మేరీల్యాండ్: అమెరికాలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలతో ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. మేరీ ల్యాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ రత్నాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమవారం బొత్ససత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు బొత్స పిలుపునిచ్చారు.