మేరీల్యాండ్: రోమ్ నగరం తగలబడిపోతుంటే.. చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించాడని చరిత్రకారులు చెప్తుంటారు. అది ఎంత వరకు వాస్తవమో తెలియదో కానీ.. తాజాగా ఓ మహిళ తన ఇంటికి నిప్పు పెట్టి.. దర్జాగా బయట లాన్‌లో రిలాక్స్‌గా కూర్చుని బుక్ చదువుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో, వీడియో తెగ వైరలవుతున్నాయి. ఈ సంఘటన మేరీల్యాండ్‌లో చోటు చేసుకుంది.
ఆ వివరాలు.. గెయిల్ మెట్‌వాలీ(47) అనే మహిళ తన పొరుగింటి వారితో వాదనకు దిగుతుంది. ఇవన్నీ వీడియోలో కనిపిస్తాయి. మరి కాసేపటికే ఓ ఇంటి లోపల మంటలు చేలరేగడం కనిపిస్తుంది. గెయిల్ ఇంటి పక్క వ్యక్తి సమాచారం మేరకు.. గొడవ పడిన తర్వాత గెయిల్ తన ఇంటికి నిప్పింటించి.. తీరిగ్గా వచ్చి లాన్‌లో కూర్చుని.. బుక్ చదువుతుందని పక్కింటి వారు తెలిపారు.
ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో లోపల ఒక వ్యక్తి ఉన్నాడని.. వారు బేస్‌మెంట్ కిటికి ద్వారా సాయం కోరారని తెలిపాడు. విషయం తెలుసుకున్న మేరీల్యాండ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి నార్త్ ఈస్ట్ బరాక్‌కు తీసుకెళ్లారు. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఫైర్ మార్షల్ కార్యాలయం ప్రకారం, గెయిల్‌తో సహా నలుగురు ఇంట్లో ఉండేవారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇద్దరు ఇంట్లోనే ఉన్నారని వెల్లడించారు.
చదవండి: గాల్లోనే పొట్ట చీల్చుకుని బయటకొచ్చింది!
Comments
Please login to add a commentAdd a comment