- ఆ లోపు మరమ్మతులు పూర్తి చేయూల్సిందే...
- మునిసిపల్ ఇంజనీర్లకు డీప్యూటీ సీఎం కడియం ఆదేశం
- వారి పనితీరు బాగాలేదని అసహనం.. ఆగ్రహం
- ఒక్కో డీఈకి ఒక్కో మార్కెట్‌ను దత్తత ఇవ్వాలని సూచన
హన్మకొండ అర్బన్ : నగర పాలక సంస్థ పరిధిలో తాగునీటి పై ప్‌లైన్లకు ఏర్పడ్డ 600 లీకేజీలను 15 రోజుల్లో మరమ్మతులు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. వేసవిలో నగరవ్యాప్తంగా ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడాల్సిన బాధ్య త అధికారులపై ఉందన్నారు.
వరంగల్ మహా నగరపాలక సంస్థ పనితీరుపై గురువారం ఆయ న హన్మకొండలోని కలెక్టరేట్‌లో సమీక్షించారు. కొందరు అధికారుల వద్ద సరైన సమాచారం లేకపోవడం పట్ల శ్రీహరి అసహనంతోపాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నగర పాలకసంస్థలో ఎంత మంది ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారంటూ అడిగిన శ్రీహరి.. ఆ వివరాలు చెబుతుండగానే అసలు మీ (కార్పొరేషన్) ఆదా యం ఎంత.. మీ ఆదాయానికి ఇంత మంది ఇంజనీరింగ్ అధికారులు అవసరమా అంటూ ప్రశ్నించారు. వరంగల్ ఈఈ పరిధిలోని 100 లీకేజీలు, హన్మకొండ ఈఈ పరిధిలోని 500 లీకేజీలను టెండర్లతో సం బంధం లేకుండా మరమ్మతు చేయాలన్నారు.
ఎంపీగా ఉన్నప్పుడు చెప్పిన పని..
తాను ఎంపీగా ఉన్నప్పుడు హన్మకొండ మండలంలోని అయోధ్యాపురం నీటి సమస్యను నేరుగా అధికారులకు ఫోన్‌చేసి వివరించానని.. ఆరు నెలలవుతున్నా ఆ సమస్య పరిష్కారం కాలేదంటే అధికారుల పనితీరు ఏంటో తెలుస్తోందని కడియం మండిపడ్డారు. అవసరాన్ని బట్టి బావులు, బోర్లు అద్దెకు తీసుకోవాలని, నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయూలని సూచించారు.
వారి పని తీరుపై సమీక్షించండి..
నగర పాలక సంస్థలోని ఇంజనీరింగ్ అధికారులు పని తీరు సక్రమంగా లేదని, వారి పని తీరును సమీక్షించి చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను శ్రీహరి ఆదేశించారు. నగరంలో పండ్ల మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, మటన్, చికెన్ మార్కెట్ల కోసం స్థల కేటాయింపులు పూర్తిచేయాలన్నారు. కుమార్‌పల్లి మార్కెట్‌లో కొనుగోలు దారులకు నరకం కనిపిస్తోందని, నిర్వహణ తీరు మారాల్సి ఉందని, ఈ విషయం లో అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఒక్కో డీఈకి ఒక్కో మార్కెట్‌ను దత్తత ఇవ్వాలని కమిషనర్‌కు సూచించారు.
నిర్లక్ష్యం వీడకుంటే చర్యలు : కలెక్టర్
వేసవి వచ్చి నెలన్నర అవుతున్నా.. పైపులైన్ల లీకేజీలను మరమ్మతు చేయకుండా నిర్లక్ష్యంగా ఉం డడంపై కలెక్టర్ కరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు స్వయంగా చెప్పినా... అధికారులు స్పందిచకపోవడం సరికాదన్నారు. పని తీరు మారకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కమిషనర్ అహ్మద్ మాట్లాడు తూ మార్కెట్‌లో చెత్త సేకరణకు ఒక వాహనం, డివిజన్‌కు ఒక ట్రాక్టర్ కేటాయిస్తామని తెలి పారు. శానిటేషన్ వ్యవస్థ మెరుగుకు చర్యలు తీసుకుంటామని, స్వయంగా మార్కెట్ స్థలాలు సందర్శించి సిబ్బందికి తగు ఆదేశాలు ఇస్తామన్నారు.
గరం గరంగా గ్రేటర్ సమీక్ష 600 లీకేజీలు..15 రోజులు
Published Fri, Apr 24 2015 3:02 AM | Last Updated on Tue, Oct 2 2018 8:13 PM
Advertisement
Advertisement