Royal Bengal Tiger Jump Video Reminds Life Of Pie Movie - Sakshi
Sakshi News home page

Tiger Video: బెంగాల్‌ టైగర్‌ రాజసం.. అచ్చం లైఫ్‌ ఆఫ్‌ పై సినిమాల్లోలాగే..

Apr 18 2022 5:13 PM | Updated on Apr 18 2022 6:11 PM

Royal Bengal Tiger Jump Video Reminds Life Of Pie Movie - Sakshi

రాయల్‌ బెంగాల్‌ టైగర్‌.. పేరుకు తగ్గట్లు రాజసం ఉట్టిపడే జీవి. అయితే అచ్చం ఆ సినిమాల్లోలాగే ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

Tiger Viral Video: లైఫ్‌ ఆఫ్‌ పై సినిమా గుర్తుందా? ఓ పులితో పాటు యువకుడు పడవలో సాగించే ప్రయాణమే ఈ చిత్ర కథ. ఆ సినిమా క్లైమాక్స్‌లో ప్రధాన పాత్రదారి దేవ్‌పటేల్‌తో పాటు పడవలో ప్రయాణించిన పెద్దపులి.. చివరికి అతన్ని వీడి వెళ్లే దృశ్యం భావోద్వేగమైన ముగింపు కథకు ఇస్తుంది. అలాంటి అనుభూతి పంచే దృశ్యం ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

వీడెవడో రిచర్డ్‌ పార్కర్‌(లైఫ్‌ ఆఫ్‌ పైలో పులి పాత్ర పేరు) కన్నా వరెస్ట్‌గా ఉన్నాడంటూ సోషల్‌ మీడియాలో ఫన్‌ జనరేట్‌ అవుతోంది. ఓ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ను కాపాడిన అధికారులు.. దానిని సుందర్బన్స్(సుందరవనాలలో)లో విడిచిపెట్టారు. బోట్‌లో నుంచి బోన్‌ ద్వారా దానిని విడిచిపెట్టగా.. అమాంతం ఒక్క దూటున నీళ్లలో దూకేసి ఈదుకుంటూ వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్లిపోయింది. 

ఇది లైఫ్‌ ఆఫ్‌ పై క్లైమాక్స్‌తో పోలుస్తూ పలువురు సరదా కామెంట్లు చేస్తున్నారు. పులి రెస్క్యూ వీడియో పాతదే అయినప్పటికీ..  సోషల్‌ మీడియాలో ఎక్కువగా వీడియోలు షేర్‌ చేసే ప్రవీణ్‌కుమార్‌ కాస్వాన్‌ ఐఎఫ్‌ఎస్‌ తాజాగా ఈ వీడియోను పోస్ట్‌ చేశాడు. దీంతో ఇలా సరదా సంభాషణ సాగుతోంది. కానీ, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పులి అలా నీళ్లలో దూకినప్పుడు.. ఈదుకుంటూ వెళ్లినప్పుడు మాత్రం దాని రాజసం మాత్రం వేరే లెవల్‌లో ఉంది!.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement