Minister Chandulal
-
తీవ్ర ఉద్రిక్తత.. భద్రత నడుమ మంత్రి ప్రచారం!
సాక్షి, భూపాలపల్లి : ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా టీఆర్ఎస్ పార్టీకి అసమ్మతి నేతల బెదడ వీడటం లేదు. ఇప్పటికే పలు నియోజవకవర్గాల్లో టీఆర్ఎస్ తాజా మాజా ఎమ్మెల్యేకు అసమ్మతి నేతల నిరసనలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు నియోజవర్గంలో మంత్రి అజ్మీరా చందులాల్‌కు అసమ్మతి నేతల నుంచి షాక్ ఎదురైంది. ములుగులో మంగళవారం ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తిరుగుబాటు నేతలు చందులాల్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తన తండ్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారన్న కోపంతో చందులాల్ కుమారుడు ప్రహ్లాద్ తన అనుచరులతో కలిసి అసమ్మతి నేతల వాహానాలను ఆదివారం నాడు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. మంత్రి కుమారుడి తీరుకు వ్యతిరేకంగా ప్రచారానికి వచ్చిన చందులాల్‌కు తిరుగుబాటు నేతల నుంచి అస్మమతి ఎదురైంది. దీంతో ములుగులో టీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. అసమ్మతి వర్గం, చందులాల్ వర్గాల మధ్య వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ములుగులో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో.. పోలీసుల భద్రత నడుమ చందులాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చదవండి : రెచ్చిపోయిన చందూలాల్ వర్గీయులు -
రెచ్చిపోయిన చందూలాల్ వర్గీయులు
ములుగు/వెంకటాపురం(ఎం): మంత్రి చందూలాల్ అనుచరులు రెచ్చిపోయారు. అసమ్మతి నేతలపై దాడి చేసి.. రెండు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు నియోజకవర్గ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. అసమ్మతి నేతలు పోరిక గోవింద్ నాయక్, తాటి కృష్ణ, టీఆర్ఎస్ జెడ్పీఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, మేడారం మాజీ చైర్మన్ ఆలం రామ్మూర్తి తదితరులు మంగళవారం నిర్వహించ తలపెట్టిన ర్యాలీని జయప్రదం చేయాలని వెంకటాపురం మండలంలో ప్రచారం నిర్వహించారు. ర్యాలీకి అనుమతి తీసుకోవడానికి గోవింద్‌నాయక్ తన వాహనం ఇచ్చి పలువురిని వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌కు పంపించి మిగతా నేతలతో కలసి బూర్గుపేటకు వెళ్లారు. ఎల్లారెడ్డిపల్లె సమీపంలో మంత్రి వర్గీయులు వాహనాన్ని అడ్డగించి అద్దాలను పగులగొట్టారు. వాహనం టాప్‌ను చించివేయడంతోపాటు టైర్లలో గాలి తీసివేశారు. బూర్గుపేటలో అసమ్మతి నేతలు ప్రచారానికి వెళ్లిన విషయం తెలుసుకొని అక్కడికి చేరుకుని దాడికి యత్నించారు. ఈ క్రమంలో తాటి కృష్ణ వాహనాన్ని ధ్వంసం చేశారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. -
ఏజెన్సీల్లో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అప్రమ త్తంగా ఉండాలని అధికారులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ తదితరులతో ఆయన సమావేశమయ్యారు. వరుసగా వర్షాలతో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య శాఖ అధికారుల సమన్వయంతో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని వైద్యారోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, అపరిశుభ్ర వాతావరణం లేకుండా పంచాయతీలను అప్రమత్తం చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలలు, స్కూళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. -
గిరిబాల వికాస్ పథకం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకై ఉద్దేశించిన ‘గిరిబాల వికాస్’ పథకాన్ని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఏటూరు నాగారం పరిధిలోని గిరిజన పాఠశాలల్లో శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల సమస్యల్ని తొలిదశలోనే గుర్తించి నివారించవచ్చన్నారు. పీరియాడికల్ చెకింగ్‌తో అనారోగ్య సమస్యల్ని వెంటనే పరిష్కరించవచ్చని చెప్పారు. ఇదే పథకాన్ని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరులోని గిరిజన బాలికల పాఠశాలలో ప్రారంభించారు. గిరిజన శాఖ కమిషనర్ క్రిస్టినాజెడ్ చొంగ్తూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని గిరిజన బాలికల ఉన్నత ఆశ్రమ పాఠశాలలో ఈ పథకాన్ని ప్రారంభించి, ప్రయోజనాలను వివరించారు. -
ఆహ్వానించలేదా లేక..వీరే దూరంగా ఉన్నారా...
టీఆర్ఎస్లో ప్రాధాన్యత సమస్య సాక్షి ప్రతినిధి, వరంగల్ : తండాలకు పంచాయతీ హోదా కల్పించడంపై రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆ వర్గం వారు సంబరాలు జరుపుకుంటున్నారు. పలువురు లంబాడీ వర్గం ప్రజాప్రతినిధులు, ముఖ్యులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును శుక్రవారం హైదరాబాద్‌లో కలిసి కృతజ్ఞతలు సైతం తెలిపారు. అధికార పార్టీకి చెందిన లంబాడీ వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి చందులాల్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ అధిష్టానమే వీరిద్దరికీ ప్రాధాన్యత లేకుండా చేసేందుకు కార్యక్రమానికి ఆహ్వానించలేదా... వీరే దూరంగా ఉన్నారా.. అనే అంశంపై అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లంబాడీ వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రాతినిథ్యం ఎక్కువగా ఉంది. ఎస్టీ వర్గానికి రిజర్వ్ అయిన అన్ని నియోజక వర్గాల్లో లంబాడీ వర్గం వారే గెలిచారు. మహబూబాబాద్ ఎంపీగా అజ్మీరా సీతారాంనాయక్, ములుగు ఎమ్మెల్యేగా ఎ.చందులాల్, డోర్నకల్ ఎమ్మెల్యేగా డీఎస్.రెడ్యానాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యేగా బి.శంకర్‌నాయక్ గత ఎన్నికల్లో గెలిచారు. తండాలను పంచాయతీలుగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ వర్గం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికార పార్టీ ముఖ్యులు వెళ్లారు. స్వయంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అజ్మీరా చందులాల్ ఈ కార్యక్రమంలో లేకపోవడం ములుగు నియోజకవర్గంలో పెద్ద అంశంగా మారింది. అనారోగ్య సమస్యల వల్ల కొంత కాలంగా చందూలాల్ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల పరిస్థితిలో మార్పు రాగా.. నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమయంలో తండాలను పంచాయతీలుగా గుర్తిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న వేళ గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్ బయటకు రాకపోవడం చర్చకు దారితీసింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ దూరంగా ఉండడం... ఈ సెగ్మెంట్లో టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎం.కవిత హాజరుకావడం ఆసక్తి కలిగిస్తోంది. వర్గ పోరు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎస్టీ కేటగిరి అసెంబ్లీ నియోజవర్గాలలో వర్గపోరు కొనసాగుతోంది. ములుగు నియోజకవర్గంలో మంత్రి చందూలాల్‌కు, ఎంపీ సీతారాంనాయక్ వర్గాల మధ్య పొసగడంలేదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సీతారాంనాయక్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఇక్కడ చందూలాల్ వర్గానికి ఇబ్బంది కలిగిస్తోంది. వీరి మధ్య వర్గపోరు కొన్నిసార్లు బహిరంగంగానే సాగి.. ఫ్లెక్సీల చించివేతల వరకు వెళ్లింది. అలాగే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు, ఎంపీ సీతారాంనాయక్‌కు ఇదే పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ అధిష్టానం అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఎంపీ సీతారాంనాయక్ సన్నిహితుల వద్ద చేసిన వ్యాఖ్యలతో శంకర్‌నాయక్ వర్గంలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఈ సెగ్మెంట్లో సైతం ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదు. మరోవైపు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత వర్గానికి, సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ వర్గానికి మధ్య ఇదే పరిస్థితి ఉంది. డోర్నకల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్‌కు అక్కడ పోటీ చేసి ఓడిపోయిన సత్యవతి రాథోడ్‌కు మధ్య రాజకీయంగా పొసగడంలేదు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి దగ్గర జరిగిన కార్యక్రమంలో ఇద్దరు ముఖ్య ప్రజాప్రతినిధులు లేకపోవడం ఆసక్తిని పెంచుతోంది. టీఆర్ఎస్ అధిష్టానమే వీరిద్దరి ప్రాధాన్యత తగ్గించిందా.. లేక వీరిద్దరే ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్నారా అనే అంశంపై స్పష్టత రావడంలేదు. ఈ రెండు అంశాలలో ఏది జరిగినా వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంపై ఇప్పుటి నుంచే ఆసక్తికర అంచనాలు మొదలయ్యాయి. -
129 మంది గిరిజనులకు కార్ల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకుంటూ తమ జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాలని గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ సూచించారు. ప్రకృతితో మమేకమై బతుకుతున్న గిరిజనులు బాహ్య ప్రపంచంలో పోటీతత్వంతో జీవనం సాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఓన్ యువర్ కార్ పథకంలో భాగంగా బుధవారం ఇక్కడ 129 మంది గిరిజనులైన లబ్ధిదారులకు కార్లను పంపిణీ చేశారు. ఈ పథకంలో ఉబర్ క్యాబ్స్‌తోపాటు మారుతి, భారతీయ స్టేట్ బ్యాంక్ భాగస్వాములయ్యాయి. మంత్రి మాట్లాడుతూ, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఇండియన్ బిజినెస్ స్కూల్‌కు బాధ్యతలు అప్పగించామన్నారు. అన్నివర్గాలకు దీటుగా గిరిజనులను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వివిధ రంగాల్లో ఉపాధి కల్పన కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.400 కోట్లు ఖర్చు చేయబోతున్నామని, దీంతో 7 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి మహేశ్ దత్త ఎక్కా, కమిషనర్ క్రిస్టినా, మారుతి సుజికి సంస్థ వాణిజ్య, వ్యాపార విభాగం అధిపతి ఆశిష్ జైన్, రీజినల్ మేనేజర్ అనింద్య దత్త తదితరులు పాల్గొన్నారు. -
ప్రొటోకాల్‌కే ‘పెద్దలు’ అయ్యో పాపం ఎమ్మెల్సీ!
‘పేరుకు పెద్దల సభ. కానీ మండల స్థాయిలో చిన్న అధికారి కూడా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే కంటే ప్రొటోకాల్ పెద్దదే. అయినా ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఎక్కడా అడుగుపెట్టలేని పరిస్థితి. సీడీపీ నిధుల నుంచి చిన్న సిమెంట్ రోడ్డు వేద్దామన్నా ఎమ్మెల్యే పర్మిషన్ ఉండాల్సిందే. ఏ విషయంలోనూ సొంతంగా నిర్ణయం తీసుకోలేని నిస్సహాయత. పేరుకు పెద్ద పదవి ఉన్నా ఎవరినీ ఆదుకునే అవకాశం లేదు’ – రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ ఆవేదన ‘‘నియోజకవర్గంలోని ఓటర్లతో నేరుగా ఎన్నికయ్యాను. నాకు తెలియకుండా నా నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పెత్తనం చేస్తానంటే ఎలా? ఏ గ్రామంలో ఎవరేం పని చేశారో, ఇప్పుడేం చేస్తున్నారో నాకు తెలుసు. ఒక ఎమ్మెల్సీ వచ్చి నన్ను లెక్కపెట్టకుండా రోడ్డు పనో, మరో పనో ఇచ్చుకుంటూ పోతే నా మాటకు ఎవరు విలువ ఇస్తరు? నాకు తెలియకుండానే నియోజకవర్గంలో పనులు అవుతున్నాయంటే నేనెందుకు?’’ – ఇదీ అధికార పార్టీ ఎమ్మెల్యేల వాదన సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య జరుగుతున్న అధికార యుద్ధం ఇదీ! వీరేకాదు.. ఎమ్మెల్యేలతో ఎంపీలు, జెడ్పీలకు కూడా పొసగడం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన, పార్టీ అంతర్గత వ్యవహారాలు.. ఇలా ఏ అంశమైనా ఇదే పరిస్థితి ఉంటోంది. కొన్ని జిల్లాల్లో అయితే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఇది తలనొప్పిగా మారుతోంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల మధ్య పోరులో గులాబీ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలు నలిగిపోతున్నారు. కొన్ని నియోజకవర్గాలలో అయితే ఏకంగా నేతల మధ్య పరస్పరం పోలీసు కేసులు, దాడులు వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి విషయంలో ఇరువర్గాలను కూర్చోబెట్టి సమన్వయం చేసే యంత్రాంగం పార్టీలో లేకుండా పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గు గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన పలువురు నేతలకు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వలేకపోయామని, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని బట్టి చూద్దామంటూ పార్టీ భరోసా ఇవ్వడంతో పలువురు ఎమ్మెల్సీగా అవకాశం తీసుకున్నారు. ఇలాంటివారి విషయంలో యుద్ధం తీవ్రస్థాయిలో ఉంది. వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సర్కారు కూడా ఎమ్మెల్యే మాటకే విలువ ఇస్తోంది. ఏ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యే నిర్ణయమే ఫైనల్ అని సీఎం కేసీఆర్ స్పష్టంగా ఆదేశాలిచ్చారు. గతంలో పలుమార్లు జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశాలతోపాటు బహిరంగంగా కూడా సీఎం ఈ మేరకు సూచనలు చేశారు. ఏ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనలు, అభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకోవాలని నిర్దేశించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి కూడా ఎమ్మెల్యేకు తెలియకుండా ఏ నియోజకవర్గంలోనూ జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు. ఈ ఆదేశాలతో తమ పరిస్థితి మరింత దీనంగా తయారైందని ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఎమ్మెల్సీలను ఎందుకు పట్టించుకోవాలనే ధోరణిలో ఎమ్మెల్యేలు ఉన్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ‘‘పటేల్, పట్వారీలు నా పట్టు. నన్ను ఎట్లా కొడతవో కొట్టురా మొగుడా’’అన్నట్టుగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని శాసన మండలిలో సీనియర్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. పోలీస్ స్టేషన్లో, రెవెన్యూ కార్యాలయాల్లోనూ చిన్న పనులు చెప్పినా కావడం లేదని పలువురు మండలి సభ్యులు వాపోతున్నారు. మండల స్థాయిలోని చిన్న అధికారులు కూడా తమ మాటలను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ‘‘నెల జీతం, సౌకర్యాలు, గన్‌మన్ వంటివి తప్ప ఎవరికీ ఉపయోగం లేదు. నన్ను నమ్ముకున్నవారికో, ప్రజలకో ఏదైనా చేస్తాననే విశ్వాసం కూడా లేకుండా పోయింది. పేరుకు పదవి ఉన్నా ఎలాంటి సంతృప్తి లేదు’’అని ఓ ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నియోజకవర్గంలో ప్రత్యక్షంగా ఎమ్మెల్యేగా గెలవాలంటే ఎన్నో ఆటుపోట్లు అధిగమించాల్సి వస్తుందని ఎమ్మెల్యే అంటున్నారు. గ్రామ స్థాయిలో నుంచి ఎవరేమిటో, వారికేం చేయాలో, ఎవరిని ఎక్కడ అదుపులో పెట్టుకోవాలో ప్రత్యక్షంగా తమకున్న అనుభవం, ఇబ్బంది ఎమ్మెల్సీకి ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమస్యలున్న నియోజకవర్గాల్లో అటు ఎమ్మెల్యేలను, ఇటు ఎమ్మెల్సీలను సమన్వయం చేయడంలో జిల్లా ఇన్చార్జి మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడెక్కడ.. ఎవరెవరు? - నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు, ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ టికెట్‌ను ఆశించిన భూపతిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్.. ఎమ్మెల్యే అవకాశాన్ని గోవర్ధన్‌కు ఇచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి టికెట్‌ను ఆశిస్తున్న వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే గోవర్ధన్ కోరిక మేరకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా సమావేశమై ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానించారు. - నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యే కె.ప్రభాకర్‌రెడ్డికి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మధ్య పొసగడం లేదు. మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఆశించిన కర్నెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి మధ్య సమన్వయంలో సమస్యలు వస్తున్నాయి. - ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మధ్య కూడా ఇలాంటి విభేదాలే ఉన్నాయి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా టి.రాజయ్య ఉండగా.. గతంలో ఇదే స్థానం నుంచి కడియం ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. - ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్న కొండా మురళి స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నాననే అసంతృప్తితో ఉన్నారు. పరకాల నియోజకవర్గంలో బలమైన అనుచరవర్గం ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కాదని ఏమీ చేయలేని పరిస్థితి ఉండటంతో లోలోన మధనపడుతున్నారు. అసంతృప్తిని బయటకు ప్రకటించకపోయినా ఎన్నికల సమయానికి పరిస్థితులు మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. - ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డికి మధ్య సమస్యలు వస్తున్నాయి. భూపాల్‌రెడ్డి పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఎంపీలు, జెడ్పీలదీ ఇదే పరిస్థితి.. ఎంపీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఎమ్మెల్యేల అనుమతి లేకుండా నియోజకవర్గంలో రూపాయి ఖర్చు పెట్టలేని దుస్థితిలో అధికార పార్టీ ఎంపీలు ఉన్నారు. ఎంపీకి చెందిన నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా ఎమ్మెల్యే ప్రతిపాదనల మేరకే కేటాయించాలని పార్టీ అధినేత నుంచి సూచనలున్నాయి. ఎమ్మెల్యేకు నచ్చకుంటే చిన్న పని కూడా చేయలేకపోతున్నామని ఎంపీలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాకు తామే బాస్ అయినా ఎమ్మెల్యేను కాదని అడుగు పెట్టే పరిస్థితి లేదని అటు పలువురు జెడ్పీ చైర్మన్లు కూడా ఆవేదన చెందుతున్నారు. నల్లగొండ జెడ్పీ చైర్మన్ బాలు నాయక్‌కు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ మధ్య ఇదే పరిస్థితి ఉంది. కరీంనగర్ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమతో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌తో పొసగడం లేదు. మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, ములుగు ఎమ్మెల్యే, మంత్రి చందూలాల్ పరస్పరం బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు. -
సాగర తీరంలో ఆకట్టుకున్న ఫ్రెంచ్ షో
హైదరాబాద్: దేశంలోనే తొలిసారి రాజధాని వేదికగా నిర్వహించిన ఫ్రెంచ్ ఏరియల్ షో నగరవాసులను మంత్ర ముగ్ధులను చేసింది. భారీ క్రేన్ సాయంతో 50 అడుగుల ఎత్తులో గాలిలో తేలియాడుతూ.. మరోపక్క మనసుకు పులకరించే సంగీతం మధ్యన సాగిన విన్యాసాలను కేరింతలు, చప్పట్లతో సందర్శకులు స్వాగతించారు. ‘మన్సూర్ ఇండియా కల్చరల్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్శకులను అమితంగా ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ నగరాల్లో నిర్వహిస్తున్న ఫ్రెంచ్ ఏరియల్ షో తొలి ప్రదర్శనను నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో మంగళవారం రాత్రి నిర్వహించారు. ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో 18 మంది కళాకారుల సంగీతం, నృత్యం, క్రాఫ్ట్, ఆర్కెస్ట్రా, సర్కస్ తదితర ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. 18 మందిలో ఆరుగురు యువతులు ఉండటం విశేషం. దేశంలోనే తొలి ఫ్రెంచ్ ఏరియల్ షోను నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పర్యాటక, సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోందని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాన్సిస్ డైరెక్టర్ ఎమిలిన్ పాల్గొన్నారు. -
7 దేశాల్లో రాష్ట్ర మహిళల బైక్ యాత్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశంతో రాష్ట్రానికి చెందిన నలుగురు మహిళలు బైక్‌లపై సాహసయాత్ర చేపట్టనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటలకు పర్యాటక భవనం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. 50 రోజుల యాత్రలో భాగంగా భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం దేశాల్లో రోడ్డు మార్గం ద్వారా సుమారు 17 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తారని తెలిపారు. ఈ యాత్రలో వీరు 19 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు, 35 యునెస్కో సైట్లను సందర్శిస్తారని అన్నారు. ఈ యాత్రకు జై భారతి నాయకత్వం వహిస్తారని, ఈమెతో పాటు ప్రియ, శాంతి, శిల్ప నలుగురు సభ్యుల బృందంలో ఉంటారని తెలిపారు. వీరికి 400 సీసీ బైకులను బజాజ్ ఆటో కంపెనీ వారు స్పాన్సర్ చేశారని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. -
పరిశోధనలతో పర్యాటకానికి కొత్తశోభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చారిత్రక, పురావస్తు అంశాలపై జరిగే పరిశోధనలు పర్యాటక రంగానికి కొత్తశోభను తెస్తున్నాయని పర్యాటకశాఖ మంత్రి చందూలాల్ అన్నారు. పరిశోధకులు గుర్తించిన అంశాలను వెలుగులోకి తేవటం ద్వారా పర్యాటకుల్లో ఆసక్తి పెరుగుతుందన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రెండు రోజులపాటు జరిగే అంతర్జాతీయ పురావస్తు సదస్సును మంత్రి శుక్రవారం ప్రారంభించారు. సదస్సుల్లో సమర్పించే పరిశోధనాపత్రాల వల్ల తెలంగాణలోని చారిత్రక ప్రాంతాలకు మరింత ప్రాచుర్యం లభిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహించాలని సూచించారు. తెలంగాణలోని వారసత్వ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కొత్త చట్టాన్ని కూడా తెచ్చిందని ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ తెలిపారు. గత సంవత్సరం నిర్వహించిన మొదటి అంతర్జాతీయ సదస్సుకు మంచి స్పందన రావటంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని, ఇందులో 450 పరిశోధనా పత్రాలు దాఖలు కాగా, సమయాభావం వల్ల కొన్నింటినే ఎంపిక చేశామన్నారు. మూడో సదస్సును మూడు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. గతంలో చరిత్రకు వక్రభాష్యం చెప్పారని, తెలంగాణలో లభించిన నాణేల వల్ల ఈ ప్రాంతం ప్రత్యేకత జనబాహుళ్యంలోకి వెళ్లిందని సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. తెలంగాణ చారిత్రక, పురావస్తు ప్రాధాన్య ప్రాంతాలకు నెలవని ప్రభుత్వ సలహాదారు పాపారావు అన్నారు. కార్యక్రమంలో హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్ విశాలాచ్చి, అధికారులు రంగాచార్యులు, రాములునాయక్, నాగరాజు, పద్మనాభ, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు మూడు సెషన్లలో 16 మంది పరిశోధనాపత్రాలను సమర్పించారు. -
లక్ష్యసాధనపై దృష్టిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: ‘కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తే దానికి ప్రతికూల అంశాలే ఎక్కువగా ఎదురవుతాయి. ప్రోత్సహించే వాళ్లకంటే విమర్శించే వాళ్లే చాలా మంది ఉంటారు. అలాంటి వాటిని పట్టించుకోకుండా లక్ష్యంపైనే దృష్టి పెట్టండి. శ్రమకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది’అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన సదస్సుకు ఆయన గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, గిరిజనులను ప్రోత్సహించేందుకు రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు రాయితీలిస్తున్నాయని వివరించారు. బ్యాంకులతోనే ఇబ్బందులు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు బ్యాంకులతో ముడిపడి ఉండటంతో లక్ష్యసాధన ఇబ్బందిగా మారుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. స్వయం ఉపాధి యూనిట్లపై ప్రభుత్వం భారీగా రాయితీలిస్తోందని, కానీ అవన్నీ బ్యాంకులతో ముడిపడి ఉండటంతో ఔత్సాహికులు బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారన్నారు. బ్యాంకుల నిబంధనల్లో మార్పులు రావాలని, ఆమేరకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను అందుకోవాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు స్పందించడంలేదు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్) ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు గతంలో ఎన్నడూ లేనంతగా భారీ మొత్తంలో రాయితీలిస్తోందని ఎంఎస్ఎంఈ సంచాలకుడు పీజీఎస్ రావు పేర్కొన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఖర్చు చేస్తోందని, కానీ వీటిని వినియోగించుకోవడంలో పలు రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించడంలేదని అన్నారు. -
మంత్రి కుమారుడి తిట్ల పురాణం హల్ చల్
-
సమ్మక్క, సారలమ్మ జాతరకు 80 కోట్లు
సాక్షి, హైదరాబాద్: సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసినందున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి చందూలాల్ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరైన ఈ మేడారం జాతరకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. -
గిరిజన పారిశ్రామికవేత్తలకు సాయం
మంత్రి చందూలాల్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ ఏరియాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే గిరిజన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రూ.50 లక్షల వరకు సబ్సిడీని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ముఖ్యంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తామ న్నారు. శుక్రవారం సచివాలయంలో గిరిజనాభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో మంత్రి చందూలాల్ సమీక్షించారు. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లోని తండాలు, గూడాలకు సంబంధించిన రోడ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. లాభసాటి పద్ధతిలో గిరిజనులు వ్యవసాయం చేసేందుకు అంతర్జాతీయ సంస్థలతో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థలతో ఆయా రంగాల్లో వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని, మొదటి విడతగా రూ.10 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పోటీ పరీక్షలకు హాజరవుతున్న గిరిజన విద్యార్థులకు రెసిడెన్సియల్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే గిరిజన బాలికలకు ఏఎన్ఎంలుగా శిక్షణ ఇప్పించి, విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థలలో వాలంటీర్ల నియామకం కోసం అనుమతి ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. బోడేఘాట్ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు వీలుగా రూ.15 కోట్లతో స్థానిక రోడ్లను విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
మంత్రి చందూలాల్ నుంచి ప్రాణ హాని
హెచ్చార్సీలో ములుగు వాసి భిక్షపతి ఫిర్యాదు హైదరాబాద్: మంత్రి అజ్మీరా చందూలాల్, అతని అనుచరుడు గట్టు మహేందర్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో జయశంకర్ జిల్లా ములుగు ప్రాంతానికి చెందిన ముంజాల భిక్షపతి ఫిర్యాదు చేశారు. ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడిగా తాను కొనసాగుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండేళ్లుగా జిల్లా సాధన కోసం చేస్తున్న ఉద్యమాన్ని విరమించుకో వాలని ములుగు ఎమ్మెల్యే చందూలాల్ హెచ్చరిస్తూ వస్తున్నారని ఆరోపించారు. తాను ససేమిరా అనడంతో ఫోన్లో ఇష్టం వచ్చినట్లు దుర్భాషలా డారని పేర్కొన్నారు. అతని అనుచరుడు గట్టు మహేందర్ సైతం ‘రోడ్డు మీదకు రాకుండా చేస్తాం బిడ్డా... బతకాలని ఉందా?’ అంటూ బెదిరించినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెప్టెంబరు 14లోగా ఈ కేసుకు సంబంధించి సమగ్రమైన నివేదిక అందజేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. -
పేగులు తీస్తా..
జిల్లా తెచ్చేంతటి మొనగాళ్లా మీరు - మాపోరగాళ్లకు చెప్పినంటే పనైతది - ఫోన్లో మంత్రి చందూలాల్ హెచ్చరికలు - వాట్సప్‌లో హల్చల్ చేస్తున్న కాల్ రికార్డు సాక్షి, వరంగల్: ‘నువ్వు ఎవడ్రా జిల్లా తెమ్మని నన్ను అడగడానికి.... పేగులెల్లుతయ్ బిడ్డ. నేను గట్టిగ తొక్కిన్నంటే’అంటూ మంత్రి చందూలాల్ బూతు పురాణం అందుకున్నారు. ములుగు–సమ్మక్క సారలమ్మ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతిని ఈ మేరకు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. నువ్వెం త నీ బతుకెంత అంటూ నోటికొచ్చి నట్లు తిట్టారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తోంది. ఈ నెల 26 రాత్రి ఈ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మంత్రి చందూలాల్‌ను సంప్రదించగా... ఇదో వార్తా ? వంద సవాళ్లు వస్తుంటయ్ మాకు. వాడో చిల్లర గాడు, వాడి వాయిస్తోని మీరు ఎందుకు వార్త రాస్తరు, రాత్రి పదిగంటలకు ఫోన్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడినందుకు వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తని సమాధానం ఇచ్చారు. ఇద్దరి మధ్య సంభాషణ ఇలా కొనసాగింది. మంత్రి చందూలాల్: హలో మంజాల బిక్షపతి: నమస్తే సార్, బాగున్నారా సార్. నేను ముంజాల భిక్షపతిని. మంత్రి చందూలాల్: బాగున్నా పెద్దలు కదా, ఫోన్ చేసిళ్లు ఎందుకో? ముంజాల భిక్షపతి: సార్.. మీకంటే పెద్దోళ్లం కాదు. మీతో మాట్లాడుదామని మొన్న రెండుమూడుసార్లు ఫోన్ చేసిన. పర్సనల్‌గా మాట్లాడుదామంటే మీరెప్పుడు బిజీగా ఉంటళ్లు. మంత్రి చందూలాల్: నీకు.... మీరు బాగా బలిసున్నరు మీరు. ములుగులో వచ్చి రాజకీయాలు చేసి.. చిల్లరగాళ్లు, చిల్లర వ్యవహారం. లీడర్లుగా లేనిపోనివన్ని చేస్తున్నరు. నేను తలుచుకుంటే పేగులెళ్లుతయ్, తొక్కితే. ముంజాల భిక్షపతి: లేద్సార్. అమ్మతోడు సార్, మిమ్మల్ని కలుస్తసార్. కావాలంటే మీ పీఏని అడగండి. చందూలాల్: ఏం కలుస్తవయ్యా.... గాడిదికొడుకువి నువ్వు. నా మీద స్టేట్మెంట్లు ఇస్తావ్, జిల్లా సాధిస్తవ్, ....... వ్యవహారం ఏందయ్యా? నీ బతుకేందయ. నువ్వు జానెడు లేవు. నా పిలగాల్లకిస్తే నీ ...... నువ్వు నకరాలు చేస్తే. నువ్వు లీడరయినవా ములుగుకు. చిల్లర గాళ్లతోని. ముంజాల భిక్షపతి: మీతో మాట్లాడుదామని ఫోన్ చేసిన. మీతోని కలుద్దామని. చందూలాల్: ఏం మాట్లాడుతవ్. ...... ఏందీ నువ్వు మాట్లాడేది. నీతోని అయ్యేదేంది, నీతోని నాకు జరిగేదేంది. నా నెత్తిలకెళ్లి పీక్కునేదేందీ. ఏ పీక్కున్నవ్. ముంజాల భిక్షపతి: అట్లేం లేద్సార్ చందూలాల్:........... వ్యవహారం చేయోద్దు బిడ్డ. నకరాలు చేయొద్దు. ఎవని జాగల వాడు బతకాలే. లేకుంటే ......... నిన్ను ఆదుకునేటోడు ఎవ్వడూ లేడు. ఆ కుమారు గాడు సాయిత,... వాని సాయిత.... లతోని జిల్లా సాధిస్తవారా నువ్వు. ముంజాల భిక్షపతి: వాళ్లతోని అయితదాసార్, అట్లయితే మీకు ఫోన్ ఎందుకు చేస్త సార్. చందూలాల్: ...... నువ్వు నువ్వు జిల్లా సాధిస్తవారా. నీ బతుకేందిరా. నీ బతుకేందిరా... నువ్వు నీఊర్ల అన్ని దోపిడీ చేసి, ఈ ములుగుకు వచ్చి రాజకీయాలు చేసి, నకరాలు చేస్తన్నవా ? నీకు బతుకు నాకు తెల్వదా ? ముంజాల భిక్షపతి: నా బతుకు మీకు తెల్వదా సార్ చందూలాల్: నువ్వు, నువ్వు జిల్లా సాధిస్తవారా నువ్వు, నా మీద కామెంట్ చేసేటోనివయినవా నువ్వు. ముంజాల భిక్షపతి: మీరే సాదిస్తర్ సార్, మతోని అయితదా సార్ చందూలాల్: నీ బతుకెంతరా, నీ బతుకెంత. ముంజాల భిక్షపతి: మీరు లేకపోతే జిల్లెట్లయితది కానీ... చందూలాల్: మరి ఎందుకు చేసినవ్. ఎన్ని కథల్ చేసినవ్ నువ్వు, ఎన్ని మాటల్ చేసినవ్ నువ్వు. మంజాల భిక్షపతి: వాస్తవమేకానీ, మీరు లేకపోతే జిల్లా కాదని అన్ననా సార్. చందూలాల్: నీ బతుకేందీ, నీ వ్యవహారమేందీ, నయాపైసా పనికి రావు బిడ్డ నువ్వు, నేను తలచుకుంటే. ములుగుల కూడా ఉండలేవు. ముంజాల భిక్షపతి: మీరు తలుసుకుంటేనే జిల్లా అయితది చందూలాల్: నువ్వు ఎవడ్రా? నన్ను అడిగేతందుకు. నేనే తిట్టిన బాగా తాగి రాత్రి పది గంటలకు నాకు ఫోన్ చేసిండు. వాడికి నాకు సంబంధం లేదు. నా కార్యకర్త కాదు. అప్పుడుప్పుడు ములుగు బజార్ల తిరుగుతుంటడు. భార్యకు ఉద్యోగం ఇప్పియ్యలేదు, జిల్లా తేలేదు అని నాతో ఆర్గ్యుమెంటు చేసిండు. రాత్రి పూట ఫోన్ చేసుడేంది, నీ భార్యకు ఉద్యోగం ఇయ్యమని అడుగుడేంది అని అడిగితే నక్రాలు చేసిండు. బాగా తిట్టిన. వాడెవడు జిల్లా తెమ్మని నన్ను అడగడానికి. వాడో మిలిటెంట్, పెద్ద బ్రోకర్ వాడు. రాత్రి పూట పదిగంటల తర్వాత ఫోన్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడిండు. వానిమీద పోలీసు స్టేషన్ల కేసు పెడత. – మంత్రి చందూలాల్ హెచ్చార్సీకి పోతా మేడారం జాతర వస్తుంది. ఈ సందర్భంగా ములుగు కేంద్రంగా సమ్మక్క– సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలని కోరేందుకు మంత్రికి ఫోన్ చేశా. దీనికే నన్ను తిట్టాడు. బెదిరించాడు. మంత్రి చందూలాల్ నుంచి నాకు ప్రాణహాని ఉంది. నాకు రక్షణ కావాలి. అందుకే మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తాను. – ముంజాల భిక్షపతి -
ఎస్సీ, ఎస్టీ నిధుల ముసాయిదా సిద్ధం
- రూపొందించిన మంత్రుల కమిటీ - ఒకట్రెండు రోజుల్లో సీఎం వద్దకు ఫైలు - ఆమోదముద్ర పడగానే అమల్లోకి.. - అభివృద్ధి నిధి పర్యవేక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు - మంత్రుల బృందంతో ప్రత్యేక కౌన్సిల్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ స్థానంలో కొత్తగా అమల్లోకి తెచ్చిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి మార్గదర్శకాల అంశం కొలిక్కి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన శాఖ మంత్రి చందూలాల్ ఆధ్వర్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేధావులు, అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు ఇప్పటికే పలు దఫాలుగా సమావేÔశమయ్యాయి. సుదీర్ఘ చర్చలు జరిపిన ఈ కమిటీలు తాజాగా నిబంధనలు ఖరారు చేశాయి. ఏడు అంశాలతో రూపొందించిన ముసాయిదాను ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పంపేందుకు రంగం సిద్ధమైంది. సీఎం ఆమోదం పొందగానే ప్రత్యేక అభివృద్ధి నిధి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గతంలో ఉన్న సబ్‌ప్లాన్ కంటే మెరుగైన రీతిలో కార్యక్రమాలు అమలు చేయాలని సీఎం ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేశారు. నిధి కింద చేసే ఖర్చుకు తగిన ఫలితాలు రావాలనే లక్ష్యంతో మంత్రుల కమిటీ కార్యచరణ రూపొం దించింది. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తూ.. పలు పథకాలను నిర్దేశించింది. ఇందులో విద్య, వైద్యం, ఆర్థిక స్థితి, ఉపాధి తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. అలాగే ఖర్చు కాని నిధులను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలని నిబంధనల్లో పేర్కొంది. ఆరు నెలలకోసారి కౌన్సిల్ భేటీ.. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి పర్యవేక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇందుకు రాష్ట్రస్థాయిలో మంత్రుల బృందంతో ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ కమిటీ ఆర్నెళ్లకోసారి సమావేశం కావాల్సి ఉంటుంది. వీటితోపాటు ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. మంత్రుల కమిటీ సూచించిన ఏడు అంశాలివే.. ► ఇతర వర్గాలు–ఎస్సీ, ఎస్టీ వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి ► జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి ఖర్చు చేయాలి ► ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి వారి సామాజిక పరిస్థితుల ఆధారంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి ► బడ్జెట్ తయారీ ప్రణాళికబద్ధంగా జరగాలి ► సకాలంలో ఖర్చు కాని నిధులను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి ► రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపట్టాలి ► జిల్లా స్థాయిలో నిఘా, పర్యవేక్షణకు కమిటీలు ఏర్పాటు చేయాలి -
ఒక్క రోజులో వెంకన్న దర్శనం
-
ఒక్క రోజులో వెంకన్న దర్శనం
తిరుపతికి ప్రత్యేక గగనతల పర్యాటక ప్యాకేజీ - ఒక్కరోజు ప్యాకేజీ ధర రూ.10 వేలు, రెండు రోజులకు రూ.13 వేలు - విమాన టికెట్, దైవదర్శనం, రవాణా, భోజనం, వసతి అన్నీ కలిపే ధర - కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తిని కలుపుతూ యాత్ర - అందుబాటులోకి తీసుకొచ్చిన పర్యాటక శాఖ, టీఎస్‌టీడీసీ - మే రెండో వారంలో ప్రారంభించనున్న మంత్రి చందూలాల్ సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవులు వచ్చేశాయ్.. ఆధ్యాత్మికం.. వినోదాన్ని కలగలుపుతూ.. విహార యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా..? మీలాంటి వారి కోసమే సరికొత్త ప్యాకేజీలను తెలంగాణ పర్యాటక శాఖ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ తీసుకొస్తున్నాయి. ఒక్కరోజులోనే తిరుపతి వెంకన్న దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి చేరుకునేలా ప్రత్యేక గగనతల ప్రయాణ ప్యాకేజీలను తెలంగాణ ప్రజల ముంగిటకు తెచ్చాయి. దైవదర్శనంతో పాటు భోజనం, వసతి, రవాణా సదుపాయాలను కూడా కల్పిస్తాయి. తిరుపతితో పాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం(తిరుచానూరు), శ్రీకాళహస్తి వంటి పర్యాటక ప్రాంతాలను కలుపుతూ యాత్రకు శ్రీకారం చుట్టాయి. ఇలాంటి యాత్రనే 2009–10లో ప్రారం భించినా.. ఆ తర్వాత వదిలేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పుడు ఈ స్పెషల్ ప్యాకేజీలను తిరిగి ప్రారంభిస్తున్నారు. దీనికోసం విమానయాన సంస్థ ‘స్పైస్ జెట్’తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యాత్రను మే రెండో వారంలో రాష్ట్ర పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రారంభించనున్నారు. ‘ఒక్కరోజు’ ప్యాకేజీ ఇలా.. హైదరాబాద్‌లో ఉదయం 6.55 గంటలకి యాత్ర మొదలవుతుంది. ఉదయం 8.10కి తిరుపతికి.. అక్కడి నుంచి 9.30కి తిరుమల చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 మధ్య వేంకటేశ్వ రుని శీఘ్రదర్శనం పూర్తవుతుంది. మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల మధ్య భోజనం, విశ్రాంతి కల్పిస్తారు. అటు తర్వాత తిరుచానూరు తీసుకెళ్లి పద్మావతీ అమ్మవారి దర్శనాన్ని 3.30 నుంచి 4 గంటల మధ్య కల్పిస్తారు. సాయంత్రం 5.35 గంట లకు తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7.45 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటారు. శనివారం మాత్రం తిరుపతి ఎయిర్‌పోర్టుకు రాత్రి 8.25కి చేరుకుంటారు. రాత్రి 9.40కి హైదరాబాద్ వస్తారు. ఒక్కొక్కరికీ రూ.10 వేలు దాకా ధర నిర్ణయించారు. ‘రెండు రోజుల’ ప్యాకేజీ ఇదీ.. హైదరాబాద్‌లో ఉదయం 9.25కి బయలుదేరి.. 10.45కి తిరుపతి చేరుకుంటారు. ఉదయం 11.30 నుంచి 12.30 గంటల మధ్య శ్రీకాళహస్తి ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడ శివుని దర్శనం పూర్తి కాగానే.. మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల మధ్య భోజనం, విశ్రాంతి కల్పిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య కాణిపాకం లేదా తిరుచానూరు తీసుకెళ్తారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు తిరుపతి ఫార్చ్యూన్ కేన్సస్ హోటల్లో రాత్రి బస కల్పిస్తారు. మరుసటి రోజు ఉదయం 9.30కి తిరుమల చేరుకుంటారు. 10 గంటల నుంచి 12.30 మధ్య శీఘ్రదర్శనం కల్పిస్తారు. 1.30 నుంచి 3 గంటల మధ్య భోజనం, విశ్రాంతి కల్పించి, 3.30 నుంచి 4 గంటల మధ్య కాణిపాకం లేదా తిరుచానూరు పద్మావతీ అమ్మవారి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6.35కి తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 7.45కి హైదరాబాద్ చేరుకుంటారు. శనివారం మాత్రం రాత్రి 8.25కు తిరుపతి ఎయిర్‌పోర్టుకు.. రాత్రి 9.40కి హైదరాబాద్‌కు చేరుకుంటారు. విమాన చార్జీలు, ఏసీ అకామిడేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, భోజనం, దైవదర్శనం అన్నీ కలుపుకుని టికెట్ ధరను రూ.13 వేలుగా నిర్ణయించినట్లు తెలిసింది. బుకింగ్ కోసం.. విమానంలో తిరుపతి వెళ్లాలనుకునే వారు టీఎస్‌టీడీసీ సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్–9848540371, ట్యాంక్‌బండ్ రోడ్డు–9848125720, పర్యాటక భవన్– 9848306435, శిల్పారామం 040–23119557, కూకట్పల్లి 040–23052028, సికింద్రాబాద్ యాత్రీ నివాస్–9848126947, వరంగల్ 0870– 2562236, నిజామాబాద్ 08462–224403, మార్కెటింగ్ డివిజన్ 040–23412129, 8096947700ల్లో సంప్రదించవచ్చు. -
మద్యం మత్తులో మంత్రి తనయుడి చిందులు
అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆత్మకూరు (పరకాల): ‘నేను హారన్ కొడుతున్నా.. జరగవారా’అంటూ మంత్రి అజ్మీరా చందూలాల్ తనయుడు ధరమ్‌సింగ్ మద్యం మత్తులో ఓ ప్రైవేటు డ్రైవర్‌ను చితకబాదాడు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ జంక్షన్ లో శనివారం రాత్రి బీభత్సం సృష్టించారు. మంత్రి తనయుడు ధరమ్‌సింగ్ మిత్రులతో కలసి కారులో మద్యం సేవిస్తూ ములుగు నుంచి హన్మకొండకు వెళ్తున్నాడు. గుడెప్పాడ్ జంక్షన్ వద్ద రోడ్డు వెంట ప్రైవేటు డ్రైవర్ నరేశ్ నిలుచొని ఉన్నాడు. అయితే, తాము హారన్ కొడుతున్నా పక్కకు జరగవారా అంటూ కారు దిగిన ధరమ్‌సింగ్ ఆయనపై పిడి గుద్దులు కురిపించాడు. ‘నేను మంత్రి కొడుకునురా.. డిపార్ట్మెంట్రా’ అంటూ దుర్భాషలాడాడు. స్థానికులు, పోలీసులు వారించినా వినలేదు. ‘నేను మంత్రి కొడుకును చెబుతున్నా అందర్ని తన్నండి’ అంటూ పోలీసులను కోరగా వారు బలవంతంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. -
ఇకపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి
ఉప ప్రణాళిక స్థానంలో అమలుకు ఎస్సీ, ఎస్టీ కమిటీల తీర్మానం చట్ట సవరణలకు సిఫారసు... పథకాల్లో మార్పులు రెండ్రోజుల్లో ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలు ఇకపై ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీఎస్డీఎఫ్), ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీఎస్డీఎఫ్)గా మారనున్నాయి. ఈ మేరకు చట్ట సవరణలు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ కమిటీలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. బడ్జెట్ లో పద్దుల మార్పు నేపథ్యంలో సబ్‌ప్లాన్ చట్టాన్ని సవరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఎస్సీ కమిటీ, గిరిజన శాఖ మంత్రి చందూలాల్ అధ్యక్షతన ఎస్టీ కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలు... తాజాగా శుక్రవారం మూడోసారి సమావేశమయ్యాయి. ఈ క్రమంలో చట్ట సవరణలపై చర్చ నిర్వహించిన కమిటీ సభ్యులు, అధికారులు పది అంశాలపై తీర్మానాలు చేశారు. వీటిని ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణ యించారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎస్సీఎస్ డీఎఫ్, ఎస్టీఎస్డీఎఫ్లలో తలపెట్టనున్న పథకాలSపైనా సుదీర్ఘ చర్చ నిర్వహించి దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఎస్టీఎస్డీఎఫ్కు సంబంధించి పథకాల్లో మార్పులు, కొత్త పథకాలపై సూచనల ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. అయితే ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద చేపట్టే కార్యక్రమాలపై స్పష్టత రాలేదు. చట్ట సవరణలపై తీర్మానాలివి: సబ్‌ప్లాన్ అమలులో ప్రస్తుతమున్న పదేళ్ల కాలపరిమితిని తొలగించి.. ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని తీర్మానించారు. జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులను సభ్యులుగా చేర్చాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో రాష్ట్ర స్థాయిలో ఏర్పాటయ్యే కౌన్సిల్‌కు ఎస్సీ అభివృద్ధి శాఖ/ఎస్టీ అభివృద్ధి శాఖల సీనియర్ ముఖ్య కార్యదర్శిని కన్వీనర్‌గా నియమించాలని తీర్మానించారు. సవరణలపై ముసాయిదా ప్రకటించిన తర్వాతనే కొత్త చట్టాన్ని అమల్లోకి తేవాలి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ కమిటీలు చట్ట సవరణలపై చేసిన సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా విడుదల చేస్తుంది. గిరిజనాభివృద్ధి పథకాలపై ప్రధాన సిఫార్సులు... ► గిరిజనుల అక్షరాస్యతను పెంచేందుకు సాక్షరభారత్ పథకానికి అదనపు నిధులు ► బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంలో సీట్ల సంఖ్య 2 వేలకు పెంచాలి ► పదివేల మంది గిరిజన డ్రాప్అవుట్లకు ఒపెన్ వర్సిటీ ద్వారా పట్టభద్రులుగా తీర్చిదిద్దాలి ► హాస్టళ్లలో మెస్ చార్జీలను ప్రస్తుతం 25 శాతం పెంచడంతో పాటు ఏటా 5శాతం పెంచాలి. ► కొత్తగా మరో 50 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు ► ‘ఓన్ యువర్ కార్’ కింద ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో మరో 500మందికి అవకాశం కల్పించాలి ► గిరిజన భూఅభివృద్ధి పథకం కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10 వేల మంది గిరిజన రైతులకు గాను 30వేల ఎకరాల అభివృద్ధికి రూ.300 కోట్లు ఖర్చు చేయాలి ► గుడుంబా బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి ► మిషన్ భగీరథ కింద ప్రతి గ్రామానికి తాగునీటి సౌకర్యం.. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి కుటుంబానికి మరుగుదొడ్లు మంజూరు. ► ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలి ► వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద గిరిజనులకు వందశాతం రాయితీతో యంత్రాలు ► కల్యాణ లక్ష్మి ఆర్థిక సాయాన్ని రూ.1.01 లక్షలకు పెంచి, పెళ్లి రోజు నాటికే అందించాలి ► 42 శాఖల పరిధిలో ఉన్న ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. -
మేరీల్యాండ్‌కు తెలంగాణ సహకారం
మంత్రి చందూలాల్ వెల్లడి హైదరాబాద్: భారత్‌తో ద్వైపాక్షిక సంబం ధాల కోసం అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరి స్తుందని టూరిజం, కల్చరర్ శాఖ మంత్రి చందులాల్ అన్నారు. సోమవారం హోటల్ మారియట్‌లో జరిగిన మేరీ ల్యాండ్ ఇండియా బిజినెస్ రౌండ్ టేబుల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ సిరీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మేరీల్యాండ్ లాగే భౌగోళికంగా వైవిధ్యం కలిగిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. నూత నంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంతో వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక సంబం ధాలను బలోపేతం చేసుకొని, రాష్ట్ర పురోభివృద్ధికి సహకారించాలని కోరారు. మేరీల్యాండ్–తెలంగాణ ప్రభుత్వాలకు సాంస్కృతిక వారధిగా పని చేస్తున్న నిర్వహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆకాశ వీధిలో..
హెలికాప్టర్ సవారీపై నగరవాసులు ఫిదా విశ్వనగరి అందాల విహంగ వీక్షణతో అమితానందం సందర్శకులను తన్మయత్వంలో ముంచెత్తిన హెలీ రైడ్ కుటుంబ సభ్యులతో కలసి నగరాన్ని చుట్టిన చందూలాల్ సాక్షి, హైదరాబాద్: చూసే మనసుండాలేగానీ భాగ్యనగరి అణువణువూ సోయగాల బృందావనమే. మహానగరానికి నలుదిశలా విస్తరించిన చార్మినార్, గోల్కొండ, మక్కా మసీదు, హైకోర్టు, అసెంబ్లీ, ఉస్మానియా ఆస్పత్రి, ఫలక్‌నుమా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లామందిర్, హుస్సేన్ సాగర్ వంటి చారిత్రాక ప్రదేశాలను ఏకకాలంలో చూడటం సందర్శకుల కనులకు విందే. ‘గగన విహారం’ ద్వారా విశ్వనగరి అందాలను నింగి లో ఎగురుతూ వీక్షించే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది హెలీ టూరిజం. హుస్సేన్ సాగర్ తీరంలో తాజాగా ప్రారంభించిన ‘హెలీ రైడ్’కు విశేష ఆదరణ లభిస్తోంది. విహంగ వీక్షణంతో సందర్శకులను తన్మయత్వంలో ముంచెత్తడంతో పాటు పర్యాటక శాఖ ప్రతిష్టనూ పెంచుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ముత్యాల నగరానికి ‘గగన విహారం’ మరో మణిహారంగా మారింది. ప్రారంభమైన రోజే హుషారుగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పర్యాటక శాఖ చేపట్టిన ఈ హెలీ టూరిజం శుక్రవారం ప్రారంభమైన రోజే ఘనమైన ఆదరణ పొందింది. తొలిరోజే 100 మందికిపైగా పర్యాటకులు హెలికాప్టర్లో నగరాన్ని చుట్టివచ్చారు. నింగికెగిరిన హెలికాప్టర్ పక్షిలా దూసుకెళ్తూ.. మలుపు తిరుగుతూ మురిపిస్తుండటం చిన్నారులనే కాదు పెద్దలను సైతం ఆనంద డోలికల్లో ముంచెత్తింది. ఈ అరుదైన అనుభూతిని ఆస్వాదించేందుకు నగరవాసులు, పర్యాటకులు ఆసక్తి చూపుతుండటంతో జాయ్‌రైడ్స్ జోరందుకున్నాయి. పైలట్స్‌గా విశేష అనుభవం కలిగిన కెప్టెన్ సునీల్, ప్రణవ్ హెలీ రైడ్‌కు నేతృత్వంగా వ్యవహరించారు. రెగ్యులర్‌గా నడిపిస్తాం..: చందులాల్ హెలీరైడ్ రెగ్యులర్‌గా నడిపిస్తామని పర్యాటక మంత్రి అజ్మీరా చందులాల్ తెలిపారు. శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులతో కలసి హెలికాప్టర్లో నగరాన్ని చుట్టివచ్చారు. సాధారణ రేట్లతోనే హెలికాప్టర్లో తిరిగిన అనుభూతి నగరవాసులు పొందవచ్చని, ప్రజలందరూ సంక్రాంతిని పురస్కరించుకుని ప్రారంభించిన హెలీ టూరిజాన్ని ఉపయోగించు కోవాలని కోరారు. నింగి నుంచి హైదరాబాద్ అందాలు తమను మంత్రముగ్ధుల్ని చేశాయని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొనటం విశేషం. నగరవాసులు విరివిగా తరలి రావాలి.. మంచి ఆఫర్స్ ఇస్తున్నామని తుంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ గోవింద్ నయ్యర్ తెలిపారు. ఒక్కరికైతే రూ.3,500, ఒక ఫ్యామిలీలో నలుగురితో వస్తే ఒక్కొక్కరికి రూ. 3 వేలు, అదే 12 మంది ఉన్న ఫ్యామిలీతో గ్రూప్‌గా వస్తే ఒక్కొక్కరికి రూ. 2,500 మాత్రమే టికెట్ ధర చెల్లించవచ్చన్నారు. మేరా ఈవెంట్స్ డాట్ కమ్‌లో బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఒక్కొక్క ట్రిప్‌కు 12 మంది వెళ్లవచ్చని, 17 వరకు హెలీ టూర్ నడిపిస్తామని చెప్పారు. సందర్శకులు మురిసిపోతున్నారు: పైలట్లు హెలికాప్టర్లో కూర్చున టూరిస్టులు గగనతలం నుంచి నగరాన్ని చూసి మురిసిపోతున్నారని పైలట్లు సునీల్, ప్రణవ్ చెప్పారు. 1,500 అడుగుల ఎత్తులో హెలికాప్టర్‌ను నడపుతున్నామని ఇది బెస్ట్ వ్యూ అని తెలిపారు. ఆకాశం నుంచి హైదరాబాద్ అందాలు చూడముచ్చటగా ఉన్నాయన్నారు. జీవితంలో మరువలేం.. గగనతలంలో ప్రయాణించటం ఇదే ఫస్ట్ టైమ్. ఈ అనుభూతిని జీవితంలో మరువలేను. అదీ బోగి పండుగ రోజున. ఈ మధురానుభూతిని కల్పించిన టూరిజం శాఖకి కృతజ్ఞతలు. – శ్రావణ్ కుమార్, మాల్కాజ్‌గిరి తన్మయత్వానికి లోనయ్యా.. హెలికాప్టర్లో ప్రయాణంతో తన్మయత్వా నికి లోనయ్యా. నగర అందాలు చాలా బాగున్నాయి. నా పిల్లలు ఉద్దమ్, తివిద్ నగరాన్ని పై నుంచి చూసి మురిసిపోయా రు. టూర్ చాలా బాగా అనిపించింది. – దీప్తి, మల్కాజ్గిరి -
నాగోబా జాతరకు రూ.40 లక్షలు
మంత్రి చందూలాల్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గిరిజనుల ఆరాధ్యదైవం ఆదిలాబాద్ జిల్లా ఖెస్లాపూర్ నాగోబా జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.40 లక్షలు విడుదల చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ, పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. సమ్మక్క, సారలమ్మల తర్వాత పెద్దదైన నాగోబా జాతరకున్న విశేష ప్రాధాన్యత దృష్ట్యా వచ్చే నెల 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే ఈ జాతరకు ప్రభుత్వం తరఫున ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నామన్నారు. మంగళవారం సచివాలయంలో జాతర ఏర్పాట్లపై మంత్రులు ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్నతో కలసి చందూలాల్ సమీక్షించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధి కారులను ఆదేశించారు. ఇంద్రవెల్లి మండలంలోని నాగోబా జాతరకు శాశ్వత ప్రాతి పదికన చర్యలు చేపట్టాలని మంత్రులు నిర్ణయించారు. ఎస్టీ సంక్షేమ శాఖ నుంచి రూ. 2కోట్లతో ధర్మసత్రం, దర్బార్ హాలు, ఇతర ఏర్పాట్లను చేపట్టను న్నట్లు చందూలాల్ తెలియజేశారు. మండప ఆధునీకరణ, రాజగోపుర నిర్మాణాలు, దేవాలయ పునరు ద్ధరణకు రూ.1.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఇంద్రకరణ్‌రెడ్డి తెలి పారు. ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్, రాథోడ్ బాబూరావు పాల్గొన్నారు. -
సంక్రాంతికి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్
హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మంత్రి చందులాల్ చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలలో ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారంతో పతంగుల ఉత్సవం చేపడుతున్నామన్నారు. కైట్ ఫెస్టివల్ ద్వారా వచ్చే నిధులను బాలికల విద్యను ప్రోత్సహించేందుకు వినియోగిస్తామని తెలిపారు. దేశ, విదేశీ కంపెనీలు ఈ పండుగలో పాల్గొంటాయన్నారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్లోను పతంగుల పండగ నిర్వహిస్తామని చందులాల్ వెల్లడించారు. -
గిరిజన యువతకు ‘జాబ్ పోర్టల్’
ప్రారంభించిన మంత్రి అజ్మీరా చందూలాల్ సాక్షి,హైదరాబాద్: గిరిజన యువత ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సరి కొత్త వేదిక ఏర్పాటైంది. హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు, గిరిజన సంక్షేమ శాఖ సంయుక్తంగా ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. శనివారం సచి వాలయంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ ఈ వెబ్సైట్... ఎస్‌టీఈసీ.తెలంగాణ.జీఓవీ.ఇన్ను ప్రారంభిం చారు. గిరిజన విద్యార్థులు మాత్రమే ఈ వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంతో సదరు అభ్యర్థికి తాజా నోటిఫికేషన్లు, ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి న సమాచారం అందుతుంది. సంక్షిప్త, ఈమెరుుల్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వడంతో పాటు ఫోన్ ద్వారా కూడా యువతకు అవగాహన కల్పిస్తారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారిని సన్నద్ధపర్చే కార్యక్రమాల్ని సైతం వెబ్సైట్ నిర్వాహకులు చేపడుతున్నారు. ఉద్యోగం వచ్చే వరకు... రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి అభ్యర్థికి ఉద్యోగావకాశం వచ్చే వరకు మార్గనిర్దేశం చేస్తామని హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ నిశాంత్ తెలి పారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే అభ్య ర్థి ఈమెరుుల్కు పాస్వర్డ్ పంపుతారు. అనంతరం అభ్యర్థి అర్హతలను అందులో నిక్షిప్తం చేయాలి. వాటి ఆధారంగా ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తారు. ఆర్థిక స్థోమత లేని అభ్యర్థులకు టీఏ, డీఏ సహకారాన్ని సైతం కల్పిస్తారు. అభ్యర్థి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు పోర్టల్‌లో ఎంట్రీ చేయాలి. నిరుద్యోగ గిరిజన యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు డిక్కి (దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) చేయూతనివ్వనుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖతో ఇప్పందం కుదుర్చుకుంది. పెట్టుబడుల సహకారంతో పాటు యూనిట్ల స్థాపనకు సలహాలు సూచనలు ఇవ్వనున్నట్లు డిక్కి చైర్మన్ రవికుమార్ తెలిపారు. గిరిజనులకు వరం: చందూలాల్ ఈ వెబ్‌పోర్టల్ గిరిజన యువతకు వరంలాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవా లి. త్వరలో ఆండ్రారుుడ్ జాబ్ యాప్‌ను తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటుంన్నాం. 10 వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు... ‘నగరాల్లో ఉద్యోగాలు చేసే గిరిజన యువతులకు నివాస సదుపాయం సమ స్యగా మారింది. దీన్ని అధిగమించేలా రాష్ట్రవ్యాప్తంగా 10వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ప్రారంభించనున్నాం. అలాగే ఐఏఎస్ శిక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తాం’ అని శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్ వెల్లడించారు. -
అభివృద్ధికి ప్రతిబింబంగా ‘డిజిటల్ తెలంగాణ’
ట్రేడ్ ఫెరుుర్‌లో రాష్ట్ర పెవిలియన్‌ను ప్రారంభించిన మంత్రి చందూలాల్ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రారంభమైన 36వ భారత అంతర్జాతీయ ట్రేడ్ ఫెరుుర్‌లో తెలంగాణ రాష్ట్రం ’డిజిటల్ తెలంగాణ’ పేరుతో ఏర్పాటు చేసిన పెవిలియన్ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమం, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ అన్నారు. సోమవారం ప్రారంభమైన ట్రేడ్ ఫెరుుర్‌లో తెలంగాణ పెవిలియన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చందూలాల్ మాట్లాడుతూ టీ-హబ్ నమూనాతో తీర్చిదిద్దిన పెవిలియన్.. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని స్పష్టంగా చాటేలా ఉందన్నారు. ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్ ఐటీ అనే మూడు అంశాలు డిజిటల్ తెలంగాణ త్రీడీ డిజైన్‌లో ప్రముఖంగా కనిపించేలా ఏర్పాట్లు చేశారన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి, ప్రపంచ స్థారుు సంస్థలు తెలంగాణలో ఏర్పాటు కావడం, వాటికి కల్పిస్తున్న సదుపాయాలను తెలిపే విధంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. చందూలాల్ వెంట ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు రామచంద్ర తేజోవత్, కేఎం సహాని తదితరులున్నారు. ఈ ఎగ్జిబిషన్లో రాష్ట్ర చేనేతాభివృద్ధి సంస్థ, హస్తకళలు, పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తదితర విభాగాలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశారుు. ఈ నెల 27 వరకు కొనసాగనున్న ఈ ఫెరుుర్‌లో 21వ తేదీన ఒగ్గు డోలు, పేరిణి నృత్యం, ఖవ్వాలీ, కొమ్ము కోయ వంటి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు హాజరుకానున్నారు. -
పంచకూటాలయానికి కొత్త స్థలం
- మంత్రి చందూలాల్ ఆదేశంతో ఆగమేఘాలమీద గుర్తింపు - గుట్టపై భూమిని సేకరించిన రెవెన్యూ అధికారులు సాక్షి, హైదరాబాద్: అరుదైన పంచకూటాలయం పునర్నిర్మాణానికి మరో కొత్త స్థలాన్ని సేకరించారు. ఇప్పటికే ఓ స్థలాన్ని గుర్తించి దాదాపు రూ.10 ల క్షలు వ్యయంతో చదునుచేసి నిర్మాణానికి సిద్ధం చేయగా, అది మరో పార్టీ నేతలు ఇచ్చిన భూమి కావటంతో అందులో ఆలయ పునర్నిర్మాణం వద్దంటూ అధికార టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దాంతో పురావస్తుశాఖ పనులు చేయకుండా చేతులెత్తేసింది. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం రామానుజాపురంలో జరిగిన ఈ వ్యవహారాన్ని 4 రోజుల క్రితం ‘పంచకూటాలయంపై పంచాయితీ’ శీర్షికన సాక్షి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో అదేరోజు పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి చందూలాల్ ఇటు పురావస్తుశాఖ, అటు రెవెన్యూ అధికారులను పిలిపించి దీనిపై చర్చించారు. పంచకూటాలయం పునరుద్ధరణ ఇలా రాజకీయకారణాలతో వివాదాస్పదం కావడంతో వెంటనే పనులు మొదలుపెట్టక తప్పదని మంత్రి ఆదేశించారు. అయితే ఆ స్థలంలో కాకుండా మరోచోట నిర్మాణం చేపట్టాలని ఆదేశించటం విశేషం. ఆలయ పునర్నిర్మాణానికి సిద్ధం చేసిన స్థలానికి బదులు మరో చోట ప్రభుత్వ భూమిని సేకరించాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో వెంకటాపురం తహసీల్దార్ రంగంలోకి దిగి రామానుజాపురానికి 5 కి.మీ. దూరంలో 30 గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించారు. దాన్ని పురావస్తుశాఖ డిప్యూటీ డెరైక్టర్ రహీంషా అలీ, ఆ శాఖ వరంగల్ ఏడీ ప్రేమ్‌సాగర్‌లు పరిశీలించారు. అందులోనే ఆలయాన్ని పునర్నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఆ స్థలాన్ని రెవెన్యూ అధికారులు పురావస్తుశాఖకు స్వాధీనం చేయనున్నట్టు సమాచారం. మళ్లీ కొత్త ఖర్చు.. గతంలో గ్రామంలో ఆలయపునర్నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసి చదును చేశారు. ఆలయం నుంచి విప్పతీసిన శిల్పాలు, రాళ్లను ఇక్కడికి తరలించారు. కాగా, ఇప్పుడు కొత్తగా గుర్తించిన స్థలం గుట్టప్రాంతం కావటంతో దాన్ని మళ్లీ చదును చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి మళ్లీ భారీగా వ్యయం చేయాల్సి ఉంటుంది. -
‘పంచకూటాలయం’పై పంచాయితీ!
* చారిత్రక ఆలయ పునర్నిర్మాణంపై రాజకీయ తకరారు * మంత్రి చందూలాల్ ఇలాఖాలో విడ్డూరం * పనులు మొదలు కాకుండా అధికార పార్టీ నేతల అడ్డంకులు * కాంగ్రెస్ నేతలకు పేరొచ్చేలా ఉందని అధికారులపై ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: అది 13వ శతాబ్దంలో నిర్మితమైన అద్భుత మందిరం... కాకతీయుల శిల్పకళావైభవంతో రూపుదిద్దుకున్న పంచకూటాలయం.. కాలక్రమంలో శిథిలమైన ఆ మందిరాన్ని అనువైన మరోచోట పునర్నిర్మించాలని పురావస్తుశాఖ రెండున్నర దశాబ్దాల క్రితం నిర్ణయించింది. నిధుల లేమి, అనువైన స్థలం లేక పునర్నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. తాజాగా రూ. కోటి నిధులు, ఎకరం స్థలం లభించినా రాజకీయ పంచాయితీ రూపంలో పనులకు మళ్లీ అవాంతరం ఎదురైంది. ఇదంతా జరుగుతున్నది రాష్ట్ర పర్యాటక, పురావస్తుశాఖ మంత్రి చందూలాల్ ఇలాఖాలోనే! పనులను అడ్డుకుంది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీకి చెందిన నేతలే..!! రామప్పకు చేరువలోనే... యునెస్కో చారిత్రక వారసత్వ గుర్తింపు హోదా కోసం పోటీపడుతున్న రామప్ప దేవాలయానికి కూతవేటు దూరంలో పంచకూటాలయం ఉంది. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం ప్రస్తుత రామానుజాపూర్ గ్రామ శివారులో 13వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఇందులో ఒకే రంగమండపంతో 5 విడివిడి ఆలయాలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్న 2 పంచకూటాలయాల్లో ఇదీ ఒకటి. వేణుగోపాలస్వామి ప్రధాన దేవతామూర్తిగా ఆలయం రూపుదిద్దుకుంది. ప్రధానాలయంలో వేణుగోపాలస్వామి విగ్రహాన్ని దుండగులు చాలా ఏళ్ల క్రితమే తస్కరించగా ఉమామహేశ్వర స్వామి ఆలయం మాత్రం స్పష్టంగా ఉండేది. శ్రీకృష్ణుని లీలలతో కూడిన చిత్రాలు ఉండటంతో దీన్ని వేణుగోపాలస్వామి ఆలయం అని చరిత్రకారులు నిర్ధారించారు. పొలాల మధ్య, ఓ చిట్టడివిని తలపించే ప్రాంతంలో ఆలయం ఉండటం, అప్పటికే ఆలనాపాలనా కరువవడం, ముస్లిం రాజుల దాడిలో చాలా వరకు శిథిలమవటంతో ఆలయ ప్రాభవం తగ్గిపోయింది. దీంతో రెండున్నర దశాబ్దాల క్రితం ఆలయాన్ని గ్రామానికి చేరువగా పునర్నిర్మించాలని పురావస్తుశాఖ నిర్ణయించింది. ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో ఆలయ రాళ్లను జాగ్రత్తగా విప్పదీశారు. అప్పటికే గుర్తించిన స్థలంలో నిర్మిద్దామనుకునేసరికి అది అటవీ శాఖ భూమిగా తేలింది. దీంతో మరో స్థలం కోసం ప్రయత్నించినా దొరకలేదు. ఈ లోగా నిధులకు ఇబ్బంది రావటంతో ఆ ప్రక్రియను అటకెక్కించారు. రూ. కోటి నిధులు సమకూరినా... ఆలయ పునర్నిర్మాణం మూడేళ్ల క్రితం మరోసారి తెరపైకి వచ్చింది. 12వ ఆర్థిక సంఘం నిధుల్లో మిగిలిన సొమ్ముతోపాటు 13వ ఆర్థిక సంఘం కేటాయింపులో కొంత కలిపి దానికి దాదాపు రూ. కోటి వరకు కేటాయించారు. స్థలం దొరికితే పనులు మొదలుపెట్టాలనుకోగా ఆ ప్రాంతానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత ఎకరం స్థలాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. ఆ తర్వాత దాన్ని గ్రామకంఠం భూమిగా గుర్తించిన అధికారులు అక్కడే పనులు మొదలు పెట్టాలనుకొని అంతా సిద్ధం చేసుకున్నారు. దాదాపు రూ.10 లక్షలు వెచ్చించి స్థలాన్ని అనువుగా మార్చారు. కానీ ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. ప్రతిపాదిత స్థలంలో ఆలయాన్ని పునర్నిర్మిస్తే కాంగ్రెస్ నేతలకు పేరొస్తుందని అధికార టీఆర్ఎస్ నేతలు ఆందోళన మొదలుపెట్టారు. పైగా స్థానిక ఎమ్మెల్యే(ములుగు నియోజకవర్గం),స్వయంగా పురావస్తుశాఖను పర్యవేక్షిస్తున్న మంత్రితో భూమి పూజ చేయించకపోవడాన్ని తప్పుపడుతూ పురావస్తుశాఖ అధికారులపై శివాలెత్తారు. ఫలితంగా పనులు మొదలు కాలేదు. నిధులు మురిగిపోయే పరిస్థితి ఉండటంతో అధికారులు టీఆర్ఎస్ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతం ఆలయ శిల్పకళా సంపద బురద, మట్టిదిబ్బల్లో కూరుకుపోయి పిచ్చి మొక్కల మధ్య దర్శనమిస్తోంది. -
ఎస్టీ గురుకులాలకు కీర్తిని తెచ్చారు
పర్వతారోహణలో విజయం సాధించిన విద్యార్థులకు మంత్రి చందూలాల్ సన్మానం హైదరాబాద్: పర్వతారోహణలో గిరిజన విద్యార్థులు కొత్త చరిత్రను సృష్టించి, ఎస్టీ గురుకులాలకు ఎనలేని కీర్తిప్రతిష్టలను తీసుకొచ్చారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. గత ఏడాది మౌంట్ రెనాక్‌ను అధిరోహించిన 16 మంది ఎస్టీ గురుకులాల విద్యార్థులు, ఒక కోచ్‌ను, ఇటీవల కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఎస్టీ విద్యార్థులు జి.సింధు, ఎన్.కృష్ణలను శుక్రవారం సంక్షేమ భవన్లో మంత్రి చందూలాల్ ఘనంగా సన్మానించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వీరికి రూ.51 వేల చొప్పున ప్రోత్సాహకాన్ని కూడా అందజేశారు. అలాగే ఇంటర్మీడియెట్‌లో స్టేట్‌ర్యాంకులు సాధించిన డి.నాగమణి, టి.భావనలకు రూ. 25 వేల చొప్పున, అత్యధిక మార్కులను సాధించిన మరో 8 మంది విద్యార్థులకు రూ.15 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 9వ తరగతి నుంచే సివిల్స్‌కు శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎస్టీ విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్యసేవలను అందించేందుకు ఎస్టీ సంక్షేమశాఖ కేంద్ర కార్యాలయంలో 24 గంటలు నడిచేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీశాఖ కమిషనర్ లక్ష్మణ్, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వాయర్ పనుల శంకుస్థాపనలో ఉద్రిక్తత
తమకు ప్రత్యామ్నాయం చూపాలని అడ్డుకున్న గీతకార్మికులు నిరసనల మధ్యనే శంకుస్థాపన చేసిన మంత్రి చందూలాల్ జఫర్‌గఢ్: వరంగల్ జిల్లా జఫర్‌గఢ్ మండలంలో ఉప్పుగల్లు రిజర్వాయర్ శంకుస్థాపన తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. రిజర్వాయర్ వల్ల ఉపాధి కోల్పోతున్న తమను ఆదుకునేందుకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు పనులు ప్రారంభించవద్దంటూ గీత కార్మికులు అడ్డుతగిలారు. ఒకవైపు గీత కార్మికులు నిరసన వ్యక్తం చేస్తుండగానే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందులాల్ రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా ఉప్పుగల్లు గ్రామాన్ని ఆనుకొని రిజర్వాయర్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేసింది. ఈ రిజర్వాయర్ నిర్మాణ వల్ల ఉప్పుగల్లు గ్రామానికి చెందిన రైతుల వ్యవసాయ భూములతో పాటు గీత కార్మికుల తాటి చెట్లు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటికే ముంపునకు గురయ్యే భూములపై సర్వే నిర్వహించడంతో పాటు భూములు కోల్పోయే కొంతమంది రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చింది. అయితే తాటిచెట్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో వీటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ఈ విషయం తేలకుండానే ప్రజాప్రతినిధులు రిజర్వాయర్ నిర్మాణ పనుల శంకుస్థాపనకు పూనుకున్నారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న గీత కార్మికులు పెద్ద సంఖ్యలో మోకు ముత్తాదులతో శిలఫలకం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. తాటి చెట్ల వల్ల ఉపాధి కోల్పోతున్న తమను ఆదుకునే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతనే పనులకు శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేయకుండా అడ్డుతగిలారు. వారిని నివారించేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా గీత కార్మికులతో వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారి ఇరువురి మధ్య తోపులాట జరిగింది. నియోజకవర్గ ఎమ్మెల్యే రాజయ్యకు వ్యతిరేకంగా గీతకార్మికులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఒక ఒక వైపు గీతా కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తుండగానే మంత్రి చందులాల్ రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. సభ జరగకుండా పలుమార్లు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా బైటకు పంపించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే రాజయ్యతో పాటు ఇదే గ్రామస్తుడైన వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ రిజర్వాయర్ వల్ల నష్టపోతున్న గీత కార్మికులను అన్ని విధాలుగా అదుకుంటామని హామీ ఇచ్చారు. -
భువనగిరి కోటకు కొత్త కళ
- తెలంగాణలో తొలి రోప్ వే ఏర్పాటు - కోటపై సౌండ్ అండ్ లైట్ షో,లేజర్ షో, మ్యూజియం నిర్మాణం సాక్షి, హైదరాబాద్ : అటు గోల్కొండ కోట... ఇటు ఓరుగల్లు కోట.. మధ్యలో భువనగిరి కోట. పదో శతాబ్దంలో నిర్మితమైన అద్భుత కట్టడం. ఒకప్పుడు గొప్ప చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ కోట ఆ తర్వాత ప్రాభవాన్ని కోల్పోయింది. మళ్లీ ఇప్పుడు ఇది ఓ పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకునేందుకు సిద్ధమైంది. దేశవిదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా రూ.50 కోట్లతో కోటను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం అయింది. వచ్చే నెలలోనే పనులు ప్రారంభం కానున్నాయి. సాహస క్రీడలకు వేదికగా... ఇటీవల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి జాతీయ పతాకాన్ని అక్కడ ఎగరేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ నుంచి కూడా ఆ సాహసాన్ని చేసి చూపుతున్నవారి సంఖ్యా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భువనగిరి కోటను సాహస క్రీడలకు వేదికగా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పర్వతారోహకులకు నిపుణుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించటం విశేషం. ఇప్పటికే ఇక్కడ ఓ కేంద్రం ఏర్పాటు కాగా, పలు పనులు కొనసాగుతున్నాయి. గుట్టపైనున్న రాణీమహల్కు వెళ్లటం పర్యాటకులకు ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో తొలి రోప్ వేను నిర్మించనున్నారు. అలాగే సేద తీరేందుకు పచ్చిక బయళ్లు, ఓ భారీ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. సౌండ్ అండ్ లైట్ షో, కోటపైనే ప్రదర్శనశాల, లేజర్ షోనూ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. 350 మీటర్ల దూరం నుంచి రోప్ వే... గుట్టను ఆనుకునే పట్టణం వైపు ఇళ్లు భారీగా వెలియడంతో ప్రవేశద్వారం వద్ద స్థలం లేదు. దీంతో అక్కడి నుంచి 350 మీటర్ల దూరంలో మూడెకరాల ప్రైవేటు భూమిని సమీకరించారు. ఆ స్థలంలో కేంద్రాన్ని నిర్మించి గుట్టపైకి రోప్‌వేను ఏర్పాటు చేస్తారు. నాలుగు సీట్లుండే.. ఎనిమిది టబ్లుండేలా ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నారు. త్వరలో దీని నిర్మాణానికి సంస్థలను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ మూడు ఎకరాల్లోనే ఓ రెస్టారెంట్‌తో పాటు విశ్రాంతి గదులను నిర్మిస్తారు. వచ్చే నెలలో పనులకు శ్రీకారం: చందూలాల్ భువనగిరి కోటను ముఖ్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వచ్చే నెలలోనే పనులు ప్రారంభించాలని నిర్ణయించినట్టు పర్యాటక మంత్రి చందూలాల్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ప్రభుత్వ సలహాదారు రమణాచారి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పర్యాటక కార్యదర్శి వెంకటేశం, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ క్రిస్టీనా చోంగ్తు, పురావస్తు సంచాలకులు విశాలాక్షి తదితరులతో సమీక్షించారు. -
రాజన్నను దర్శించుకున్న చందులాల్
కరీంనగర్: వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రి చందులాల్ శనివారం దర్శించుకున్నారు. సతీసమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజ ఏర్పాట్లను చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. త్వరలోనే ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చుదిద్దుతామని మంత్రి తెలిపారు. -
అంబరాన్నంటేలా సంబురాలు
తెలంగాణ అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి చందూలాల్ ♦ అన్నిచోట్లా పతాక ఆవిష్కరణలు.. ♦ ప్రముఖులకు సన్మానాలు సాక్షి, హైదరాబాద్: అంబరాన్ని అంటేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలను రాష్ట్ర అవతరణ పండుగలో భాగస్వాములను చేసేలా సాంస్కృతిక శాఖ అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలందరూ పండుగ చేసుకునేలా వివిధ కార్యక్రమాల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక శాఖపరంగా చేపట్టిన ఉత్సవ ఏర్పాట్లను మంత్రి వివరించారు. వివిధ రంగాల్లోని 62 మంది ప్రముఖులను రాష్ట్రస్థాయిలో, 25 మందిని జిల్లా స్థాయిలో ప్రభుత్వం తరపున ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. సాంస్కృతిక శాఖ సలహాదారు రమణాచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ప్రపంచానికి చాటేలా ప్రజలు నిర్వహించుకోవాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి దాకా అన్ని ప్రాంతాల్లో పతాక ఆవిష్కరణలు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా లుంబినీ పార్కులో అమరవీరుల స్మృతివనం, సంజీవయ్య పార్కులో అతిపెద్ద జాతీయ జెండా నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాజధాని నగరంలో ఖవ్వాలీ, గజల్, ముషాయిరా.. తదితర సంప్రదాయ క ళలతోపాటు కల్చరల్ కార్నివాల్, కవి సమ్మేళనాలు, పేరిణి నృత్యాలు నిర్వహిస్తున్నామన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా జరుపుకుంటున్న ఉత్సవాల స్ఫూర్తిని ఏడాది పొడవునా కొనసాగించాలన్నారు. సాంస్కృతిక వారధి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. వారధి తరపున ప్రతి జిల్లాకు సంబంధించిన సంస్కృతిని, సంప్రదాయాన్ని ఆవిష్కరించేలా కార్యక్రమాలను రూపొందించామన్నారు. ఉత్సవాల్లో ఫైర్‌వాల్, కల్చరల్ కార్నివాల్, కొరేకల్స్ రేసింగ్, లైట్పార్క్, ఫుడ్ ఫెస్టివల్స్ వంటివి ఏర్పాటు చేశామని సాం స్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. బాగా అలంకరించిన నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లకు రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేల చొప్పున బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశం లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు, మైనార్టీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ తదితరులున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా.. లలిత కళా తోరణంలో ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు డప్పులు, డోళ్లు, పేర్ని మహానృత్యం నిర్వహిస్తారు. పీపుల్స్ ప్లాజాలో వివిధ జిల్లాల కళాకారులతో గోండు, కోయ, లంబాడా.. తదితర నృత్య ప్రదర్శనలు, రవీంద్రభారతిలో ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ నృత్యరూపకం, బాలల నాటిక ‘దీనబాంధవ’, తెలుగు యూనివర్సిటీలో కవి సమ్మేళనం, హరిహర కళాభవన్‌లో బుద్ధిస్ట్, జైన్, క్రిస్టియన్ కార్యక్రమాలు, కిల్వత్ మైదానంలో ఖవ్వాలీ, ఎల్బీ స్టేడియంలో గజల్స్, కులీ కుతుబ్‌షా స్టేడియంలో ముషాయిరా, ఎల్బీనగర్ జగజ్జీవన్‌రామ్ హాల్లో ఫోక్, కల్చరల్ ఈవెంట్స్, హెచ్ఐసీసీలో సాం స్కృతిక కార్యక్రమాలు, ట్యాంక్‌బండ్‌పై, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బతుకమ్మ, బోనాలు, కోలాటం తదితర ప్రదర్శనలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిజాం వారసులకు ఆహ్వానం.. అవతరణ దినోత్సవాల్లో పాల్గొనాలంటూ నిజాం వారసులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందులో భాగంగా కింగ్‌కోఠిలో నివసిస్తున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వారసుడు, మునిమనవడు మీర్జా మొహిబ్ బేగ్‌కు సచివాలయం నుంచి ఆహ్వానం అందింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఉత్సవాల్లో మీర్జాకు ఏ1 సిరీస్‌లో సీటు కేటాయించింది. కుటుంబసమేతంగా హాజరవ్వా లంటూ ప్రభుత్వం లేఖ పంపినట్టు మీర్జా తెలిపారు. -
పర్యాటక రంగానికి ప్రాధాన్యం
వండర్లా పార్కు ప్రారంభోత్సవంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, చందూలాల్ మహేశ్వరం: ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యమిస్తూ, ప్రోత్సహిస్తోందని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామం సమీపంలో వండర్లా 60 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అమ్యూజ్మెంట్ పార్కును పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వారు పార్కులో తిరిగి రైడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వండర్లా పార్కు ఆసియాలో 7వ స్థానం, భారతదేశంలో మొదటి స్థానంలో ఉందన్నారు. దేశంలోనే మొదటిసారిగా రివర్స్ రూపింగ్స్ రోలర్ కోస్టర్‌తో వండర్లా హైదరాబాద్ ప్రజలను అలరించనుందన్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఒక మెగావాట్ సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల ఏకైక ఆహ్లాదపార్క్ వండర్లా అని పేర్కొన్నారు. దీని పక్కనే సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో భారీ పార్కు రానుందన్నారు. కాగా, ఈ ప్రాంతం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి చందూలాల్ అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, ఐటీ, పీఆర్శాఖల మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని భారీ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, పార్కులను తెస్తున్నారని అన్నారు. వండర్లా ఎండీ అరుణ్ కే చిట్టిల పిళ్లై మాట్లాడుతూ.. వండర్లా అమ్యూజ్ పార్కుల్లో మొదటిది బెంగళూర్‌లో, రెండోది కొచ్చిలో ఏర్పాటు చేయగా, ప్రస్తుతం మూడో పార్కును హైదరాబాద్ రావిర్యాలలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్నారనడంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు భారీగా పార్కుకు వచ్చారు. కానీ ఆయన గైర్హాజరు కావడంతో నిరాశ చెందారు. ఇంకా ఈ కార్యక్రమంలో వండర్లా వ్యవస్థాపకులు కోచోసెప్ థామస్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రియా అరుణ్, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి, పార్కు ఇన్చార్జ్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
హవ్వ... గుడుంబా నియంత్రించారట
గ్రామాల్లో పూర్తి స్థాయిలో గుడుంబా నివారణ కు కృషి చేస్తున్నామంటూ గొప్పలు చె ప్పుకుంటున్న అధికారుల తీరుకు పై చిత్రం నిదర్శనంగా నిలుస్తుంది. మంత్రి చందూలాల్ మండలంలోని తన స్వగ్రామమైన జగ్గన్నపేట పంచాయతీ పరిధిలోని ఊరచెరువు పునరుద్ధరణ పనుల ప్రారంభించారు. అనంతరం మట్టిని తవ్వేందుకుచెరువు వద్దకు వెళ్లారు. కేవలం నిమిషం వ్యవధిలో కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తి తాగి తూలుతూ శిలాఫలకం ఎదుటే పడిపోయాడు. గుడుంబా రహిత జిల్లాగా మార్చుతున్నామని చెబుతున్న అధికారులు దీనిపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి. - ములుగు -
ఇసుక క్వారీ పనులను నిలిపివేసిన ఆదివాసీ జేఏసీ
ఏటూరునాగారం : ఆదివాసీ జేఏసీలకు ఇచ్చిన క్వారీని తపస్సీ కాంట్రాక్టర్ అక్రమంగా అగ్రిమెంట్ చేసుకున్నారని, అగ్రిమెంట్‌ను రద్దు చేసుకోవాలని నాయకులు తాటి హన్మంతరావు, ఆగబోయిన రవి, కుంజ నారాయణ డిమాండ్ చేశా రు. కాగా, గురువారం క్వారీ పనులను ఆదివాసీ జేఏసీ నాయకులు అడ్డుకున్నా రు. అనంతరం వారు మాట్లాడుతూ ఆది వాసీ ప్రజాసంఘాల జేఏసీకి కేటాయిం చిన ఏటూరు 1ఏ క్వారీ నిర్వహణను తపస్వి ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రైవేట్ ఇండి యా కంపెనీకి అక్రమంగా కేటారుుంచారని, ఈ అగ్రిమెంట్ రద్దు చేసే వరకు క్వారీ పనులు సాగనిచ్చేది లేదని హెచ్చరించారు. అలాగే మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ క్వారీ పనులు అడ్డుకుంటే మీ అంతు చూస్తా... మీరు నక్సలైట్లకు సహకరిస్తూ.. మాపై ప్రకటనలు ఇప్పిస్తున్నారని ఫోన్లో బెదిరిస్తున్నారని తెలిపారు. అలాగే ఏటూరునాగారం సీఐ తో ఫోన్లు చేయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఐటీడీఏ పీఓ, ఐకేపీ అధికార యంత్రాంగం ఆది వాసీలకు అండగా ఉండాలని కోరారు. లేని పక్షంలో దశలవారిగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అర్రెం లచ్చుపటేల్, మేడ బుచ్చిరాములు, కబ్బాక జగదీశ్వర్‌రావు, మోకాళ్ల వెంకటేష్, ఈసం సుధాకర్, పడిగె నాగేశ్వర్రావు, పొలం సాగర్, తాటి సుధాకర్, దారం సిద్దు, కోరగట్ల లక్ష్మణ్‌రావు, ఆలం కిషోర్, వట్టం నాగరాజు, దారం నరేష్, ఈసం సాంబయ్య పాల్గొన్నారు. -
సంక్షేమ నిధులన్నీ ఖర్చు చేస్తాం
శాసనమండలిలో సంక్షేమ పద్దులపై లఘు చర్చలో మంత్రులు పూర్తిస్థాయిలో నిధులను ఖర్చు చేయాలని సభ్యుల సూచన సాక్షి, హైదరాబాద్: రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలను అందించి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కేటాయించిన బడ్జెట్‌ను ఖర్చు చే సేందుకు చర్యలు చేపడతామని వివిధ సంక్షేమ శాఖల మంత్రులు తెలిపారు. శాసనమండలిలో సంక్షేమ పద్దులపై ఆదివారం జరిగిన లఘు చర్చలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని వక్ఫ్ భూములతో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ పి.సుధాకరరెడ్డి (కాంగ్రెస్), కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌లకు ఇస్తున్న రూ.51 వేలని రూ.75 వేలకు పెంచాలని ఫారుఖ్ హుస్సేన్ (కాంగ్రెస్) కోరారు. కళ్యాణలక్ష్మికి ఇస్తున్న మొత్తాన్ని రూ.1.16 లక్షలకు పెంచాలని, ఎస్టీ హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చాలని రాములు నాయక్ (టీఆర్ఎస్) కోరారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతమున్న చట్టాలతోనే వాటిని రక్షించవచ్చునని అల్తాఫ్ రిజ్వీ (ఎంఐఎం) సూచించారు. ఏ కులమైనా, మతమైనా అభివృద్ధికి కొలమానం మంచి విద్య, శిక్షణ, ఆరోగ్యమని, ఈ దిశలో ఆయా వర్గాలను తీసుకెళ్లాలని రామచంద్రరావు (బీజేపీ) అన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను సక్రమంగా వ్యయం చేయని శాఖలు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ (కాంగ్రెస్) కోరారు. రెండింతలు ఖర్చు చేశాం: ఎస్సీ అభివృద్ధి శాఖ జగదీశ్‌రెడ్డి గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను రెండింతలు ఖర్చు చేశామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ‘సబ్‌ప్లాన్ కింద రూ.8,089 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు రూ.4,236 కోట్లు వ్యయం చేశాం. ఈ ఏడాది స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాల ద్వారా 28 వేలమందికి రూ.283 కోట్ల రుణాలు అందించాం. తెలంగాణ ఏర్పడే నాటికే రూ.1,550 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలున్నాయి. 2014-15లో రూ.2వేల కోట్లు ఇచ్చాం’ అని ఆయన వివరించారు. కల్యాణలక్ష్మి కోసం రూ.300 కోట్లు ఏప్రిల్ నుంచి బీసీలు, ఈబీసీల కళ్యాణలక్ష్మిని ప్రారంభిస్తున్నామని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న చెప్పారు. 26 సంచార జాతుల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్నామని. ప్రస్తుత బడ్జెట్ రూ.2,170 కోట్లలో ఇప్పటివరకు రూ.1,250 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. విద్య, వైద్యంపై శ్రద్ధ తీసుకుంటున్నామని, 2015-16లో గిరిజన ఉపప్రణాళిక కింద రూ.2,664.33 కోట్లు విడుదల చేసి, వాటిని పూర్తిగా ఖర్చు చేశామని గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్ చెప్పారు. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, ఈ ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. -
జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
► ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ► ‘మిషన్’ పనులపై కలెక్టరేట్లో సమీక్ష హన్మకొండ అర్బన్ : రెండో దశ మిషన్ కాకతీయ పనులు గడువులోగా నాణ్యతతో పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుపాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మిషన్ కాకతీయకు అంతర్జాతీయ స్థారుు గుర్తింపు వచ్చిందని, దీన్ని దృష్టి లో ఉంచుకొని అధికారులు మరింత బాధ్యతగా పనిచేయూలన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరం లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్‌తో కలిసి మిషన్ కాకతీయ పనులపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో రెండో దశ పనులు ఆశించిన మేరకు వేగంగా జరగడంలేదన్నారు. క్షేత్రస్థారుులో సాంకేతిక సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మొదటి విడతలో 1075 చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదించగా 1063 చెరువులకు పరిపాలనా అనుమతులు వచ్చాయని, ఇందులో 483 చెరువుల పనులు పూర్తిస్థారుులో బిల్లులు చెల్లించామని, 355 చెరువుల పనులు పూర్తి కాగా బిల్లులు చెల్లించాల్సి ఉందని వివరించారు. రెండో దశలో 1268 చెరువులకు ప్రతిపాదనలు పంపగా 824 చెరువులకు అనుమతులు లభించాయని తెలిపారు. వీటిలో 266 చెరువులకు టెండర్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. 94 చెరువుల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అదేవిధంగా మొదటి దశ పెండింగ్ పనులు ఈ సీజన్లో పూర్తి చేయాలని సూచించారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ మిషన్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఈలకు వాహనం, కంప్యూటర్ ఆపరేటర్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ తిరుపతిరావు, ఎస్ఈ విజయభాస్కర్, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
గగనంలో ఎం‘జాయ్’
-
గగనంలో ఎం‘జాయ్’
హెలికాప్టర్ జాయ్ రైడ్స్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘చారిత్రక ప్రాధాన్యమున్న హైదరాబాద్ మహా నగరంలో పర్యాటకానికి కొత్త హంగులద్దుతూ హెలీ టూరిజంను ప్రారంభిస్తున్నాం. విశ్వనగరంగా అభివృద్ధి వైపు అడుగులేస్తున్న తరుణంలో తెలంగాణ పర్యాటక శాఖ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది’ అని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హుస్సేన్‌సాగర తీరంలోని నెక్లెస్‌రోడ్‌లో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని ‘హెలికాప్టర్ జాయ్ రైడ్స్’ను మంగళవారం మంత్రులు కేటీఆర్, చందూలాల్ ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ... విమానయానం సంపన్నులకు సంబంధించిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అయితే.. తెలంగాణ పర్యాటక శాఖ సామాన్యులకు సైతం రూ.3,499కే హైదరాబాద్ గగన యానం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. కోటి జనాభాకు పైగా ఉన్న నగరంలో పర్యాటకాన్ని ఇంకా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రధానంగా ఔటర్ రింగ్‌రోడ్డు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, హుస్సేన్‌సాగర్, మూసీ నది సుందరీకరణ చేయడం ద్వారా నగరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలు మా వద్ద ఉన్నాయి. హుస్సేన్‌సాగర్ తీరంలో 95 ఎకరాల్లో ఉన్న సంజీవయ్య పార్కును మరింత సుందరంగా తీర్చిదిద్దుతాం’ అన్నారు. భవిష్యత్‌లో యాదాద్రి, మేడారం... ‘భాగ్యనగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కేసీఆర్ కలలుగంటున్న తరుణంలో హెలీ టూ రిజాన్ని ప్రారంభిస్తున్నాం. నగరం అనతికాలంలోనే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందటం ఖాయం. భవిష్యత్‌లో హెలీ టూరిజం ద్వారా యాదాద్రి, లక్కవరం చెరువు, మేడారం, వరంగల్, నాగార్జునసాగర్, కరీంనగర్ తదితర ప్రాంతాలు చూసేందుకు అవకాశం కల్పిస్తాం’ అని పర్యాటక శాఖమంత్రి చందూలాల్ చెప్పారు. ఇద్దరు సందర్శకులకు జాయ్ రైడ్ టికెట్లను కేటీఆర్ చేతుల మీదుగా అందించారు. అనంతరం కేటీఆర్, చందూలాల్, మేయర్ బొంతు రామ్మోహన్ హెలికాప్టర్లో ట్రయల్ రన్ వేశారు. హెలికాప్టర్ జాయ్ రైడ్స్ చేయాలనుకొనే వారు క్ఛట్చ్ఛఠ్ఛ్టిట.ఛిౌఝలోగానీ, 9868827777 నంబర్లో గానీ సంప్రదించాలని హెలీ టూరిజం నిర్వాహకులు తెలిపారు. పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు, ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం, టూరిజం ఎండీ క్రిస్టినా, ప్రభుత్వ సలహాదారు పాపారావు, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యనభ్యసించే ఎస్టీలకు రూ.50 వేలు
ఎస్టీ గురుకుల సొసైటీ సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మెడిసిన్, ఐఐటీతో పాటు ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశం సాధించే ఎస్టీ విద్యార్థులకు రూ.50వేల నగదు పురస్కారం, ల్యాప్‌టాప్‌ను ఇవ్వనున్నారు. ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ విద్యార్థులకు ప్రోత్సాహకంగా వీటిని అంది స్తారు. సొసైటీ పాలక మండలి అధ్యక్షుడు, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఈ మేరకు నిర్ణయించారు. పాఠశాల విద్యా శాఖ నిధులతో నిర్వహించే 9 ఎస్టీ గురుకుల పాఠశాలలు, ఇంటర్ బోర్డు నిధులతో ప్రారంభించిన 2 జూనియర్ కళాశాలలను సంస్థ నాన్‌ప్లాన్ స్కీమ్ కిందకు తీసుకొచ్చేందుకు ఆమోదించారు. విద్యార్థుల పురోగతిపై తల్లితండ్రులకు ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేయాలని, అన్ని పాఠశాలల్లో క్రమం తప్పకుండా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి విద్యాభివృద్ధిపై సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో జరిగిన ఎస్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసై టీ తొలి పాలక మండలి సమావేశంలో కొన్ని ప్రతిపాదనలను ఆమోదించారు. పాలక మండ లి సభ్యులైన ఎస్టీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, కమిషనర్ లక్ష్మణ్, పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జి.కిషన్, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. నూతన పాలకమండలి, 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.123 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించారు. బాలికల పాఠశాలల్లో వారి భద్రతకు ఇద్దరేసి సెక్యూరిటీ గార్డుల నియామకం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని తీర్మానించారు. -
సగానికి పైగా బడి బయటే
ఆందోళన కలిగిస్తున్న ఎస్టీ విద్యార్థుల డ్రాపవుట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిపుత్రుల డ్రాపవుట్ శాతం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వపరంగా ఎన్నో చర్యలను తీసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. బడి మానేస్తున్న పిల్లల సంఖ్య, ఇప్పటివరకు పాఠశాల అంటే ఏంటో తెలియని వారి సంఖ్య కూడా ఏటా పెరిగిపోతోంది. షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్లు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు రాష్ట్రంలోని 10 జిల్లాల్లో అసలు బడుల్లో చేరని, పాఠశాలలు మానేస్తున్న ఎస్టీ పిల్లలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగింపునకు వస్తున్నా, ఇంకా 50 శాతం కంటే అధికంగానే పిల్లలు స్కూళ్ల బయటే ఉన్నారు. బడికి దూర మైన (డ్రాపవుట్స్), అసలు స్కూళ్లలో చేరని (నెవర్ ఎన్రోల్డ్ చిల్డ్రన్) వారు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14,285 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. వారిలో గత డిసెంబర్ నాటికి 6,982 మంది బాలబాలికలను పాఠశాలల్లో చేర్పించగలిగారు. ఇంకా 7 వేల మందికిపైగా స్కూళ్లలో చేర్పించాల్సి ఉందని తేలింది. గిరిజనుల్లో అక్షరాస్యతా శాతాన్ని పెంచేందుకు, గిరిజనుల పిల్లలను ప్రీమెట్రిక్ హాస్టళ్లు, స్కూళ్లలో చేర్పించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లా ఎస్టీ సంక్షేమ అధికారులతో గత బుధవారం జరిపిన సమీక్షలో మంత్రి అజ్మీరా చందూలాల్ గిరిపుత్రుల డ్రాపవుట్స్ పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది వచ్చే వేసవి సెలవుల్లో సమీప తండాలు, గ్రామపంచాయతీల్లో పర్యటించి డ్రాపవుట్ల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కూల్ డ్రాపవుట్స్‌కు సంబంధించి ఎస్టీ శాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం.. పది జిల్లాల్లోని మొత్తం 12,129 గిరిజన ఆవాస ప్రాంతాల్లో బడికి వెళ్లని పిల్లలు మొత్తం 14,285 మంది కాగా.. వారిలో బాలలు 6,495 మంది, బాలికలు 6,730 మంది ఉన్నారు. -
ఇసుక సొసైటీల పేరుతో రూ.10 కోట్లు వసూళ్లు!
♦ మంత్రి చందూలాల్ తనయుడు ప్రహ్లాద్ పద్ధతి మార్చుకోవాలి ♦ అక్రమార్కులకు ప్రజల చేతుల్లో శిక్ష తప్పదు... కేకేడబ్ల్యూ డివిజన్ కార్యదర్శి దామోదర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: గోదావరి నదిలో సొసైటీల పేరుతో ప్రభుత్వమే ఇసుక మాఫియాగా మారిందని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) కరీంనగర్-ఖమ్మం-వరంగల్ డివిజన్ కమిటీ కార్యదర్శి దామోదర్ పేర్కొన్నారు. మంత్రి అజ్మీరా చందూలాల్‌ను అడ్డం పెట్టుకొని ఏజెన్సీలో దోపిడీ చేస్తున్న ఆయన కొడుకు ప్రహ్లాద్ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. సొసైటీలను ఏర్పాటు చేసి గిరిజనులకు లబ్ధి చేకూరుస్తున్నట్లు ప్రకటనలు చేసి ప్రహ్లాద్ కోట్ల రూపాయలు దోచుకుంటున్నాడని అన్నారు. మావోయిస్టు పార్టీ కేకేడబ్లూ కార్యదర్శి దామోదర్ శుక్రవారం పత్రిక కార్యాలయాలకు ఓ లేఖ పంపారు. ‘‘సొసైటీలకు ఇసుక అమ్మకానికి ఆదివాసులకు అధికారం ఉందని చెబుతూనే మంత్రి చందూలాల్ కొడుకు ప్రహ్లాద్ సొసైటీలపై రాజకీయ ఆధిపత్యంతో చక్రం తిప్పుతున్నాడు. కాంట్రాక్టర్లకు ఇసుక సొసైటీల అశలు చూపి వారి వద్ద నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాడు. కాంట్రాక్టర్లకు ఇసుక సొసైటీలను ఇవ్వకుండా వారి వద్ద నుంచి రూ.10 కోట్ల ముడుపులు పుచ్చుకున్నాడు. ఈ వ్యవహారంలో పర్యాటక మంత్రి చందూలాల్ పాత్ర కీలకంగా ఉంది. సొసైటీలను అడ్డం పెట్టుకొని కోట్లు ఆర్జిస్తున్న ఆజ్మీరా ప్రహ్లాద్ పద్ధతులు మార్చుకోవాలి. ఇసుక కాంట్రాక్టర్లు ఓం నమఃశివాయ (ఏటూరు 2వ క్వారీ), నర్సింహారెడ్డి(1బీ క్వారీ), నిజామాబాద్ యలమంచిలి శ్రీనివాసరావు (1ఎ-క్వారీ), ఖమ్మం కృష్ణబాబు (3వ క్వారీ), తుపాకులగూడెం క్వారీ ప్రభాకర్‌లు రాజకీయ నాయకులకు దగ్గరగా ఉండి ఇసుక అక్రమ తరలింపునకు పాల్పడుతూ కోట్లు సంపాదిస్తున్నారు. వీరు గ్రామాల్లో ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించడం, గ్రూపులు కట్టించడం, తాగడం, గ్రామాల్లో చెడు సంస్కృతిని ప్రజలపై రుద్దుతున్నారు. ఈ పద్ధతులు మార్చుకోకపోతే అజ్మీరా ప్రహ్లాద్, నర్సింహారెడ్డి, శ్రీనివాసరావు, ఓం నమఃశివాయ, కృష్ణబాబు, ప్రభాకర్లకు ప్రజల చేతుల్లో శిక్ష తప్పదు’ అని దామోదర్ ఆ లేఖలో హెచ్చరించారు. -
..ఎందుకిలా!
గ్రేటర్ ఎన్నికలకు దూరంగా మంత్రి చందూలాల్ - సమన్వయ కమిటీలో దక్కని చోటు -పక్కన పెట్టిన టీఆర్ఎస్ నాయకత్వం తెలంగాణ మంత్రి చందూలాల్ ను గ్రేటర్ వరంగల్ సమన్వయ కమిటీలోకి తీసుకోకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సాక్షాత్తూ ఒక మంత్రిని జిల్లా కేంద్రంలో జరగుతున్న ఎన్నికలకు దూరంగా పెట్టడం అంటే పెద్ద విషయమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, వరంగల్: గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖల మంత్రి అజ్మీరా చందూలాల్ కు టీఆర్ఎస్ లో పార్టీ పరంగా సరైన గుర్తింపు దక్కడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. పార్టీకి సంబంధించిన కీలక కార్యక్రమాలకు చందూలాల్ ను ఉద్దేశపూర్వకంగానే దూరం పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లో వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ అభిప్రాయాలకు బలం చేకూరుస్తున్నాయి. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎన్నికల కార్యక్రమాల్లో చందులాల్‌కు ప్రత్యేకంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించ లేదు. తాజాగా గ్రేటర్ వరంగల్‌కు జరుగుతున్న ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితే పునరావృతమైంది. వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ)లోని 58 డివిజన్లలో భారీ అధిక్యం లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహాలు అమలు చేస్తోంది. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను టీఆర్ఎస్ అధిష్టానం పూర్తిగా జిల్లా నేతలకే అప్పగించింది. అన్ని డివిజిన్లలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడం, ప్రచార వ్యూహాలు, రెబల్ అభ్యర్థులకు సర్దిచెప్పడం.. వంటి కీలక వ్యవహారాలను చక్కబెట్టేందుకు టీఆర్ఎస్ తొమ్మిది మంది సభ్యులతో ప్రత్యేకంగా కమిటీని నియమించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని ఈ కమిటీలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎమ్మెల్యేలు టి.రాజయ్య, కొండా సురేఖ, దాస్యం వినయభాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డితోపాటు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావులను సభ్యులుగా నియమించారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్‌లో జరుగుతున్న ఎన్నికల కోసం నియమించిన కమిటీలో చందులాల్‌కు చోటు కల్పించలేదు. రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న చందూలాల్‌ను గ్రేటర్ వరంగల్ సమన్వయ కమిటీలో నియమించకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సాక్షాత్తూ ఒక మంత్రిని జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఎన్నికకు దూరంగా పెట్టడం అంటే పెద్ద విషయమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడు నెలల క్రితం టీఆర్ఎస్లో చేరిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిని గ్రేటర్ ఎన్నికల సమన్వయ కమిటీలో సభ్యురాలిగా నియమించి... రాష్ట్ర మంత్రిని పక్కనబెట్టడం ఏమిటని చందూలాల్ అనుచరుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్లో, ప్రభుత్వంలో చందులాల్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదని, తాజాగా ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో ఇదే స్పష్టమైందని మంత్రి వ్యతిరేకులు అంటున్నారు. చందూలాల్ సన్నిహితులు, వ్యతిరేకుల అభిప్రాయాలు ఎలా ఉన్నా... రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తిని ఎన్నికల కార్యక్రమాలకు దూరం పెట్టడం మాత్రం టీఆర్ఎస్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. టీఆర్ఎస్లో సీనియర్ నేతగా, కేసీఆర్‌కు సన్నిహితుడిగా అజ్మీరా చందూలాల్‌కు గుర్తింపు ఉంది. గిరిజనుల కోటాలో 2014 డిసెంబర్లో ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలతో చందులాల్‌కు గతంలో ఉన్న ప్రాధాన్యత లేదని టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. దీంట్లో భాగంగానే చందులాల్‌ను గ్రేటర్ ఎన్నికల సమన్వయ కమిటీకి దూరం పెట్టారని తెలుస్తోంది. ‘గ్రేటర్ వరంగల్ సమన్వయ కమిటీలో తొమ్మిది మంది ఉన్నారు. ఎస్సీ, బీసీ, ఓసీ... అన్ని వర్గాల వారికి చోటు కల్పించారు. తొమ్మిది మందిలో ఒక్క ఎస్టీ నేత లేరు. ప్రత్యేక రాష్ట్రంలో ఎస్టీలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రకటనకు తాజా కమిటీ తీరు విరుద్ధంగా ఉంది’ అని టీఆర్ఎస్లోని ఎస్టీ నేతలు అంటున్నారు. మేడారం జాతర వల్లే : డిప్యూటీ సీఎం కడియం మేడారం జాతర నిర్వహణలో బిజీగా ఉండడం వల్లే చందూలాల్‌కు గ్రేటర్ వరంగల్ ఎన్నికల సమన్వయ కమిటీలో చోటు కల్పించలేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. వరంగల్ నగరంలో ఓటు హక్కు ఉన్న వారికి కమిటీలో చోటు కల్పించినట్లు వివరించారు. సోమవారం హన్మకొండలోని ఓ హోట ల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా కడియం ఈ వివరణ ఇచ్చారు. -
సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లు పూర్తి: చందూలాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను వైభోవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటకశాఖల మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ఈ నెల 17-19 తేదీల్లో జరగనున్న జాతరకు 1.2 కోట్ల మంది భక్తులు హాజరుకావచ్చని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ నెల 19న సీఎం కె.చంద్రశేఖరరావు మేడారం జాతరలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటారని చెప్పారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఈ జాతర నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ వచ్చాక జాతర నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ రూ.175 కోట్లు విడుదల చేశారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు, మంచినీరు, స్నానఘట్టాలు, టాయిలెట్లు, ఇతర సదుపాయాలను కల్పించామని చెప్పారు. హెలికాప్టర్ ద్వారా మేడారం సందర్శనకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతర కోసం ఆర్టీసీ ద్వారా 4 వేల బస్సులు, దక్షిణ మధ్య రైల్వే ద్వారా 16 రైళ్లు ఏర్పాటు చేశారని చెప్పారు. -
దోచుకున్నోడికి దోచుకున్నంత!
♦ పర్యాటక శాఖలో కొందరు అధికారుల ఇష్టారాజ్యం ♦ మంత్రి చందూలాల్ సీరియస్ ♦ పూర్తి నివేదిక అందించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: టూరిజం బస్సు టికెట్లు విక్రయించే ట్రావెల్ ఏజెంట్లు పర్యాటక శాఖకు దాదాపు రూ. 50 లక్షలు బకాయిపడ్డారు. అధికారులు వారిని అడగడమే లేదు. ► పర్యాటకాభివృద్ధి సంస్థ బస్సులను శుభ్రం చేసే యంత్రంలో చిన్న మరమ్మతు... రూ. 10వేలతో దాన్ని సరిచేయవచ్చు. అయినా దాన్ని మూలన పడేసి క్లీనింగ్ బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఇందుకు రూ.లక్షలు చెల్లిస్తున్నారు. ► టూరిజం హోటళ్లలో నిర్వహణ పేరుతో రూ.లక్షలు దుబారా అవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ హోటళ్లను తనిఖీ చేయకుండానే అధికారులు ‘అంతా బాగుంది’ అనేస్తున్నారు. ► నిబంధనలకు విరుద్ధంగా కనీసం పత్రికా ప్రకటన ఇవ్వకుండా ఇటీవల డ్రైవర్లను నియమించారు. టికెట్లు జారీ చేయకుండానే పర్యాటకులను ఆ బస్సుల్లో తరలిస్తున్న విషయాన్ని విజిలెన్స్ గుర్తించింది. అయినా చర్యల్లేవు... వీటన్నింటి వెనుకా మతలబు ఏమిటి, అధికారుల చర్యల్లోని మర్మం ఏమిటనేది సందేహాస్పదంగా మారింది. పర్యాటకశాఖలో అధికారుల అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్లుగా పాతుకుపోయిన కొందరు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నిధులను మింగేస్తున్నారు. వారిపై ఎన్ని ఫిర్యాదులొచ్చినా చర్యలుండవు. ఇటీవల ఆ శాఖ పనితీరును సమీక్షించిన మంత్రి చందూలాల్ దాదాపు 30 అంశాలపై ఆరోపణలను ప్రస్తావిస్తూ.. వివరణ అడిగారు. మంత్రి అసహనం గతంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులుగా పనిచేసిన వారి కనుసన్నల్లో మెలుగుతూ... అర్హతల్లేకున్నా పదోన్నతులు పొందిన కొందరు అధికారులపై ఆరోపణలున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించినట్లు తెలి సింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో కొందరు అధికారుల అవినీతి వ్యవహారాన్ని విజిలెన్స్ బట్టబయలు చేసినా చర్యలు తీసుకోకపోవడం, ఇప్పుడు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థలో వారికి కీలక బాధ్యతలు అప్పగించడంపైనా ప్రశ్నించినట్లు సమాచారం. ఇక హైదరాబాద్‌లోని యాత్రీ నివాస్ లీజుల విషయంలో నెలకొన్న గందరగోళంపైనా మంత్రి అసహనం వ్యక్తం చేశారు. దీని వెనుక కొందరు అధికారుల హస్తముందని, దీనిని సరిదిద్దాలని పేర్కొన్నట్టు సమాచారం. ఇక కొన్ని పర్యాటక ప్రాంతాల్లో నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఎలా చెల్లించారని మంత్రి నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంపై తనకు నివేదిక అందజేయాలన్నారు. -
గగనం నుంచి నగర వీక్షణం!
సాక్షి, హైదరాబాద్: గగనతలం నుంచి వీక్షిస్తే భాగ్యనగరం ఎలా కనిపిస్తుంది.. పాలరాతి అద్భుతం బిర్లామందిరం, చారిత్రక చార్మినార్, గోల్కొండ కోటలు, హుస్సేన్‌సాగర్, ఐటీ హబ్ మాదాపూర్ పరిసరాలను ఆకాశంలో విహరిస్తూ చూడాలని ఉందా? రాష్ట్ర పర్యాటకశాఖ ఈ అరుదైన అవకాశాన్ని సాకారం చేసే ప్రయత్నాల్లో ఉంది. విదేశీ నగరాల్లో అందుబాటులో ఉన్న హెలిటూరిజాన్ని హైదరాబాద్‌లో ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా ప్రైవేటు హెలికాప్టర్లను అద్దెకు తీసుకుని గగనతల పర్యాటకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. వచ్చే జనవరి చివరి నాటికి తొలుత ఒక హెలికాప్టర్‌ను అందుబాటులోకి తెచ్చి, ఈ ప్రయోగం సత్ఫలితాన్నిస్తే మరికొన్ని హెలికాప్టర్లను తీసుకురావాలని భావిస్తోంది. అవికూడా విజయవంతంగా నడిస్తే సొంతంగానే హెలికాప్టర్లను సమకూర్చుకునే ఆలోచనలో ఉంది. తొలి ప్రయోగం సానుకూలంగా ఉంటే, దాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు హాట్ ఎయిర్ బెలూన్, సీ ప్లేన్ ద్వారా కూడా గగనతలం నుంచి నగర వీక్షణకు అవకాశం కల్పించాలని సంకల్పించింది. దీనిపై పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ సోమవారం ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వక్షించారు. తుది నిర్ణయం తీసుకోవడానికి వీలుగా జనవరిలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. చైనా తరహాలో... గతంలో సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి పర్యాటక శాఖ చర్యలు ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటిలో అనువైనవి తెలంగాణలో అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఇటీవల రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో అధికారుల బృందం చైనాలో పర్యటించినప్పుడు ఈ గగనతల వీక్షణపై దృష్టి సారించింది. ఇప్పటివరకు మన దేశంలో ఈ తరహా ప్రయత్నాలు అంతగా జరగలేదు. మొదటిసారి హైదరాబాద్‌లో దాన్ని అమలు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. చైనాకు భారీ సంఖ్యలో విదేశీ పర్యాటకులు పోటెత్తుతుండగా, మన దేశంలో విదేశీ పర్యాటకులు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యారు. దక్షిణ భారతంలో కేరళ, తమిళనాడులకు వారి తాకిడి ఉన్నా.. తెలంగాణ బాగా వెనకబడింది. విదేశీయులను ఆకట్టుకునే ప్రాంతాలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ వాటికి అంతగా ప్రచారం లేకుండాపోయింది. టూర్ ఆపరేటర్లతో సంప్రదింపులు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు టూర్ ఆపరేటర్లతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ట్రైబల్, ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నల్లమల అటవీ ప్రాంతం, సోమశిల, ఫరహాబాద్, మల్లెల తీర్థం, శ్రీశైలం పరిసరాలను ఎకో టూరిజంగా, వరంగల్ జిల్లా మేడారం, లక్నవరం, తాడ్వాయి, మల్లూరు, గట్టమ్మ దేవాలయ ప్రాంతాలను ట్రైబల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. బౌద్ధ, జైన, రామాయణ సర్క్యూట్లుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించే పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించినట్టు చందూలాల్ చెప్పారు. సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పర్యాటక కార్యదర్శి వెంకటేశం, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ క్రిస్టీనా జెడ్ చోంగ్తు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి చందూలాల్‌కు చేదు అనుభవం
హోటల్ గేటు వద్దే అడ్డుకున్న భద్రతా సిబ్బంది సీఎం లోనికి వెళ్లేదాకా అక్కడే నిలిపివేత సాక్షి, హైదరాబాద్: కలెక్టర్ల సదస్సు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్‌కు చేదు అనుభవం మిగిల్చింది. సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మారియట్ హోటల్‌కు చేరుకున్న ఆయన్ను, సీఎం వస్తున్నారంటూ భద్రత సిబ్బంది గేటు వద్దే అడ్డుకుని రోడ్డుపై నిలిపివేశారు. కారు దిగి హోటల్ లోపలికి నడుచుకుంటూ వెళ్లబోయినా ఒప్పుకోలేదు. సీఎం కాన్వాయ్ సమీపించిందని, ఆయన లోపలకు వెళ్లేదాకా అక్కడే వేచి వుండాలని పోలీసులు స్పష్టం చేశారు. దాంతో, సీఎం కాన్వాయ్ వచ్చి హోటల్ లోపలికి వెళ్లేదాకా కొద్ది నిమిషాల పాటు చందూలాల్ అక్కడే వేచి చూడాల్సి వచ్చింది. అదే సమయంలో మంత్రి కేటీఆర్ వచ్చి రోడ్డుపైనే కారు దిగి హోటల్లోకి నడుస్తూ వెళ్లిపోవడంతో చందూలాల్ కూడా ఆయన్ను అనుసరించారు. ఇక సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఐపీఎస్‌లకు మాత్రం భద్రతా సిబ్బంది రాచబాట పరిచారు. ఐపీఎస్‌ల వాహనాలు హోటల్ లోపలిదాకా వెళ్లి వారిని ప్రవేశ ద్వారం వరకు దిగబెట్టి తిరిగొచ్చాయి. కానీ కలెక్టర్లతో సహా ఐఏఎస్‌ల వాహనాలను మాత్రం పోలీసులు హోటల్ ప్రధాన గేటు వద్దే రోడ్డుపై ఆపేశారు. దాంతో వారంతా అక్కణ్నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్టర్ల సదస్సు అధికారులు, ప్రజాప్రతినిధుల కోలాహాలంతో కిక్కిరిసిపోయింది. తొలి రోజు సదస్సు ఉదయం 10.30 నుంచి రాత్రి 8.30 గంటల దాకా సుదీర్ఘంగా సాగింది. -
తమాషా చేస్తున్నావా!
♦ డీఎస్ఓపై.. దుర్భాషలాడిన మంత్రి ఓఎస్డీ ♦ ఫోన్లో చందూలాల్ ఓఎస్డీ అతిప్రవర్తన ♦ 6ఏ కేసు తొలగించాలని హెచ్చరిక ♦ కంటతడి పెట్టిన డీఎస్ఓ ఉషారాణి ♦ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉద్యోగులు ‘ఎవరు మాట్లాడేది డీఎస్ఓనా.. ఒకసారి చెపితే అర్థం కాదా.. మావాళ్ల మీద 6(ఏ) కేసు పెట్టొద్దని చెప్పినా వినట్లేదు. ఏమనుకుంటున్నావ్. అసలు నీది ఏ బ్యాచ్. జిల్లాలో ఎక్కడ ఏం జరిగేది నాకు తెలుసు.. తమాషాలా? అక్కడ జనంతో ధర్నా చేయిస్తా అప్పుడు తెలుస్తుంది. ముందు నువ్వు పూర్తి వివరాలతో వచ్చేవారం రా.. రివ్యూ ఏర్పాటు చేస్తా..’ ఇలా మాట్లాడింది ఎవరో కాదు. జిల్లాకు చెందిన మంత్రి అజ్మీరా చందూలాల్ హైదరాబాద్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి(ఓఎస్డీ)గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్. ఫోన్లో ఇవతలివైపు ఉన్నది జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి(డీఎస్ఓ) ఉషారాణి. సాక్షి ప్రతినిధి, వరంగల్ : మహబూబాబాద్‌లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చిన ఓ రేషన్ దుకాణం డీలరుపై అధికారులు నమోదు చేసిన కేసు ఎత్తివేయాలని మంత్రి చందూలాల్ ఓఎస్డీ ప్రవీణ్‌కుమార్ ఫోన్లో డీఎస్ఓ ఉషారాణిని ఆదేశించారు. ముందుగానే తాను ఫోన్ చేసినా ఎందుకు కేసు నమోదు చేశారని కోపగించుకున్నారు. తన అక్కసునంతా ఫోన్లో మహిళా అధికారిపై వెళ్లగక్కాడు. సాటి అధికారి అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దీంతో తోటి ఉద్యోగుల సమక్షంలోనే డీఎస్వో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓఎస్డీ మాట్లాడిన తీరుపై ఉద్యోగుల్లోనే నిరసన వ్యక్తమవుతోంది. మంత్రి పేషీలో పనిచేస్తే దబాయింపు చేయడమేమిటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓఎస్డీ మాట్లాడిన తీరుతో డీఎస్వో ఉషారాణి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కంటతడి పెట్టారు. ఇదీ విషయం.. పౌర సరఫరాల శాఖలో అక్రమాలను అరికట్టేందుకు జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ కొంతకాలం నుంచి.. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నేరుగా ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత నెల మొదటివారంలో మహబూబాబాద్ నుంచి ఒక ఫోన్‌కాల్ వచ్చింది. మహబూబాబాద్‌లోని 126 నంబర్ రేషన్‌షాపు డీలరు కార్డుదారులకు సరుకులు ఇవ్వడంలేదని, షాపు తెరవడంలేదని, సరుకులు పక్కదారి పడుతున్నాయన్నది ఆ ఫోన్‌కాల్ ఫిర్యాదు సారాంశం. టోల్ ఫ్రీ నంబర్‌కు అందిన ఫోన్‌కాల్ ఫిర్యాదుపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ అక్కడి అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ మహౠబాబాద్ సహాయ సరఫరా అధికారి(ఏఎస్వో) చందన్‌కుమార్ ఆరోపణలు వచ్చిన షాపులో తనిఖీలు చేశారు. సరుకుల నిల్వల్లో భారీగా తేడాలు ఉండటంతో పూర్తిస్థాయి విచారణ చేసి సదరు డీలర్‌పై నిత్యావసరాల చట్టంలోని 6ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తదుపరి చర్యల కోసం దీనికి సంబంధించిన ఫైల్ డీఎస్వో ద్వారా జాయింట్ కలెక్టర్‌కు చేరింది. కేసు వద్దని ఒత్తిడి.. షాపులో తనిఖీలు చేసినప్పటి నుంచి అధికారులపై ఒ త్తిళ్లు మొదలయ్యాయి. మొదట కేసు నమోదు చేయవద్దని ఆదేశాలు వచ్చాయి. కేసు నమోదైన తర్వాత తాజా కేసు ఎత్తివేయాలని తీవ్రస్థాయిలో అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. ఇదే క్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ ఓఎస్డీగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ డీఎస్ వో ఉషారాణికి ఫోన్ చేసి కేసు విషయంలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కేసు తమ పరిధిలో లేదని జాయింట్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం అధికారులు విచారణ చేసి నివేదిక ఇచ్చారని డీఎస్వో తెలిపారు. ఏదైనా ఉంటే జేసీతో మాట్లాడాలని సూచించారు. ఇలా ఈ వ్యవహారం నడుస్తోంది. తాజాగా సోమవారం కలెక్టరేట్లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో డీఎస్వో ఉషారాణి అధికారులతో సమావేశమయ్యారు. అధికారులతో మాట్లాడుతు న్న క్రమంలో డీఎస్వోకి ఫోన్‌కాల్ వచ్చింది. తాను వద్ద ని చెప్పినా కేసు ఎందుకు నమోదు చేశారని నిలదీశారు. ఇప్పటికైనా కేసు ఎత్తివేయాలని ఆదేశించారు. అది తన పరిధిలో వ్యవహారం కాదని డీఎస్వో మరోసారి చెప్పా రు. అయినా పట్టించుకోకుండా ఓఎస్డీ వినకుండా... వా రంలో రావాలి రివ్యూ ఏర్పాటు చేస్తా అప్పుడు చెపుతా అంటూ హెచ్చరిస్తూ మాట్లాడారు. ఈ ఘటనతో డీఎస్ వో కంటతడి పెట్టుకున్నారు. అధికారులు సమావేశం ముగించుకుని వెళ్లిపోయారు. ఈ విషయంపై జేసీకి, కలెక్టర్‌కు, పౌరసరఫరాల మంత్రికి ఫిర్యాదు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయంపై మం త్రి చందూలాల్ ఓఎస్డీ ప్రవీణ్‌కుమార్‌ను ‘సాక్షి ప్రతినిధి’ ఫోన్లో సంప్రదించగా.. తాను అధికారులతో బాగానే ఉంటానని చెప్పారు. డీఎస్‌వోతో మాట్లాడాను. విషయం ఏమిటని ఆరా తీశాను. హైదరాబాద్‌కు అక్కడి అధికారులను మేం ఎందుకు రప్పిస్తాం’ అని అన్నారు. -
టూరిజం సర్క్యూట్‌గా ఓరుగల్లు
జిల్లాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తా గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపుతా గిరిజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ {పజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుందాం ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాం నాయక్ పర్యాటక రంగంలో జిల్లాను తెలంగాణలోనే అగ్రగామిగా నిలుపుతానని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి చందూలాల్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంగళవారం తొలిసారిగా ఆయన జిల్లాకు వచ్చారు. ఓరుగల్లు కోట, వేయిస్తంభాల గుడి, గణప సముద్రం, రామప్ప, లక్నవరం, మేడారం, మల్లూరు హేమాచల క్షేత్రంను టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తానన్నారు. హన్మకొండ/ములుగు :పర్యాటకం రంగంలో జిల్లాను తెలంగాణలోనే అగ్రగామిలో నిలుపుతానని, టూరిజం సర్క్యూట్‌గా ఓరుగల్లును అభివృద్ధి చేస్తానని రాష్ట్ర గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన అనంతరం మంగళవారం తొలిసారిగా ఆయన జిల్లా పర్యటనకు వచ్చారు. హన్మకొండలో మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఓరుగల్లు కోట, వెయ్యి స్తంభాల గుడి, గణప సముద్రం, రామప్ప, లక్నవరం, మేడారం, మల్లూరు హేమాచల క్షేత్రాలు అనుసంధానంగా టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. గత ప్రభుత్వాలు గిరిజన భవన్‌కు 5 గజాల స్థలం ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ అడగగానే గిరిజన భవన్, ఆదివాసీ భవన్, మాదిగ భవన్‌కు నిధులు విడుదల చేశారన్నారు. జిల్లాలో కాకతీయ ఉత్సవాల ప్రారంభానికి ముఖ్యమంత్రి రానున్నారని తెలిపారు. తండాలు, గూడాల్లో తమ రాజ్యం రావాలని కలలు కంటూ వచ్చామని, ఆ కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తూ జీవో జారీ చేశారన్నారు. సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, మాజీ మంత్రి కెప్టె న్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యేలు అరూరి రమే ష్, సతీష్‌బాబు, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్ పాల్గొన్నారు. రైతన్న కళ్లల్లో సంతోషం కనిపించాలి ములుగులోని డీఎల్ఆర్ ఫంక్షన్హాల్లో జరి గిన కార్యకర్తల సమావేశంలో మంత్రి చందూ లాల్ మాట్లాడుతూ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి, రైతన్న కళ్లల్లో సంతోషం చూడడానికి ప్రజాప్రతినిధులమంతా కలిసి ముందుకు సాగుతామన్నారు. ఇందుకు ప్రజలు సహకరిం చాలని కోరారు. ఐటీడీఏ పరిధిలో పని చేస్తున్న సీఆర్టీలను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. బడుగుల అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం : కడియం రాష్ట్రంలో 85 శాతం మంది బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే ఉన్నారని, వారిని అభివృద్ధి పథంవైపు నడిపించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వసిస్తున్నారని ఎంపీ కడియం శ్రీహరి తెలిపారు. 46 వేల చెరువుల పునరుద్ధరణ, 10 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధికి నాంది పలికామని తెలిపారు. టెక్స్టైల్ ప్రాజెక్టు, స్మార్ట్‌సిటీ నిధులను వరంగల్ జిల్లాకు తరలించడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని వివరించారు. పోగొట్టుకున్న ఆత్మగౌరవం కాపాడుకున్నాం : ఎంపీ సీతారాంనాయక్ ఉమ్మడి రాష్ట్రంలో పోగొట్టుకున్న ఆత్మగౌరవా న్ని స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తిరిగి సాధించుకున్నారని ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జీ సత్యవతి రాథోడ్ లంబాడ భాషలో మాట్లాడి అలరించారు. రామప్ప కళాకారుల ఆటపాట లు ఆకట్టుకున్నాయి. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కేశెట్టి కుటుంబరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రా వు, జిల్లా ఇన్చార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, పొలిట్‌బ్యూరో సభ్యు లు కన్నెబోయిన రాజయ్యయాదవ్, నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, జెడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, బానోతు సంగూలాల్, భరత్‌కుమార్‌రెడ్డి, జిల్లా మహిళా కార్యదర్శి భూక్య సుమలత, జిల్లా నాయకులు అజ్మీరా ప్రహ్లద్, ధరంసింగ్, పోరిక హర్జీనాయక్, పోరిక గోవింద్‌నాయక్, మాజీ మంత్రి జగన్నాయక్ పాల్గొన్నారు.