మంత్రి చందూలాల్ వెల్లడి
హైదరాబాద్: భారత్‌తో ద్వైపాక్షిక సంబం ధాల కోసం అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరి స్తుందని టూరిజం, కల్చరర్ శాఖ మంత్రి చందులాల్ అన్నారు. సోమవారం హోటల్ మారియట్‌లో జరిగిన మేరీ ల్యాండ్ ఇండియా బిజినెస్ రౌండ్ టేబుల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ సిరీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మేరీల్యాండ్ లాగే భౌగోళికంగా వైవిధ్యం కలిగిన రాష్ట్రం తెలంగాణ అన్నారు.
నూత నంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంతో వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక సంబం ధాలను బలోపేతం చేసుకొని, రాష్ట్ర పురోభివృద్ధికి సహకారించాలని కోరారు. మేరీల్యాండ్–తెలంగాణ ప్రభుత్వాలకు సాంస్కృతిక వారధిగా పని చేస్తున్న నిర్వహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.