జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం
- డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి
హన్మకొండ : జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సో మవారం హన్మకొండలోని ప్రెస్‌క్లబ్ సొంత భ వనాన్ని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్‌తో కలిసి ప్రా రంభించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో వివిధ రంగాల్లో జిల్లా వెనుబడి ఉందని తేలిందని, దీని పునర్మాణానికి కృషి చేద్దామన్నారు. పేద వర్గానికి చెందిన తాను రాజకీయాల్లో నిలదొక్కుకోవడంలో జర్నలిస్టుల సహకారం ఎంతో ఉందన్నారు.
స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జిల్లా జర్నలిస్టులు పోషించిన పాత్ర అద్వితీయమైనదన్నారు. ప్రెస్‌క్లబ్‌లోఇతర నిర్మాణాలకు నియోజక అభివృద్ధి నిధుల నుంచి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ మాట్లాడు తూ జిల్లా జర్నలిస్టులు ఉత్తేజపూరిత ఉద్యమాన్ని నిర్వహించారన్నారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు మజీథియూ వేజ్‌బోర్డును అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గుంటిపల్లి వెంకట్, కార్యదర్శి దుంపల పవన్, టీఎస్‌యూడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు పిన్న శివకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంతు రమేశ్, టీయూడబ్ల్యుజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, జర్నలిస్టు సంఘాల నాయకులు దాసరి కృష్ణారెడ్డి, కె.మహేందర్, పిట్టల రవీందర్, పీవీ కొండల్‌రావు పాల్గొన్నారు.