ఓ చిన్నారి ఎనిమిదో అంతస్తు కిటికి నుంచి వేలాడుతున్నాడు. ఆ చిన్నారి తల కిటికిలో ఇరుక్కుపోవడంతో అలా వేలాడుతున్నాడు. ఏ క్షణంలో పడిపోతాడో అని నరాలు తెగే ఉత్కంఠ సాగుతుండగా.. అనూహ్యంగా ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కజికిస్తాన్లో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే.. ఓ మూడేళ్ల చిన్నారి అకస్మాత్తుగా ఎనిమిదో అంతస్తు కిటికీ గుండా పడిపోయాడు. ఐతే అతడి తల ఇరుక్కుపోవడంతో అలా వేలాడుతూ ఉన్నాడు. ఆ ఇంటిలోని వారు సైతం ఆ చిన్నారిని గమనించకపోవడంతో.. ఆచిన్నారి అలా చాలా సేపు ఏ చేయాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. ఇంతలో కింద అంతస్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు దీన్ని గమనించారు. ఐతే ఆ కుర్రాడిని రక్షించేందుకు ఏం చేయాలో తొలుత వారికి అర్థం కాలేదు.
ఎందుకంటే ఆ పిల్లాడి తల విండోలో ఇరుక్కుపోయింది. కాబట్టి అతన్ని కిందకి లాగితే ఆ చిన్నారికి ప్రమాదం. కాబట్టి కింద ఏ స్టూలో వేసి సాయం చేసి.. ఆ చిన్నారిలో ఉత్సాహం నింపాలనుకున్నారు. అనుకున్నట్లుగానే రెండు స్టూల్స్‌ని ఆ చిన్నారి కాళ్ల వద్ద ఉంచారు. కానీ ఆ చిన్నారి మాత్రం స్పృహ కోల్పోయాడు. ఎంతసేపు ఆ స్టూల్‌పై కాళ్లు నిలబడకుండా వేలాడిపోతుంటాయి. దీంతో వారు కూడా ఆ భవనంపై స్టూల్స్ పట్టుకుని ఆ చిన్నారి స్పృహలోకి వచ్చేంత వరకు అలా నుంచొని ఉంటారు.
సరిగ్గా ఇంతలో ఆ చిన్నారి పేరెంట్స్ వచ్చి కంగారుపడుతూ, అరుస్తూ.. ఆ చిన్నారిని కిటికి గుండా పైకి లాగే యత్నం చేస్తారు. దీంతో ఆ చిన్నారి స్పృహలోకి వస్తాడు. హమ్మయ్యా! ఆ చిన్నారి బతికే ఉన్నాడనుకుని ఆ ఇద్దరు వ్యక్తులు ఊపిరి పీల్చుకుంటారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరదించుతూ.. ఆ పిల్లాడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ ఇద్దర్ని రియల్ హీరోలు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.
Amazing men🙏
— Tansu YEĞEN (@TansuYegen) April 26, 2023
pic.twitter.com/WOQNoFP8ZB
Comments
Please login to add a commentAdd a comment