మంత్రి చందూలాల్‌ నుంచి ప్రాణ హాని | Harm to life from Minister Chandulal | Sakshi
Sakshi News home page

మంత్రి చందూలాల్‌ నుంచి ప్రాణ హాని

Published Tue, Jul 4 2017 3:31 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

Harm to life from Minister Chandulal

హెచ్చార్సీలో ములుగు వాసి భిక్షపతి ఫిర్యాదు  
 
హైదరాబాద్‌: మంత్రి అజ్మీరా చందూలాల్, అతని అనుచరుడు గట్టు మహేందర్‌ నుంచి తనకు ప్రాణ హాని ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో జయశంకర్‌ జిల్లా ములుగు ప్రాంతానికి చెందిన ముంజాల భిక్షపతి ఫిర్యాదు చేశారు. ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడిగా తాను కొనసాగుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండేళ్లుగా జిల్లా సాధన కోసం చేస్తున్న ఉద్యమాన్ని విరమించుకో వాలని ములుగు ఎమ్మెల్యే చందూలాల్‌ హెచ్చరిస్తూ వస్తున్నారని ఆరోపించారు.

తాను ససేమిరా అనడంతో ఫోన్‌లో ఇష్టం వచ్చినట్లు దుర్భాషలా డారని పేర్కొన్నారు. అతని అనుచరుడు గట్టు మహేందర్‌ సైతం ‘రోడ్డు మీదకు రాకుండా చేస్తాం బిడ్డా... బతకాలని ఉందా?’ అంటూ బెదిరించినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సెప్టెంబరు 14లోగా ఈ కేసుకు సంబంధించి సమగ్రమైన నివేదిక అందజేయాలని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement