set to fire
-
ప్రియుడి 23 లక్షల బైక్‌ను తగలబెట్టేసిన ప్రియురాలు
బ్యాంకాక్: ప్రేమ.. మాటల్లో వర్ణించలేని గొప్ప ఫీలింగ్. ఒకరి మనుసు ఒకరు తెలుసుకొని జీవితాంతం తోడుగా నిలవాలని ఎంతో మంది కలలు కంటుంటారు. కానీ తమ ప్రేమను పెళ్లితో మూడేసి నూరేళ్లు జీవించేవాళ్లు కొందరే. మనస్పర్థలు, నమ్మకం కోల్పోవడం వంటి కారణాలతో మధ్యలోనే విడిపోయే వారు కోకొల్లలు. కొంతమంది బలమైన కారణంతో బ్రేకప్ మరికొంతమంది సిల్లీ రీజన్స్‌తో విడిపోతుంటారు. అయితే అచ్చం ఇలాగే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ సమయంలో కనాక్ వావన్ అనే యువతి తన లవర్‌కు లక్షల విలువైన బైక్‌ను గిఫ్ట్‌గా అందించింది. తరువాత కొన్ని కారణాలతో వారు విడిపోయారు. అయితే తను ఇచ్చి బైక్‌ను తిరిగి ఇవ్వాలని యువతి అతన్ని కోరింది. ఇందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో ఎలాగైన మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఓ ప్లాన్ వేసింది. బ్యాంకాక్‌లోని ఓ భవనం మూడో అంతస్తులో ప్రియుడి బైక్ పార్క్ చేసి ఉందని తెలుసుకుంది. అక్కడికి వెళ్లి ఆమె ఇచ్చిన లగ్జరీ బైక్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టింది. ఈ క్రమంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ఆరు బైక్‌లకు కూడా మంటలు అంటుకున్నాయి. అయితే అక్కడున్న సిబ్బంది వెంటనే తెరుకొని అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అనంతరం సీసీ టీవీఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ప్రమాదం జరిగడానికి ముందు ఓ మహిళ వచ్చి ఓ బైక్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం పోలీసులు గమనించారు. ప్రమాదానికి కనాక్ వావన్ కారణమని తెలుసుకొని ఆమెను అరెస్ట్ చేసి విచారించగా మరిన్ని వివరాలు బయటకొచ్చాయి. ఆ బైక్ ధర ఒక మిలియన్ బాట్ అంట. అంటే మన కరెన్సీలో సుమారు ₹23 లక్షల వరకు ఉంటుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడే ఆమె కొనిచ్చనని, ఇప్పుడు విడిపోవడంతో అతని మీద కోపంతో ఆ బైక్‌ను తగలబెట్టాలని తెలిపింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: వీడియో వైరల్: భారీగా బరువు తగ్గిన కిమ్ జాంగ్ -
మహాతల్లి.. ఇంటికి నిప్పు పెట్టి ఆపై దర్జాగా
మేరీల్యాండ్: రోమ్ నగరం తగలబడిపోతుంటే.. చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించాడని చరిత్రకారులు చెప్తుంటారు. అది ఎంత వరకు వాస్తవమో తెలియదో కానీ.. తాజాగా ఓ మహిళ తన ఇంటికి నిప్పు పెట్టి.. దర్జాగా బయట లాన్లో రిలాక్స్‌గా కూర్చుని బుక్ చదువుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో, వీడియో తెగ వైరలవుతున్నాయి. ఈ సంఘటన మేరీల్యాండ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. గెయిల్ మెట్వాలీ(47) అనే మహిళ తన పొరుగింటి వారితో వాదనకు దిగుతుంది. ఇవన్నీ వీడియోలో కనిపిస్తాయి. మరి కాసేపటికే ఓ ఇంటి లోపల మంటలు చేలరేగడం కనిపిస్తుంది. గెయిల్ ఇంటి పక్క వ్యక్తి సమాచారం మేరకు.. గొడవ పడిన తర్వాత గెయిల్ తన ఇంటికి నిప్పింటించి.. తీరిగ్గా వచ్చి లాన్లో కూర్చుని.. బుక్ చదువుతుందని పక్కింటి వారు తెలిపారు. ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో లోపల ఒక వ్యక్తి ఉన్నాడని.. వారు బేస్మెంట్ కిటికి ద్వారా సాయం కోరారని తెలిపాడు. విషయం తెలుసుకున్న మేరీల్యాండ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి నార్త్ ఈస్ట్ బరాక్కు తీసుకెళ్లారు. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఫైర్ మార్షల్ కార్యాలయం ప్రకారం, గెయిల్‌తో సహా నలుగురు ఇంట్లో ఉండేవారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇద్దరు ఇంట్లోనే ఉన్నారని వెల్లడించారు. చదవండి: గాల్లోనే పొట్ట చీల్చుకుని బయటకొచ్చింది! -
తండ్రి లైంగిక వేధింపులు: కాల్చి పడేసిన కూతురు
కోల్‌కతా: బాల్యంలోనే తల్లి చనిపోయింది. అమ్మనాన్న తానే అయి ప్రేమను పంచి కాపాడాల్సిన తండ్రి.. తనపై కన్నేశాడు. లైంగికంగా వేధిస్తూ.. మానసికంగా హింసిస్తూ.. నరకం చూపించాడు. వివాహం చేసుకుని అత్తారింటికి వెళ్లే వరకు ప్రతిరోజు కన్నీళ్లే. అత్తారింటికి వెళ్లాక ఈ బాధలు తప్పుతాయనుకుంటే.. దురదృష్టం కొద్ది వివాహ బంధం ఎక్కువ రోజులు సాజవుగా సాగలేదు. విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. దాంతో మళ్లీ పుట్టింటికి చేరింది. తండ్రి టార్చర్ తిరిగి మొదలయ్యింది. ఈ బాధలను భరించలేకపోయిన ఆ మహిళ ఓ దారుణ నిర్ణయం తీసుకుంది. తనకు నరకం చూపిస్తున్న తండ్రిని కడతేర్చింది. ఆ వివరాలు.. కోల్‌కతాకు చెందిన మహిళ తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. అప్పటి నుంచి తండ్రి ఆమెని లైంగికంగా హింసించేవాడు. తన వివాహం అయ్యే వరకు ఈ కష్టాలు భరించింది. కానీ దురదృష్టం కొద్ది విడాకలు తీసుకుని మళ్లీ తండ్రి పంచన చేరాల్సి వచ్చింది. దాంతో మళ్లీ టార్చర్ మొదలు. ఈ బాధలు భరించలేక పోయిన యువతి తండ్రిని హతమార్చలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తండ్రి బిడ్డలిద్దరూ కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. తిన్న తర్వాత తండ్రి చేత ఫుల్లుగా మద్యం తాగించింది. ఆ తర్వాత ఇద్దరు హూగ్లీ నది ఒడ్డున ఉన్న బెంచీ మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. మందు ఎక్కువ కావడంతోతండ్రి మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు. ఈ క్రమంలో మహిళ అప్పటికే తెచ్చి పెట్టుకున్న కిరోసిన్‌ని తండ్రి మీద పోసి నిప్పంటించింది. ఈ దృశ్యాలన్ని అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు విచారణలో నిందితురాలు తండ్రి చిన్నతనం నుంచి తనను ఎలా హింసిస్తుంది వివరించింది. ఆ బాధలు తట్టుకోలేక అతడిని చంపేసినట్లు అంగీకరించింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: లైంగికదాడి చేయబోయాడు; కోలుకోలేని దెబ్బకొట్టింది! -
కిషన్ రెడ్డి సభలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
-
కిషన్ రెడ్డి సభలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతుండగా నిండు సభలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. నల్లగొండకు సమీపంలోని కేశరాజుపల్లికి చెందిన శంకర్ అనే వ్యక్తి.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కేంద్రంలో బీజేపీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సభలో.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడటం ప్రారంభించిన కొద్ది సేపటికే జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన శంకర్.. తమ గ్రామంలోని ఓ సమస్య విషయమై కిషన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు సభకు వచ్చాడు. అయితే, అప్పటికే ఆయన ప్రసంగం ప్రారంభం కావడంతో.. ఇప్పుడు కాదంటూ బీజేపీ కార్యకర్తలు అతడికి అనుమతి ఇవ్వలేదు. దాంతో.. తన విజ్ఞప్తిని తీసుకోలేదన్న మనస్తాపంతో.. వెంటనే తాను తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడిని నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన మొత్తం రెండు నిమిషాల్లోనే జరిగిపోయింది. శంకర్‌ను ఆస్పత్రికి తరలించిన కొద్ది సేపటికే సభ మళ్లీ ప్రారంభమైంది.