వాషింగ్టన్: లాటరీ తగలడమే అదృష్టం అందులోనూ ఆ లాటరీలో మరింత ఎక్కువ డబ్బు వస్తే ఇక ఆనందానికి అవధులే ఉండవు. పైగా చిన్నచితకా ఉద్యోగాలతో రోజంతా నిర్విరామంగా పనిచేసే వాళ్లకు లాటరీ తగలితే ఇక ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటి అనుభవం ఒక ఉబర్ డైవర్‌కి ఎదురైంది. వివరాల్లోకెళ్లితే...అమెరికాలోని 69 ఏళ్ల ఒక ఉబర్ డ్రైవర్ పగలు రాత్రి రైడింగ్‌తో నిర్విరామంగా పనిచేస్తుంటాడు.
(చదవండి: సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిలో జన్మించినన ముగ్గురు అక్కాచెల్లెళ్లు)
పెద్దగా ఆదాయం లేని విరామ సమయాన్ని ఈ ఉబర్ డ్రైవర్ మంచి లాభదాయకంగా మార్చుకున్నాడు. ఇంతకీ అతను ఆ సమయంలో ఏం చేశాడంటే....జోప్పాలోని ఓ దుకాణం వద్ద 10 డాలర్లతో లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేస్తూ డబ్బలు గడిస్తుండేవాడు. ఆ విధంగా అతను ఒకరోజు అనుకోకుండా 1000 డాలర్ల వెచ్చించి మరీ పెద్ద లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. అయితే ఆరోజు అనుహ్యంగా లక్ష (రూ.75 లక్షలు) గెలుచుకున్నాడు.
ఈ సందర్భంగా ఉబర్ డైవర్ మాట్లాడుతూ.. "ఈ రోజు చాలా పవిత్రమైంది అంటూ నేను అరుస్తుంటే పక్కనే ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి బాగానే ఉన్నావా అంటూ విచిత్రంగా చూశాడు. ఆ తర్వాత నేను చూశావా నాకు లాటరీలో ఎంత తగిలిందో చూడు అంటూ ఆనందంగా చూపించాను. మిడిల్ రివర్ నుండి వచ్చిన నేను మేరీల్యాండ్ లాటరీ టికెట్ కంపెనీకి ఉబర్ డ్రైవర్‌గా ఐదేళ్లు నుంచి పనిచేయడమే కాక 24 వేల రైడ్లకు పైగా చేశాను" అని అన్నాడు. అంతేకాదు సదరు డ్రైవర్ ఈ డబ్బులో కొంతవరకూ తన కారును బాగుచేయించుకోవడానికి ఖర్చు పెడతానని అన్నాడు.
(చదవండి: దయచేసి ఫోన్ ఎత్తి మేము సురక్షితంగా ఉన్నాం అని చెప్పండి!)
Comments
Please login to add a commentAdd a comment