ఎస్టీ గురుకుల సొసైటీ సమావేశంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మెడిసిన్, ఐఐటీతో పాటు ఎన్‌ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశం సాధించే ఎస్టీ విద్యార్థులకు రూ.50వేల నగదు పురస్కారం, ల్యాప్‌టాప్‌ను ఇవ్వనున్నారు. ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ విద్యార్థులకు ప్రోత్సాహకంగా వీటిని అంది స్తారు. సొసైటీ పాలక మండలి అధ్యక్షుడు, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఈ మేరకు నిర్ణయించారు. పాఠశాల విద్యా శాఖ నిధులతో నిర్వహించే 9 ఎస్టీ గురుకుల పాఠశాలలు, ఇంటర్ బోర్డు నిధులతో ప్రారంభించిన 2 జూనియర్ కళాశాలలను సంస్థ నాన్‌ప్లాన్ స్కీమ్ కిందకు తీసుకొచ్చేందుకు ఆమోదించారు.
విద్యార్థుల పురోగతిపై తల్లితండ్రులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేయాలని, అన్ని పాఠశాలల్లో క్రమం తప్పకుండా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి విద్యాభివృద్ధిపై సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో జరిగిన ఎస్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసై టీ తొలి పాలక మండలి సమావేశంలో కొన్ని ప్రతిపాదనలను ఆమోదించారు. పాలక మండ లి సభ్యులైన ఎస్టీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, కమిషనర్ లక్ష్మణ్, పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జి.కిషన్, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. నూతన పాలకమండలి, 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.123 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించారు. బాలికల పాఠశాలల్లో వారి భద్రతకు ఇద్దరేసి సెక్యూరిటీ గార్డుల నియామకం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని తీర్మానించారు.
ఉన్నత విద్యనభ్యసించే ఎస్టీలకు రూ.50 వేలు
Published Tue, Mar 1 2016 2:36 AM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM
Advertisement