పర్వతగిరికి డిప్యూటీ సీఎం మార్క్ | Deputy CM Mark to parvatagiri | Sakshi
Sakshi News home page

పర్వతగిరికి డిప్యూటీ సీఎం మార్క్

Published Mon, Aug 24 2015 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

Deputy CM Mark to parvatagiri

సాక్షి కథనానికి కడియం శ్రీహరి స్పందన
సాక్షిలో వచ్చిన అన్ని పనులకు గ్రీన్ సిగ్నల్

 
పర్వతగిరి :పుట్టిన ఊరికి తన మార్క్ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, ప్రజలు గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరగా పర్వతగిరిని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. సాక్షిలో ప్రచురితమైన కథనాలకు కడియం స్పందిం చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్‌లో గ్రామజ్యోతిలో భాగంగా సర్పంచ్ గోనె విజయలక్ష్మి అధ్యక్షత ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి కడియం ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలు సమస్యలపై ‘అయ్యా మా మొర అలకిం చరూ..’ అనే శీర్షికతో ప్రచురితమైన సాక్షి కథనాన్ని కడియం చదివారు. స్పందించి ఆరు నెలల్లో ఈ పనులన్నీ చేయటానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.

 ఓహెచ్‌ఎస్‌ఆర్ కింద రూ. 34 లక్షలను తక్షణమే మం జూరు చేరుుస్తున్నట్లు, 15 రోజుల్లో ఎమ్మెల్సీ నిధుల కింద రూ.25 లక్షల మంజూరుకు హామీ ఇచ్చారు. శ్మాశనవాటికకు పది లక్షలతో పనులను చేయిస్తున్నట్లు తెలిపారు. రూ. 54కోట్లతో ఊకల్ నుంచి తొర్రూర్ వరకు 53 కిలోమీటర్లలో డబుల్ రోడ్డు విస్తరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రంలో జెడ్పీటీసీ మాదసి శైలజా, ఎంపీపీ రంగు రజిత, ఎంపీటీసీ రాయపురం రమేష్, ఆర్‌డీఓ మాధవరావు, వర్ధన్నపేట స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వెంకయ్యనాయుడు, తహసీల్దార్ మాధవి, ఎంపీడీవో కృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి రమేష్, టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏడుద్డొడ్ల జితేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాటి రతన్‌రావు, మట్టపల్లి ప్రవీణ్‌రావు, సర్పంచ్‌లు ఏర్పుల శ్రీనివాస్, ఎర్రబెల్లి వెంకటేశ్వర్‌రావు, కల్లెడ సర్పంచ్ శ్రీనివాస్, లూనవత్ బీలునాయక్, రాజు, జుంకజువ్వ కొంరమ్మ, సంద్యారాణి, ఎంపీటీసీలు ఈరగాని రాధిక, పట్టాపురం తిరుమల ఏకాంతంగౌడ్, మహిళ విభాగం మండల అధ్యక్షురాలు బరిగెల విజయ, టీఆర్‌ఎస్ నాయకులు జూలపల్లి దేవేందర్‌రావు, రంగు కుమారస్వామి, దద్దు రవి, జీడి గట్టయ్య, దూద రవి, జంగిలి బాబు, యాకయ్య,శ్యాం, ఈరగాని సాంబయ్య, బూర యాకయ్య, ప్రభాకర్‌రావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement