బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని రాయల్ బెంగాల్ టైగర్ (మున్నీ–23) సోమవారం అనారోగ్యం, వృద్ధాప్యంతో మృతి చెందింది. 1994లో జూలో జన్మించిన ఈ పులి కొంతకాలంగా ఇతర పులులతో జత కట్టి ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది. అడవుల జీవిత కాలం 18 ఏళ్లు కాగా మున్నీ 23 ఏళ్లు జీవించిందని జూ అధికారులు తెలిపారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతూ కొంతకాలంగా జూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతి చెందిన మున్నీకి మంగళవారం జూ వెటర్నరీ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించినట్లు జూపార్కు క్యూరేటర్ శివానీ డోగ్రా తెలిపారు.