జిల్లా తెచ్చేంతటి మొనగాళ్లా మీరు
- మాపోరగాళ్లకు చెప్పినంటే పనైతది
- ఫోన్‌లో మంత్రి చందూలాల్ హెచ్చరికలు
- వాట్సప్‌లో హల్‌చల్ చేస్తున్న కాల్ రికార్డు
సాక్షి, వరంగల్: ‘నువ్వు ఎవడ్రా జిల్లా తెమ్మని నన్ను అడగడానికి.... పేగులెల్లుతయ్ బిడ్డ. నేను గట్టిగ తొక్కిన్నంటే’అంటూ మంత్రి చందూలాల్ బూతు పురాణం అందుకున్నారు. ములుగు–సమ్మక్క సారలమ్మ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతిని ఈ మేరకు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. నువ్వెం త నీ బతుకెంత అంటూ నోటికొచ్చి నట్లు తిట్టారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ నెల 26 రాత్రి ఈ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మంత్రి చందూలాల్‌ను సంప్రదించగా... ఇదో వార్తా ? వంద సవాళ్లు వస్తుంటయ్ మాకు. వాడో చిల్లర గాడు, వాడి వాయిస్‌తోని మీరు ఎందుకు వార్త రాస్తరు, రాత్రి పదిగంటలకు ఫోన్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడినందుకు వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తని సమాధానం ఇచ్చారు.
ఇద్దరి మధ్య సంభాషణ ఇలా కొనసాగింది.
మంత్రి చందూలాల్: హలో
మంజాల బిక్షపతి: నమస్తే సార్, బాగున్నారా సార్. నేను ముంజాల భిక్షపతిని.
మంత్రి చందూలాల్: బాగున్నా పెద్దలు కదా, ఫోన్ చేసిళ్లు ఎందుకో?
ముంజాల భిక్షపతి: సార్.. మీకంటే పెద్దోళ్లం కాదు. మీతో మాట్లాడుదామని మొన్న రెండుమూడుసార్లు ఫోన్ చేసిన. పర్సనల్‌గా మాట్లాడుదామంటే మీరెప్పుడు బిజీగా ఉంటళ్లు.
మంత్రి చందూలాల్: నీకు.... మీరు బాగా బలిసున్నరు మీరు. ములుగులో వచ్చి రాజకీయాలు చేసి.. చిల్లరగాళ్లు, చిల్లర వ్యవహారం. లీడర్లుగా లేనిపోనివన్ని చేస్తున్నరు. నేను తలుచుకుంటే పేగులెళ్లుతయ్, తొక్కితే.
ముంజాల భిక్షపతి: లేద్సార్. అమ్మతోడు సార్, మిమ్మల్ని కలుస్తసార్. కావాలంటే మీ పీఏని అడగండి.
చందూలాల్: ఏం కలుస్తవయ్యా.... గాడిదికొడుకువి నువ్వు. నా మీద స్టేట్‌మెంట్లు ఇస్తావ్, జిల్లా సాధిస్తవ్, ....... వ్యవహారం ఏందయ్యా? నీ బతుకేందయ. నువ్వు జానెడు లేవు. నా పిలగాల్లకిస్తే నీ ...... నువ్వు నకరాలు చేస్తే. నువ్వు లీడరయినవా ములుగుకు. చిల్లర గాళ్లతోని.
ముంజాల భిక్షపతి: మీతో మాట్లాడుదామని ఫోన్ చేసిన. మీతోని కలుద్దామని.
చందూలాల్: ఏం మాట్లాడుతవ్. ...... ఏందీ నువ్వు మాట్లాడేది. నీతోని అయ్యేదేంది, నీతోని నాకు జరిగేదేంది. నా నెత్తిలకెళ్లి పీక్కునేదేందీ. ఏ పీక్కున్నవ్.
ముంజాల భిక్షపతి: అట్లేం లేద్సార్
చందూలాల్:........... వ్యవహారం చేయోద్దు బిడ్డ. నకరాలు చేయొద్దు. ఎవని జాగల వాడు బతకాలే. లేకుంటే ......... నిన్ను ఆదుకునేటోడు ఎవ్వడూ లేడు. ఆ కుమారు గాడు సాయిత,... వాని సాయిత.... లతోని జిల్లా సాధిస్తవారా నువ్వు.
ముంజాల భిక్షపతి: వాళ్లతోని అయితదాసార్, అట్లయితే మీకు ఫోన్ ఎందుకు చేస్త సార్.
చందూలాల్: ...... నువ్వు నువ్వు జిల్లా సాధిస్తవారా. నీ బతుకేందిరా. నీ బతుకేందిరా... నువ్వు నీఊర్ల అన్ని దోపిడీ చేసి, ఈ ములుగుకు వచ్చి రాజకీయాలు చేసి, నకరాలు చేస్తన్నవా ? నీకు బతుకు నాకు తెల్వదా ?
ముంజాల భిక్షపతి: నా బతుకు మీకు తెల్వదా సార్
చందూలాల్: నువ్వు, నువ్వు జిల్లా సాధిస్తవారా నువ్వు, నా మీద కామెంట్ చేసేటోనివయినవా నువ్వు.
ముంజాల భిక్షపతి: మీరే సాదిస్తర్ సార్, మతోని అయితదా సార్
చందూలాల్: నీ బతుకెంతరా, నీ బతుకెంత.
ముంజాల భిక్షపతి: మీరు లేకపోతే జిల్లెట్లయితది కానీ...
చందూలాల్: మరి ఎందుకు చేసినవ్. ఎన్ని కథల్ చేసినవ్ నువ్వు, ఎన్ని మాటల్ చేసినవ్ నువ్వు.
మంజాల భిక్షపతి: వాస్తవమేకానీ, మీరు లేకపోతే జిల్లా కాదని అన్ననా సార్.
చందూలాల్: నీ బతుకేందీ, నీ వ్యవహారమేందీ, నయాపైసా పనికి రావు బిడ్డ నువ్వు, నేను తలచుకుంటే. ములుగుల కూడా ఉండలేవు.
ముంజాల భిక్షపతి: మీరు తలుసుకుంటేనే జిల్లా అయితది
చందూలాల్: నువ్వు ఎవడ్రా? నన్ను అడిగేతందుకు.
నేనే తిట్టిన
బాగా తాగి రాత్రి పది గంటలకు నాకు ఫోన్ చేసిండు. వాడికి నాకు సంబంధం లేదు. నా కార్యకర్త కాదు. అప్పుడుప్పుడు ములుగు బజార్ల తిరుగుతుంటడు. భార్యకు ఉద్యోగం ఇప్పియ్యలేదు, జిల్లా తేలేదు అని నాతో ఆర్గ్యుమెంటు చేసిండు. రాత్రి పూట ఫోన్ చేసుడేంది, నీ భార్యకు ఉద్యోగం ఇయ్యమని అడుగుడేంది అని అడిగితే నక్రాలు చేసిండు. బాగా తిట్టిన. వాడెవడు జిల్లా తెమ్మని నన్ను అడగడానికి. వాడో మిలిటెంట్, పెద్ద బ్రోకర్ వాడు. రాత్రి పూట పదిగంటల తర్వాత ఫోన్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడిండు. వానిమీద పోలీసు స్టేషన్ల కేసు పెడత. – మంత్రి చందూలాల్
హెచ్చార్సీకి పోతా
మేడారం జాతర వస్తుంది. ఈ సందర్భంగా ములుగు కేంద్రంగా సమ్మక్క– సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలని కోరేందుకు మంత్రికి ఫోన్ చేశా. దీనికే నన్ను తిట్టాడు. బెదిరించాడు. మంత్రి చందూలాల్ నుంచి నాకు ప్రాణహాని ఉంది. నాకు రక్షణ కావాలి. అందుకే మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తాను.
– ముంజాల భిక్షపతి