సగానికి పైగా బడి బయటే | More than half of out of school | Sakshi
Sakshi News home page

సగానికి పైగా బడి బయటే

Published Mon, Feb 29 2016 2:52 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

సగానికి పైగా బడి బయటే

సగానికి పైగా బడి బయటే

ఆందోళన కలిగిస్తున్న ఎస్టీ విద్యార్థుల డ్రాపవుట్లు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిపుత్రుల డ్రాపవుట్ శాతం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వపరంగా ఎన్నో చర్యలను తీసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. బడి మానేస్తున్న పిల్లల సంఖ్య, ఇప్పటివరకు పాఠశాల అంటే ఏంటో తెలియని వారి సంఖ్య కూడా ఏటా పెరిగిపోతోంది. షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్లు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు రాష్ట్రంలోని 10 జిల్లాల్లో అసలు బడుల్లో చేరని, పాఠశాలలు మానేస్తున్న ఎస్టీ పిల్లలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగింపునకు వస్తున్నా, ఇంకా 50 శాతం కంటే అధికంగానే పిల్లలు స్కూళ్ల బయటే ఉన్నారు.

బడికి దూర మైన (డ్రాపవుట్స్), అసలు స్కూళ్లలో చేరని (నెవర్ ఎన్‌రోల్డ్ చిల్డ్రన్) వారు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14,285 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. వారిలో గత డిసెంబర్ నాటికి 6,982 మంది బాలబాలికలను పాఠశాలల్లో చేర్పించగలిగారు. ఇంకా 7 వేల మందికిపైగా స్కూళ్లలో చేర్పించాల్సి ఉందని తేలింది. గిరిజనుల్లో అక్షరాస్యతా శాతాన్ని పెంచేందుకు, గిరిజనుల పిల్లలను ప్రీమెట్రిక్ హాస్టళ్లు, స్కూళ్లలో చేర్పించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న పథకాలు,  అభివృద్ధి కార్యక్రమాలను ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లా ఎస్టీ సంక్షేమ అధికారులతో గత బుధవారం జరిపిన సమీక్షలో మంత్రి అజ్మీరా చందూలాల్ గిరిపుత్రుల డ్రాపవుట్స్ పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది వచ్చే వేసవి సెలవుల్లో సమీప తండాలు, గ్రామపంచాయతీల్లో పర్యటించి డ్రాపవుట్ల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కూల్ డ్రాపవుట్స్‌కు సంబంధించి ఎస్టీ శాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం.. పది జిల్లాల్లోని మొత్తం 12,129 గిరిజన ఆవాస ప్రాంతాల్లో బడికి వెళ్లని పిల్లలు మొత్తం 14,285 మంది కాగా.. వారిలో బాలలు 6,495 మంది, బాలికలు 6,730 మంది ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement