విద్యుత్ లైన్లపైకి దూసుకెళ్లిన విమానం.. 90 వేల ఇళ్లకు పవర్‍ కట్.. | Plane Crashes Into Power Lines Power Cut Offs Affect 90k Houses | Sakshi
Sakshi News home page

విద్యుత్ లైన్లపైకి దూసుకెళ్లిన విమానం.. 90 వేల ఇళ్లకు పవర్‍ కట్..

Published Mon, Nov 28 2022 9:34 AM | Last Updated on Mon, Nov 28 2022 9:34 AM

Plane Crashes Into Power Lines Power Cut Offs Affect 90k Houses - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మేరీలాండ్‌లోని మాంట్‌గోమెరీ కౌంటీలో ఓ చిన్న సైజు విమానం విద్యుత్‌ లైన్లపైకి దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటీ హాని జరగలేదు. కానీ కరెంటు తీగలు తెగిపోవడంతో కౌంటీలోని 90 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కౌంటీవాసులంతా అంధకారంలోకి వెళ్లారు.

వర్షాలు పడటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 10 అంతస్తుల ఎత్తులోనే ఈ ప్రమాదం జరగడానికి కచ్చితమైన కారణాలు మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు.

ఈ ప్రమాదంపై మాంట్‌గోమెరీ పోలీసులు ట్వీట్ చేశారు. విమానం విద్యుత్‌ లైన్లపైకి దూసుకెళ్లిన ప్రాంతం వైపు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. అక్కడ కరెంటు తీగలు నెలపై పడి ఉన్నాయని పేర్కొన్నారు.
చదవండి: తిరగబడ్డ చైనా.. మితిమీరిన ఆంక్షలపై కన్నెర్రజేసిన జనం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement