
ఉద్యమంలో ఆటోడ్రైవర్ల పాత్ర మరువలేం..
- తెలంగాణ కోసం 22 మంది అమరులయ్యారు
- ఆటోడ్రైవర్ల ప్రథమ మహాసభలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
హన్మకొండ చౌరస్తా : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆటోడ్రైవర్ల పాత్ర మరిచిపోలేనిదని, ఉద్యమంలో రాష్ట్రంలో 22 మంది ఆటోడ్రైవర్లు ఆత్మబలిదానాలు చేసుకుంటే అందులో కేవలం జిల్లాలోనే 11మంది అమరుల య్యారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నా రు. హన్మకొండలోని ఏనుగులగడ్డ(ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం)లో శనివారం తెలంగాణ ఆటోడ్రైవర్ల ప్రథమ మహాసభ జరిగింది. వేలాదిగా తరలివచ్చిన ఆటోడ్రైవర్లనుద్దేషించి కడియం శ్రీహరి మాట్లాడారు. స్వరాష్ట్రం కోసం 5లక్షల మంది ఆటోడ్రైవర్లు ఉద్యమంలో భాగస్వాములు అయ్యారని గుర్తు చేశారు.
ఎక్కువ శాతం దళిత, బలహీన వర్గాల వారే ఆటోడ్రైవర్లుగా ఉన్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందన్నా రు. వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రూ.77 కోట్ల మేర రోడ్‌ట్యాక్స్ మాఫీ చేశారన్నారు. డ్రైవర్ల భద్రత ఇన్సూరెన్స్, జీవిత బీమా సౌకర్యాల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ సందర్భంగా కడియం, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ను ఆటోడ్రైవర్లు సత్కరించారు. యూనియన్ నాయకులు మేకల రవీం దర్, ఈసంపెల్లి సంజీవ, కిషన్, రాజు, కలకోట జయరాం, మడికొండబాబు, ఎండీ యాకూబ్, పసునూరి బాబు, జిలుకరస్వామి, ఎండీ గయాస్, అన్వర్, మాతంగి స్వామి, గోవిందు మహేష్, బొచ్చురాజు, హరిచంద్రునాయక్, బత్తులరాజ్‌కుమార్, శంకర్, రమేష్, చక్రపాణి, మందభాస్కర్, నాగపురి రమేష్, వేల్పుల సతీష్, మైదం గిరిప్రసాద్, రవీందర్, సంజీవ పాల్గొన్నారు.