సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అటవీఅధికారి (ఎఫ్‌ఆర్‌వో) చళ్లమళ్ల శ్రీనివాసరావు హత్య కేసులో తీసుకున్న చర్యలేంటో వివరించాలని సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో అడవుల పరిరక్షణకు సంబంధించిన ఓ పిటిషన్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం విచారణ చేసింది.
ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు...భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హత్యకు గురైన ఎఫ్‌ఆర్‌వో చళ్లమళ్ల శ్రీనివాసరావు అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వార్తాపత్రికల ఆధారంగా పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అడవుల పరిరక్షణ వ్యవహారంపై కోర్టు నియమించిన కేంద్ర సాధికారిత కమిటీ నుంచి నివేదికను తీసుకోవాలని సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అమికస్‌క్యూరీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి: అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment