
కారును కడుగుతున్న చింపాంజీలు
సొంత పనులు చేసుకోవడానికి కూడా తెగ బద్దకిస్తుంటారు కొంతమంది. ఐతే ఈ వీడియోలో కనిపించే చింపాంజీలు మాత్రం ఒళ్లొంచి ఎలా పనిచేస్తున్నాయో చూడండి. ఎవరప్పగించారోగానీ కారును నీళ్లతో శుభ్రంగా కడిగేస్తున్నాయి. జంతువులను చూసి పనులు ఎలా శ్రద్ధగా చేయాలో నేర్చుకోవాలనే విధంగా ఉంది వీటి పనితనం. మీరు ఓ లుక్కెయ్యండి!
రెండు చింపాంజీలు బ్లాక్ కారుపై ఎక్కి కూర్చుని మరీ గ్లాస్‌ను నీట్‌గా రుద్ది రుద్ది కడగటం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఎంతో ప్రొఫెషనల్ క్లీనర్స్‌లా చేతితో క్లాత్ పట్టుకుని దర్జాగా కారును శుభ్రం చేస్తున్నాయి. ఇంతవరకూ మనుషులు మాత్రమే కార్లను క్లీన్ చేయడం చూశారు. ఇలా చింపాంజీలు కారును శుభ్రంచేయడం ఎప్పుడైనా చూశారా?
ఐతే చింపాజీలు మనుషులను అనుకరించగలిగే తెలివైన జంతువులనే విషయం మనందరికీ తెలుసు! పిల్లలతో ఆటలాడే, మనుషులు ఉతికినట్టే బట్టలుతికే వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో పలుమార్లు వైరలయ్యాయి. ఇప్పుడు కారు కడిగే చింపాజీల వీడియో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. లక్షల వీక్షణలు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ఫ్రీ కార్ వాషింగ్ అని, ఇంటిలో అత్యంత ప్రమాదకరమైన జంతువని కొంతమంది సరదాగా ఈ వీడియోకు కామెంట్లు జోడించారు. మీరేమంటారు..
చదవండి: ఈ అంబులెన్స్ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు! కంగారులో..
Comments
Please login to add a commentAdd a comment