టూరిజం సర్క్యూట్‌గా ఓరుగల్లు
జిల్లాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తా
గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపుతా
గిరిజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్
{పజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుందాం
ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాం నాయక్
పర్యాటక రంగంలో జిల్లాను తెలంగాణలోనే అగ్రగామిగా నిలుపుతానని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి చందూలాల్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంగళవారం తొలిసారిగా ఆయన జిల్లాకు వచ్చారు. ఓరుగల్లు కోట, వేయిస్తంభాల గుడి, గణప సముద్రం, రామప్ప, లక్నవరం, మేడారం, మల్లూరు హేమాచల క్షేత్రంను టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తానన్నారు.
హన్మకొండ/ములుగు :పర్యాటకం రంగంలో జిల్లాను తెలంగాణలోనే అగ్రగామిలో నిలుపుతానని, టూరిజం సర్క్యూట్‌గా ఓరుగల్లును అభివృద్ధి చేస్తానని రాష్ట్ర గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన అనంతరం మంగళవారం తొలిసారిగా ఆయన జిల్లా పర్యటనకు వచ్చారు. హన్మకొండలో మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఓరుగల్లు కోట, వెయ్యి స్తంభాల గుడి, గణప సముద్రం, రామప్ప, లక్నవరం, మేడారం, మల్లూరు హేమాచల క్షేత్రాలు అనుసంధానంగా టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. గత ప్రభుత్వాలు గిరిజన భవన్‌కు 5 గజాల స్థలం ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ అడగగానే గిరిజన భవన్, ఆదివాసీ భవన్, మాదిగ భవన్‌కు నిధులు విడుదల చేశారన్నారు. జిల్లాలో కాకతీయ ఉత్సవాల ప్రారంభానికి ముఖ్యమంత్రి రానున్నారని తెలిపారు. తండాలు, గూడాల్లో తమ రాజ్యం రావాలని కలలు కంటూ వచ్చామని, ఆ కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తూ జీవో జారీ చేశారన్నారు. సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, మాజీ మంత్రి కెప్టె న్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యేలు అరూరి రమే ష్, సతీష్‌బాబు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్ పాల్గొన్నారు.
రైతన్న కళ్లల్లో సంతోషం కనిపించాలి
ములుగులోని డీఎల్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో జరి గిన కార్యకర్తల సమావేశంలో మంత్రి చందూ లాల్ మాట్లాడుతూ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి, రైతన్న కళ్లల్లో సంతోషం చూడడానికి ప్రజాప్రతినిధులమంతా కలిసి ముందుకు సాగుతామన్నారు. ఇందుకు ప్రజలు సహకరిం చాలని కోరారు. ఐటీడీఏ పరిధిలో పని చేస్తున్న సీఆర్టీలను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు.
బడుగుల అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం : కడియం
రాష్ట్రంలో 85 శాతం మంది బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే ఉన్నారని, వారిని అభివృద్ధి పథంవైపు నడిపించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వసిస్తున్నారని ఎంపీ కడియం శ్రీహరి తెలిపారు. 46 వేల చెరువుల పునరుద్ధరణ, 10 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధికి నాంది పలికామని తెలిపారు. టెక్స్‌టైల్ ప్రాజెక్టు, స్మార్ట్‌సిటీ నిధులను వరంగల్ జిల్లాకు తరలించడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని వివరించారు.
పోగొట్టుకున్న ఆత్మగౌరవం కాపాడుకున్నాం : ఎంపీ సీతారాంనాయక్
ఉమ్మడి రాష్ట్రంలో పోగొట్టుకున్న ఆత్మగౌరవా న్ని స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తిరిగి సాధించుకున్నారని ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. డోర్నకల్ నియోజకవర్గ ఇన్‌చార్జీ సత్యవతి రాథోడ్ లంబాడ భాషలో మాట్లాడి అలరించారు. రామప్ప కళాకారుల ఆటపాట లు ఆకట్టుకున్నాయి. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కేశెట్టి కుటుంబరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రా వు, జిల్లా ఇన్‌చార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, పొలిట్‌బ్యూరో సభ్యు లు కన్నెబోయిన రాజయ్యయాదవ్, నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, జెడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, బానోతు సంగూలాల్, భరత్‌కుమార్‌రెడ్డి, జిల్లా మహిళా కార్యదర్శి భూక్య సుమలత, జిల్లా నాయకులు అజ్మీరా ప్రహ్లద్, ధరంసింగ్, పోరిక హర్జీనాయక్, పోరిక గోవింద్‌నాయక్, మాజీ మంత్రి జగన్నాయక్ పాల్గొన్నారు.