సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలోనే..
సాక్షి, హైదరాబాద్: కాయతీ లంబాడా, వాల్మీకి బోయలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చే అంశంపై జరిపిన పరిశీలనకు సంబంధించి ప్రభుత్వానికి త్వరలో ఎస్టీ కమిషన్ మధ్యంతర నివేదిక సమర్పించనుంది. పూర్తిస్థాయి నివేదికకు సమయం పట్టనుండటంతో మధ్యంతర నివేదికను సమర్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. జూలై ఆఖరులోగా నివేదిక సమర్పించాలని కమిషన్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మధ్యంతర నివేదికను రూపొందించడంలో నిమగ్నమయ్యారు.
గురువారం సచివాలయంలో ఎస్టీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్.చెల్లప్ప, సభ్యులు సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10% వరకు ఎస్టీల జనాభా ఉన్నందున, కొత్త కులాలను కలిపి 12 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ ఆలోచనను పక్కనపెట్టి 10% రిజర్వేషన్లు కల్పించాలని కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కొన్ని ఎస్టీ సంఘాలు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
త్వరలో ఎస్టీ కమిషన్ మధ్యంతర నివేదిక
Published Fri, Jul 1 2016 1:04 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM
Advertisement
Advertisement