మేరీలాండ్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పదో వర్ధంతి(సెప్టెంబర్ 2)ని మేరీలాండ్‌లో ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజర్స్ ఘనంగా నిర్వహించారు. మహానేత చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు జననేతను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన గొప్పతనాన్ని గుర్తుచేసుకుంటూ తాము కూడా జననేత అడుగుజాడల్లోనే నడుస్తామని పేర్కొన్నారు. అనంతరం కార్యకర్తలు సేకరించిన విరాళాలను మేరీలాండ్‌లో సరైన వసతి లేక ఇబ్బందిపడుతున్న వారికి, హరికేన్ బాధితులకు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ప్రసన్న కాకుమాని, క్లియోనా కాకుమాని, పార్థసారథి రెడ్డి బైరెడ్డి, పవన్ ధనిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి యరమల, తిప్పా రెడ్డి కోట్ల, లోకేష్ మేడపాటి, శ్రీనివాస్ రెడ్డి పూసపాటి, వాసుదేవ రెడ్డి తాళ్ల, పూర్ణ శేఖర్ రెడ్డి జొన్నల, శ్రీనాధ్ కలకడ, సురేష్ కుప్పిరెడ్డి, సంజీవ రెడ్డి దేవిరెడ్డి, వెంకట సతీష్ రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి, నోయల్ రాజ్ కట్టా, స్వర్ణ కట్టా, పల్లవి నామాల, దీపిక కదరి, రాజేష్ తంజీరెడ్డి, సబ్బు సిస్ట, మెర్సి ఆవుల బేబి క్యాధరిన, హర్ష, శ్రీనివాస్ యవసాని, సత్యనారాయణ రెడ్డి, శ్రీని గడ్డం, వసంత్, రామ్ గోపాల్, మోహన్, తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment