సాక్షి, భూపాలపల్లి : ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా టీఆర్‌ఎస్ పార్టీకి అసమ్మతి నేతల బెదడ వీడటం లేదు. ఇప్పటికే పలు నియోజవకవర్గాల్లో టీఆర్‌ఎస్ తాజా మాజా ఎమ్మెల్యేకు అసమ్మతి నేతల నిరసనలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు నియోజవర్గంలో మంత్రి అజ్మీరా చందులాల్‌కు అసమ్మతి నేతల నుంచి షాక్ ఎదురైంది. ములుగులో మంగళవారం ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తిరుగుబాటు నేతలు చందులాల్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
తన తండ్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారన్న కోపంతో చందులాల్ కుమారుడు ప్రహ్లాద్ తన అనుచరులతో కలిసి అసమ్మతి నేతల వాహానాలను ఆదివారం నాడు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. మంత్రి కుమారుడి తీరుకు వ్యతిరేకంగా ప్రచారానికి వచ్చిన చందులాల్‌కు తిరుగుబాటు నేతల నుంచి అస్మమతి ఎదురైంది. దీంతో ములుగులో టీఆర్‌ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. అసమ్మతి వర్గం, చందులాల్ వర్గాల మధ్య వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ములుగులో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో.. పోలీసుల భద్రత నడుమ చందులాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment