నాగోబా జాతరకు రూ.40 లక్షలు
మంత్రి చందూలాల్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గిరిజనుల ఆరాధ్యదైవం ఆదిలాబాద్ జిల్లా ఖెస్లాపూర్ నాగోబా జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.40 లక్షలు విడుదల చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ, పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. సమ్మక్క, సారలమ్మల తర్వాత పెద్దదైన నాగోబా జాతరకున్న విశేష ప్రాధాన్యత దృష్ట్యా వచ్చే నెల 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే ఈ జాతరకు ప్రభుత్వం తరఫున ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నామన్నారు. మంగళవారం సచివాలయంలో జాతర ఏర్పాట్లపై మంత్రులు ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్నతో కలసి చందూలాల్ సమీక్షించారు.
లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధి కారులను ఆదేశించారు. ఇంద్రవెల్లి మండలంలోని నాగోబా జాతరకు శాశ్వత ప్రాతి పదికన చర్యలు చేపట్టాలని మంత్రులు నిర్ణయించారు. ఎస్టీ సంక్షేమ శాఖ నుంచి రూ. 2కోట్లతో ధర్మసత్రం, దర్బార్ హాలు, ఇతర ఏర్పాట్లను చేపట్టను న్నట్లు చందూలాల్ తెలియజేశారు. మండప ఆధునీకరణ, రాజగోపుర నిర్మాణాలు, దేవాలయ పునరు ద్ధరణకు రూ.1.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఇంద్రకరణ్‌రెడ్డి తెలి పారు. ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్, రాథోడ్ బాబూరావు పాల్గొన్నారు.