nagoba fair
-
‘నాగోబా’ ప్రచార యాత్రకు శ్రీకారం
ఇంద్రవెల్లి/సిరికొండ: ప్రచార రథాన్ని ప్రారంభించి నాగోబా జాతరకు మెస్రం వంశీయు లు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌కు మెస్రం వంశీయులు భారీగా తరలివచ్చారు. నాగోబా మురాడి వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ సమక్షంలో కటోడ మెస్రం కోసేరావ్, పర్ధాన్ దాదారావ్ల ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని ప్రారంభించారు.ఏడు రోజుల పాటు మెస్రం వంశీయులు ఉన్న గ్రామాల్లో ప్రచా రం చేపడతారు. ఇందులో భాగంగా తొ లిరోజు సిరికొండ మండలకేంద్రంలోని కుమ్మరిస్వామి వద్ద మహాపూజకు అవసరమయ్యే కుండల తయారీకి ఆర్డర్ ఇచ్చారు. అక్కడి నుంచి అదే మండలంలోని రాజన్పేట్కు చేరుకొని తమ వంశీయుల ఇళ్ల వద్ద రాత్రి బస చేశారు. ఇలా రోజుకో ఊరిలో బస చేస్తూ, ఈనెల 10న ఉదయం కేస్లాపూర్‌లోని నాగోబా మురాడి వద్దకు తిరిగి చేరుకుంటా రు. అదే రోజున పవిత్ర గంగా జల సేకరణకు పాదయాత్ర ప్రారంభిస్తామని వెంకట్రావ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి హస్తినమడుగు వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడి నుంచి పవిత్ర గంగాజలం తీసుకొస్తారు. ఆ గంగాజలంతో ఈనెల 28న నాగోబాను అభిషేకించి జాతరను ప్రారంభిస్తామని వెంకట్రావ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశపెద్దలు చిన్ను, బాదిరావ్, హనుమంత్‌రావ్, కోసేరావ్, తుకారాం, దాదారావ్, తిరుపతి, వంశ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రచారం రథంజాతర నిర్వహణలో ప్రచార రథానికి (చకడ) ప్రత్యేకత ఉంది. దీనికి పదేళ్ల తర్వాత సొబగులు అద్దారు. నార్నూర్ మండలం గుండల గ్రామానికి చెందిన మెస్రం మల్కు ఆధ్వర్యంలో కొంతమంది కొలాంల సహకారంతో కొత్తగా నాగోబా ప్రతిమతో కూడిన జడపతోపాటు జువ్వను అమర్చారు. శుక్రవారం కేస్లాపూర్‌కు తీసుకొచి్చన దీనిని మెస్రం వంశీయులు ఆసక్తిగా తిలకించారు. -
త్వరలోనే పోడు పట్టాల పంపిణీ
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్రంలో త్వరలోనే పోడు పట్టాలు పంపిణీ చేస్తామని, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కేస్లాపూర్ నుంచే అందిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆర్ఓఎఫ్ఆర్ కింద ఎక్కువ మందికి న్యాయం చేసేలా చూస్తామని, రైతుబంధు వర్తింపజేస్తామన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరుగుతున్న నాగోబా జాతరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి ఆమె విచ్చేశారు. నాగోబాను దర్శించుకున్న అనంతరం గిరిజన దర్బార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 3.8 లక్షల ఎకరాల పోడు భూములకు రైతుబంధు ఇచ్చి గిరిజనుల కోసం అనేక గురుకులాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ విద్యాసంవత్సరం నుంచే అగ్రికల్చర్ బీఎస్సీ ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. కొందరు ఏం తెలియకుండా మాట్లాడుతున్నారని నాగోబా జాతరకు వచ్చిన కేంద్ర మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్రం ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను ఆమోదించి పంపితే కేంద్రం పక్కనబెట్టిందంటూ దుయ్యబట్టారు. మెస్రం పెద్దలు సూచించినట్లుగా అభివృద్ధి పనులు: ఇంద్రకరణ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలో 10 శాతం రిజర్వేషన్ల ప్రకారం 9 వేలకుపైగా ఉద్యోగాలు గిరిజనులకే దక్కుతాయన్నారు. నాగోబా సన్నిధిలో అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ. 12.5 కోట్ల నిధులను తక్షణమే మంజూరు చేశారని తెలిపారు. మెస్రం పెద్దలు సూచించిన ప్రతిపాదనలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలకు ఏమైనా నిధులు ఇచ్చిందా? అంటూ విమర్శించిన కేంద్ర మంత్రి అర్జున్ ముండా కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా రాష్ట్రంలోని ఆలయాలకు మంజూరు చేశారా అంటూ ధ్వజమెత్తారు. గిరిజన దర్బార్‌లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీఓ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దండే విఠల్, రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, రేఖాశ్యామ్ నాయక్, రాథోడ్ బాపురావు తదితరులు పాల్గొన్నారు. -
నాగోబా జాతరకు రూ.40 లక్షలు
మంత్రి చందూలాల్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గిరిజనుల ఆరాధ్యదైవం ఆదిలాబాద్ జిల్లా ఖెస్లాపూర్ నాగోబా జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.40 లక్షలు విడుదల చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ, పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. సమ్మక్క, సారలమ్మల తర్వాత పెద్దదైన నాగోబా జాతరకున్న విశేష ప్రాధాన్యత దృష్ట్యా వచ్చే నెల 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే ఈ జాతరకు ప్రభుత్వం తరఫున ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నామన్నారు. మంగళవారం సచివాలయంలో జాతర ఏర్పాట్లపై మంత్రులు ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్నతో కలసి చందూలాల్ సమీక్షించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధి కారులను ఆదేశించారు. ఇంద్రవెల్లి మండలంలోని నాగోబా జాతరకు శాశ్వత ప్రాతి పదికన చర్యలు చేపట్టాలని మంత్రులు నిర్ణయించారు. ఎస్టీ సంక్షేమ శాఖ నుంచి రూ. 2కోట్లతో ధర్మసత్రం, దర్బార్ హాలు, ఇతర ఏర్పాట్లను చేపట్టను న్నట్లు చందూలాల్ తెలియజేశారు. మండప ఆధునీకరణ, రాజగోపుర నిర్మాణాలు, దేవాలయ పునరు ద్ధరణకు రూ.1.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఇంద్రకరణ్‌రెడ్డి తెలి పారు. ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్, రాథోడ్ బాబూరావు పాల్గొన్నారు.