Maryland
-
అమెరికా నౌక ప్రమాదం.. ఆరుగురు మృతి!
బాల్టిమోర్: అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలోని బాల్టీమోర్ నగరంలో చోటు చేసుకున్న బ్రిడ్జ్ కుప్పకూలిన ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. నదిలో పడి గల్లంతు అయిన ఆరుగురు మరణించారని భావించిన అధికారులు సహాయక చర్యలు నిలిపివేశారు. మంగళవారం అమెరికాలో మేరీలాండ్ రాష్ట్రంలోని బాల్టీమోర్ నగరంలో ఘోర ప్రమాదం సంభవించింది. పటాప్స్కో నదిలో వాహన కంటైనర్లతో వెళ్తున్న ఓ భారీ నౌక పవర్ ఫెయిల్యూర్‌కు గురైంది. అదుపు తప్పి నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని శరవేగంగా ఢీకొంది. దాంతో వంతెన కుప్పకూలింది. దానిపై ప్రయాణిస్తున్న వాహనాలు నీటిలో పడి మునిగిపోయాయి. వాటిలో ప్రయాణిస్తున్నవారు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై గుంతలు పూడుస్తున్న ఆరుగురు సిబ్బంది కూడా నదిలో పడిపోయారు. అధికారులు ఇద్దరిని రక్షించారు. కనీసం ఆరుగురి దాకా గల్లంతైనట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలంలో నది 15 మీటర్ల లోతుంది. నీళ్లు కూడా బాగా చల్లగా ఉండటంతో వారంతా దుర్మరణం పాలై ఉంటారని భావిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి 1.30 దాటాక ఈ దుర్ఘటన జరిగింది. నౌకలోని సిబ్బంది మొత్తం భారతీయులే. నౌక అదుపు తప్పిన వెంటనే వారు హుటాహుటిన ప్రమాద హెచ్చరికలు (మేడే) జారీ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు అప్రమత్తమై వాహనాలేవీ బ్రిడ్జిపైకి వెళ్లకుండా నియంత్రించారు. దానికి తోడు ప్రమాదం జరిగింది అర్ధరాత్రి వేళ కావడంతో బ్రిడ్జిపై ట్రాఫిక్ కూడా భారీగా లేదు. ఇలా జరిగింది... ప్రమాద సమయంలో నౌక గంటకు 15 కి.మీ. వేగంతో వెళ్తోంది. పవర్ ఫెయిల్యూర్‌తో అదుపు తప్పి శరవేగంగా బ్రిడ్జికేసి దూసుకొచ్చి దాని తాలూకు పిల్లర్‌ను ఢీకొట్టింది. పిల్లర్ విరగడంతో 2.6 కిలోమీటర్ల పొడవున్న వంతెన ఒక్కసారిగా కుంగిపోయింది. సెకండ్ల వ్యవధిలో పాక్షికంగా కుప్పకూలింది. ఆ వెంటనే నౌకలో మంటలు చెలరేగి దట్టమైన పొగ వెలువడింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కనీవినీ ఎరగని ప్రమాదమని మేరీలాండ్ గవర్నర్ వెస్ మూర్ అన్నారు. ప్రమాద హెచ్చరికకు అధికారులు శరవేగంగా స్పందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడారంటూ కొనియాడారు. ప్రమాదం జరిగిన తీరు యాక్షన్ సినిమా సీన్‌ను తలపించిందని బాల్టీమోర్ మేయర్ బ్రాండన్ స్కాట్ అన్నారు. నగరంలో అత్యవసర పరిస్థితి విధించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పవర్ ఫెయిల్యూరే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలినా మరింత లోతుగా దర్యాప్తు సాగుతోంది. భారత సిబ్బంది క్షేమం ప్రమాదానికి గురైన నౌక పేరు డాలీ. గ్రీస్ ఓషియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఈ నౌక ప్రస్తుతతం సినర్జీ మెరైన్ గ్రూప్ నిర్వహణలో ఉంది. ప్రఖ్యాత డెన్మార్క్ షిప్పింగ్ కంపెనీ ‘మెర్క్స్’కు చెందిన సరుకుతో బాల్టిమోర్ రేవు నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. 985 అడుగుల పొడవు, 157 అడుగుల వెడల్పున్న ఈ నౌకలో ఇద్దరు పైలట్లు సహా మొత్తం 22 మంది సిబ్బందీ భారతీయులేనని సినర్జీ మెరైన్ గ్రూప్ వెల్లడించింది. వారంతా క్షేమంగానే ఉన్నారని పేర్కొంది. ప్రమాదం నేపథ్యంలో అమెరికా తూర్పు తీరంలో అత్యంత బిజీ ఓడరేవుల్లో ఒకటైన బాల్టీమోర్కు నౌకల రాకపోకలు కనీసం కొద్ది నెలల పాటు స్తంభించనున్నాయి. గతేడాది బాల్టీమోర్ రేవు గుండా ఏకంగా 5.2 కోట్ల టన్నుల మేరకు సరుకు, దాదాపు 5 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు జరిగాయి! పోర్టుకు నౌకల రాకపోకలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. దుర్ఘటన ఉగ్రవాద చర్య కాదని స్పష్టం చేశారు. -
Baltimore Bridge Accident : అమెరికాలో కంటెయినర్ షిప్ ఢీకొని కుప్పకూలిన బాల్టీమోర్ బ్రిడ్జ్ (ఫొటోలు)
-
అమెరికాలో కూలిన బ్రిడ్జ్.. కంటైనర్ షిప్‌లోని 22 మంది సేఫ్
వాషింగ్టన్: అమెరికా మేరిల్యాండ్ నగరంలోని ఓ వంతెన కుప్పకూలింది. మంగళవారం తెల్లవారుజామున బాల్టిమోర్ పట్ణణంలోని పాలప్స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను సింగపూర్ జెండా ఉన్న ఓ కంటెయినర్ అర్థరాత్రి 1:30 గంటలకు షిప్ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వంతెన కుప్పకూలడంతో సుమారు 22 మంది నదిలో పడిపోయారని బాల్టిమోర్ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో బ్రిడ్జ్‌పై నుంచి పలు వాహనాలు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాల్టిమోర్‌లోని ప్రధాన వంతెనను ఢీకొట్టిన కార్గో షిప్‌లోని మొత్తం 22 మంది సిబ్బంది భారతీయులేనని ఓడ నిర్వహణ సంస్థ తాజాగా వెల్లడించింది. వారంతా సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. అయితే ఈ ప్రమాదంలో వంతెనపై ఉన్న కొన్ని కార్లు సైతం నదిలోకి దూసుకెళ్లాయి. ఇప్పటి వరకు అధికారులు ఇద్దరిని సురక్షింతగా బయటకు తీశారు. మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉన్నట్లు సమాచారం. Baltimore Bridge is 1.6 miles long, this is the moment it collapsed after a cargo ship struck it in the early hours of this morning pic.twitter.com/eA6womQlcI — Science girl (@gunsnrosesgirl3) March 26, 2024 2.6 కిలోమీటర్ల నాలుగు లేన్ల బ్రిడ్జ్ కుప్పకూలిన సమయంలో పలు వాహనాలు బ్రిడ్జ్‌పై నుంచి ప్రయాణించినట్లు వీడియోలో కనిపిస్తోంది. వంతెన కూలిపోయిన వెంటనే పలు వాహనాలు నదిలో పడిపోయినట్లు బాల్టిమోర్ అగ్నిమాపక విభాగానికి చెందిన కెవిన్ కార్ట్‌రైట్ బాల్టిమోర్ తెలిపారు. తాము ఘటనాస్థలికి చేరుకునేలోపే వంతెన మొత్తం నీటిలో కూలిపోయిందని తెలిపారు. వెంటనే నదిలో సహాయక చర్యలు చేపట్టాని తెలిపారు. సుమారు 20 మంది వరకు నదిలో ముగినిపోయినట్లు తెలుస్తోందని బాల్టిమోర్ పోలిసులు పేర్కొన్నారు. ఈ వంతెనను 1977లో ప్రారంభించారని పేర్కొన్నారు. The Francis Scott Key Bridge in Baltimore, Maryland which crosses the Patapsco River has reportedly Collapsed within the last few minutes after being Struck by a Large Container Ship; a Mass Casualty Incident has been Declared with over a Dozen Cars and many Individuals said to… pic.twitter.com/SsPMU8Mjph — OSINTdefender (@sentdefender) March 26, 2024 అమెరికాలో తెల్లవారుజామున, ఇంకా పొద్దుపొడవకముందే ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించిన తీవ్రత బయటపడుతోంది. ఓడను సూటిగా బ్రిడ్జివైపు ఎలా నడిపిస్తారు? కళ్ల ముందు అంత భారీ బ్రిడ్జ్ ఉంటే.. గుడ్డిగా ఎలా నడిపిస్తారు? నెటిజన్లు వ్యాఖ్యలు జోడించారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఉదయం 8 గంటల వరకు రాలేదు. Daylight reveals aftermath of Baltimore bridge collapse. Search and rescue underway. pic.twitter.com/2rHUN1T3u1 — BNO News (@BNONews) March 26, 2024 -
మేరీల్యాండ్ లో దీపావళి వేడుకలు
-
అమెరికాలో మనిషికి పంది గుండె
వాషింగ్టన్: అమెరికాలోని మేరీలాండ్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి డాక్టర్లు పంది గుండె అమర్చారు. అతడి ప్రాణం కాపాడారు. ఇలాంటి అరుదైన చికిత్స జరగడం అమెరికాలో ఇది రెండోసారి కావడం విశేషం. బాధితుడు లారెన్స్ ఫాసెట్ నావికాదళంలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. అతడి వయసు ప్రస్తుతం 58 ఏళ్లు. గుండె వైఫల్యంతో బాధపడుతున్నాడు. మరణానికి దగ్గరయ్యాడు. ఇతర వ్యాధులు కూడా ఉండడంతో సంప్రదాయ గుండె మారి్పడికి అవకాశం లేకుండాపోయింది. దాంతో ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడిసిన్’ డాక్టర్లు కష్టతరమైన ప్రయోగానికి సిద్ధమమయ్యారు. లారెన్స్ ఫాసెట్‌కు ఇటీవలే పంది గుండెను అమర్చారు. ఈ చికిత్స విజయవంతమైంది. రెండు రోజుల విశ్రాంతి తర్వాత అతడి ఆరోగ్యం మెరుగైంది. ఇదే ‘యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడిసిన్’ వైద్యులు గత ఏడాది పంది గుండెను డేవిట్ బెనెట్ అనే వ్యక్తికి అమర్చారు. కానీ, అతడు రెండు నెలలు మాత్రమే జీవించాడు. ఈ విషయం తెలిసి కూడా లారెన్స్ ఫాసెట్ శస్త్రచికిత్సకు సిద్ధపడ్డాడు. తాను నిండు నూరేళ్లు జీవిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అమెరికాలో మానవ అవయవాలకు కొరత ఏర్పడింది. దేశంలో గత ఏడాది కేవలం 4,100 గుండె మార్చిడి చికిత్సలు చేశారు. గుండెతోపాటు ఇతర అవయవాల కోసం పెద్ద సంఖ్యలో బాధితులు ఎదురు చూస్తున్నారు. -
విద్యుత్ లైన్లపైకి దూసుకెళ్లిన విమానం.. 90 వేల ఇళ్లకు పవర్ కట్..
వాషింగ్టన్: అమెరికా మేరీలాండ్‌లోని మాంట్గోమెరీ కౌంటీలో ఓ చిన్న సైజు విమానం విద్యుత్ లైన్లపైకి దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటీ హాని జరగలేదు. కానీ కరెంటు తీగలు తెగిపోవడంతో కౌంటీలోని 90 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కౌంటీవాసులంతా అంధకారంలోకి వెళ్లారు. వర్షాలు పడటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 10 అంతస్తుల ఎత్తులోనే ఈ ప్రమాదం జరగడానికి కచ్చితమైన కారణాలు మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ఈ ప్రమాదంపై మాంట్గోమెరీ పోలీసులు ట్వీట్ చేశారు. విమానం విద్యుత్ లైన్లపైకి దూసుకెళ్లిన ప్రాంతం వైపు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. అక్కడ కరెంటు తీగలు నెలపై పడి ఉన్నాయని పేర్కొన్నారు. చదవండి: తిరగబడ్డ చైనా.. మితిమీరిన ఆంక్షలపై కన్నెర్రజేసిన జనం.. -
అమెరికాలో కొత్త చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ
వాషింగ్టన్: తెలుగు మహిళ కాట్రగడ్డ అరుణ మిల్లర్ (58) అమెరికాలో చరిత్ర సృష్టించారు. దేశంలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో మేరీలాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డుకెక్కారు. డెమొక్రాటిక్ పార్టీ తరఫున అరుణ రికార్డు మెజార్టీతో గెలిచారు. రిపబ్లికన్ పార్టీ అనుకూల వర్గాలూ ఆమెకే మద్దతివ్వడంతో గెలుపు సులభమైంది. అమెరికాలో రాష్ట్రస్థాయిలో గవర్నర్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ పదవి అత్యంత కీలకం. రవాణా ఇంజనీర్‌గా సేవలు కాట్రగడ్డ అరుణ మిల్లర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం. ఆమె 1964 నవంబర్ 6న జన్మించారు. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరితో కలిసి 1972లో అమెరికా చేరుకున్నారు. తండ్రి కాట్రగడ్డ వెంకటరామారావు ఐబీఎం సంస్థలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లో ప్రాథమిక విద్య అనంతరం అరుణ ‘మిస్సౌరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’లో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేశారు. 1990లో మేరీల్యాండ్‌లోని మాంట్గొమెరీ కౌంటీకి మారారు. అక్కడే తన కళాశాల మిత్రుడు డేవిడ్ మిల్లర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు మీనా, క్లోయి, సాషా ఉన్నారు. అరుణ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2000లో అమెరికా పౌరసత్వం లభించింది. 2010 నుంచి 2018 దాకా మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో డిస్ట్రిక్ట్ 15కి ప్రాతినిధ్యం వహించారు. 2018లో అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు పోటీపడి ఓడారు. ‘‘మేరీల్యాండ్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి నావంతు కృషి చేస్తా. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ నన్ను గెలిపించి, ప్రజాస్వామ్య వ్యవస్థలో చిన్న రాష్ట్రం కూడా అద్భుతం సృష్టిస్తుందని ఈ ఎన్నికతో ప్రజలు నిరూపించారు’’ అని అరుణ మిల్లర్ చెప్పారు. రిపబ్లికన్ల ఆధిక్యం మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్లు స్వల్ప ఆధిక్యం కనబరుస్తున్నారు. మొత్తం 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో కడపలి వార్తలు అందే సమయానికి 202 స్థానాలు గెలుచుకున్నారు. అధికార డెమొక్రటిక్ పార్టీకి 184 స్థానాలు దక్కాయి. మ్యాజిక్ ఫిగర్ 218 సీట్లు. సెనేట్‌లో 35 స్థానాలకు ఎన్నికలు జరగ్గా రిపబ్లికన్లు 19 , డెమొక్రాట్లు 12 సీట్లు నెగ్గారు. కడపటి వార్తలందేసరికి ఈ రెండు పార్టీలకూ సెనేట్‌లో చెరో 48 సీట్లున్నాయి. 36 గవర్నర్ పదవుల్లో రిపబ్లికన్లకు 16, డెమొక్రాట్లకు 15 దక్కాయి. ఐదింటి ఫలితాలు రావాల్సి ఉంది. ఐదుగురు భారత అమెరికన్ల విజయం వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభకు ఐదుగురు భారత–అమెరికన్లు ఎన్నికయ్యారు. వీరంతా అధికార డెమొక్రాటిక్ పార్టీ తరఫున నెగ్గడం విశేషం. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెషనల్ జిల్లాల నుంచి రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, అమీ బేరా, ప్రమీలా జయపాల్, థానేదార్ ప్రతినిధుల సభలో అడుగు పెట్టనున్నారు. -
అమెరికాలో కాల్పులు.. నల్గొండ వాసి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: అమెరికా మేరీల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో నల్గొండ వాసి మృతి చెందాడు. దుండగుడి కాల్పుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి నక్కా సాయిచరణ్ (26)మృతి చెందాడు. గత రెండేళ్లుగా సాయిచరణ్ అక్కడ ఉంటున్నాడు. కాల్పులకు పాల్పడింది ఓ నల్లజాతీయుడిగా తేలింది. అయితే ఇది విద్వేష నేరమా? లేదంటే రెగ్యులర్‌గా జరుగుతున్న కాల్పుల కలకలమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం స్నేహితుడిని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి కారులో వస్తుండగా.. ఓ నల్లజాతీయుడు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కొడుకు మృతి సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా విషాదం అలుముకుంది. సాక్షి, నల్లగొండ: కొడుకు మృతి ఘటనపై సాక్షితో.. సాయి చరణ్ తండ్రి నర్సింహా మాట్లాడారు. సాయిచరణ్ ఉదయం జరిగిన కాల్పుల్లో మృతి చెందగా.. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది. సాయిచరణ్ ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. సిన్సినాటి యూనివర్శిటీ లో ఎంఎస్ పూర్తి చేశాడు. ఆరు నెలలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే కారు కొనుగోలు చేశాడు. నవంబర్‌లో స్వదేశానికి వస్తానని అన్నాడు. చివరిసారిగా శుక్రవారం మాతో మాట్లాడాడు. బ్యాంకు అకౌంట్ డిటైల్స్ అడిగితే పంపించాం. సాయి చరణ్ మృతదేహం త్వరగా మా దగ్గరికి వచ్చేలా చూడండి.. అంటూ విదేశాంగ శాఖను కోరుతున్నాం. -
ఉబర్ డ్రైవర్ని వరించిన రూ. 75 లక్షల లాటరీ
వాషింగ్టన్: లాటరీ తగలడమే అదృష్టం అందులోనూ ఆ లాటరీలో మరింత ఎక్కువ డబ్బు వస్తే ఇక ఆనందానికి అవధులే ఉండవు. పైగా చిన్నచితకా ఉద్యోగాలతో రోజంతా నిర్విరామంగా పనిచేసే వాళ్లకు లాటరీ తగలితే ఇక ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటి అనుభవం ఒక ఉబర్ డైవర్కి ఎదురైంది. వివరాల్లోకెళ్లితే...అమెరికాలోని 69 ఏళ్ల ఒక ఉబర్ డ్రైవర్ పగలు రాత్రి రైడింగ్‌తో నిర్విరామంగా పనిచేస్తుంటాడు. (చదవండి: సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిలో జన్మించినన ముగ్గురు అక్కాచెల్లెళ్లు) పెద్దగా ఆదాయం లేని విరామ సమయాన్ని ఈ ఉబర్ డ్రైవర్ మంచి లాభదాయకంగా మార్చుకున్నాడు. ఇంతకీ అతను ఆ సమయంలో ఏం చేశాడంటే....జోప్పాలోని ఓ దుకాణం వద్ద 10 డాలర్లతో లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేస్తూ డబ్బలు గడిస్తుండేవాడు. ఆ విధంగా అతను ఒకరోజు అనుకోకుండా 1000 డాలర్ల వెచ్చించి మరీ పెద్ద లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. అయితే ఆరోజు అనుహ్యంగా లక్ష (రూ.75 లక్షలు) గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఉబర్ డైవర్ మాట్లాడుతూ.. "ఈ రోజు చాలా పవిత్రమైంది అంటూ నేను అరుస్తుంటే పక్కనే ఉన్న ఎన్ఫోర్స్మెంట్ అధికారి బాగానే ఉన్నావా అంటూ విచిత్రంగా చూశాడు. ఆ తర్వాత నేను చూశావా నాకు లాటరీలో ఎంత తగిలిందో చూడు అంటూ ఆనందంగా చూపించాను. మిడిల్ రివర్ నుండి వచ్చిన నేను మేరీల్యాండ్ లాటరీ టికెట్ కంపెనీకి ఉబర్ డ్రైవర్‌గా ఐదేళ్లు నుంచి పనిచేయడమే కాక 24 వేల రైడ్లకు పైగా చేశాను" అని అన్నాడు. అంతేకాదు సదరు డ్రైవర్ ఈ డబ్బులో కొంతవరకూ తన కారును బాగుచేయించుకోవడానికి ఖర్చు పెడతానని అన్నాడు. (చదవండి: దయచేసి ఫోన్ ఎత్తి మేము సురక్షితంగా ఉన్నాం అని చెప్పండి!) -
ఇడా తుపాను దెబ్బకు 46 మంది మృతి
న్యూయార్క్: అమెరికాలో ఇడా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మేరీలాండ్ నుంచి కనెక్టికట్ ప్రాంతం వరకు ఇడా సృష్టించిన విలయంలో దాదాపు 46 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. పలువురు ప్రజల ఇళ్లు, వాహనాలు నీటమునిగాయి. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇడా దెబ్బకు పలు ప్రాంతాల్లో నదులు పొంగి ఉత్పాతాలు సృష్టించాయి. ఈ తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో 23 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. పరిస్థితులను అధ్యక్షుడు జోబైడెన్ సమీక్షిస్తున్నారు. జోరున కురుస్తున్న వానతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొవిడ్ బాధితులతో పాటు అత్యవసర చికిత్సలు అవసరమైనవారి కోసం చాలా చోట్ల జనరేటర్లతో ఆసుపత్రులను నిర్వహించాల్సి వచి్చంది. అత్యవసర సహాయం కోసం ఏర్పాటు చేసిన 911 సేవలకూ ఆటంకాలు ఎదురయ్యాయి. చాలా చోట్ల చెట్లు కూలిపోవడంతో పాటు ఇళ్ల కప్పులు ధ్వంసమయ్యాయి. తుపాను కారణంగా ష్కైల్‌కిల్ నదికి 100ఏళ్లలో ఎన్నడూ రానంత వరద వచి్చంది. వాన, గాలి కారణంగా అధికారిక సహాయ చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. -
మహాతల్లి.. ఇంటికి నిప్పు పెట్టి ఆపై దర్జాగా
మేరీల్యాండ్: రోమ్ నగరం తగలబడిపోతుంటే.. చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించాడని చరిత్రకారులు చెప్తుంటారు. అది ఎంత వరకు వాస్తవమో తెలియదో కానీ.. తాజాగా ఓ మహిళ తన ఇంటికి నిప్పు పెట్టి.. దర్జాగా బయట లాన్లో రిలాక్స్‌గా కూర్చుని బుక్ చదువుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో, వీడియో తెగ వైరలవుతున్నాయి. ఈ సంఘటన మేరీల్యాండ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. గెయిల్ మెట్వాలీ(47) అనే మహిళ తన పొరుగింటి వారితో వాదనకు దిగుతుంది. ఇవన్నీ వీడియోలో కనిపిస్తాయి. మరి కాసేపటికే ఓ ఇంటి లోపల మంటలు చేలరేగడం కనిపిస్తుంది. గెయిల్ ఇంటి పక్క వ్యక్తి సమాచారం మేరకు.. గొడవ పడిన తర్వాత గెయిల్ తన ఇంటికి నిప్పింటించి.. తీరిగ్గా వచ్చి లాన్లో కూర్చుని.. బుక్ చదువుతుందని పక్కింటి వారు తెలిపారు. ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో లోపల ఒక వ్యక్తి ఉన్నాడని.. వారు బేస్మెంట్ కిటికి ద్వారా సాయం కోరారని తెలిపాడు. విషయం తెలుసుకున్న మేరీల్యాండ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి నార్త్ ఈస్ట్ బరాక్కు తీసుకెళ్లారు. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఫైర్ మార్షల్ కార్యాలయం ప్రకారం, గెయిల్‌తో సహా నలుగురు ఇంట్లో ఉండేవారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇద్దరు ఇంట్లోనే ఉన్నారని వెల్లడించారు. చదవండి: గాల్లోనే పొట్ట చీల్చుకుని బయటకొచ్చింది! -
నవ్వులు పూయిస్తున్న చింపాజీ పిల్లల అల్లరి
చిన్న పిల్లలు చేసే అల్లరిని భరించడం తల్లిదండ్రులకు చాలా కష్టం. ఒక్క చోట ఉండకుండా అటు,ఇటు తిరుగుతూ ఎప్పుడు ఏదో ఒక చెడ్డ పని చేస్తూనే ఉంటారు. తోటి పిల్లలతో పోట్లాడుకోవడం లేదా పనికి వచ్చే వస్తువులు పగులగొట్టడం వారికి సరదా. ఇక వారి అల్లరిని ఆపేందుకు తల్లి చేయని చేయని ప్రయత్నం ఉండదు. అయితే పిల్లల అల్లరి కేవలం మనుషులకు మాత్రమే కాదు.. జంతువులకు కూడా తప్పదు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. అమెరికాలోని ప్రముఖ మేరీలాండ్ జూలో రెండు చింపాజీ పిల్లలు ఆటలాడుతూ కొట్టుకోగా తల్లి చింపాంజీ వచ్చి వారిని విడగొట్టింది. అటు,ఇటు పరుగెత్తుతుంటే.. తీసుకొచ్చి బుట్టలో పడేసింది. ఈ వీడియోని జూ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. చింపాంజీల జీవితంలో శారీరక సంకర్షణలు అనేది అతి ముఖ్యమైనవి. పిల్ల చింపాంజీలైన లోలా, వైలెట్ తమదైన అల్లరి చేష్టలను ప్రదర్శించాయి. వాటి నేపుణ్యాన్ని ప్రదర్శించే క్రమంలో కొట్లాటకు దిగినప్పుడు తల్లి రావెన్ అప్పుడప్పుడు స్పందించి వాటిని సముదాయించింది’అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. పిల్ల చింపాజీల అల్లరి, వాటి కొట్లాట, తల్లి సముదాయించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. Physical interactions are a big part of life in a #chimpanzee troop. Chimp youngsters Lola and Violet are practicing their rough-and-tumble social skills with occasional refereeing from Violet's mom Raven. pic.twitter.com/pd9NSogwYp — Maryland Zoo (@marylandzoo) January 16, 2021 -
ఒంటరిగా మహిళ డ్యాన్స్.. తర్వాత ఏమైందంటే
అమెరికాలోని మేరీల్యాండ్ ప్రాంతం.. నవంబర్ 29 ఆదివారం.. సమయం రాత్రి 10 గంటలు.. ఒక అపార్ట్మెంట్లో హన్నా వివేరెట్ అనే మహిళ తన ఇంట్లో సీరియస్‌గా డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకుంటూ ఎంజాయ్ మూడ్‌లో ఉంది. ఇంతలో ముందు రూమ్‌లో ఎవరో డోర్ తీసినట్లు అలికిడి వినిపించింది.వెంటనే హన్నా తాను ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగానే.. ఎదురుగా ఒక మనిషి చేతులను జేబులో పెట్టుకొని కోపంగా చూస్తూ నిలబడ్డాడు. అంతే ఒక్కసారిగా షాక్‌కు గురైన హన్నా భయాందోళనతో మ్యూజిక్ ఆఫ్ చేసి.. ఏయ్ ఎవరు నువ్వు.. లోపలికి ఎందుకొచ్చావు.. బయటికి వెళ్లిపో అంటూ గట్టిగట్టిగా అరిచింది. అయినా ఆ మనిషి ఆమెను పట్టించుకోకుండా లోపలికి రావడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన హన్నా తననేం చేయొద్దు అని గట్టిగట్టిగా అరుస్తూ చేతికందినదాన్ని అతని మీదకు విసరడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత హన్నా 911 నెంబర్‌కు కాల్ చేసి పోలీసులకు విషయాన్ని చెప్పింది. పోలీసులు అక్కడికి చేరుకొని మహిళ చెప్పిన ఆధారాల ప్రకారం నిందితుడిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదీ ఇక్కడ జరిగిన విషయం. అసలు ఆ వ్యక్తి ఎవరు.. తన ఇంటికి ఎందుకు వచ్చాడనేది హన్నానే స్వయంగా వీడియోనూ షేర్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చారు. 'నా జీవితంలో ఇది మరిచిపోలేని రోజు. ఈరోజు నా ఇంటికి వచ్చిన వ్యక్తిని మా పక్క వీదిలో చాలా సార్లు చూశాను. అతని పేరు ఏంజెల్ మోసెస్ రోడ్రిగేజ్. అతని ముఖం నాకు బాగా గుర్తు. నన్ను తరచుగా ఫాలో అయ్యేవాడు. కానీ నాకున్న భయంతో ఒక్కసారి కూడా అతన్ని... ఎవరు నువ్వు అని ఎదురు ప్రశ్నించలేదు. కొన్నిసార్లు నా పక్కనుంచే వెళుతూ నన్ను ఇబ్బందులకు గురి చేసేవాడు. ఇదే విషయమై పోలీసులకు చెప్పాలని భావించాను.. కానీ అతను మళ్లీ నాకు కనిపించకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని అనుకున్నా. కానీ ఇలా మా ఇంట్లో ప్రత్యక్షమవుతాడని మాత్రం ఊహించలేదు. కచ్చితంగా అతను నన్ను ఏదైనా చేసే ఉద్దేశంతోనే వచ్చాడని భావించా. అంతేకాదు.. అతను వెళ్తూ స్పానిష్ భాషలో ఎవరికి ఏదో చెబుతున్నట్లుగా అనిపించింది. నాకు తెలిసి అతనితో పాటు తన స్నేహితులు కూడా వచ్చి ఉంటారు. ఆ అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించే ముందు ముఖం కనిపించకుండా ఉండేందుకు డోర్ ముందు ఉన్న క్రిస్టమస్ లైటింగ్ వైర్‌ను తెంచేశాడు. కానీ రూమ్‌లో ఉన్న వెలుతురుకు అతని ముఖం స్పష్టంగా కనపడింది. దీంతో 911కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశానంటూ' చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హన్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోపక్క అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా ఇంటి వస్తువులను నాశనం చేసినందుకు ఏంజెల్‌పై పోలీసులు థర్డ్‌డిగ్రీ ఉపయోగించారు. View this post on Instagram A post shared by Hannah Viv (@hannah.viverette) -
గాల్లోనే పొట్ట చీల్చుకుని బయటకొచ్చింది!
న్యూయార్క్ : అమెరికాకు చెందిన సామ్ డేవిస్ అనే ఫొటోగ్రాఫర్ కొద్దిరోజుల క్రితం మేరీల్యాండ్‌లోని అటవీ ప్రాంతంలో వన్య మృగాలను ఫొటోలు తీసేపనిలో బిజీగా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత గాల్లో ఎగురుతున్న హెరాన్( నారాయణ పక్షి) కనిపించింది. అందులో వింతేమీ లేదు కానీ, దాని పొట్టబాగంలో ఓ స్నేక్ ఈల్ వేలాడుతూ ఉంది. అది హెరాన్ పొట్టకు అతుక్కుందని భావించాడు మొదట. కానీ, అది దగ్గరకు వచ్చిన తర్వాత విషయం అర్థమై షాక్ తిన్నాడు. హెరాన్ మింగిన స్నేక్ ఈల్ దాని పొట్టను చీల్చుకుని బయటకు వచ్చింది. అలా గాల్లో పక్షితో పాటు ఎగురుతూ ఉండిపోయింది. ( పాపం: ఇరుకింట్లో 164 కుక్కలు ) దీనిపై సామ్ మాట్లాడుతూ.. ‘‘ స్నేక్ ఈల్స్ అనేవి ఈల్ జాతికి చెందినవి. ఇవి ఎక్కువగా సముద్ర తీరాల్లోని బురద, ఇసుక ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. ఏదైనా జీవి వీటిని సజీవంగా తిన్నప్పుడు అవి తమ పదునైన తోకను ఉపయోగించి బయటపడటానికి ప్రయత్నిస్తాయి. పొట్టలో జీర్ణం అవకుండా ఉండటానికి అలా చేస్తాయి. ఈల్ పొట్టను చీల్చినా హెరాన్ బ్రతికి ఉండటం అశ్చర్యంగా ఉంది. మామూలుగా అయితే అంత పెద్ద గాయం అయిన తర్వాత ఏ జీవైనా వెంటనే చనిపోతుంది’’ అని తెలిపాడు. ( ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకరినే మనువాడారు! ) -
బీరు తాగిన తల్లి, మరణించిన పసికందు
మేరీల్యాండ్: ఒక మహిళ బీర్ తాగి తన పాప పక్కన పడుకుంది. ఆమెకు పసికందుతో పాటు 4 యేళ్ల కూతురు కూడా ఉంది. తాగి వచ్చిన ఆ మహిళ పసిపాపకు పాలుపట్టింది, డైపర్ మార్చింది, తలుపులు అన్ని లాక్ చేసి జాగ్రత్తగానే పడుకుంది. కానీ తెల్లారి లేచేసరికి ఆ పసికందు కదలడం లేదు. ఆమె పెదాలన్ని నీలం రంగులోకి మారిపోయి కదలకుండా బెడ్ మీద ఉంది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు పాప మరణించినట్లు తెలిపారు. ఈ ఘటన మేరీ ల్యాండ్‌లో జరిగింది. మేరీ ల్యాండ్‌కు చెందిన మురియెల్ మోరిసన్ అనే మహిళ వర్చువల్ పార్టీలో 2 బీర్లు, కొంచెం మద్యం సేవించింది. తరువాత వెళ్లి తన నాలుగేళ్ల చిన్నారితో పాటు నిదురిస్తున్న మరో పాప వద్ద పడుకుంది. అయితే బీర్ వాసన వలన ఆ పసికందు మరణించిందని, ఆ తల్లి మద్యం సేవించడం కారణంగా పాపకు ఊపిరాడక మృతి చెందినట్లు ఆమె పై కేసు నమోదయ్యింది. అయితే ఈ కేసును విచారించిన న్యాయస్థానం తల్లి నిర్లక్ష్యం కారణంగా బిడ్డ చనిపోయిందనడానికి ఏం ఆధారాలు లేవని పేర్కొంది. అంతే కాకుండా బీర్ వాసన వల్ల ఊపిరాడక మరణిస్తారు అని ఎక్కడ లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో మోరిసన్‌ను విడుదల చేశారు. అమెరికాలో ఈ ఒక్కటే కాదు ప్రతి యేడాది కలిసి పడుకోవడం వలన 3,500 మందికి పైగా చిన్నారులు మరణిస్తున్నారు. చిన్నారులతో కలిసి పడుకోవడం కాకుండా వారికి వేరే ఊయల లేదా బెడ్‌ను ఏర్పాటు చేయాలని అమెరికా ఆరోగ్య భద్రత నిపుణులు సూచిస్తున్నారు. కానీ 64 శాతం మందికి పైగా మహిళలు వారి పిల్లలతో కలిసి ఒకే బెడ్ పై నిదురిస్తున్నారు. చదవండి: ఈతకని వచ్చి గుహలో చిక్కుకుపోయాడు -
భూ అంతర్భాగంలో భారీ నిర్మాణం
మేరిల్యాండ్: శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ విశ్వానికి సంబంధించిన పలు రహస్యాలు కనుగొంటున్న విషయం తెలిసిందే. అదే విధంగా భూ అంతర్భాగానికి సంబంధించిన విషయాలు, రహస్యాలను తెలుసుకోవడానికి కూడా నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్రం కింద ఉన్న భూమిలో పరిశోధనలు చేసి భూమి లోపల ఉండే మంటిల్ పొర వద్ద ఓ భారీ నిర్మాణాన్ని కనుగొన్నారు. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన డోయోన్ కిమ్, అతని సహచరులు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వత మార్క్వాస్ దీవుల కింద ఉన్న భూమిలో ఓ కొత్త నిర్మాణాన్ని కనుగొన్నట్లు తెలిపారు. (జుకర్ బర్గ్ దంపతుల సంచలనం : ట్రంప్‌కు షాక్) వేల కిలోమిటర్ల అడుగున భూ అంతర్భంగంలోని ఈ నిర్మాణాన్ని కనుగొనడానికి భూకంపాలు సంభవించినప్పుడు వెలువడే తరంగాల డేటాను విశ్లేషించినట్లు వెల్లడించారు. ఈ నిర్మాణాన్ని భూమి లోపల 2900 కిలోమీటర్ల వద్ద గుర్తించామని తెలిపారు. అల్ట్రా లో వెలాసిటీ(యూఎల్‌వీ)జోన్ అని పిలువబడే ఈ నిర్మాణం 1000 కిలోమీటర్ల వ్యాసం, 25 కిలోమీటర్ల మందంతో ఉన్నట్లు కిమ్ తెలిపారు. భూకంపకాలు సంభవించినప్పుడు వచ్చే తరంగాలు భూమిలో వేల కిలోమీటర్లు ప్రయాణించగలవు. ఈ తరంగాల ప్రతిధ్వనుల సాయంతో భూమి ఉపరితల భౌతిక లక్షణాలతోపాటు భూగర్భంలోని పలు నిర్మాణాలను కనుగొనవచ్చుని పేర్కొన్నారు. దీనికోసం 1990 నుంచి 2018 వరకు పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతం చూట్టూ సంభవించిన సుమారు 7000 భూకంపాలకు సంబంధించిన తరంగాల రికార్డులను విశ్లేషించినట్లు డోయోన్ కిమ్ తెలిపారు.(వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మల్టీ లాగిన్) -
‘తను లేని చోట నేనుండలేను’
వాషింగ్టన్: లారెన్స్ నోక్స్(69) మేరిల్యాండ్లోని ప్లీజంట్ వ్యూ నర్సింగ్ హోంలో నర్సింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించాడు. అతని రాష్ట్రంలో కరోనా విజృంభించడానికి వారం రోజుల ముందు వరకు కూడా అతడు విధులు నిర్వహించాడు. ఈ ఏడాది మార్చి 30న లారెన్స్ అనారోగ్యం పాలయ్యాడు. దాంతో కటుంబ సభ్యులు లారెన్స్‌ను కారోల్ హాస్పిటల్ సెంటర్లో చేర్పించారు. అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిన లారెన్స్ వారం తర్వాత కోలుకున్నారు. ఇక అతడికేం పర్వాలేదని వైద్యులు చెప్పారు. కోమాలో నుంచి కోలుకున్న వెంటనే లారెన్స్ అడిగిన మొదటి ప్రశ్న మిన్నేట్ నోక్స్(71) ఎక్కడ అని. ఆ ప్రశ్న వినగానే కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలయ్యింది. నిజం చేప్తే ఎంత ప్రమాదమో వారికి తెలుసు. అందుకే సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. కానీ లారెన్స్ పదే పదే అడగటంతో సమాధనం చెప్పక తప్పలేదు. మిన్నేట్ ఇక లేరనే చేదు విషయాన్ని లారెన్స్‌కు చెప్పారు. ఆ సమాధానం విన్న లారెన్స్ క్షణం పాటు స్తంభించిపోయారు. తాను విన్నది అబద్దం అయితే బాగుండని దేవుడిని ప్రార్థించారు. అసలు కోమా నుంచి ఎందుకు కోలుకున్నానా అని రోదించారు. అవును మరి గత 24 ఏళ్లుగా కష్ట సుఖాల్లో తనతో కలసి జీవించిన మనిషి ఇక లేదని తెలిస్తే ఆ బాధ వర్ణణాతీం. అది జీవిత చరమాంకంలో. ఈ విషాదం లారెన్స్‌ను కృంగదీసింది. మిన్నేట్ లేని చోట తను ఉండలేను అనుకున్నాడు. అందుకే పిల్లల్ని పిలిచి ఇక తనకు ఎలాంటి వైద్యం అందించ కూడదని చెప్పారు. ఆ బాధతో ఏప్రిల్ 15న చివరి శ్వాస విడిచారు లారెన్స్. (కరోనా: థానే కలకలం.. కోయంబేడు కలవరం) ఈ విషయం గురించి లారెన్స్ కుమార్తె మాట్లాడుతూ.. నాన్నకు కరోనా పాజిటీవ్ అని తేలడంతో ఆస్పత్రిలో చేర్పించాం. నాన్న ఆరోగ్యం గురించి అమ్మ చాలా దిగులుపడింది. ఆ బాధతోనే ఏప్రిల్ 7న గుండెపోటుతో నిద్రలోనేమరణించింది. తర్వాత డాక్టర్లు అమ్మకు కరోనా పాజిటీవ్ అని తేల్చారు. కోమా నుంచి బయటకు వచ్చిన నాన్న అమ్మ మరణాన్ని జీర్ణించుకోలేక పోయాడు. అందుకే ఆమె చనిపోయిన వారం రోజులకే తను ఈ లోకం నుంచి వెళ్లి పోయాడు అంటూ కన్నీటిపర్యంతం అయ్యింది. చదవండి: ఇక 'కోవిడ్' లైఫ్ -
కరోనా విలయం: మేరీల్యాండ్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాపై కరోనా(కోవిడ్-19) విలయతాండవం చేస్తున్న వేళ.. మహమ్మారి నివారణ చర్యల్లో భాగంగా మేరీల్యాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం 5 లక్షల టెస్టు కిట్లను దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ల్యారీ హోగన్ వెల్లడించారు. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం కరోనా కట్టడిలో గేమ్ ఛేంజర్‌గా పనిచేస్తుందన్నారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ... దాదాపు 9 మిలియన్ డాలర్ల వ్యయంతో ఐదు లక్షల కిట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ‘‘అనారోగ్యంతో ఉన్న వారిని.. వైరస్ సోకిన వారిని గుర్తించడంలో టెస్టింగ్ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి కరోనా లక్షణలు ఉన్న వారిని ఐసోలేట్ చేసి చికిత్స అందిస్తూ వ్యాప్తిని అరికట్టవచ్చు. ముందు జాగ్రత్త చర్యల్లో ఇది ప్రముఖమైనది’’ అని పేర్కొన్నారు. (వైరస్ పుట్టుక గురించి చెప్పండి: జర్మనీ) ఇక దక్షిణ కొరియాలోని ల్యాబ్జెనోమిక్స్ నుంచి టెస్టు కిట్లను కొరియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ద్వారా శనివారం బాల్టిమోర్ వాషింగ్టన్ ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకున్నామని హోగన్ వెల్లడించారు. కిట్ల ధరల నిర్ణయం విషయంలో దక్షిణ కొరియా మూలాలున్న తన భార్య యుమీ కీలక పాత్ర పోషించారని ప్రశంసలు కురిపించారు. కాగా ఇప్పటి వరకు మేరీల్యాండ్‌లో 71,400 కరోనా పరీక్షలు నిర్వహించామన్న హోగన్... సరిపడా కిట్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామన్నారు. (ఆ దేశాల కంటే మేమే ముందున్నాం: ట్రంప్) అదే విధంగా అమెరికాలో టెస్టింగ్ కిట్ల కొరత ఉందంటూ ఈ రిపబ్లికన్ ట్రంప్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇక హోగన్ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్... ‘‘మేరీల్యాండ్ గవర్నర్ లాంటి వాళ్లకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఎన్నటికీ అర్థం కాదు’’అంటూ సొంత పార్టీ నేతపై విరుచుకుపడ్డారు. కాగా దాదాపు 60 లక్షల జనాభా ఉన్న మేరీల్యాండ్‌లో కరోనాతో ఇప్పటివరకు 516 మంది మరణించగా... 13,684 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
కరోనా: ‘ఆ డ్రగ్ తనకు పనిచేయలేదు’
వాషింగ్టన్: ‘‘నా కూతురిని చివరిసారిగా చేతుల్లోకి తీసుకున్నా. నా బేబీ అందరికీ సహాయం చేసేది. తను ఈ లోకాన్ని వదిలివెళ్లడంతో నా హృదయానికి చిల్లుపడినట్లుగా అనిపిస్తోంది’’ అంటూ జెనోబియా షీఫర్డ్ అనే మహిళ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా వైరస్ కంటికి కనిపించదని.. అది ఎప్పుడు ఎవరిని బలి తీసుకుంటుందో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. మేరీల్యాండ్‌లోని ఓ గ్రోసరీ స్టోర్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న లిలానీ ఇటీవల మృతి చెందారు. కరోనా వైరస్(కోవిడ్-19) బారిన పడిన ఆమె మస్తిష్క పక్షవాతంతో ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో తన కూతురు 27 ఏళ్ల వయస్సులోనే మరణించడానికి మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో లేకపోవడమే కారణమని జెనోబియా ఆరోపించారు. తన కూతురు వృద్ధులకు సహాయం చేసేదని... సరుకులు కార్ల వద్దకు చేర్చేదని గుర్తుచేసుకున్నారు. (భారత ప్రజలకు ధన్యవాదాలు: ట్రంప్) ఈ క్రమంలో కోవిడ్-19 సోకగా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అక్కడ తనకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇచ్చారని.. అయినప్పటికీ తను మరణించిందన్నారు. మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో గ్రోసరీ స్టోర్లు మరింత పరిశుభ్ర వాతావరణంలో పనిచేసే వెసలుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వృద్ధుల కోసం మరిన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. తన కూతురు నిస్వార్థంగా అందరికీ సేవ చేసేదని.. బటర్‌ఫ్లైని(లిలానీ ముద్దుపేరు) మిస్సవుతున్నా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఆమె సవతి తండ్రి మాట్లాడుతూ.. లిలానీ చనిపోయే ముందు అందరికీ గుడ్‌బై చెబుతూ వీడియో రూపొందించిందని.. కుటుంబ సభ్యులు, స్నేహితులకు దానిని షేర్ చేసిందని ఉద్వేగానికి లోనయ్యారు. కోవిడ్-19 వ్యాప్తిస్తున్న తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా కరోనాతో ఇప్పటికే అమెరికాలో 14 వేల మందికి పైగా మరణించారు.(కరోనా: అమెరికాలో 11 మంది భారతీయుల మృతి) -
మేరీల్యాండ్‌లో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్
మేరీల్యాండ్ : అమెరికాలోని మేరీల్యాండ్‌లో కేఎల్ఏపీ సంస్థ ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా అక్టోబరు 26 న నిర్వహించిన వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్ పోటీలు ఘనంగా జరిగాయి. పురుషులకు వాలీబాల్ మహిళలకు త్రోబాల్ క్రీడలలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో వాలీబాల్‌కు 20 జట్లు, త్రోబాల్‌కు 10 జట్లకు గాను మొత్తం 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12.30 కు ప్రారంభమైన ఈ పోటీలను రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించారు. ఈ పద్దతిలో ప్రతీ గ్రూప్‌లో టాప్కు చేరిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలలో వాలీబాల్ విజేతగా న్యూయార్క్ స్పైకర్స్ నిలిచింది. రన్నరప్‌గా వాషింగ్టన్ కింగ్స్ నిలిచింది. టీమ్ స్ట్రైవ్ మూడో స్థానానికి పరిమితమయ్యింది. ప్రేక్షకులు అత్యధిక సంఖ్యలో హాజరై తమ మద్ధతును తెలిపారు. రాత్రి 9.30కి పోటీలు ముగిశాయి. ఈ టోర్నమెంట్‌కి సహకరించిన ఇండియన ప్యారడైజ్ కూషన్ హోటల్ ఎమ్‌డి జిన్ఓక్కు నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే స్పాన్సర్లు, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు. టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. -
పక్షి దెబ్బకు 14కోట్లు నష్టం
మేరీల్యాండ్: ప్రచ్చన్న యుద్ధ కాలంలో అమెరికా నేతలకు రక్షణ కల్పించడంతోపాటు అణుదాడులకు ఉపయోగపడిన ఓ కీలకమైన విమానం పక్షి కారణంగా దెబ్బతినడంతో రూ.14 కోట్ల మేర నష్టం కలిగింది. మేరీల్యాండ్‌లోని పట్యుక్సెంట్ రివర్ నేవల్ ఎయిర్ స్టేషన్లో ఈ నెల 2న జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ–6బీ మెర్క్యురీ రకం విమానం రన్‌వేపైకి వస్తున్న క్రమంలో ఓ పక్షి ఢీకొంది. విమానాన్ని వెంటనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, పక్షి కారణంగా విమానంలోని నాలుగు ఇంజిన్లలో ఒకటి దెబ్బతింది. దీంతో రూ.14 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనను వైమానిక దళం ‘ఏ క్లాస్’ ప్రమాదంగా పేర్కొంది. ఈ–6బీ మెర్క్యురీ విమానం ఖరీదు రూ.10వేల కోట్లపైమాటే. -
మేరీలాండ్‌లో వైఎస్సార్‌కు ఘన నివాళి
మేరీలాండ్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పదో వర్ధంతి(సెప్టెంబర్ 2)ని మేరీలాండ్‌లో ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజర్స్ ఘనంగా నిర్వహించారు. మహానేత చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు జననేతను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన గొప్పతనాన్ని గుర్తుచేసుకుంటూ తాము కూడా జననేత అడుగుజాడల్లోనే నడుస్తామని పేర్కొన్నారు. అనంతరం కార్యకర్తలు సేకరించిన విరాళాలను మేరీలాండ్‌లో సరైన వసతి లేక ఇబ్బందిపడుతున్న వారికి, హరికేన్ బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రసన్న కాకుమాని, క్లియోనా కాకుమాని, పార్థసారథి రెడ్డి బైరెడ్డి, పవన్ ధనిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి యరమల, తిప్పా రెడ్డి కోట్ల, లోకేష్ మేడపాటి, శ్రీనివాస్ రెడ్డి పూసపాటి, వాసుదేవ రెడ్డి తాళ్ల, పూర్ణ శేఖర్ రెడ్డి జొన్నల, శ్రీనాధ్ కలకడ, సురేష్ కుప్పిరెడ్డి, సంజీవ రెడ్డి దేవిరెడ్డి, వెంకట సతీష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నోయల్ రాజ్ కట్టా, స్వర్ణ కట్టా, పల్లవి నామాల, దీపిక కదరి, రాజేష్ తంజీరెడ్డి, సబ్బు సిస్ట, మెర్సి ఆవుల బేబి క్యాధరిన, హర్ష, శ్రీనివాస్ యవసాని, సత్యనారాయణ రెడ్డి, శ్రీని గడ్డం, వసంత్, రామ్ గోపాల్, మోహన్, తదితరులు హాజరయ్యారు. -
మేరీలాండ్‌లో వైఎస్సార్సీపీ విజయోత్సవ వేడుకలు..
మేరీలాండ్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా అమెరికా మేరీలాండ్‌లోని ఆ పార్టీ కమిటీ సభ్యులు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని విజయ దుందుభి మోగించడం తమకు ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ వేడుకలకు మేరీలాండ్ పరిసర ప్రాంతాల్లోని వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. దాదాపు 500 మంది సకుంట సమేతంగా ఒకే వేదికను పంచుకోవడంతో.. ఈ సభ ఏపీలో జరుగుతున్నందనే అనుభూతినిచ్చింది. కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు తెలుగుదనం ఉట్టిపడేలా చేసిన ఏర్పాట్లను చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేరీలాండ్ వైఎస్సార్సీపీ ఆర్గనైజర్స్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ సాధించిన విజయం ప్రతి ఒక్క కార్యకర్త విజయమని అన్నారు. ఇంతటి అద్వితీయ విజయాన్ని అందించిన కార్యకర్తలకు , సోషల్ మీడియా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. దివంగత మహానేత వైఎస్సార్ పాలనను మరిపించే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందించాలన్నారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సభ్యులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజలు మరిచిపోయేలా.. వైఎస్సార్ సీపీ పాలనలో సంక్షేమ ఫలాలు వారికి చేరుతాయని అన్నారు. వైఎస్సార్ సీపీ భవిష్యత్తులో మరిన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చిన్నారుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తయారుచేయించిన తెలుగింటి వంటకాలను సభకు హాజరైన వారికి వడ్డించారు. ఈ కార్యక్రమాన్ని ప్రసన్న కాకుమాని, పార్థ బైరెడ్డి, పవన్ ధనిరెడ్డి, రవి బారెడ్డి, కోట్ల తిప్పారెడ్డి, వెంకట్ ఎర్రం, రాజ్ ఎరమల, భాస్కర బొమ్మారెడ్డి, సుదర్శన్ దేవిరెడ్డి, నర్సారెడ్డి, సురేశ్ కుప్పిరెడ్డి, నోయల్ కట్ట, జితేంద్ర సాయి పైడిమర్ల, ప్రతాప్ కాకర్ల, రామ్‌గోపాల్ దేవపట్ల, మురళి బాచు, వెంకట్ కీసర, ఆశోక్ చిట్టెల, నాగిరెడ్డి, గిరిధర్ బండి, శివ పిట్టు, శ్రీనివాస్ పూతన, రాజ్‌గోపాల్ గుజ్జాల, కమలాకర్, నివాస్, హితేశ్, శ్రీను గడ్డం, బ్రహ్మ, వాసుదేవారెడ్డి తాళ్ల, శ్రీనివాసరెడ్డి పూసపాటి, సోమశేఖర్‌రెడ్డి, సత్య, కరుణాకర్, రాజ్, విష్ణు బుసిరెడ్డి, రామనంద కొండా, శ్రీనివాస్ యావసాని, వాసు మద్దిశెట్టి, శ్రీధర్ వన్నెంరెడ్డి, రమేశ్‌రెడ్డి, సత్య పాటిల్, శ్రీధర్ నాగిరెడ్డి, వేణు, సుధాకర్ ధనిరెడ్డి, వర్జీనియా నుంచి దిలీప్, నినాంద్, సత్య పాటిల్, వేణు గోపాల్‌లు విజయవంతంగా నిర్వహించారు. పాల్గొన్న సభ్యులందరికి అభినందనలు తెలిపారు. -
షాకింగ్; ఎన్నారై సజీవ దహనం
వాషింగ్టన్ : వైట్‌హౌజ్ సమీపంలో ఓ వ్యక్తి సజీవ దహనమవడం కలకలం రేపింది. అధ్యక్ష భవనానికి దగ్గర్లోనే అతడు ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో మృతుడు భారత్‌కు చెందిన అర్నవ్ గుప్తా(33)గా పోలీసులు గుర్తించారు. వివరాలు.. మేరీలాండ్‌లో నివసిస్తున్న ఆర్నవ్ గుప్తా బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటికి వచ్చాడు. చాలా సమయం గడిచినా అతడు రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. శ్వేతసౌధానికి సమీపంలో ఉన్న ఎలిప్స్ పార్కు వచ్చిన ఆర్నవ్.. అక్కడ అందరూ చూస్తుండగానే తనకు తాను నిప్పంటించుకున్నాడు. దీంతో షాక్ తిన్న స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే శరీరంలోని అన్ని అవయవాలు తీవ్రంగా కాలిపోవడంతో అర్నవ్ మృతిచెంచినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆర్నవ్ ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
వివస్త్రను చేసి, అత్యంత పాశవికంగా హతమార్చి..
అరియానా ఫ్యూన్స్-డియాజ్.. పద్నాగేళ్ల అమ్మాయి.. గత నెల 11న తాను ఆశ్రయం పొందే యూత్ గ్రూప్ హోం నుంచి పారిపోయింది. అనంతరం అదే నెల17న ఇంటికి వెళ్లేందుకు తన తల్లికి పరిచయస్తుడైన ఓ వ్యక్తిని కలిసి బెన్నింగ్ మెట్రో స్టేషన్లో తనను దించాల్సిందిగా కోరింది. అయితే మార్గ మధ్యలో వీరి కారును అడ్డగించిన పదిహేను మందితో కూడిన ఓ గుంపు అరియానా వెంట ఉన్న వ్యక్తిని బయటికి ఈడ్చిపారేసింది. అనంతరం అతడిని ఓ ఇంటిలోకి తీసుకు వెళ్లి తీవ్రంగా కొట్టారు. అర్ధనగ్నంగా అతడిని నిల్చోబెట్టి కాసేపు హింసించిన తర్వాత 500 డాలర్లు, ఏటీఎమ్ కార్డులు లాక్కున్నారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న అరియానా ఆ వ్యక్తిని కొట్టవద్దంటూ దుండగులను బతిమిలాడటంతో అతడిని వదిలిపెట్టారు. అయితే అరియానా చేత అతడిని కిడ్నాప్ చేయించాలని భావించిన ఆమె గ్యాంగ్‌కు ఈ విషయం తెలియడంతో అరియానాపై అనుమానం వచ్చింది. ఈ విషయంతో పాటుగా తమ గురించి కూడా పోలీసులకు చెబుతుందోమోనన్న అనుమానం వారిని వెంటాడింది. దీంతో ఎప్పటికైనా ఆమెతో తమకు ప్రమాదం పొంచి ఉందని భావించిన గ్యాంగ్ సభ్యులు ఆమెను అంతమొందించాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 18న అరియానాను జనసమ్మర్దం తక్కువగా ఉండే ఓ అపార్టుమెంటులోకి తీసుకువెళ్లారు. అనంతరం అక్కడే ఉన్న టన్నెల్లోకి లాక్కెళ్లి పాశవికంగా హత్య చేశారు. అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో జరిగింది ఈ ఘటన. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఎస్కోబార్, ఫ్యూంటెస్ పోన్స్ అనే టీనేజర్లు ఈ దారుణానికి ఒడిగట్టారు. అరియానాను వివస్త్రగా మార్చిన ఎస్కోబార్.. చెక్క బ్యాట్, బేస్‌బాల్‌తో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆ తర్వాత ఫ్యూంటెన్స్ కత్తితో ఆమెను దారుణంగా గాయపరిచాడు. ఈ తతంగాన్నంతా చూస్తున్న మరో వ్యక్తి వీడియో తీస్తూ రాక్షసానందం పొందాడు. ఈ నేరంలో వీరికి హెర్నాండెజ్ అనే మరో పద్నాగేళ్ల బాలిక సహకరించింది. విచారణలో భాగంగా అరియానా హత్యలో తనకు భాగం లేదన్న హెర్నాండెజ్.. ఆరోజు తను టన్నెల్ బయట నిల్చుని ఉన్నానని పేర్కొంది. ఆ సమయంలో ఆడ మనిషి అరుపులు విన్నానని.. కాసేపటి తర్వాత ఎస్కోబార్, ఫ్యూంటెన్స్ బయటికి వచ్చారని చెప్పింది. అప్పుడు వారి ముఖం, బట్టలు పూర్తిగా రక్తంతో తడిచిపోవడంతో తనకు భయం వేసిందని పేర్కొంది. అయితే ఉద్దేశ పూర్వకంగానే హెర్నాండెజ్ టన్నెల్ బయట నిల్చుని హంతకులకు సహకరించిందని పోలీసులు వెల్లడించారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సమీపంలో దొరికిన కత్తి, అపార్టుమెంటులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించగలిగామని పేర్కొన్నారు. అయితే ఈ హత్యలో భాగస్వామ్యమైన మరో వ్యక్తి జాడ ఇంతవరకు తెలియలేదని, త్వరలోనే ఆ నిందితుడిని కూడా పట్టుకుంటామని తెలిపారు.