Tourism Circuit
-
ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్‌పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలోకడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, బ్యూటిఫికేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు టూరిజం ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్, గండి టెంపుల్ కాంప్లెక్స్, ఐఐటీ క్యాంపస్, ఎకో పార్క్, జంగిల్ సఫారీ, పీకాక్ బ్రీడింగ్ సెంటర్ ఎస్టిమేషన్ వివరాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. బ్యూటిఫికేషన్ పెరిగే విధంగా ఆర్కిటెక్చర్ ఉండాలని అధికారులకు సూచించారు. ఏ పని చేసినా దీర్ఘకాలికంగా మన్నికతో పాటు ప్రాజెక్టు ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించాలని చెప్పారు. కాలక్రమేణా సుందరీకరణ ప్రాజెక్టు వన్నె తగ్గకుండా చూసుకోవడంతో పాటు ఆకర్షణీయంగా ఉండేందుకు కావాల్సిన అన్ని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కడప, పులివెందులను మోడల్‌టౌన్స్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సహాయాన్ని పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ(పాడా) నంచి తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పులిచింతలలో వైఎస్సార్ ఉద్యానవనం ప్రణాళికను , విశాఖపట్నంలో లుంబినీ పార్క్ అభివృద్ధిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇదే తరహాలో పోలవరం వద్ద కూడా పార్క్ రూపొందించాలని అధికారులకు సూచించారు. -
ఏజెన్సీ@ టూరిజం సర్క్యూట్
- గట్టమ్మ నుంచి మల్లూరు వరకు విస్తరణ - ప్రతిపాదనలు పంపిన పర్యాటక శాఖ ములుగు: ములుగు ఏజెన్సీ ఇక టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు పర్యాటకశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఓ నివేదిక రూపొందించారు. వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్‌లో జరిగే టూరిజం అభివృద్ధి సమావేశంలో జిల్లా అధికారుల నివేదికపై చర్చలు జరిగే అవకాశం ఉంది. నివేదికకు గ్రీన్‌సిగ్నల్ లభిస్తే గట్టమ్మ - మంగపేట, మల్లూరు హేమాచల క్షేత్రం టూరిజం సర్క్యూట్‌గా రూపుదిద్దుకోనుంది. ఇది సర్క్యూట్ ప్రస్తుతం గట్టమ్మ ఆలయం సమీపంలో హరిత హోటల్‌తో పాటు కాటేజీలు, మల్లూరు క్షేత్రం సమీపంలో 8 కాటేజీలు , హరిత హోటల్ నిర్మించనున్నట్లు ఇదివరకే ఆ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ వెల్లడించారు. వెంకటాపురం మండలం పాలంపేట రామప్ప, గోవిందరావుపేట మండలంలోని లక్నవరం, తాడ్వాయి మండలంలోని మేడారంలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తారుు. ఏటూరునాగారం మండలం కంతనపల్లి, దేవాదుల, జంపన్నవాగు పరిసర ప్రాంతాలైనఊరట్టం, రెడ్డిగూడెం, తాడ్వాయి, ముల్లకట్ట, రామన్నగూడెం ప్రాంతాలను కలుపుతూ నూతనంగా టూరిజం పరంగా అభివృద్ధి చేయాలని శాఖ ప్రతిపాదించింది. పాపికొండలు తరహ బోటింగ్.. పాపికొండలు తరహలో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కంతనపల్లి సమీపంలో సుమారు 25 కిలోమీర్ల మేర బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసేందుకు నిర్ణరుుంచారు. ఇందుకోసం అధికారులు గోదావరిలో పరిశీలించారు. గోదావరి నది ఒడ్డు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే టూరిజం ప్రాంతాలను కలుపుకుంటూ ఆదిలాబాద్ నుంచి వరంగల్ వరకు ప్రత్యేక ప్యాకేజీతో బస్సులు నడిపించి పర్యాటకును ఆకట్టుకునే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. పుష్కరాల సందర్భంగా ఏటూరునాగారం, మంగపేట గోదావరి ప్రాంతాలు, కంతనపల్లి, ముల్లకట్ట, మల్లూరు లాంటి ప్రాంతాలు భక్తులను ఆకర్షించిన కారణంగా ఏకో టూరిజం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు శాఖ అధికారి ఒకరు తెలిపారు. ముల్లకట్ట మరింత అందంగా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట గ్రామం నుంచి ఖమ్మం జిల్లా పూసురులను కలుపుతూ వారధిగా నిర్మించిన ముల్లుకట్ట బిడ్జి ఇప్పటికే పలువురిని ఆకట్టుకుంది. బ్రిడ్జి ప్రాంతంలో హరిత హోటల్ ఇతర అభివృద్ధి పనులు చేపడితే అటు ఖమ్మం జిల్లాతో పాటు ఇటు మన జిల్లా పర్యాటకులను ఆకర్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రతిపాదనలు పంపించాం గట్టమ్మ నుంచి రామప్ప, లక్నవరం, మేడారం, కంతనపల్లి, దేవాదుల, మల్లూరు, గోదావరి పరీవాహక ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసి అందించాం. సహకరించాలని కలెక్టర్‌ను కోరాం. వచ్చే నెలలో జరిగే శాఖ సమావేశంలో నివేదికపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆమోదం అందితే పనులు ప్రారంభిస్తాం. గోదావరి పుష్కరాలకు వచ్చిన వారు, మేడారం వచ్చిన భక్తులు ఈ ప్రాంతాలకు తిరగివచ్చేలా చూడాలని భావిస్తున్నాం. - ఎం. శివాజీ, జిల్లా టూరిజం అధికారి -
టూరిజం సర్క్యూట్‌గా ఓరుగల్లు
జిల్లాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తా గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపుతా గిరిజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ {పజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుందాం ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాం నాయక్ పర్యాటక రంగంలో జిల్లాను తెలంగాణలోనే అగ్రగామిగా నిలుపుతానని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి చందూలాల్ అన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంగళవారం తొలిసారిగా ఆయన జిల్లాకు వచ్చారు. ఓరుగల్లు కోట, వేయిస్తంభాల గుడి, గణప సముద్రం, రామప్ప, లక్నవరం, మేడారం, మల్లూరు హేమాచల క్షేత్రంను టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తానన్నారు. హన్మకొండ/ములుగు :పర్యాటకం రంగంలో జిల్లాను తెలంగాణలోనే అగ్రగామిలో నిలుపుతానని, టూరిజం సర్క్యూట్‌గా ఓరుగల్లును అభివృద్ధి చేస్తానని రాష్ట్ర గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన అనంతరం మంగళవారం తొలిసారిగా ఆయన జిల్లా పర్యటనకు వచ్చారు. హన్మకొండలో మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఓరుగల్లు కోట, వెయ్యి స్తంభాల గుడి, గణప సముద్రం, రామప్ప, లక్నవరం, మేడారం, మల్లూరు హేమాచల క్షేత్రాలు అనుసంధానంగా టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. గత ప్రభుత్వాలు గిరిజన భవన్‌కు 5 గజాల స్థలం ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ అడగగానే గిరిజన భవన్, ఆదివాసీ భవన్, మాదిగ భవన్‌కు నిధులు విడుదల చేశారన్నారు. జిల్లాలో కాకతీయ ఉత్సవాల ప్రారంభానికి ముఖ్యమంత్రి రానున్నారని తెలిపారు. తండాలు, గూడాల్లో తమ రాజ్యం రావాలని కలలు కంటూ వచ్చామని, ఆ కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తూ జీవో జారీ చేశారన్నారు. సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, మాజీ మంత్రి కెప్టె న్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యేలు అరూరి రమే ష్, సతీష్‌బాబు, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్ పాల్గొన్నారు. రైతన్న కళ్లల్లో సంతోషం కనిపించాలి ములుగులోని డీఎల్ఆర్ ఫంక్షన్హాల్లో జరి గిన కార్యకర్తల సమావేశంలో మంత్రి చందూ లాల్ మాట్లాడుతూ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి, రైతన్న కళ్లల్లో సంతోషం చూడడానికి ప్రజాప్రతినిధులమంతా కలిసి ముందుకు సాగుతామన్నారు. ఇందుకు ప్రజలు సహకరిం చాలని కోరారు. ఐటీడీఏ పరిధిలో పని చేస్తున్న సీఆర్టీలను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. బడుగుల అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం : కడియం రాష్ట్రంలో 85 శాతం మంది బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే ఉన్నారని, వారిని అభివృద్ధి పథంవైపు నడిపించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వసిస్తున్నారని ఎంపీ కడియం శ్రీహరి తెలిపారు. 46 వేల చెరువుల పునరుద్ధరణ, 10 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధికి నాంది పలికామని తెలిపారు. టెక్స్టైల్ ప్రాజెక్టు, స్మార్ట్‌సిటీ నిధులను వరంగల్ జిల్లాకు తరలించడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని వివరించారు. పోగొట్టుకున్న ఆత్మగౌరవం కాపాడుకున్నాం : ఎంపీ సీతారాంనాయక్ ఉమ్మడి రాష్ట్రంలో పోగొట్టుకున్న ఆత్మగౌరవా న్ని స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తిరిగి సాధించుకున్నారని ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జీ సత్యవతి రాథోడ్ లంబాడ భాషలో మాట్లాడి అలరించారు. రామప్ప కళాకారుల ఆటపాట లు ఆకట్టుకున్నాయి. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కేశెట్టి కుటుంబరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్, జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రా వు, జిల్లా ఇన్చార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, పొలిట్‌బ్యూరో సభ్యు లు కన్నెబోయిన రాజయ్యయాదవ్, నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, జెడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, బానోతు సంగూలాల్, భరత్‌కుమార్‌రెడ్డి, జిల్లా మహిళా కార్యదర్శి భూక్య సుమలత, జిల్లా నాయకులు అజ్మీరా ప్రహ్లద్, ధరంసింగ్, పోరిక హర్జీనాయక్, పోరిక గోవింద్‌నాయక్, మాజీ మంత్రి జగన్నాయక్ పాల్గొన్నారు. -
జిల్లాపై చిన్నచూపు
నిజాంపట్నం ఓడరేవు అభివృద్ధి ఊసే లేదు ►రుణ మాఫీపై నిర్ధిష్ట హామీ లేదు.. ►టూరిజం సర్క్యూట్ మంజూరు.. ►కీలక ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులు ►కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులకు రూ.120 కోట్లు ►పులిచింతల ప్రాజెక్టుకు రూ.26.21 కోట్లు మాత్రమే.. ►ఇరిగేషన్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికీ భారీ కోతలు ►రాష్ట్ర బడ్జెట్‌పై సర్వత్రా అసంతృప్తి... సాక్షి ప్రతినిధి, గుంటూరు: విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తొలిసారిగా శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లాలోని అన్ని వర్గాలను అసంతృప్తికి గురిచేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు తగ్గట్టు కేటాయింపులు చూపించేందుకు చేసిన ప్రయత్నంగా ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి అంకెల గారడీ చేశారనే విమర్శలూ వినపడుతున్నాయి. ►తెలుగుదేశం పార్టీ తరఫున 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించిన గుంటూరు జిల్లా ప్రజలకు ఈ బడ్జెట్ ఎలాంటి ప్రయోజనం కలిగించలేకపోతోంది. ►జిల్లాకు కొత్తగా టూరిజం సర్క్యూట్‌ను మాత్రమే మంజూరు చేసి, ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులను విస్మరించడం విస్మయానికి గురి చేసింది. ►రాష్ట్రంలోని 14 చిన్న తరహా ఓడరేవులను పబ్లిక్, ప్రైవేట్ భా గస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం జిల్లాలోని నిజాంపట్నం ఓడరేవు అభివృద్ధిని విస్మరించింది. కళింగపట్నం, భావనపాడు వంటి హార్బర్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం చిన్న తరహా ఓడరేవుల శాఖ ఆధీనంలోని నిజాం పట్నం హార్బర్‌ను పట్టించుకోకపోవడం అనాలోచిత చర్యగా అభివర్ణిస్తున్నారు. ►సముద్ర ముఖ ద్వారం వద్ద ఏర్పడుతున్న ఇసుకమేటలను తొలగించి ఓడల ద్వారా సరుకుల రవాణా పెంచే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయలేకపోయిందని వాణిజ్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ►కృష్ణా పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులకు మొక్కుబడిగానే నిధులు కేటాయించారు. దీనికి సంబంధించి రూ.850 కోట్లకు రూ.200 కోట్ల విలువైన పనులే ఇప్పటి వరకు జరిగాయి. సాగునీటి రంగానికి పెద్ద పీట వేశామంటున్న ప్రభుత్వం రూ.8,465 కోట్లు కేటాయించినప్పటికీ, నిధులు అరకొరగానే విడుదలయ్యాయి. ►నిర్మాణ సంస్థలు డెల్టా ఆధునికీకరణ పనులను వేగంగా చేయడం లేదని ప్రతీ బడ్జెట్లోనూ ప్రభుత్వం నిధులు అరకొరగానే కేటాయిస్తోంది. ఈసారీ కూడా కృష్ణాడెల్టాకు రూ.120 కోట్లు మాత్రమే కేటాయించింది. ►పులిచింతల ప్రాజెక్టుకు రూ.26.21 కోట్లు కేటాయించారు. అయితే ఈ సంస్థ రూ.216 కోట్ల నష్టపరిహారం కోరుతూ ఆర్భిట్రేషన్‌కు వెళ్లింది. పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, బాధితులకు నష్టపరిహారంగా చెల్లించాల్సిన మొత్తాలు అధికంగా ఉన్నప్పటికీ బడ్జెట్లో రూ.26.21 కోట్లు మాత్రమే కేటాయించారు. ►పౌరసరఫరాల శాఖకు రూ.2,318 కోట్లు కేటాయించినప్పటికీ‘అమ్మహస్తం’ గురిం చి ప్రస్తావించకపోవడంతో ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం అటకెక్కిస్తుందనే ప్రచా రం జరుగుతోంది. ఈ పథకం స్థానే ‘అన్న క్యాంటీన్’లకు నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ►పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే కార్యక్రమంలో భాగంగా జిల్లాకు ఒక టూరిజం సర్క్యూట్‌ను కేటాయించారు. పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించగా, ఇందులో టూరిజం సర్క్యూట్ కూడా ఉంది. జిల్లాలోని కొండవీడుకోట తదితర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నామమాత్ర నిధులు కేటాయించారు. ►రైతులు, డ్వాక్రా గ్రూపులు తీసుకున్న రుణాలను పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వీటి మాఫీపై పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వలేకపోయారు. ►జిల్లాలో రైతులు, డ్వాక్రా గ్రూపులు తీసుకున్న మొత్తం రుణాలు రూ.10 వేల కోట్లు ఉంటే, రాష్ట్రం మొత్తం మీద రుణమాఫీకి ఈ బడ్జెట్లో రూ.15 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ►ఎస్సీ సబ్‌ప్లాన్ కింద గత ఏడాది కేటాయించిన నిధులు పూర్తిగా పంపిణీ జరగలేదు. జిల్లాలో 3 వేల మంది లబ్ధిదారులు బ్యాంకుల్లో వ్యక్తిగత ఖాతాలు ప్రారంభించినప్పటికీ సబ్సిడీ జమ కాలేదు. తిరిగి ఈ బడ్జెట్లో రూ.2,657 కోట్లు కేటాయించారు. ►గృహ నిర్మాణ రంగానికి అరకొరగానే కేటాయింపులు జరిపారు. జిల్లాలో 23,521 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయాయి. 54,919 ఇళ్లు ప్రారంభానికీ నోచుకోలేదు. 78 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులను చూస్తే ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడం గగనమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముస్లిం మైనార్టీలకు అన్యాయం పట్నంబజారు : బడ్జెట్లో ముస్లిం మైనారిటీ వర్గాలకు తీరని అన్యాయం జరిగింది. తెలంగాణలో రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తే, మన రాష్ట్రంలో కేవలం రూ. 371 కోట్లు మాత్రమే కేటాయించటం దారుణం. ఈ కారణంగాగ ముస్లిం వర్గాల ప్రజలు అనేక రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉంది. మైనారిటీ వర్గాల ఫీజురీయింబర్స్‌మెంట్, కార్పొరేషన్ రుణాలు, పేదలకు నివాసాల ఏర్పాటు వీటిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందిస్తే బాగుండేది. బడ్జెట్లో మైనారిటీలను చిన్నచూపు చూశారనేది స్పష్టంగా అర్థమవుతోంది. - మొహ్మద్ ముస్తఫా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ప్రజలను వంచించిన టీడీపీ ప్రభుత్వం నరసరావుపేటవెస్ట్ : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలను వంచించింది. రుణమాఫీకి అరకొర కేటాయింపులు చూస్తుంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నట్లుగా కనిపిస్తోంది. ప్రతి నిరుద్యోగికి రూ.2 వేలు భృతి కల్పిస్తామని చేసిన హామీ ప్రస్తావనే బడ్జెట్లో లేదు. ఈ ఏడాది నుంచే నరసరావుపేటలో జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభిస్తామని చెప్పి బడ్జెట్లో ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖలో 12 లక్షల ఇందిరమ్మ ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోగా, బడ్జెట్లో రూ.800కోట్లు మాత్రమే కేటాయించి, మరో 25 వేల ఇళ్లు ఏ విధంగా పూర్తి చేస్తారు. ఇక మైనార్టీలకు పూర్తిగా అన్యాయం చేశారు. -డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ,నరసరావుపేట రాజధాని ఊసేలేని బడ్జెట్ మంగళగిరి: నవ్యాంధ్ర రాజధాని ఊసే లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆశ్చర్యంగా వుంది. ఆర్థిక శాఖా మంత్రి యనమల బడ్జెట్ ప్రసంగం అంతా పార్టీ ప్రసంగాన్ని తలపించింది. రూ. 15వేల కోట్లను కేటాయిస్తే రుణమాఫీ ఎలా సాధ్యం. డ్వాక్రా మహిళలు, చేనేతలు, రైతులు, యువకులు బడ్జెట్‌పై ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. బుధవారం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వారి ఆశలను వమ్ము చేసింది. ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమం, ఇంటికో ఉద్యోగం, పవర్‌లూమ్‌కు కేటాయింపులని వాగ్దానాలు చేసిన ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఏ విధంగా అమలు చేస్తారు. గృహ నిర్మాణాలకు కేటాయించిన నిధులు ఇప్పటి వరకు వున్న పాత బిల్లులకే సరిపోవు. ఇక కొత్త ఇళ్ల నిర్మాణం ఏ విధంగా సాధ్యమవుతుంది. కార్మిక సంక్షేమం కోసం రూ. 276 కోట్లు మాత్రమే కేటాయించడం కార్మికులపై ప్రభుత్వానికి వున్న నిర్లక్ష్యాన్ని తెలియజేసింది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు రూ. 615 కోట్లు కేటాయించిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామిక వేత్తలు ఏ విధంగా ముందుకు వస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే కరవు తాండవిస్తోంది. వర్షాభావం ఏర్పడి రైతుల పంటలు వేసే స్థితిలో లేరు. ఇలాంటి దశలో విపత్తుల నిర్వహణకు రూ.403 కోట్లు కేటాయించడం ఏ విధంగా సమంజసం. ఆర్థిక మంత్రి ప్రసంగం అంతా పరనింద...ఆత్మస్తుతి అన్న చందాన సాగింది. ఫించన్లు, ఫీజు రీయింబర్స్మెంట్లపై స్పష్టత లేదు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు నిధులు కేటాయించకుండా ఏ విధంగా అభివృద్ధి చేస్తారు. నవ్యాంధ్రలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. -ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్యే,మంగళగిరి.