ఏడు రోజులపాటు మెస్రం వంశీయులున్న గ్రామాల్లో సందర్శన
28న మహాపూజ అనంతరం మొదలుకానున్న జాతర
ఇంద్రవెల్లి/సిరికొండ: ప్రచార రథాన్ని ప్రారంభించి నాగోబా జాతరకు మెస్రం వంశీయు లు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌కు మెస్రం వంశీయులు భారీగా తరలివచ్చారు. నాగోబా మురాడి వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ సమక్షంలో కటోడ మెస్రం కోసేరావ్, పర్ధాన్ దాదారావ్‌ల ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని ప్రారంభించారు.
ఏడు రోజుల పాటు మెస్రం వంశీయులు ఉన్న గ్రామాల్లో ప్రచా రం చేపడతారు. ఇందులో భాగంగా తొ లిరోజు సిరికొండ మండలకేంద్రంలోని కుమ్మరిస్వామి వద్ద మహాపూజకు అవసరమయ్యే కుండల తయారీకి ఆర్డర్ ఇచ్చారు. అక్కడి నుంచి అదే మండలంలోని రాజన్‌పేట్‌కు చేరుకొని తమ వంశీయుల ఇళ్ల వద్ద రాత్రి బస చేశారు. ఇలా రోజుకో ఊరిలో బస చేస్తూ, ఈనెల 10న ఉదయం కేస్లాపూర్‌లోని నాగోబా మురాడి వద్దకు తిరిగి చేరుకుంటా రు. అదే రోజున పవిత్ర గంగా జల సేకరణకు పాదయాత్ర ప్రారంభిస్తామని వెంకట్‌రావ్ తెలిపారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి హస్తినమడుగు వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడి నుంచి పవిత్ర గంగాజలం తీసుకొస్తారు. ఆ గంగాజలంతో ఈనెల 28న నాగోబాను అభిషేకించి జాతరను ప్రారంభిస్తామని వెంకట్‌రావ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశపెద్దలు చిన్ను, బాదిరావ్, హనుమంత్‌రావ్, కోసేరావ్, తుకారాం, దాదారావ్, తిరుపతి, వంశ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రచారం రథం
జాతర నిర్వహణలో ప్రచార రథానికి (చకడ) ప్రత్యేకత ఉంది. దీనికి పదేళ్ల తర్వాత సొబగులు అద్దారు. నార్నూర్ మండలం గుండల గ్రామానికి చెందిన మెస్రం మల్కు ఆధ్వర్యంలో కొంతమంది కొలాంల సహకారంతో కొత్తగా నాగోబా ప్రతిమతో కూడిన జడపతోపాటు జువ్వను అమర్చారు. శుక్రవారం కేస్లాపూర్‌కు తీసుకొచి్చన దీనిని మెస్రం వంశీయులు ఆసక్తిగా తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment