chimpanzees
-
కడుగు.. కడుగు!! బాగా కడుగు.. ఈ దెబ్బతో కారు తళ తళ మెరిసిపోవాలి!
సొంత పనులు చేసుకోవడానికి కూడా తెగ బద్దకిస్తుంటారు కొంతమంది. ఐతే ఈ వీడియోలో కనిపించే చింపాంజీలు మాత్రం ఒళ్లొంచి ఎలా పనిచేస్తున్నాయో చూడండి. ఎవరప్పగించారోగానీ కారును నీళ్లతో శుభ్రంగా కడిగేస్తున్నాయి. జంతువులను చూసి పనులు ఎలా శ్రద్ధగా చేయాలో నేర్చుకోవాలనే విధంగా ఉంది వీటి పనితనం. మీరు ఓ లుక్కెయ్యండి! రెండు చింపాంజీలు బ్లాక్ కారుపై ఎక్కి కూర్చుని మరీ గ్లాస్‌ను నీట్‌గా రుద్ది రుద్ది కడగటం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఎంతో ప్రొఫెషనల్ క్లీనర్స్లా చేతితో క్లాత్ పట్టుకుని దర్జాగా కారును శుభ్రం చేస్తున్నాయి. ఇంతవరకూ మనుషులు మాత్రమే కార్లను క్లీన్ చేయడం చూశారు. ఇలా చింపాంజీలు కారును శుభ్రంచేయడం ఎప్పుడైనా చూశారా? ఐతే చింపాజీలు మనుషులను అనుకరించగలిగే తెలివైన జంతువులనే విషయం మనందరికీ తెలుసు! పిల్లలతో ఆటలాడే, మనుషులు ఉతికినట్టే బట్టలుతికే వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో పలుమార్లు వైరలయ్యాయి. ఇప్పుడు కారు కడిగే చింపాజీల వీడియో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. లక్షల వీక్షణలు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ఫ్రీ కార్ వాషింగ్ అని, ఇంటిలో అత్యంత ప్రమాదకరమైన జంతువని కొంతమంది సరదాగా ఈ వీడియోకు కామెంట్లు జోడించారు. మీరేమంటారు.. చదవండి: ఈ అంబులెన్స్ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు! కంగారులో.. View this post on Instagram A post shared by Wilds Planet (@wildsplanet) -
నవ్వులు పూయిస్తున్న చింపాజీ పిల్లల అల్లరి
చిన్న పిల్లలు చేసే అల్లరిని భరించడం తల్లిదండ్రులకు చాలా కష్టం. ఒక్క చోట ఉండకుండా అటు,ఇటు తిరుగుతూ ఎప్పుడు ఏదో ఒక చెడ్డ పని చేస్తూనే ఉంటారు. తోటి పిల్లలతో పోట్లాడుకోవడం లేదా పనికి వచ్చే వస్తువులు పగులగొట్టడం వారికి సరదా. ఇక వారి అల్లరిని ఆపేందుకు తల్లి చేయని చేయని ప్రయత్నం ఉండదు. అయితే పిల్లల అల్లరి కేవలం మనుషులకు మాత్రమే కాదు.. జంతువులకు కూడా తప్పదు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. అమెరికాలోని ప్రముఖ మేరీలాండ్ జూలో రెండు చింపాజీ పిల్లలు ఆటలాడుతూ కొట్టుకోగా తల్లి చింపాంజీ వచ్చి వారిని విడగొట్టింది. అటు,ఇటు పరుగెత్తుతుంటే.. తీసుకొచ్చి బుట్టలో పడేసింది. ఈ వీడియోని జూ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. చింపాంజీల జీవితంలో శారీరక సంకర్షణలు అనేది అతి ముఖ్యమైనవి. పిల్ల చింపాంజీలైన లోలా, వైలెట్ తమదైన అల్లరి చేష్టలను ప్రదర్శించాయి. వాటి నేపుణ్యాన్ని ప్రదర్శించే క్రమంలో కొట్లాటకు దిగినప్పుడు తల్లి రావెన్ అప్పుడప్పుడు స్పందించి వాటిని సముదాయించింది’అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. పిల్ల చింపాజీల అల్లరి, వాటి కొట్లాట, తల్లి సముదాయించడంపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. Physical interactions are a big part of life in a #chimpanzee troop. Chimp youngsters Lola and Violet are practicing their rough-and-tumble social skills with occasional refereeing from Violet's mom Raven. pic.twitter.com/pd9NSogwYp — Maryland Zoo (@marylandzoo) January 16, 2021 -
అక్టోబర్‌లో ఆక్స్ఫర్డ్ టీకా!
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ నివారణకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన టీకా అభివృద్ధి కార్యక్రమం కీలకమైన ముందడుగు వేసింది. చింపాంజీలపై జరిపిన ప్రయోగాలు ప్రోత్సాహకరమైన ఫలితాలివ్వగా మానవ ప్రయోగాలు వేగంగా నిర్వహిస్తున్నట్లు ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త, జెనెన్‌ర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆడ్రియన్ హిల్ ప్రకటించారు. టీకా అక్టోబర్‌కల్లా సిద్ధమయ్యే అవకాశముందన్నారు. ఫార్మా కంపెనీ ఆస్ట్రా జెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కొత్త టీకాను ఇప్పటికే బ్రెజిల్‌లోని కొంతమంది కార్యకర్తలపై ప్రయోగించారు. టీకా అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 సంస్థలు/ పరిశోధన కేంద్రాలు టీకాలు అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉండగా, వీటన్నింటి లోనూ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ టీకా మేలైన ఫలితాలు ఇస్తు న్నట్లు తెలుస్తోంది. (లాక్డౌన్లో ఎంత డౌన్) ఈ కార ణంగానే ఈ టీకా ఇప్పటికే మానవ ప్రయోగాల తుదిదశ కు చేరుకుందని అంచనా. దక్షిణాఫ్రికాలోనూ ఈ టీకాను సుమారు 200 మందిపై ప్రయోగిస్తున్నారు. బ్రిటన్‌లో సుమారు 4000 మంది ఇప్పటికే టీకా ప్రయోగాలకు తమ సమ్మతిని తెలిపారని, మరో పదివేల మందిని సమీప భవిష్యత్తులో నియమించుకుంటామని కంపెనీ చెబుతోంది. ఏప్రిల్ 23న ఈ మానవ ప్రయోగాలు మొదలయ్యాయని సమాచారం. వీటి వివరాలు ఆగస్టు లేదా సెప్టెంబరు నెలకు అందుతాయని, తదనుగుణంగా అక్టోబరులో టీకాను విడుదల చేస్తామని అడ్రియన్ హిల్ ఇటీవల జరిగిన ఒక వెబినార్‌లో వ్యాఖ్యానించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఆస్ట్రా జెనెకా 3కోట్ల టీకా డోసులను సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ టీకాను స్థానికంగా తయారు చేసేందుకు ఆస్ట్రా జెనెకాతో ఒక ఒప్పందం చేసుకుంటున్నట్లు బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి ఎడ్యురాడో పాజిల్లో తెలిపారు. (భారీగా తగ్గిన పీపీఈ కిట్ల ధరలు) -
చింపాంజీలను అటాచ్ చేసిన ఈడీ!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు చింపాంజీలు, నాలుగు మార్మోసెట్ల (పొడవాటి తోక గల దక్షిణ అమెరికా కోతులు) ను అటాచ్చేసింది. ఈడీ చింపాంజీలను అటాచ్ చేయడమేంటి అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వన్యప్రాణి స్మగ్లర్‌పై మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా వీటిని అటాచ్ చేసింది. స్మగ్లర్ ఇంటి నుంచి వాటిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని కోల్‌కతాలోని అలిపోర్ జంతుప్రదర్శన శాలలో ఉంచినట్లు కేంద్ర సంస్థ వెల్లడించింది. ఈ చింపాంజీలు సందర్శకులను ఆకర్షించడమే కాకుండా, జూకి ఒక మంచి ఆదాయ మార్గం అని చెప్పింది. కాగా, కోతులను జంతు శాలలో ఉంచినట్లు తెలిపింది. ఈ విధంగా మనీ లాండరింగ్ చట్టంకింద జంతువులను అటాచ్ చేయడం మొదటి సారి అని ఈడీ పేర్కొంది. స్మగ్లర్ ఆ జంతువులను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది. మొత్తం ఏడు జంతువుల విలువ రూ.81 లక్షలు ఉంటుందని, ఒక్కో చింపాంజీ విలువ రూ.25 లక్షలు కాగా.. కోతుల విలువ రూ.1.5 లక్షలుంటుందని వెల్లడించింది. అడవి జంతువులను అక్రమంగా నిర్భంధించాడని స్మగ్లర్ సుప్రదీప్ గుహపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. గుహ ‘వ్యవస్థీకృత వన్యప్రాణుల అక్రమ రవాణా రాకెట్‌ను నడుపుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైనట్లు ఈడీ తెలిపింది. -
చింపాంజీలు మానవ ఆధిపత్యాన్ని అధిగమిస్తాయ్!
లండన్: సాధారణంగా అడవి జంతువులేవైనా మానవులు నివసించే ప్రాంతాలకు సమీపంలో మనుగడ సాగించలేవు. వాటి జీవనానికి అటవీ ప్రాంతమే అనుకూలంగా ఉంటుంది. కానీ చింపాంజీలు మాత్రం మానవుల ఆధిపత్యం కొనసాగే ప్రాంతాలకు సమీపంలోనూ మనగలవని తాజాగా నిపుణులు గుర్తించారు. మానవుల కార్యకలాపాలు కొనసాగే ప్రాంతం అడవి జీవులకు అనుకూలం కాదు. ఇక్కడ వాటికి మానవుల వల్ల వనరుల కొరత ఏర్పడవచ్చు. తక్కువ సంఖ్యలో మాత్రమే అడవి జంతువులు ఇలాంటి ప్రదేశాల్లో జీవిస్తాయి. కానీ చింపాంజీలు ఈ పరిస్థితులకు అలవాటు పడగలవని, అవరోధాల్ని అధిగమించి వాటి సంఖ్యను వృద్ధి చేసుకోగలవని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకులు తెలిపారు. ఉగాండాలోని మానవులు అధికంగా నివసించే ప్రాంతాల్లో వీటి సంఖ్య భారీగా వృద్ధి చెందడమే ఇందుకు నిదర్శనమని వారు అన్నారు. ఉగాండోలోని బుడోంగో, బుగోమాల్లోని అభయారణ్యాల్లో గతంతో పోలిస్తే చింపాంజీల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. పైగా ఈ అభయారణ్యానికి సమీపంలోనే మానవ కార్యకలాపాలు అధికంగా ఉంటాయి. వ్యవసాయ క్షేత్రాలు, మైదానాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి చోట్ల కూడా చింపాంజీల జనాభా పెరగడం పరిశోధకుల్ని ఆశ్చర్యపరిచింది. -
చింపాంజీలకు తప్పొప్పులు తెలుసు
న్యూయార్క్: మనుషులు తాము చేసే పని సరైనదే అయినప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మనుషుల్లాగే చింపాంజీలు కూడా తాము చేసే పని సరైనదైనప్పుడు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. చింపాంజీలను మనుషులకు పూర్వ జీవులుగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తుంటారు. ఒక విషయాన్ని నేర్చుకోవడంలో, తెలుసుకొని అర్థం చేసుకోవడంలో అవి మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి. అలాగే పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునే గుణం కూడా చింపాజీలకు ఉంది. ఏదైనా పరిస్థితుల్లో మనకు ఆ విషయం గురించి అవగాహన ఉంటే ఒకలా, లేకుంటే మరోలా ప్రవర్తిస్తాం. మనకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో స్పందిస్తాం. మనకు ఎంత తెలుసు అనేదాన్ని బట్టే మన ఆత్మవిశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి మానసిక స్థితే జంతువుల్లో కూడా ఉంటుందా అనే అంశంపై జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం సాగించారు. చింపాంజీలపై వీరు సాగించిన అధ్యయనంలో అవి కూడా మనుషుల్లాగే స్పందిస్తాయని రుజువైంది. ఈ అధ్యయనంలో చింపాంజీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో సమాధానం ఇవ్వగానే వాటికి ఆహారాన్ని వేరే చోట ఏర్పాటు చేసినట్లు కంప్యూటర్లో తెలిపేవారు. కానీ సరైన సమాధానం చెప్పినప్పుడు మాత్రమే వాటికి అక్కడ ఆహారాన్ని అందించేవారు. సమాధానం చెప్పిన వెంటనే చింపాంజీలు ఆహారాన్ని తీసుకోవడానికి వెళ్లేవి. కానీ సరైన సమాధానం చెప్పినప్పుడు ఆహారాన్ని తీసుకునేందుకు త్వరగా వెళ్లగా, సమాధానం తప్పుగా చెప్పినప్పుడు మెల్లగా వెళ్లేవి. సమాధానం సరైనదని అనిపించినప్పుడు అవి పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించాయి. దీన్ని బట్టి అవి కూడా మనుషుల్లాగే తాము చేసేది సరైనదైతే ఆత్మవిశ్వాసంతో ఉంటాయని రుజువైంది. -
చింపాంజీలు కూడా వంట చేస్తాయట...
సాక్షి: ఈ భూమ్మీద మానవుల్తో దగ్గరి పోలికలు కలిగిన జీవి చింపాజీ. ఇవి మనుషులు చేయగలిగిన అనేక పనులను నిర్వహించే సామర్థ్యం కలిగి ఉన్నట్లు అనేక పరిశోధనల్లో రుజువైంది. చింపాంజీల మీద ఈ విషయమై పలు పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చింపాంజీల సామర్థ్యం గురించి మరో విషయం బయటపడింది. ది రాయల్ సొసైటీకి చెందిన పరిశోధకులు వెల్లడించిన నివేదిక ప్రకారం చింపాంజీలు కూడా మనుషుల్లాగే వంట చేయగలవట. వాటికి వండటం నేర్పిస్తే అవి నేర్చుకోగలవని ఆ అధ్యయనం వెల్లడించింది. అన్ని చింపాంజీలు వంట చేయలేకపోయినా కనీసం మైక్రోవేవ్‌ని వాడగలిగే శక్తి మాత్రం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆహార పదార్థాల్ని వండి తినగలిగే ఏకైక లక్షణం మానవులకు మాత్రమే ఉంది. కానీ చింపాంజీల్లో ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు వాటికి కొన్ని పరీక్షలు నిర్వహించారు. వండిన ఆహార పదార్థాలు తినడం వాటికి అలవాటు చేశారు. దీని వల్ల పచ్చి ఆహారం కన్నా వీటికే అవి ఎక్కువగా అలవాటు పడిపోయాయి. చివరికి వాటికి మెల్లగా వండడం నేర్పించారు. వండిన ఆహారాన్ని తినడానికి అలవాటు పడిన చింపాంజీలు సొంతంగా వండుకునే పరిస్థితుల్ని కలిగించారు. దీంతో అవి కనీసం మంటల్లో ఆహారాన్ని వేడి చేసి తినగలిగే స్థితికి చేరుకున్నాయి. మైక్రోవేవ్ లాంటి పరికరాన్ని చింపాంజీలకు ఇచ్చారు. దీనికోసం ‘చింపాంజీ మైక్రోవేవ్’ అనే పరికరాన్ని వారు రూపొందించారు. ఇందులో అవి ఆహారాన్ని ఉంచి, అది వేడెక్కిన తర్వాతే తినడం మొదలెట్టాయి. దీన్ని బట్టి చింపాంజీలకు కూడా వంట చేసి తినగలిగే సామర్థ్యం ఉన్నట్లు తేలిందని పరిశోధకులు తెలిపారు.