చిన్న పిల్లలు చేసే అల్లరిని భరించడం తల్లిదండ్రులకు చాలా కష్టం. ఒక్క చోట ఉండకుండా అటు,ఇటు తిరుగుతూ ఎప్పుడు ఏదో ఒక చెడ్డ పని చేస్తూనే ఉంటారు. తోటి పిల్లలతో పోట్లాడుకోవడం లేదా పనికి వచ్చే వస్తువులు పగులగొట్టడం వారికి సరదా. ఇక వారి అల్లరిని ఆపేందుకు తల్లి చేయని చేయని ప్రయత్నం ఉండదు. అయితే పిల్లల అల్లరి కేవలం మనుషులకు మాత్రమే కాదు.. జంతువులకు కూడా తప్పదు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం.
అమెరికాలోని ప్రముఖ మేరీలాండ్ జూలో రెండు చింపాజీ పిల్లలు ఆటలాడుతూ కొట్టుకోగా తల్లి చింపాంజీ వచ్చి వారిని విడగొట్టింది. అటు,ఇటు పరుగెత్తుతుంటే.. తీసుకొచ్చి బుట్టలో పడేసింది. ఈ వీడియోని జూ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. చింపాంజీల జీవితంలో శారీరక సంకర్షణలు అనేది అతి ముఖ్యమైనవి. పిల్ల చింపాంజీలైన లోలా, వైలెట్ తమదైన అల్లరి చేష్టలను ప్రదర్శించాయి. వాటి నేపుణ్యాన్ని ప్రదర్శించే క్రమంలో కొట్లాటకు దిగినప్పుడు తల్లి రావెన్ అప్పుడప్పుడు స్పందించి వాటిని సముదాయించింది’అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. పిల్ల చింపాజీల అల్లరి, వాటి కొట్లాట, తల్లి సముదాయించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు.
Physical interactions are a big part of life in a #chimpanzee troop. Chimp youngsters Lola and Violet are practicing their rough-and-tumble social skills with occasional refereeing from Violet's mom Raven. pic.twitter.com/pd9NSogwYp
— Maryland Zoo (@marylandzoo) January 16, 2021
Comments
Please login to add a commentAdd a comment