మేరీ ల్యాండ్లో వైఎస్సార్ జయంతి వేడుకలు | YSR Jayanthi Maryland USA 2017 | Sakshi
Sakshi News home page

మేరీ ల్యాండ్లో వైఎస్సార్ జయంతి వేడుకలు

Published Tue, Jul 11 2017 1:54 PM | Last Updated on Sat, Jul 7 2018 3:07 PM

YSR Jayanthi Maryland USA 2017

మేరీ ల్యాండ్ :
అమెరికాలోని మేరీ ల్యాండ్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కులమతాలకు అతీతంగా మేరీ ల్యాండ్లోని ఎన్ఆర్ఐలందరూ ఒకేచోట చేరి వైఎస్సార్ 68వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలకు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వచ్చిన పెద్దలు మేరిల్యాండ్లోని ఎన్ఆర్ఐలకు వైఎస్సార్ పాలనని, ఆయన మడమ తిప్పని ఔన్నత్యాన్ని బడుగు, బలహీన, కార్మిక, శ్రామిక, రైతు వర్గాలకు ఆయన చేసిన మంచిపనులను వివరించారు.

అనంతరం వైఎస్సార్ జయంతి సందర్భంగా హోవార్డ్ కౌంటీ ఫుడ్ బ్యాంక్ కి భారీ స్థాయిలో ఆహారాన్ని వితరణగా ఇచ్చారు. వైఎస్సార్ మరణించినా ఆయన ఆశయాలను  అమలు పరచే విధంగా తమ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని మేరీల్యాండ్ వైస్సార్ అభిమానులు ప్రతిఙ్ఞ చేశారు. ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు మేరీ ల్యాండ్లో మరిన్ని చేసి తమ ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి ఖ్యాతిని వ్యాప్తి చెందేలా కృషి చేస్తామన్నారు. రాజన్న ఆశయాలు కొనసాగించే ధైర్యం  వైఎస్ఆర్సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమన్నారు. 2019 లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై నిలిపేందుకు తమ సహకారం ఎప్పుడు అందించడానికి సిద్ధమని మేరీల్యాండ్లోని ఎన్​‍ఆర్ఐలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement