
ఇసుక క్వారీ పనులను నిలిపివేసిన ఆదివాసీ జేఏసీ
ఏటూరునాగారం : ఆదివాసీ జేఏసీలకు ఇచ్చిన క్వారీని తపస్సీ కాంట్రాక్టర్ అక్రమంగా అగ్రిమెంట్ చేసుకున్నారని, అగ్రిమెంట్‌ను రద్దు చేసుకోవాలని నాయకులు తాటి హన్మంతరావు, ఆగబోయిన రవి, కుంజ నారాయణ డిమాండ్ చేశా రు. కాగా, గురువారం క్వారీ పనులను ఆదివాసీ జేఏసీ నాయకులు అడ్డుకున్నా రు. అనంతరం వారు మాట్లాడుతూ ఆది వాసీ ప్రజాసంఘాల జేఏసీకి కేటాయిం చిన ఏటూరు 1ఏ క్వారీ నిర్వహణను తపస్వి ఇన్‌ఫ్రా ప్రాజెక్టు ప్రైవేట్ ఇండి యా కంపెనీకి అక్రమంగా కేటారుుంచారని, ఈ అగ్రిమెంట్ రద్దు చేసే వరకు క్వారీ పనులు సాగనిచ్చేది లేదని హెచ్చరించారు. అలాగే మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ క్వారీ పనులు అడ్డుకుంటే మీ అంతు చూస్తా... మీరు నక్సలైట్లకు సహకరిస్తూ.. మాపై ప్రకటనలు ఇప్పిస్తున్నారని ఫోన్లో బెదిరిస్తున్నారని తెలిపారు. అలాగే ఏటూరునాగారం సీఐ తో ఫోన్లు చేయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
ఐటీడీఏ పీఓ, ఐకేపీ అధికార యంత్రాంగం ఆది వాసీలకు అండగా ఉండాలని కోరారు. లేని పక్షంలో దశలవారిగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అర్రెం లచ్చుపటేల్, మేడ బుచ్చిరాములు, కబ్బాక జగదీశ్వర్‌రావు, మోకాళ్ల వెంకటేష్, ఈసం సుధాకర్, పడిగె నాగేశ్వర్‌రావు, పొలం సాగర్, తాటి సుధాకర్, దారం సిద్దు, కోరగట్ల లక్ష్మణ్‌రావు, ఆలం కిషోర్, వట్టం నాగరాజు, దారం నరేష్, ఈసం సాంబయ్య పాల్గొన్నారు.