
ఎవరి జీవితాలు ఎప్పుడు, ఎలా మారుతాయో ఎవ్వరూ ఊహించలేరు. ఇటీవల ఆరెంజ్ జ్యూస్ కోసం ఆగిన మహిళ, లాటరీ టికెట్ కొని కోటీశ్వరురాలు అయిపోయింది.
నార్త్ కరోలినాకు చెందిన ఒక మహిళ ఆరెంజ్ జ్యూస్ కొనుక్కోవడం కోసం ఆగింది. అక్కడే కనిపించిన లాటరీ టిక్కెట్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్న విధంగానే ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేసింది.
సరిగ్గా ఆమె కొనుగోలు చేసిన లాటరీ టికెట్టుకు లాటరీ తగిలింది. దీంతో 2,50,000 డాలర్ల విజేతగా నిలిచింది. అనుకోకుండా కొనుగోలు చేసిన లాటరీ టికెట్ వారి జీవితాన్నే మార్చేసిందని ఆ మహిళ చాలా సంతోషపడింది.
కొన్ని రోజులకు ముందు అమెరికాకు చెందిన ఒక సాధారణ ఉద్యోగి లంచ్ బాక్స్ మరిచిపోవడమే.. అతన్ని కోటీశ్వరున్ని చేసింది. మధ్యాహ్నం తినడానికి సమీపంలో ఏదైనా దొరుకుతుందేమో చూసాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ కిరాణా షాపులో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేసాడు. ఆ వ్యక్తి కొనుగోలు చేసి టికెట్టుకే లాటరీ తగిలింది. దీంతో అతడు ఏకంగా రూ. 25.24 కోట్లు గెలుచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment