షాకింగ్‌; ఎన్నారై సజీవ దహనం | Man Dies Who Set Himself On Fire Near White House | Sakshi
Sakshi News home page

వైట్‌హౌజ్‌ సమీపంలో ఎన్నారై సజీవ దహనం

Published Fri, May 31 2019 10:42 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

Man Dies Who Set Himself On Fire Near White House - Sakshi

వాషింగ్టన్‌ : వైట్‌హౌజ్‌ సమీపంలో ఓ వ్యక్తి సజీవ దహనమవడం కలకలం రేపింది. అధ్యక్ష భవనానికి దగ్గర్లోనే అతడు ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో మృతుడు భారత్‌కు చెందిన అర్నవ్‌ గుప్తా(33)గా పోలీసులు గుర్తించారు. వివరాలు.. మేరీలాండ్‌లో నివసిస్తున్న ఆర్నవ్‌ గుప్తా బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటికి వచ్చాడు. చాలా సమయం గడిచినా అతడు రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా.. శ్వేతసౌధానికి సమీపంలో ఉన్న ఎలిప్స్‌ పార్కు వచ్చిన ఆర్నవ్‌.. అక్కడ అందరూ చూస్తుండగానే తనకు తాను నిప్పంటించుకున్నాడు. దీంతో షాక్‌ తిన్న స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే శరీరంలోని అన్ని అవయవాలు తీవ్రంగా కాలిపోవడంతో అర్నవ్‌ మృతిచెంచినట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆర్నవ్‌ ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement