Royal Bengal Tiger
-
బ్రహ్మపుత్ర నదిలో ఈత కొడుతూ వస్తున్న పులి..షాక్‌లో ప్రజలు
బ్రహ్మపుత్ర నది మీదుగా ఈదుకుంటూ వస్తోంది ఒక రాయల్ బెంగాల్ టెంగర్. అది గౌహతిలో పేరుగాంచిన ఉమానంద ఆలయానికి సమీపంలోని రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉంది. ఆ పులిని చూసిన ఆ ఆలయ భక్తులు, పూజారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బహుశా ఈ పులి సమీపంలోని ద్వీపకల్పం వద్ద ఉన్న ఒరంగా నేషనల్ పార్క్ నుంచి తప్పిపోయి ఉండవచ్చని భావించారు. బహుశా నీళ్లు తాగడానికి వచ్చి బహ్మపుత్ర నది ప్రవాహానికి కొట్టుకోపోయి ఉండవచ్చని అనుమానించారు అధికారులు. ఈమేరకు ఆ పులిని రక్షించేందుకు జాతీయ విపత్తు బృందం, అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ఐతే ఆపులిని కాపాడటం అటవీ శాఖ రెస్క్యూ టీంకి, జాతీయ విపత్తు బృందానికి అత్యంత క్లిష్టమైన టాస్క్‌గా అనిపించింది. ఎందుకంటే ఆ పులిని కాపాడాలంటే ముందు అది ప్రశాంతంగా ఉండాలి. అదీగాక ఒకవేళ ఆ రెస్క్యూ టీం ఆపరేషన్ ఫెలయితే ఆ పులి నీటిలో మునిగిపోతుంది లేదా ఆ పులి ఆ రెస్క్యూ బృందంపై ఎటాక్ చేసే ప్రమాదము ఉంది. దీంతో రెస్య్కూ టీంకి ఆ పులిని రక్షించడం సుమారు 10 గంటలు పైనే పట్టింది. మొదటగా రెస్క్యూ టీం బోట్లతో ఆ పులి ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అది సహకరిస్తుంది అని నిర్ధారించుకున్నాక దాన్ని రక్షించి బోనులో ఉంచారు. ఈ పులిని రక్షించేంతవరకు ఆ ఆలయాన్ని మూసివేయడమే గాక సమీపంలోని దుకాణాలను సైతం మూసేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. A full grown Royal Bengal tiger is found swimming in middle of Brahmaputra River in Guwahati. Tiger is now taking shelter in a rock gap in Umananda Temple in middle of the river. To my surprise, if he came swimming from Kaziranga in Assam, then he has crossed 160 km! 🐯 🐅 pic.twitter.com/OhwIkq5T9H — Inpatient Unit Khanapara (@Inpatient_Unit) December 20, 2022 (చదవండి: ఘోరంగా పెరుగుతున్న కేసులు..వైద్యం అందించలేక కుప్పకూలిన డాక్టర్) -
సిటీ హంటర్ చేతిలో మరో మ్యానీటర్ హతం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఏసీ గార్ట్స్ ప్రాంతానికి చెందిన ప్రముఖ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ సుదీర్ఘ విరామం తర్వాత మరో ఆపరేషన్ చేపట్టారు. బీహార్‌లోని వాల్మీకి టైగర్ రిజర్వ్ (వీటీఆర్) ఫారెస్ట్‌లో మ్యానీటర్‌గా మారిన రాయల్ బెంగాల్ టైగర్‌ను శనివారం హతమార్చారు. మూడేళ్ల వయస్సున్న ఈ మగ పులి గడచిన ఆరు నెలల్లో పది మందిని పొట్టన పెట్టుకుంది. గత నెల 27న చేపట్టిన ఆపరేషన్‌లో షఫత్ అలీ ఖాన్ తొలుత ఆ పులికి మత్తు మందు ఇచ్చి పట్టుకోవడానికి ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో పాటు శుక్రవారం తల్లీకుమారుడిని ఆ పులి చంపేయడంతో బీహార్ పోలీసు కమాండోలతో కలిసి దాన్ని కాల్చి చంపారు. అలీ ఖాన్‌కు గతంలో దేశ వ్యాప్తంగా ఎన్నో మ్యానీటర్లు, మదగజాలను చంపిన, బంధించిన రికార్డు ఉంది. ఈ పులితో కలిపి ఇప్పటి వరకు ఆయన మొత్తం 17 మ్యానీటర్లను చంపారు. కొన్ని ఆపరేషన్స్‌లో ఆయన కుమారుడు అస్ఘర్ అలీ ఖాన్ సైతం పాల్గొన్నారు. ► వీటీఆర్ అడవిలో ఓ రాయల్ బెంగాల్ టైగర్ ఆరు నెలల క్రితం మ్యానీటర్‌గా మారింది. దీని బారినపడి గత నెల ఆఖరి వారం వరకు ఆరుగురు చనిపోగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ పులిని బంధించడానికి బీహార్ అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వాళ్లు తమకు సహకరించాల్సిందిగా షఫత్ అలీ ఖాన్‌ను కోరారు. ► బీహార్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ ప్రభాత్ కుమార్ ఆహ్వానం మేరకు అలీ ఖాన్ గత నెల 27న అక్కడికి వెళ్లి ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం వీటీఆర్ ఫారెస్ట్‌లో మొత్తం 40 పులులు, 9 కూనలు ఉన్నాయి. దీంతో ఆ అడవి వాటికి ఇరుకుగా మారి అనేక ఆడ పులులు బయటకు వస్తున్నాయి. సమీపంలోని మాస నది ఒడ్డున ఉన్న చెరుకు పొలాల్లో పిల్లలను కంటున్నాయి. ఇలాంటి వాటిలో కొన్ని కూనలు తిరిగి అడవిలోకి వెళ్లకుండా పొలాలు, ఊర్ల సమీపంలో తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడేళ్ల వయస్సున్న ఓ మగ పులి ఆరు నెలల క్రితం అనుకోకుండా పొలాల్లోకి వచ్చిన ఓ యువకుడిని చంపింది. అప్పటి నుంచి మ్యానీటర్‌గా మారి అవకాశం దొరికినప్పుడల్లా గ్రామస్తులపై దాడి చేసి హతమారుస్తోంది. శుక్రవారం ఉదయం వరకు కలిపి మొత్తం పది మందిని చంపేయడంతో పాటు మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచింది. గత నెల ఆఖరి వారంలో రంగంలోకి దిగిన షఫత్ అలీ ఖాన్ ఆ పులికి మత్తు మందు ఇచ్చి పట్టుకోవడానికి, సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ల వదలడానికి ఈ ఆపరేషన్ చేపట్టారు. దీనికోసం పట్నా జూకు చెందిన బృందంతో కలిసి పని చేసినా ఫలితం దక్కలేదని, ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం షఫత్ అలీ ఖాన్‌తో కలిసి బీహార్ పోలీసుల కమాండోలు దాన్ని హతమార్చారు అని అక్కడి అటవీ శాఖ ప్రకటించింది. చదవండి: టప్పాఖానాలకు కొత్త రూపు -
రెండోసారి కెమెరాకు చిక్కిన రాయల్ బెంగాల్ టైగర్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : నాలుగు నెలల్లో రెండోసారి రాయల్ బెంగాల్ టైగర్ (పెద్దపులి) అటవీశాఖ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కింది. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలోని పులిగొమ్మి గ్రామ శివారులోని తోటలో ఆదివారం ఆవును చంపేసింది. ఆ కళేబరం వద్ద అటవీశాఖ అధికారులు నాలుగు సీసీ కెమెరాలను అమర్చారు. మిగిలిన కళేబరాన్ని తీసుకెళ్లేందుకు సోమవారం రాత్రి ఆ ప్రాంతానికి పెద్దపులి వచ్చిన దృశ్యాలను కెమెరాలు చిత్రీకరించాయి. ఆ చిత్రాల విశ్లేషణ కోసం గుంటూరులోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్కు పంపించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌వో) శంబంగి వెంకటేష్ చెప్పారు. ప్రాథమిక పరిశీలన మేరకు అది మగ పులి అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. గత 4 నెలల కాలంలో కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల ఆనవాళ్లు కనిపించిన పులి ఇదేనని ఒక అంచనాకు వచ్చారు. మరో ఆవు హతం... విజయనగరం జిల్లా బొబ్బిలి ఫారెస్టు రేంజ్ పరిధిలోని బొబ్బిలి–బాడంగి మండలం సరిహద్దులోని హరిజన పాల్తేరు గ్రామ సమీపంలో బుధవారం అర్ధరాత్రి మరో ఆవుపై పెద్దపులి దాడి చేసింది. దాన్ని చంపేసి కళేబరాన్ని సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లింది. మిగిలిన కళేబరాన్ని గురువారం ఉదయం గుర్తించిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు.. ఆ ఆనవాళ్లను బట్టి ఉత్తర దిక్కుగా బొబ్బిలి మండలంలోని అలజంగి, పిరిడి గ్రామాల వైపు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. (క్లిక్: అక్కా.. తమ్ముడు.. ఓ స్కూటర్) -
Viral: ఏరా పులి.. వాడి కంటే వరస్ట్‌గా ఉన్నావ్!
Tiger Viral Video: లైఫ్ ఆఫ్ పై సినిమా గుర్తుందా? ఓ పులితో పాటు యువకుడు పడవలో సాగించే ప్రయాణమే ఈ చిత్ర కథ. ఆ సినిమా క్లైమాక్స్‌లో ప్రధాన పాత్రదారి దేవ్‌పటేల్‌తో పాటు పడవలో ప్రయాణించిన పెద్దపులి.. చివరికి అతన్ని వీడి వెళ్లే దృశ్యం భావోద్వేగమైన ముగింపు కథకు ఇస్తుంది. అలాంటి అనుభూతి పంచే దృశ్యం ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వీడెవడో రిచర్డ్ పార్కర్(లైఫ్ ఆఫ్ పైలో పులి పాత్ర పేరు) కన్నా వరెస్ట్‌గా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ఫన్ జనరేట్ అవుతోంది. ఓ రాయల్ బెంగాల్ టైగర్‌ను కాపాడిన అధికారులు.. దానిని సుందర్బన్స్(సుందరవనాలలో)లో విడిచిపెట్టారు. బోట్లో నుంచి బోన్ ద్వారా దానిని విడిచిపెట్టగా.. అమాంతం ఒక్క దూటున నీళ్లలో దూకేసి ఈదుకుంటూ వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్లిపోయింది. That tiger sized jump though. Old video of rescue & release of tiger from Sundarbans. pic.twitter.com/u6ls2NW7H3 — Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 17, 2022 ఇది లైఫ్ ఆఫ్ పై క్లైమాక్స్‌తో పోలుస్తూ పలువురు సరదా కామెంట్లు చేస్తున్నారు. పులి రెస్క్యూ వీడియో పాతదే అయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఎక్కువగా వీడియోలు షేర్ చేసే ప్రవీణ్‌కుమార్ కాస్వాన్ ఐఎఫ్ఎస్ తాజాగా ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఇలా సరదా సంభాషణ సాగుతోంది. కానీ, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పులి అలా నీళ్లలో దూకినప్పుడు.. ఈదుకుంటూ వెళ్లినప్పుడు మాత్రం దాని రాజసం మాత్రం వేరే లెవల్లో ఉంది!. -
పెద్దపులి దత్తతకు రూ.5 లక్షల చెక్
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని రాయల్ బెంగాల్ టైగర్‌ను ఆరిజన్ ఫార్మా స్యూటికల్ సర్వీసు సీఈఓ రవి వెంకటరమణ సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు. శనివారం జూ పార్కుకు వచ్చిన ఆయన రాయల్ బెంగాల్ టైగర్ (ప్రభాస్)ను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి దాని పోషణకు అయ్యే ఖర్చు నిమిత్తం రూ.5 లక్షల చెక్‌ను డిప్యూటీ క్యూరేటర్ నాగమణికి అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ క్యూరేటర్ మాట్లాడుతూ... కార్పొరేట్ సంస్థలు వన్యప్రాణుల దత్తతకు ముందుకు రావాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో ఆరిజన్ ఫార్మా సర్వీసు కంపెనీ ప్రతినిధులు దీపక్ రాజ్, జూపార్కు బయోలజిస్ట్ సందీప్, పీఆర్ఓ హనీఫుల్లా పాల్గొన్నారు. (రాయల్ బెంగాల్ టైగర్ కదంబ మృతి) చెక్‌ను అందజేస్తున్న ఆరిజన్ ఫార్మా సూటికల్ సర్వీసు సీఈఓ -
గుండెపోటుతో రాయల్ బెంగాల్ టైగర్ మృతి
-
గుండెపోటుతో ‘కదంబ’ మృతి
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో రాయల్ బెంగాల్ టైగర్ కదంబా (11) గుండె సంబంధ వ్యాధితో బాధపడుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ప్రాథమిక నివేదికల ప్రకారం గుండె పనితీరు ఫెయిలవడం, రక్తం గడ్డ కట్టడం మృతికి కారణంగా అధికారులు పేర్కొన్నారు. రాజేంద్రనగర్ వెటర్నరీ సైన్స్ కాలేజీ ఫ్యాథలాజీ విభాగం అధిపతి డాక్టర్ ప్రొఫెసర్ లక్ష్మణ్, వీబీఆర్ఐ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ దేవేందర్, వీబీఆర్ఐ వైద్యులు డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి, అత్తాపూర్ సీసీఎంబీ ల్యాంకోన్స్ సీనియర్ ప్రిన్సిపాల్ శాస్త్రవేత్త సదానంద్ సోన్‌టాకే, జూపార్కు వెటర్నరీ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్, జూపార్కు వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఎ.హకీం పులి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇందుకు సంబందించిన నమునాలను రాజేంద్రనగర్ వెటర్నరీ సైన్స్ కాలేజీ, ల్యాంకోన్స్ సీసీఎంబీ, వీబీఆర్‌ఐకు పంపినట్లు తెలిపారు. వారం రోజులుగా అస్వస్థతకు గురైన ‘కదంబా ఆహారం తీసుకోవడం లేదని జూ క్యూరేటర్ క్షితిజా తెలిపారు. జూ వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో కదంబాకు చికిత్స అందించారు. అయితే శనివారం గుండె పనితీరు పూర్తిగా క్షీణించడంతో రాత్రి 9.20 గంటలకు మృతి చెందిందన్నారు. ప్రస్తుతం జూపార్కులో 11 ఎల్లో టైగర్లు ఉన్నాయని, ఇందులో మూడు పులులు 19–21 ఏళ్ల వయస్సు గలవని ఆమె తెలిపారు. హడలెత్తించిన ‘కదంబా’ కర్ణాటక జూలాజికల్ పార్కు నుంచి 2014 మార్చి 6న వన్యప్రాణి జంతువు మార్పిడిలో భాగంగా ‘కదంబా’ను జూపార్కుకు తీసుకువచ్చారు. అప్పటి నుంచి జూపార్కులో ఉన్న కదంబాను 2015 ఆగస్టు 21న సంతానోత్పత్తి కోసం జూలో ఉన్న రాణి పులితో కలిపేందుకు ప్రయత్నం చేశారు. 10 అడుగుల ఎత్తున్న ఓపెన్ ఎన్‌క్లోజర్‌లో ఉంచి వాటిని కలిపేందుకు ప్రయత్నం చేస్తుండగా ‘కదంబా’ ఎన్క్లోజర్ను దూకి బయటికి వచ్చింది. దీంతో అక్కడే ఉన్న యానిమల్ కీపర్లు, జూ వైద్యులు, అధికారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. దాదాపుగా 2 గంటల పాటు అటు ఇటు తిరిగి హల్చల్ చేసిన కదంబాను ఎట్టకేలకు ఎన్‌క్లోజర్‌లో బం«ధించారు. ఇందుకు జూ అసిస్టెంట్ క్యూరేటర్ మక్సూద్ వైఫల్యమే కారణమని భావించి అప్పట్లో అతడిని బదిలీ చేశారు. ఎన్‌క్లోజర్ నుంచి బయటికి వచ్చినా ఎవరికి హాని చేయకపోవడం గమనార్హం. అయితే 11 ఏళ్ల వయస్సులోనే ‘కదంబా’ గుండె వ్యాధితో మృతి చెందడం బాధాకరం. కొనసాగుతున్న వన్యప్రాణుల మృత్యువాత 2016 నుంచి జూలో వరుసగా చిన్న వయస్సులోనే పులులు, సింహాలు, అడవిదున్నలు, ఐనాలు, నామాల కోతులు, నీటి కుక్కలు (ముంగిసలు), సంవత్సరం వయస్సున్న పులి సైతం మృతి చెందాయి. ప్రాథమిక నివేదికల ఆధారంగా కదంబా మృతి చెందిందని చెబుతున్న జూ అధికారులు... అంతకు ముందు మృతి చెందిన వన్యప్రాణులు ఫలానా వాటితో మృతి చెందాయని తెలిపారే తప్పా... సేకరించిన నమునాల నివేదికలను ఇప్పటి వరకు వెల్లడించకపోవడం గమనార్హం. -
కిరణ్ మరణం
బహదూర్‌పురా: రాయల్ బెంగాల్ వైట్ టైగర్ (కిరణ్– 8) కుడివైపు దవడ భాగంలో ఏర్పడిన న్యూయో ప్లాస్టిక్ కణితితో బాధపడుతూ గురువారం మృతి చెందింది. నెహ్రూ జూలాజికల్ పార్కు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్కులో పుట్టి పెరిగిన కిరణ్ (టైగర్) కొంతకాలంగా న్యూయో ప్లాస్టిక్ ట్యూమర్‌తో బాధపడుతోంది. దీనికి కొన్నిరోజులుగా ల్యాంకోన్స్ శాస్త్రవేత్తలు, వైద్యులు, జూపార్కు వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. గత నెల 29న టైగర్‌కు డాక్టర్ నవీన్, వీబీఆర్ఐ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మృతి చెందిన వైట్ టైగర్‌కు వెటర్నరీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు. కిరణ్ తండ్రి బద్రి కూడా న్యూయో ప్లాస్టిక్ కణితితోనే బాధపడుతూ కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. కిరణ్ (టైగర్) తాత రుద్ర (టైగర్) 12 ఏళ్ల వయసులో ఇదే వ్యాధితో మృతి చెందింది. కిరణ్ కూడా న్యూయో ప్లాస్టిక్ వ్యాధితో మృతి చెందడంతో వైద్యులు శాంపిళ్లు సేకరించారు. జూపార్కుకే వన్నె తెచ్చే రాయల్ బెంగాల్ టైగర్లు ట్యూమర్ వ్యాధితో మృతిచెందుతుడటం ఆందోళనకు గురి చేస్తోంది. -
విశాఖ జూకి రాయల్ బెంగాల్ టైగర్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ జూ లోకి రాయల్ బెంగాల్ టైగర్ ప్రవేశించింది. బిలాస్పూర్ జూ నుంచి ఆడ రాయల్ బెంగాల్ టైగర్ రైలులో గురువారం విశాఖ జూ కి చేరుకుంది. అనంతరం జూ క్యూరేటర్ యశోద బాయి పులిని పరిశీలించారు. ఏడాది వయస్సున్న ఆడ పులికి జూ అధికారులు దుర్గగా నామకరణం చేశారు. ఆడపులికి విశాఖ జూ పూర్తిగా కొత్తది కావటంతో అలవాటు పడటానికి ప్రత్యేక రక్షణలో ఉంచారు. ఆడ పులిని పంపినందుకు బదులుగా రెండు జతల నక్షత్ర తాబేళ్లను విశాఖ జూ అధికారులు బిలాస్పూర్ జూకు పంపారు. -
దర్జాగా పరుపుపై నిద్రపోయిన పులి...
గువాహటి : అసోంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద బీభత్సానికి మనుషులే కాదు పశుపక్ష్యాదులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో కజిరంగా జాతీయ పార్కులోని ఓ రాయల్ బెంగాల్ టైగర్ రోడ్డుపైకి వచ్చి పరుగులు తీసింది. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న మోతీలాల్ అనే వ్యక్తి షాపులో చొరబడి దర్జాగా పరుపుపై నిద్రపోయింది. ఈ క్రమంలో అతడు అటవీ అధికారులను ఆశ్రయించగా ప్రస్తుతం వారు పులిని తిరిగి పార్కులోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ఘటన కజిరంగాలో చోటుచేసుకుంది. తనకు ఎదురైన భయానక అనుభవం గురించి షాపు మోతీలాల్ మాట్లాడుతూ...‘ గురువారం పొద్దున నేను షాపులో కూర్చుని ఉన్నాను. పులి వస్తోందంటూ అరుపులు, కేకలు వినిపించాయి. బయటికొచ్చే చూసే సరికి దాదాపు 20 అడుగుల దూరంలో నా ముందు పులి నిల్చొని ఉంది. ఒక్కసారిగా భయం వేసింది. కానీ అది నన్నేమీ అనకుండా నేరుగా షాపులోకి వెళ్లి అక్కడున్న పరుపుపై నిద్రపోయింది. పాపం అది బాగా అలసిపోయినట్టుంది. మనిషి ప్రాణానికి ఎంత విలువ ఉంటుందో పులి ప్రాణం కూడా అంతే గొప్పది. అందుకే షాపు మొత్తం దానికే వదిలేశాను. అటవీ అధికారులు దానిని బయటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. ఇక ఎవరికీ హాని చేయకుండా పులిని అక్కడి నుంచి సురక్షితంగా తరలించనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. -
మహారాష్ట్ర గ్యాంగ్ వేటలో పోలీసులు
సాక్షి,పెద్దపల్లి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాయల్ బెంగాల్ టైగర్ (పెద్దపులి) మృతి, అనంతర దందాపై పోలీస్ విచారణ తుది దశకు చేరుకుంటోంది. పులి మృతి, అక్రమ దందాలపై ‘సాక్షి’లో వరుస కథనాలకు స్పందించిన ప్రభుత్వం.. కేసును అటవీశాఖ నుంచి రామగుండం పోలీసు కమిషనరేట్‌కు బదిలీ చేసింది. కమిషనర్ సత్యనారాయణ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. రైతులు పెట్టిన విద్యుత్ తీగలకు తగిలి పెద్దపులి మృతి చెందడం.. ఆ తరువాత చర్మం, గోళ్లతో వ్యాపారం చేసే ప్రయత్నం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పులి వేట నిరో ధక సంస్థ పేరుతో ఏర్పాటు చేసిన ఓ స్వచ్ఛంద సంస్థనే ఈ ‘ఆపరేషన్ టైగర్ స్కిన్’కు సూత్రధారి అని పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. స్వచ్ఛంద సంస్థ పేరిట సంవత్సరాలుగా నిందితులు సాగిస్తున్న అక్రమ దందాల సమాచారం పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం గ్రామ సమీపంలోని అడవుల్లో జనవరిలో రాయల్ బెంగాల్ టైగర్ మృతి వెలుగు చూసింది. రైతులు పెట్టిన విద్యుత్ తీగలకు తగిలి ఈ పులి మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సంబంధిత రైతులను అరెస్ట్ కూడా చేశారు. పులి మృతి చెందిన తరువాతే అసలు కథ మొదలు కాగా, ఆ వ్యవహారంపై పోలీసులు కూపీ లాగారు. పులి వేట నిరోధక సంస్థ పేరుతో అటవీ అధికారులను బురిడీ కొట్టించిన గ్యాంగ్ కోసం పోలీసుల విచారణ పూర్తి కావొచ్చినట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాయే కాకుండా ఐదారు రాష్ట్రాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు విచారణలో తెలిసింది. అటవీశాఖ అధికారులతో సబంధాలు పెంచుకునేందుకు, అక్రమ దందాపై అనుమానం రాకుండే ఉండేందుకే పులుల వేట నిరోధక సంస్థ ముసుగు వేసుకున్నట్లు దర్యాప్తులో నిర్ధారణ అయినట్లు సమాచారం. వన్యప్రాణుల చర్మాలు, విలువైన కొమ్ము లు, పులిగోళ్లు లాంటివి కొనుగోలు చేస్తామని చెప్పి అటవీ సమీప ప్రాంతాల్లో తిరు గుతూ.. ఒకవేళ బేరం గిట్టకపోతే అటవీశాఖ, పోలీసులకు పట్టిస్తూ రెండు పాత్రలు పోషిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో టైగర్ హంటింగ్ ఎండ్ కార్యకలాపాలు విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు. రెండేళ్ల క్రితమే రిజిస్ట్రేషన్ టైగర్ హంటింగ్ ఎండ్ సంస్థ రెండేళ్ల క్రితమే రిజిస్ట్రేన్ చేయించుకున్నట్లు తెలిసింది. కానీ, దాదాపు 12 ఏళ్లుగా ఈ గ్యాంగ్ ఇదే పనిలో నిమగ్నమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మహారాష్ట్రలో ఉంటున్న గ్యాంగ్‌పై పోలీసులు ఉచ్చు బిగించినట్లు సమాచారం. అయితే ఈ సంస్థ పులుల వేటను నిరోధిస్తుందా, ఆ ముసుగులో వన్యప్రాణుల మరణాలను ప్రోత్సహిస్తోందా..అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోయిన వన్యప్రాణుల విలువైన చర్మాలను కొనుగోలు నెపంతో రూ.లక్షలు వసూలు చేసుకుని పరారైనట్లుగా మొన్నటి సంఘటనతో పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. -
సరిహద్దులో రాయల్ బెంగాల్ టైగర్
రాయగడ: ఒడిశాలోని రాయగడ–కొరాపుట్, నవరంగ్‌పూర్, కలహండి, గజపతి, జిల్లాలకు సంబంధించిన అడవికి రాయల్‌బెంగాల్ అభయారణ్యంగా గుర్తింపు ఉండేది. గత 50సంవత్సరాలుగా ఈ అడవుల్లో పులుల అక్రమ రవాణా ముఠా, వేటగాళ్ల వల్ల పులుల సంతతి సంపూర్ణంగా అంతరించిపోయింది. ప్రసిద్ధి చెందిన రాయల్‌బెంగాల్ టైగర్ వంశం 10సంవత్సరాల క్రితం అంతరించిపోయినట్లు అటవీశాఖ భావించింది. 10సంవత్సరాలలో రాయగడ జిల్లా సరిహద్దుల్లో గానీ, రాయగడ జిల్లా అడవిలో కానీ సాధారణ పులులు తప్ప రాయల్‌బెంగాల్ టైగర్ సంతతి ఉన్నట్లు ఏ సర్వేలో కూడా తెలియరాలేదు. కానీ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రాయగడ, కలహండి జిల్లా సరిహద్దుల్లో రైలు పట్టాలపై రాయల్ బెంగాల్ టైగర్ కనిపించినట్లు వాట్సాప్‌ల ద్వారా తెలియవచ్చింది. ఇది తెలిసిన వెంటనే రాయగడ జిల్లా అటవీశాఖ అధికారులు జిల్లా సరిహద్దు అడవిలో రాయల్ బెంగాల్ టైగర్ కాలిముద్రలను గుర్తించేందుకు ప్రత్యేక బృందం బయల్దేరింది. జిల్లా సరిహద్దులో గత 10సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా ప్రజల దృష్టికి రాయల్టైగర్ కనిపించిది. 10సంవత్సరాల క్రితం అటవీశాఖ అధికారులు జంతువుల జనాభా లెక్కల్లో రాయగడ జిల్లా అడవిలో 3పులులు ఉన్నట్లు గుర్తించారు. కానీ అవి ఏ జాతి పులులన్నది తెలియరాలేదు. -
జూలో రాయల్ బెంగాల్ టైగర్ మృతి
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని రాయల్ బెంగాల్ టైగర్ (మున్నీ–23) సోమవారం అనారోగ్యం, వృద్ధాప్యంతో మృతి చెందింది. 1994లో జూలో జన్మించిన ఈ పులి కొంతకాలంగా ఇతర పులులతో జత కట్టి ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది. అడవుల జీవిత కాలం 18 ఏళ్లు కాగా మున్నీ 23 ఏళ్లు జీవించిందని జూ అధికారులు తెలిపారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతూ కొంతకాలంగా జూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతి చెందిన మున్నీకి మంగళవారం జూ వెటర్నరీ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించినట్లు జూపార్కు క్యూరేటర్ శివానీ డోగ్రా తెలిపారు. -
మున్నాగారి పేరు మొహం మీదే ఉంది..
మధ్యప్రదేశ్: చిత్రంలోని రాయల్ బెంగాల్ టైగర్ పేరు మున్నా.. దాని మొహం మీద చూడండి. ఏమని ఉందో? క్యాట్ అని.. పులులు, సింహాలు, చిరుతలు బిగ్ క్యాట్ జాబితాలోకి వస్తాయి. ఈ పులి మొహం మీద ఉండే చారలు ఇలా క్యాట్ అనే పేరును సూచిస్తుండటంతో ఇదో సెలబ్రిటీగా మారిపోయింది. మధ్యప్రదేశ్‌లోని కన్హా జాతీయ పార్కులో ఉండే మున్నాను క్లిక్‌మనిపించడానికి పర్యాటకులు పోటీ పడుతుంటారు. -
అమ్మో.. పెద్ద పులి
-
అమ్మో.. పెద్ద పులి
ఎన్‌క్లోజర్ నుంచి బయటకు దూకిన రాయల్ బెంగాల్ టైగర్ హైదరాబాద్: బోనులో బుద్దిగా ఉండాల్సిన ఓ పెద్ద పులికి ఏమైందో ఏమో... 10 అడుగుల ఎన్‌క్లోజర్ పైనుంచి దూకేసి ఒక్కసారిగా బయటకు వచ్చింది. జూ పార్కులో కలియతిరుగుతూ మరో ఎన్‌క్లోజర్ వైపు అడుగులు వేసింది... అప్పుడు ఆ ఎన్‌క్లోజర్‌లో ఇద్దరు సిబ్బంది కూడా ఉన్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. జూ సిబ్బంది సమ్మర్ హౌజ్‌లో ఉన్న రాయల్ బెంగాల్ టైగర్ కదంబా (5) ను సంతానోత్పత్తి కోసం కరీనా అనే ఆడ పులి ఎన్‌క్లోజర్‌లోకి పంపారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో 10 అడుగులు ఉన్న ఆ ఎన్‌క్లోజర్ పైనుంచి కదంబా పులి ఒక్కసారిగా బయటికి దూకింది. అక్కడి నుంచి తనను రోజూ ఉంచే ఎన్‌క్లోజర్ ద్వారం వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఎన్‌క్లోజర్‌లో జూ సిబ్బంది తిలక్, మహేశ్‌లు ఉన్నారు. పులిని చూసిన వెంటనే వారు అప్రమత్తమై లోపలే ఉండి ఎన్‌క్లోజర్‌కు తాళం వేసుకున్నారు. సమాచారాన్ని వెంటనే జూ అధికారులకు తెలియజేశారు. అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా జూ లో ఉన్న సందర్శకులను బయటకు పంపించారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని పులిపై మత్తు మందును ప్రయోగించారు. మత్తులోకి జారుకున్న పులిని వెంటనే పాత ఎన్‌క్లోజర్‌లోకి తీసుకెళ్లారు. అప్పటి వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎన్‌క్లోజర్‌లోనే ఉన్న తిలక్, మహేశ్‌లను బయటికి తీసుకొచ్చారు. అయితే ఎన్‌క్లోజర్ నుంచి బయటకొచ్చిన పులి తన సమీపంలోని మౌస్ డీర్, సరిసృపాల జగత్తు, మొసళ్ల ఎన్క్లోజర్ల వద్ద ఉండే జనాల వైపు వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జంతువుల మార్పిడిలో భాగంగా 2010 లో కదంబా పులిని మైసూర్‌లోని మంగళూర్ జూ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. కదంబా పులితో క్రాసింగ్ చేయిస్తున్న ఎన్క్లోజర్ను ఇటీవల నిర్మించారు. ఈ ఎన్‌క్లోజర్ 10 అడుగులే ఉంది. విశాలమైన స్థలం లేకపోవడంతో క్రాసింగ్‌కు అవకాశం లేని కారణంగా చిర్రెత్తిన పులి ఎన్‌క్లోజర్ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చని జూ సిబ్బంది భావిస్తున్నారు. సంతానోత్పత్తి కోసమే పంపాం: సంతానోత్పత్తి కోసమే కదంబా పులిని మరో ఎన్‌క్లోజర్‌లోకి పంపామని వైల్డ్‌లైఫ్ పీసీసీఎఫ్ పి.కె. శర్మ తెలిపారు. ఎన్‌క్లోజర్ నుంచి పులి బయటికి రావడంపై ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు. సంతానోత్పత్తి కోసం తీసుకొఢచ్చిన పులి బయటికి వచ్చినా.. సిబ్బంది అప్రమత్తమై సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్క్లోజర్ల వద్ద జూ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ సూచిం చారు. పులిని సురక్షితంగా ఎన్‌క్లోజర్‌లోకి తరలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.