రాయల్ బెంగాల్ టైగర్
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని రాయల్ బెంగాల్ టైగర్‌ను ఆరిజన్ ఫార్మా స్యూటికల్ సర్వీసు సీఈఓ రవి వెంకటరమణ సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు. శనివారం జూ పార్కుకు వచ్చిన ఆయన రాయల్ బెంగాల్ టైగర్ (ప్రభాస్)ను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి దాని పోషణకు అయ్యే ఖర్చు నిమిత్తం రూ.5 లక్షల చెక్‌ను డిప్యూటీ క్యూరేటర్ నాగమణికి అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ క్యూరేటర్ మాట్లాడుతూ... కార్పొరేట్ సంస్థలు వన్యప్రాణుల దత్తతకు ముందుకు రావాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో ఆరిజన్ ఫార్మా సర్వీసు కంపెనీ ప్రతినిధులు దీపక్ రాజ్, జూపార్కు బయోలజిస్ట్ సందీప్, పీఆర్‌ఓ హనీఫుల్లా పాల్గొన్నారు.
(రాయల్ బెంగాల్ టైగర్ కదంబ మృతి)
చెక్‌ను అందజేస్తున్న ఆరిజన్ ఫార్మా సూటికల్ సర్వీసు సీఈఓ
Comments
Please login to add a commentAdd a comment