Video: టైగర్‌ ఎన్‌క్లోజర్‌లోకి దూకిన మహిళ.. జస్ట్‌ మిస్‌ | Video: US Woman Climbs Into Tiger's Enclosure In Zoo Nearly Gets Bitten | Sakshi
Sakshi News home page

Video: టైగర్‌ ఎన్‌క్లోజర్‌లోకి దూకిన మహిళ.. పులిని రెచ్చగొట్టి..

Published Thu, Aug 22 2024 9:38 AM | Last Updated on Thu, Aug 22 2024 10:12 AM

Video: US Woman Climbs Into Tiger's Enclosure In Zoo Nearly Gets Bitten

అమెరికాలో ఓ మహిళా హల్‌చల్‌ చేసింది. న్యూజెర్సీలోని కోహన్‌జిక్‌ జూ వద్ద బెంగాల్‌ టైగర్‌ ఎన్‌క్లోజర్‌లోకి కంచె ఎక్కింది. ఏమాత్రం భయం లేకుండా పులిని తాకేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమెను పులి దాడి చేసేందుకు ముందుకు వచ్చింది.  ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అయితే పులికి మహిళకు మద్య మరో ఫెన్సింగ్‌ ఉండటంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.

అయినప్పటికీ మహిళ తన పిచ్చి వేషాలు మానుకోకుండా  పులిని ప్రలోభపెట్టడానికి యత్నించింది. జంతువుకు చేయి చూపింది, దాన్ని రెచ్చగొట్టేందుకు చూసింది. వెంటనే పులి ఆమె చేతిని ​ఒరికేందుకు, దాడి చేసేందుకు యత్నించింది. దీంతో భయపడిన మహిళ అక్కడనుంచి వెనక్కి పరుగుత్తుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. జూలోని కంచెపైకి ఎక్కడం చట్ట విరుద్దమని తెలిపారు. సందర్శకుల భద్రతతోపాటు జంతువుల సంరక్షణ తమ ప్రధాన ప్రాధాన్యతగా పేర్కొన్నారు. జూలో జంతువులపై సందర్శకుల ప్రమాదకరమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని తెలిపారు. సదరు యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

 ఇదిలా ఉండగా  కోహన్‌జిక్‌ జూలో రెండు బెంగాల్‌ పులులు ఉన్నాయి. రిషి, మహేషా అనే సోదరులు. వీటిని 2016లో అక్కడికి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాటిని తీసుకొచ్చారు. అప్పుడు కేవలం 20 పౌండ్ల బరువుతో ఉండగా.. ఇప్పుడు పులులు ఒక్కొక్కటి దాదాపు 500 పౌండ్ల బరువు కలిగి ఉన్నాయి.

ఇక బెంగాల్ పులులను భారతీయ పులులు అని కూడా పిలుస్తారు. ఇవి అంతరించిపోతున్న జాతికి చెందినవి. అక్టోబర్ 2022 నాటికి  దాదాపు 3,500 పులులు మాత్రమే అడవిలో ఉన్నాయి. సైబీరియన్ పులి తర్వాత బెంగాల్‌ పులి జాతి రెండవ అతిపెద్దదిగా పరిగణిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement