
సాక్షి, అమరావతి : ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలోకడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, బ్యూటిఫికేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు టూరిజం ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్, గండి టెంపుల్ కాంప్లెక్స్, ఐఐటీ క్యాంపస్, ఎకో పార్క్, జంగిల్ సఫారీ, పీకాక్ బ్రీడింగ్ సెంటర్ ఎస్టిమేషన్ వివరాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. బ్యూటిఫికేషన్ పెరిగే విధంగా ఆర్కిటెక్చర్ ఉండాలని అధికారులకు సూచించారు. ఏ పని చేసినా దీర్ఘకాలికంగా మన్నికతో పాటు ప్రాజెక్టు ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించాలని చెప్పారు. కాలక్రమేణా సుందరీకరణ ప్రాజెక్టు వన్నె తగ్గకుండా చూసుకోవడంతో పాటు ఆకర్షణీయంగా ఉండేందుకు కావాల్సిన అన్ని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కడప, పులివెందులను మోడల్‌టౌన్స్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సహాయాన్ని పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీ(పాడా) నంచి తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పులిచింతలలో వైఎస్సార్ ఉద్యానవనం ప్రణాళికను , విశాఖపట్నంలో లుంబినీ పార్క్ అభివృద్ధిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇదే తరహాలో పోలవరం వద్ద కూడా పార్క్ రూపొందించాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment