
బాధితుడు నరేశ్
అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆత్మకూరు (పరకాల): ‘నేను హారన్ కొడుతున్నా.. జరగవారా’అంటూ మంత్రి అజ్మీరా చందూలాల్ తనయుడు ధరమ్‌సింగ్ మద్యం మత్తులో ఓ ప్రైవేటు డ్రైవర్‌ను చితకబాదాడు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ జంక్షన్ లో శనివారం రాత్రి బీభత్సం సృష్టించారు. మంత్రి తనయుడు ధరమ్‌సింగ్ మిత్రులతో కలసి కారులో మద్యం సేవిస్తూ ములుగు నుంచి హన్మకొండకు వెళ్తున్నాడు. గుడెప్పాడ్ జంక్షన్ వద్ద రోడ్డు వెంట ప్రైవేటు డ్రైవర్ నరేశ్ నిలుచొని ఉన్నాడు.
అయితే, తాము హారన్ కొడుతున్నా పక్కకు జరగవారా అంటూ కారు దిగిన ధరమ్‌సింగ్ ఆయనపై పిడి గుద్దులు కురిపించాడు. ‘నేను మంత్రి కొడుకునురా.. డిపార్ట్‌మెంట్‌రా’ అంటూ దుర్భాషలాడాడు. స్థానికులు, పోలీసులు వారించినా వినలేదు. ‘నేను మంత్రి కొడుకును చెబుతున్నా అందర్ని తన్నండి’ అంటూ పోలీసులను కోరగా వారు బలవంతంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.