- త్వరలో చెర్వుగట్టుకు సీఎం కేసీఆర్ రాక
- శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి
చెర్వుగట్టు(నార్కట్‌పల్లి) : దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి గట్టుపై ఎమ్మెల్సీ నిధులు రూ.13 లక్షలతో చేపట్టిన కమిటీ హాల్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెర్వుగట్టు దేవాలయాన్ని తెలంగాణలో ప్రముఖ క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే సీఎం కేసీఆర్ చెర్వుగట్టును సందర్శించనున్నారన్నారు.
ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. చెర్వుగట్టుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అంతకుముందు దేవాలయ ఈఓ గుత్తా మనోహర్‌రెడ్డి, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ పూర్ణకుంభంతో ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్‌జ దుబ్బాక నర్సింహారెడ్డి, స్థానిక సర్పంచ్ మల్గ రమణబాలకృష్ణ, యల్లారెడ్డిగూడెం ఎంపీటీసీ నల్ల అనిత వెంకన్న, మేకల వెంకన్న, ఈటల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
Published Fri, May 1 2015 5:44 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement
Advertisement