వాషింగ్టన్: యూఎస్ మేరిల్యాండ్లోని ప్రిన్సెస్ అన్నీ పట్టణంలోని ఓ ఇంటిలో ఎనిమిది మంది విగత జీవులుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సదురు నివాసానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఏడుగురు ఆరు నుంచి 16 ఏళ్ల వయస్సు కలిగిన వారని పోలీసులు తెలిపారు.
అయితే వారంతా వంట గదిలోని గ్యాస్ లీక్ కారణంగా మరణించి ఉంటారా అనే కోణం దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా సదరు ఇంటికి విద్యుత్ సరఫరా లేదని పోలీసులు వెల్లడించారు. వీరంతా ఎలా మృతి చెందారో తెలియాలంటే పోస్ట్మార్టం నివేదిక వస్తే కానీ తెలియదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.