ST Department
-
త్వరలో ఎస్టీ కమిషన్ మధ్యంతర నివేదిక
సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలోనే.. సాక్షి, హైదరాబాద్: కాయతీ లంబాడా, వాల్మీకి బోయలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చే అంశంపై జరిపిన పరిశీలనకు సంబంధించి ప్రభుత్వానికి త్వరలో ఎస్టీ కమిషన్ మధ్యంతర నివేదిక సమర్పించనుంది. పూర్తిస్థాయి నివేదికకు సమయం పట్టనుండటంతో మధ్యంతర నివేదికను సమర్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. జూలై ఆఖరులోగా నివేదిక సమర్పించాలని కమిషన్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మధ్యంతర నివేదికను రూపొందించడంలో నిమగ్నమయ్యారు. గురువారం సచివాలయంలో ఎస్టీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్.చెల్లప్ప, సభ్యులు సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10% వరకు ఎస్టీల జనాభా ఉన్నందున, కొత్త కులాలను కలిపి 12 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ ఆలోచనను పక్కనపెట్టి 10% రిజర్వేషన్లు కల్పించాలని కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కొన్ని ఎస్టీ సంఘాలు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. -
సగానికి పైగా బడి బయటే
ఆందోళన కలిగిస్తున్న ఎస్టీ విద్యార్థుల డ్రాపవుట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిపుత్రుల డ్రాపవుట్ శాతం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వపరంగా ఎన్నో చర్యలను తీసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. బడి మానేస్తున్న పిల్లల సంఖ్య, ఇప్పటివరకు పాఠశాల అంటే ఏంటో తెలియని వారి సంఖ్య కూడా ఏటా పెరిగిపోతోంది. షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్లు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు రాష్ట్రంలోని 10 జిల్లాల్లో అసలు బడుల్లో చేరని, పాఠశాలలు మానేస్తున్న ఎస్టీ పిల్లలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగింపునకు వస్తున్నా, ఇంకా 50 శాతం కంటే అధికంగానే పిల్లలు స్కూళ్ల బయటే ఉన్నారు. బడికి దూర మైన (డ్రాపవుట్స్), అసలు స్కూళ్లలో చేరని (నెవర్ ఎన్రోల్డ్ చిల్డ్రన్) వారు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14,285 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. వారిలో గత డిసెంబర్ నాటికి 6,982 మంది బాలబాలికలను పాఠశాలల్లో చేర్పించగలిగారు. ఇంకా 7 వేల మందికిపైగా స్కూళ్లలో చేర్పించాల్సి ఉందని తేలింది. గిరిజనుల్లో అక్షరాస్యతా శాతాన్ని పెంచేందుకు, గిరిజనుల పిల్లలను ప్రీమెట్రిక్ హాస్టళ్లు, స్కూళ్లలో చేర్పించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లా ఎస్టీ సంక్షేమ అధికారులతో గత బుధవారం జరిపిన సమీక్షలో మంత్రి అజ్మీరా చందూలాల్ గిరిపుత్రుల డ్రాపవుట్స్ పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది వచ్చే వేసవి సెలవుల్లో సమీప తండాలు, గ్రామపంచాయతీల్లో పర్యటించి డ్రాపవుట్ల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కూల్ డ్రాపవుట్స్‌కు సంబంధించి ఎస్టీ శాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం.. పది జిల్లాల్లోని మొత్తం 12,129 గిరిజన ఆవాస ప్రాంతాల్లో బడికి వెళ్లని పిల్లలు మొత్తం 14,285 మంది కాగా.. వారిలో బాలలు 6,495 మంది, బాలికలు 6,730 మంది ఉన్నారు. -
ఎస్టీ రైతుల వ్యవ‘సాయా’నికి కొత్త పథకం
సాక్షి, హైదరాబాద్: గిరిజన రైతులను అన్ని విధాలుగా ఆదుకుని, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పంట వేసుకునేందుకు ఆర్థిక సాయంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే వరకు సహకారం అందించాలని యోచిస్తోంది. ఈ పథకానికి ఎస్టీ శాఖ ఆధ్వర్యంలో తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ శాఖ పరిధిలోని ట్రైకార్(ఎస్టీ సహకార ఆర్థిక కార్పొరేషన్) ద్వారా ఈ పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోం ది. రైతులు ఒక బృందంగా ఏర్పడి పంటను వేయడం మొదలుకుని, ఉత్పత్తి చేతికొచ్చాక దానిని గిడ్డంగుల్లో భద్రపరిచి మంచి ధర వచ్చినపుడు విక్రయించేలా పథకం రూపొందిస్తున్నారు. వరంగల్జిల్లాలో మిర్చి, ఆదిలాబాద్ జిల్లాలో సోయా, ఇలా మిగతా జిల్లాల్లో అక్కడి ప్రత్యేకతలను బట్టి ఆయా పంటలను వేయిస్తూ రైతులు ఆర్థికంగా లాభపడేలా చేయడం ఈ పథకం ఉద్దేశం. త్వరలో వాహన పథకం... డ్రైవింగ్‌లో అనుభవముండి, సొంతంగా వాహనాలు నడుపుకోగలిగే ఎస్టీలకు ప్యాసింజర్, రవాణా వాహనాలు అందించనున్నారు.డ్రైవర్ కమ్ ఓనర్ పథకంలో భాగంగా ఈ వాహనాలు ఇస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దీనిని ప్రారంభించి ,పదిజిల్లాల్లో వెయ్యి మందికి ఊతమివ్వనున్నారు. దీన్ని ఎస్టీ ఆర్థిక సహకార కార్పొరేషన్ (ట్రైకార్) ద్వారా అమలుచేయనున్నారు.ఈ పథకం నేరుగా లబ్ధిదారులకే చేరేలా నిబంధనలను రూపకల్పన చేస్తున్నారు.