లంచ్ బాక్స్ మరిచిపోయి.. కోటీశ్వరుడయ్యాడు | US Man Wins Rs 25 Crore Lottery When He Forgotten Lunch Box | Sakshi
Sakshi News home page

లంచ్ బాక్స్ మరిచిపోయి.. కోటీశ్వరుడయ్యాడు

Published Mon, Nov 4 2024 3:08 PM | Last Updated on Mon, Nov 4 2024 3:42 PM

US Man Wins Rs 25 Crore Lottery When He Forgotten Lunch Box

ఒక సాధారణ ఉద్యోగి లంచ్ బాక్స్ మరిచిపోవడమే.. అతన్ని కోటీశ్వరున్ని చేసింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

అమెరికాకు చెందిన వ్యక్తి ఉద్యోగానికి వెళ్లే హడావిడిలో లంచ్ బాక్స్ తీసుకెళ్లడం మరిచిపోయాడు. ఆ తరువాత అతని భార్య ఫోన్ చేసి లంచ్ బాక్స్ మరిచిపోయావు అన్న విషయం చెప్పింది. మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లడం ఇష్టం లేక మధ్యాహ్నం తినడానికి సమీపంలో ఏదైనా దొరుకుతుందేమో చూసాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ కిరాణా షాపులో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేసాడు.

ఆ వ్యక్తి కొనుగోలు చేసి టికెట్టుకే లాటరీ తగిలింది. దీంతో అతడు ఏకంగా రూ. 25.24 కోట్లు (3 మిలియన్ డాలర్లు) గెలుచుకున్నట్లు మిస్సౌరీ లాటరీ అధికారులు తెలిపారు. లాటరీ టికెట్ కొన్న వ్యక్తికి.. లాటరీ తగిలిందంటే అస్సలు నమ్మలేదు. ఆ తరువాత టికెట్ నెంబర్ చూసుకుని నిర్దారించుకుని, తెగ సంతోషపడ్డాడు.

ఇదీ చదవండి: మారని ధరలు: బంగారం కొనడానికి ఇదో మంచి ఛాన్స్!

లాటరీ గెలిచిన తరువాత, ఆ విషయాన్ని తన భార్యకు చెప్పడానికి ఫోన్ చేసాడు. అయితే ఆమె కూడా మొదట్లో నమ్మలేదని.. ఆ వ్యక్తి వెల్లడించాడు. ఈ విషయాన్ని నమ్మడానికి ఆమెకు కొంత సమయం పట్టింది. మొత్తానికి లంచ్ బాక్స్ మరిచిపోవడంతో అతడు ధనవంతుడయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement