బ్రహ్మపుత్ర నది మీదుగా ఈదుకుంటూ వస్తోంది ఒక రాయల్ బెంగాల్ టెంగర్. అది గౌహతిలో పేరుగాంచిన ఉమానంద ఆలయానికి సమీపంలోని రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉంది. ఆ పులిని చూసిన ఆ ఆలయ భక్తులు, పూజారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బహుశా ఈ పులి సమీపంలోని ద్వీపకల్పం వద్ద ఉన్న ఒరంగా నేషనల్ పార్క్ నుంచి తప్పిపోయి ఉండవచ్చని భావించారు.
బహుశా నీళ్లు తాగడానికి వచ్చి బహ్మపుత్ర నది ప్రవాహానికి కొట్టుకోపోయి ఉండవచ్చని అనుమానించారు అధికారులు. ఈమేరకు ఆ పులిని రక్షించేందుకు జాతీయ విపత్తు బృందం, అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ఐతే ఆపులిని కాపాడటం అటవీ శాఖ రెస్క్యూ టీంకి, జాతీయ విపత్తు బృందానికి అత్యంత క్లిష్టమైన టాస్క్‌గా అనిపించింది. ఎందుకంటే ఆ పులిని కాపాడాలంటే ముందు అది ప్రశాంతంగా ఉండాలి. అదీగాక ఒకవేళ ఆ రెస్క్యూ టీం ఆపరేషన్ ఫెలయితే ఆ పులి నీటిలో మునిగిపోతుంది లేదా ఆ పులి ఆ రెస్క్యూ బృందంపై ఎటాక్ చేసే ప్రమాదము ఉంది.
దీంతో రెస్య్కూ టీంకి ఆ పులిని రక్షించడం సుమారు 10 గంటలు పైనే పట్టింది. మొదటగా రెస్క్యూ టీం బోట్లతో ఆ పులి ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అది సహకరిస్తుంది అని నిర్ధారించుకున్నాక దాన్ని రక్షించి బోనులో ఉంచారు. ఈ పులిని రక్షించేంతవరకు ఆ ఆలయాన్ని మూసివేయడమే గాక సమీపంలోని దుకాణాలను సైతం మూసేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
A full grown Royal Bengal tiger is found swimming in middle of Brahmaputra River in Guwahati. Tiger is now taking shelter in a rock gap in Umananda Temple in middle of the river. To my surprise, if he came swimming from Kaziranga in Assam, then he has crossed 160 km! 🐯 🐅 pic.twitter.com/OhwIkq5T9H
— Inpatient Unit Khanapara (@Inpatient_Unit) December 20, 2022
(చదవండి: ఘోరంగా పెరుగుతున్న కేసులు..వైద్యం అందించలేక కుప్పకూలిన డాక్టర్)
Comments
Please login to add a commentAdd a comment