parvatagiri
-
45 రోజులు కాపురం చేశాక వద్దంటున్నాడు..
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బట్టు తండా 2 లో బాదావత్ అనిల్ కుమార్ ఇంటి ముందు అతని భార్య స్రవంతి ఆందోళన చేపట్టింది. చౌటపల్లి శివారు లచ్చ తండాకు చెందిన స్రవంతితో ఈ ఏడాది జనవరిలో అతనితో ప్రేమ వివాహం చేసుకుంది. అనిల్ కుమార్ ఇంటి ముందు నిరసన చేస్తున్న అతని భార్య స్రవంతి అయితే నెల 15 రోజులు కాపురం చేసిన అనిల్ కుమార్.. ఇప్పుడు తనను వద్దంటున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక గురువారం స్రవంతి తన భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. తన భర్తే కావాలంటూ తనకు న్యాయం చేయాలని ఆమె అధికారులు వేడుకుంది. -
వర్ధన్నపేటను ‘వరించని’ మంత్రి పదవి
సాక్షి, హసన్‌పర్తి: వరంగల్నగరం వర్ధన్నపేట నియోజకవర్గాన్ని విడదీస్తుంది. నాలుగు మండలాలతో విస్తీరించిన నియోజకవర్గంలో రెండు మండలాలు పూర్తిగా నగరానికి ఓవైపు..మరో రెండు మండలాలు మరోవైపు ఉన్నాయి. హన్మకొండ, హసన్పర్తికి చెందిన ప్రజలు వర్ధన్నపేటకు వెళ్లాలంటే.. వరంగల్ పశ్చిమ, వరంగల్‌తూర్పు నియోజకవర్గాలను దాటాల్సిందే. 1952లో వర్ధన్నపేట నియోజకవర్గం ఏర్పడింది. జనరల్‌గా ఉన్న ఈ నియోజకవర్గాన్ని 2009లో పునర్విభజన సందర్భంగా ఎస్సీకి రిజర్వ్ చేశారు. ఈ నియోజక వర్గంపై తొలిసారిగా పీడీఎఫ్ జెండా ఎగిరింది. పెండ్యాల రాఘువరావు ఈ నియోజక వర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రిజర్వ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా ఒకసారి మాత్రం ఉప ఎన్నికల అనివార్యమయ్యాయి. ఈ స్థానం నుంచి కాంగ్రెస్, టీడీపీలు చెరో మూడుసార్లు విజయం సాధించాయి. జనతాపార్టీ, ఇండిపెండెంట్లు, బీజేపీ రెండుసార్లు, టీఆర్ఎస్ ఒక్కసారి వర్ధన్నపేటపై జెండాను ఎగురవేశారు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. ఈ స్థానం నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు మూడుసార్లు గెలుపొందారు. మాజీ మంత్రి పురుషోత్తంరావు, మాచర్ల జగన్నాధం రెండుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. పురుష్తోతంరావు ఒక సారి ఎస్టీపీఎస్, మరోసారి స్వతంత్య్ర అభ్యర్థిగా గెలుపొందారు. మాచర్ల జగన్నాథం ఒకసారి జనతాపార్టీ, మరోసారి కాంగ్రెస్ పార్టీనుంచి విజయం సాధించారు. టి.రాజేశ్వర్‌రావు, వన్నాల శ్రీరాములు బీజేపీ తరఫున గెలుపొందారు. వర్ధన్నపేటపై పీడీఎఫ్ అభ్యర్థులు పెండ్యాల రాఘవరావు, ఏ.ఎల్.ఎన్.రెడ్డి వరుసగా గెలుపొందారు. కె. లక్ష్మీనర్సింహారెడ్డి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. 1957లో జరిగిన ఉప ఎన్నికలో ఎర్రబెల్లి వెంకట రామనర్సయ్య విజయం సాధించారు. ఈ నియోజకవర్గాన్ని కావాలనే పునర్విభజనలో ఎస్సీకి కేటాయించినట్లు పుకార్లు జరిగాయి. పక్క ప్రాంతాల్లో పోటీ చేస్తేనే పదవులు.. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఏ నాయకుడికీ ఇప్పటి వరకు పదవులు దక్కలేదు. ఇక్కడ నుంచి పోటీ చేసిన పురుషోత్తంరావు తర్వాత వరంగల్‌నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి బాధ్యతలు చేపట్టారు. తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పనిచేసి ఆ తర్వాత నగర మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎర్రబెల్లి స్వర్ణ సైతం ఎమ్మెల్యేగా ఓటమి పొంది... నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి 1994, 1999లో రెండు సార్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ దయాకర్‌రావుకు మంత్రి పదవి దక్కలేదు. కడియం శ్రీహరి ఈ ప్రాంతానికి చెందిన వారైనా పక్క నియోజకవర్గానికి వెళ్లి గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. పునర్విభజన పరిణామం.. పునర్విభజనకు ముందు వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, రాయపర్తి మండలాలు ఉన్నాయి. జనరల్‌గా ఉన్నప్పుడు ఈ స్థానం టీడీపీ కం చుకోటగా ఉండేది. ఈ నియోజకవర్గాన్ని పునర్విభజనలో ఎస్సీకి రిజర్వ్‌చేశారు. జనరల్‌గా ఉన్న వర్ధన్నపేటను మూడు ముక్కలుగా విభజించారు. ఈ నియోజకవర్గం లో ఉన్న రాయపర్తిని పాలకుర్తిలో, సంగెంను పరకాల నియో జకవర్గంలో విలీనంచేశారు. హన్మకొండ నియోజకవర్గంలో ఉన్న హసన్‌పర్తి, హన్మకొండ రూరల్ మండలాలను వర్ధన్నపేటలో విలీనం చేశారు. దీంతో వర్ధన్నపేట, పర్వతగిరి, హన్మకొండ రూరల్, హసన్‌పర్తి మండలాలతో వర్ధన్నపేట నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. కొత్తగా ఏర్పడిన వర్ధన్నపేట నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కొండేటి శ్రీధర్ విజయం సాధించారు. రాజకీయంగా పర్వతగిరికి ప్రత్యేక స్థానం ... రాజకీయంగా పరిశీలిస్తే వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరికి ప్రత్యేకస్థానం ఉంది. ఈ మండలానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులతో పాటు ఇతర రాష్ట్రస్థాయి పదవులు అలంకరించారు. టీడీపీ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి పర్వతగిరికి చెందినవారు. ఇదే మండలం కొంకపాకకు చెందిన పురుషోత్తంరావు కాంగ్రెస్ తరఫున వరంగల్ నుంచి పోటీచేసి గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. దీంతో పాటు మారుమూల ప్రాంతాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. పాలకుర్తి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్వతగిరికి చెందినవారు. ఎంపీ వినోద్‌కుమార్ స్వస్థలం పర్వతగిరి మండలం ఏనుగల్లు. అరూరికి భారీ మెజార్టీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ పోటీచేశారు. సుమారు 87వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో రెండోస్థానంలో నిలిచారు. ఇద్దరు మేయర్లుగా వర్ధన్నపేట వాసులే... నగర మేయర్లుగా పనిచేసిన ఇద్దరు ప్రముఖులు వర్దన్నపేట వాసులే. ఇద్దరు కూడా సమీప బంధువులే. ఇందులో ఒకరు తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు కాగా, మరొకరు ఎర్రబెల్లి స్వర్ణ. తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు బీజేపీనుంచి మేయర్‌గా ఎన్నిక కాగా, ఎర్రబెల్లి స్వర్ణ కాంగ్రెస్ నుంచి మేయర్ పదవి చేపట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పొన్నేలుకు చెందిన వారు. బీజేపీ జాతీయ నాయకుడు పేరాల చంద్రశేఖర్‌రావు ల్యాబర్తికి చెందిన వారు. తెలుగుదేశం హయాంలో రోడ్ల భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన సంగంరెడ్డి సత్యనారాయణ (ముచ్చర్ల సత్యనారాయణ)çస్వస్థలం హసన్‌పర్తి మండలం ముచ్చర్ల గ్రామం. సత్యనారాయణ మాత్రం వరంగల్పశ్చిమ (పాత హన్మకొండ)నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. -
పర్వతగిరికి డిప్యూటీ సీఎం మార్క్
సాక్షి కథనానికి కడియం శ్రీహరి స్పందన సాక్షిలో వచ్చిన అన్ని పనులకు గ్రీన్ సిగ్నల్ పర్వతగిరి :పుట్టిన ఊరికి తన మార్క్ ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, ప్రజలు గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరగా పర్వతగిరిని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. సాక్షిలో ప్రచురితమైన కథనాలకు కడియం స్పందిం చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో గ్రామజ్యోతిలో భాగంగా సర్పంచ్ గోనె విజయలక్ష్మి అధ్యక్షత ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి కడియం ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలు సమస్యలపై ‘అయ్యా మా మొర అలకిం చరూ..’ అనే శీర్షికతో ప్రచురితమైన సాక్షి కథనాన్ని కడియం చదివారు. స్పందించి ఆరు నెలల్లో ఈ పనులన్నీ చేయటానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. ఓహెచ్ఎస్ఆర్ కింద రూ. 34 లక్షలను తక్షణమే మం జూరు చేరుుస్తున్నట్లు, 15 రోజుల్లో ఎమ్మెల్సీ నిధుల కింద రూ.25 లక్షల మంజూరుకు హామీ ఇచ్చారు. శ్మాశనవాటికకు పది లక్షలతో పనులను చేయిస్తున్నట్లు తెలిపారు. రూ. 54కోట్లతో ఊకల్ నుంచి తొర్రూర్ వరకు 53 కిలోమీటర్లలో డబుల్ రోడ్డు విస్తరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రంలో జెడ్పీటీసీ మాదసి శైలజా, ఎంపీపీ రంగు రజిత, ఎంపీటీసీ రాయపురం రమేష్, ఆర్డీఓ మాధవరావు, వర్ధన్నపేట స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వెంకయ్యనాయుడు, తహసీల్దార్ మాధవి, ఎంపీడీవో కృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి రమేష్, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏడుద్డొడ్ల జితేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాటి రతన్‌రావు, మట్టపల్లి ప్రవీణ్‌రావు, సర్పంచ్‌లు ఏర్పుల శ్రీనివాస్, ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, కల్లెడ సర్పంచ్ శ్రీనివాస్, లూనవత్ బీలునాయక్, రాజు, జుంకజువ్వ కొంరమ్మ, సంద్యారాణి, ఎంపీటీసీలు ఈరగాని రాధిక, పట్టాపురం తిరుమల ఏకాంతంగౌడ్, మహిళ విభాగం మండల అధ్యక్షురాలు బరిగెల విజయ, టీఆర్ఎస్ నాయకులు జూలపల్లి దేవేందర్‌రావు, రంగు కుమారస్వామి, దద్దు రవి, జీడి గట్టయ్య, దూద రవి, జంగిలి బాబు, యాకయ్య,శ్యాం, ఈరగాని సాంబయ్య, బూర యాకయ్య, ప్రభాకర్‌రావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
వంద గ్రామాలకు కరెంట్ కట్
14 సబ్స్టేషన్ల పరిధిలో అంధకారం వర్షం మిగిల్చిన నష్టం రూ.14.43 కోట్లు హన్మకొండ, న్యూస్‌లైన్: జిల్లాలో కురిసిన అకాల వర్షంతో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తమైంది. 14 సబ్స్టేషన్ల పరిధిలోని గ్రామాలన్నీ బుధవారం రాత్రి వరకూ అంధకారంలోనే మగ్గుతున్నాయి. మొత్తం 28 సబ్స్టేషన్లు వర్షం తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా చేసే డీటీఆర్లు వర్షం నీటితో కాలిపోయాయి. ప్రధాన లైన్లల్లో కండక్టర్ వైరు ఎక్కడికక్కడే తెగిపోయింది. దీంతో సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖకు మొత్తం రూ.14.43 కోట్ల నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల పునరుద్ధరణ కోసం రూ.8 కోట్లు అవసరమని ప్రాథమికంగా గుర్తించారు. పర్వతగిరి మండలం ఏనుగల్లు తండా వద్ద ట్రాన్స్‌కో నుంచి వచ్చే 222 కేవీ లైను తెగిపోయింది. దీం తో కొన్ని గంటల పాటు జిల్లాకు సరఫరా ఆగిపోయింది. అధికారులు ప్రత్యామ్నాయంగా మరో ఫీడర్పై సరఫరాను పునరుద్ధరించారు. బుధవారం రాత్రి వరకు 14 సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. కానీ... మరో 14 సబ్‌స్టే షన్ల పరిధిలో మరమ్మతులు ముందుకు సాగడం లేదు. తీగరాజుపల్లి, సంగెం, చౌటపల్లి, ఏనుగల్లు, పర్వతగిరి, ద్వారకపేట, కూనూర్, వెంకటాపూర్, రెడ్లవాడ, అలంకానిపేట, లింగగిరి, ఉప్పరపల్లి, గూడూర్, నెక్కొండ సబ్స్టేషన్లలో బుధవారం రా త్రి వరకూ మరమ్మతులు పూర్తి కాలేదు. రాత్రి కావడంతో వి ద్యుత్ పనులు నిలిపివేశారు. దీంతో ఈ సబ్స్టేషన్ల పరిధిలో సుమారు 100కుపైగా గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. నేలకూలిన స్తంభాలు జిల్లాలో ప్రధాన లైన్ ఈసారి దెబ్బతిన్నది. 11.2 కిలోమీటర్ల కండక్టర్ వైరు తెగిపోయింది. సబ్స్టేషన్ల నుంచి ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ సరఫరా చేసే ఈ లైను తెగిపోవడంతో సరఫరా పునరుద్ధరణ కష్టంగా మారింది. అదే విధంగా 28 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. వీటిలో అత్యవసరంగా 9 డీటీఆర్ (ట్రాన్స్ఫార్మర్ల)ను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారు. 11కేవీ లైన్ల పరిధిలో 44 పెద్ద విద్యుత్ స్తంభాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వీటి పునరుద్ధరణకు మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక జిల్లాలో విద్యుత్ సరఫరా చేసే ఎల్టీ లైన్ల పరిధిలో 1059 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వీటి స్థానంలో కొత్త స్తంభాలు వేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్తంభాలు అనుకున్న సమయంలో రాకపోవడంతో లైన్లు కూడా పునరుద్ధరించడం లేదు. 11కేవీ స్తంభాలతో రూ.88 వేలు, ఎల్టీ లైన్ల పరిధిలో 1059 స్తంభాలు నేలకూలడంతో రూ.16.94 లక్షలు, 28 సబ్స్టేషన్లు తీవ్రంగా దెబ్బతినడంతో రూ.14 కోట్లు, 28 డీటీఆర్ ట్రాన్స్పార్మర్లు కాలిపోవడంతో రూ.13.50 లక్షలు, 11.2 కిలోమీటర్ల కండక్టర్ వైరు తెగిపోవడంతో రూ.11 లక్షల నష్టం వాటిలినట్లుగా అంచనా వేశారు.