
ప్రమాదం అని తెలిసినా కావాలనే కొంతమంది తమ పిచ్చి చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఓ డైలాగ్ ఇందుకు సరిగ్గా సరిపోతుంది. ‘పులిని చూడలంటే చూస్కో.. దానితో ఫొటో దిగాలనిపించిందనుకో కొంచె రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు..సరే చనివిచ్చిందకదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది’ ఈ డైలాగ్‌లో పులి ప్లేస్‌లో సింహాన్ని రీప్లేస్ చేస్తే అచ్చం ఇలాగే ఉంటుందేమో.. అసలేం జరిగిందంటే..
ఓ జూలో రెండు సింహాలను బంధించి ఉండగా.. వాటిని చూసేందుకు సందర్శకులు చుట్టుముడతారు. వారిలో ఓ వ్యక్తి బోనులోకి చేయి పెట్టి సింహాన్ని మచ్చిక చేస్తున్నట్లు ప్రయత్నించాడు. కానీ ఆ సింహం స్పందించకుండా అలాగే ప్రశాంతంగా ఉంటుంది. అతనిని గమనించిన పక్కనున్న వ్యక్తి బోనులోని మరో సింహం తలపై చేయి పెట్టాయి. దీంతో ఆగ్రహం చెందిన సింహం హఠాత్తుగా అతని చేతిని నోటిలోకి లాక్కుటుంది..
సింహం ఊహించని చర్యతో అక్కడున్న వారంతా షాక్‌కు గరయ్యారు. సింహం చేతిని కరవడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. సింహం బారి నుంచి చేతిని విడిపించుకోవడానికి ముప్పు తిప్పలు పడ్డాడు. సింహానికి భయపడి అక్కడున్న వారు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. అయితే భయం, బాధతో గట్టిగా అరవడంతో కాసేపటికి సింహం అతని చేతిని వదిలేసింది. దీంతో భయంతో అక్కడున్న వారంతా దాని నుంచి దూరంగా పారిపోయారు.
Fook around............. pic.twitter.com/N8ETVsXQJr
— Vicious Videos (@ViciousVideos) December 26, 2022
15 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ట్విటర్‌లోషేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. బోనులో ఉన్నా సింహం సింహమే.. ఇలాంటి తుంటరి పనులు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. అంటూ కామెట్లు చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడూ జరిగిందో తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment