District Development
-
కడపలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం
-
యువ సారథులు; అందరూ 35 ఏళ్లలోపు వారే
సాక్షి, అనంతపురం: నలుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్, ఒక ఐఎఫ్ఎస్.. అందరూ 35 ఏళ్ల లోపు వయసున్న వారే. కేవలం జీతం కోసం కాకుండా వృత్తిధర్మాన్ని చాటేలా తమ విధులను నిర్వర్తిస్తూ.. జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు తీయించేందుకు వీరంతా శ్రమిస్తున్నారు. కలెక్టర్‌గా గంధం చంద్రుడు.. జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా.. పాలనలో తనదైన ప్రత్యేకత కనిపించేలా విధులు నిర్వర్తిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు... రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన దిశగా జాయింట్ కలెక్టర్ నిశాంతకుమార్, సచివాలయ సేవలు ప్రజల ముంగిటకే చేర్చే దిశగా మరో జాయింట్ కలెక్టర్ ఎ.సిరి, అటవీ సంరక్షణ, అటవీ భూముల పరిరక్షణ లక్ష్యంగా డీఎఫ్ఓ జగన్నాథ్ సింగ్, పెనుకొండ రెవెన్యూ డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపించడమే ధ్యేయంగా సబ్ కలెక్టర్ నిషాంతి.. ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వీరి బృహత్ చర్యల వల్ల రాష్ట్రంలోనే ‘అనంత’ జిల్లా ప్రత్యేకతను చాటుకుంటోంది. అభివృద్ధి.. సంక్షేమం రెండు కళ్లు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించే దిశగా కలెక్టర్ గంధం చంద్రుడు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ►అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా తన విధులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ►అంశాల వారీగా అధికారులతో సమీక్షిస్తూ.. తగిన కార్యాచరణతో జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ►ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ►జిల్లాలో 5 లక్షల మంది కూలీలకు పనులు కల్పించడాన్ని లక్ష్యంగా నిర్ధేశించుకుని, ఇప్పటి వరకూ 3.77 లక్షల మందికి ఉపాధి పనులు కల్పించారు. ఈ నెలాఖరులోగా లక్ష్యం పూర్తి చేసే దిశగా సంబంధిత అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ►సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం, సచివాలయ వ్యవస్థ ద్వారా సేవలు ప్రజలకు అందించడం లక్ష్యంగా అధికారులను నడిపించడం... ప్రతి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా ప్రజలకు చేరువ చేయడంలో కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాంతిభద్రతలే ఊపిరిగా.. -సత్యయేసుబాబు, ఎస్పీ ►శాంతి భద్రతల అదుపులో ఉన్నపుడే ప్రజలకు సంపూర్ణ రక్షణ ఉంటుందని బలంగా విశ్వసించే పోలీస్ ఉన్నత స్థాయి అధికారి ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు. ►ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, రాజకీయ గొడవలు చోటు చేసుకోలేదు. ►విధుల పట్ల ఆయన తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉన్నా.. ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షణలో అవి ఎంతో కీలకంగా మారాయి. ►కేవలం ప్రజలే కాకుండా శాఖలోని ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా ఆలోచిస్తూ.. పోలీసు ఉద్యోగుల మంచీచెడులకు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. ►ప్రతి వారం గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తూ, తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం చూపించారు. ►అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. ►జిల్లాలో మట్కాను కూకటివేళ్లతో పెకలించేందుకు కఠినంగా వ్యవహరించారు. ►పోలీసు శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ►కానిస్టేబుళ్ల బదిలీల విషయంలో విమర్శలకు తావివ్వకుండా కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించారు. ఎస్ఐల బదిలీ విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించారు. వ్యవస్థ ప్రక్షాళన దిశగా -నిశాంత్‌కుమార్, జేసీ ‘ప్రజలకు సత్వర మెరుగైన సేవలు అందించడం, సమస్యలకు నాణ్యమైన పరిష్కారాన్ని చూపేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తా’ అంటూ పేర్కొనే నిశాంత్‌కుమార్... ఈ నెల 14న జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ►జిల్లాలో రైతు భరోసా, రెవెన్యూ (ఆర్బీ అండ్ ఆర్), ఇతర విభాగాలను ఆయనకు కేటాయించారు. ►నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జిల్లాలో అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపట్టారు. ►రెవెన్యూ అంశాల్లోని లోపాలను సరిదిద్ది, సాంకేతిక పరిజ్ఞానం జోడించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే దిశగా సాహసోపేత నిర్ణయాలతో ముందుకు పోతున్నారు. ►ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అందుకు తగినట్లుగా కార్యాచరణను రూపొందించుకుని అమలు చేస్తున్నారు. ►రెవెన్యూ ఒక్కటే కాకుండా.. తనకు అప్పగించిన గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, పరిశ్రమలు, దేవాదాయ, నైపుణ్యాభివృద్ధి విభాగాలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు. పారదర్శకతకు పెద్దపీట - ఎ.సిరి, జాయింట్ కలెక్టర్ ‘ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల సంక్షేమ ఫలాలు చిట్టచివరి‡ అర్హుడికి చేరాలి. అప్పుడే ప్రభుత్వ ఉద్ధేశం నెరవేరుతుంది. సచివాలయాల ద్వారా ప్రభు త్వ సేవలు ప్రజల ముగింటకే అందించే దిశగా చర్యలు చేపట్టాం’ అపి అంటున్న అట్టాడ సిరి... జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఈ నెల 24న బాధ్యతలు స్వీకరించారు. ►గ్రామ/వార్డు సచివాలయలు, అభివృద్ధి (వీడబ్ల్యూఎస్‌డీ) విభాగాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ►సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హుల దరిచేర్చడంలో పారదర్శకత ఉండేలా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ►గ్రామ, వార్డు సచివాలయల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై ఇప్పటికే జెడ్పీ సీఈఓ, డీపీఓ, మున్సిపల్ కమిషనర్లతో నివేదికలు తెప్పించుకుని, అందులో లోటుపాట్ల గుర్తింపు, వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ►ప్రభుత్వ పథకాలను అర్హుల దరిచేర్చేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలతో ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని ముందుకు పోతున్నారు. ►తనకు అప్పగించిన ఇతర బాధ్యతలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు -టి.నిషాంతి, సబ్‌కలెక్టర్ ‘ప్రజలకు మెరుగైన సేవలు సత్వరం అందించడం అందరి లక్ష్యం. మన పరిసరాలు పరిశుభ్రంగా ఆకట్టుకునేలా ఉండాలనే ఉద్ధేశంతో ప్రహరీలపై చిత్రాలు వేయించా. పిల్లల నవ్వుల ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లలితకళల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం. తురకలాపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను’ అని చెబుతున్న నిషాంతి... పెనుకొండ సబ్‌కలెక్టర్‌గా గత ఏడాది సెపె్టంబర్లో బాధ్యతలు చేపట్టారు. ►కార్యాలయంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిచ్చారు. ►దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రజాసమస్యల దస్త్రాలను ఆగమేఘాలపై పరిష్కరించారు. ►నిషాంతి పనితీరు వల్ల ఫైల్ క్లియరెన్స్‌లో రాష్ట్రస్థాయిలో పెనుకొండ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఉత్తమ అవార్డు అందుకుంది. ► ప్రహరీలపై ప్రభుత్వ పథకాలను చిత్రీకరించడం ద్వారా ప్రజలను చైతన్య పరిచారు. ►నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కియా పరిశ్రమ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. విద్యార్హతకు తగిన ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు ఇప్పించారు. ►కరోనా ప్రభావిత హిందూపురంలో వైరస్ నియంత్రణకు రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు. అటవీ సంపద రక్షణలో.. - జగన్నాథ్‌సింగ్, డీఎఫ్ఓ ‘పచ్చదనం కాపాడినప్పుడే మానవ మనుగడ ఉంటుంది. అటవీ భూముల పరిరక్షణ, అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం’ అని అంటున్న జిల్లా అటవీశాఖ అధికారి జగన్నాథ్‌సింగ్ ఆ దిశగా పయనిస్తున్నారు. ►అటవీ సంరక్షణ, అటవీ భూముల పరిరక్షణ లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడమే కాక, వాటిని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ►గార్లదిన్నె, మరుట్ల, పెనకచర్ల డ్యామ్ ప్రాంతాల్లో అన్యాక్రాంతమైన 310 ఎకరాల అటవీ భూములను తాను బాధ్యతలు స్వీకరించిన అతి కొద్ది రోజుల్లోనే స్వాధీనం చేసుకున్నారు. ►అక్రమణలకు గురైన మరో 400 ఎకరాలు అటవీ భూములను స్వాదీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ►అటవీ భూముల ఆక్రమణలను నియంత్రించే దిశగా కఠినంగా వ్యవహరిస్తూ జిల్లాలో పూర్తి స్థాయిలో పచ్చదనం నెలకొల్పేందుకు శ్రమిస్తున్నారు. ►వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతున్నారు. ►అడవులు అగ్నికి ఆహుతి కాకుండా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా ఈ వేసవిలో అటవీ ప్రాంతాల్లో అగి్నప్రమాదాలు కట్టడి చేయగలిగారు. -
జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం
డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆదర్శ గ్రామాల సర్పంచ్‌లకు సన్మానం రాజమహేంద్రవరం సిటీ : గ్రామాలు అభివృద్ధి సాధించినప్పుడే జిల్లా ఆదర్శంగా తయారవుతుందని, గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగుకు సమష్టిగా కృషి చేయాలని డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. రెండేళ్ల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం పూర్తకావడంతో రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో ఆదివారం ‘ ఒక అడుగు స్వచ్ఛత వైపు’ కార్యక్రమం నిర్వహించారు. గాంధీ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని బహిరంగ మలమూత విసర్జన రహిత గ్రామాల సర్పంచ్‌లను సన్మానించారు. తొలుత గాంధీజీ విగ్రహానికి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వచ్ఛత వైపు అడుగులు చినరాజప్ప మాట్లాడుతూ ప్ర«ధాన మంత్రి మోదీ పిలుపు మేరకు స్వచ్ఛగ్రామాల వైపు అడుగులు వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యం మెరుగుకు సహకరించాలన్నారు. కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో సంపూర్ణ మలమూత్ర విసర్జన గ్రామాల్లో దుళ్ల గ్రామ సర్పంచ్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లాలోని 1069 పంచాయతీల్లో కేవలం 139 మాత్రమే మల,మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా గుర్తించబడ్డాయన్నారు. వచ్చే ఏడాది 250 గ్రామాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం 139 గ్రామాల సర్పంచ్‌లను ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పులవర్తి నారాయణరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ కే.పద్మ, డ్వామా పీడీ ఏ.నాగేశ్వరరావు పాల్గొన్నారు. సెంట్రల్ జైలులో రూ.ఆరుకోట్లతో ఆసుపత్రి రాజమహేంద్రవరం క్రైం : ఖైదీలకు సకాలంలో వైద్యసేవలు అందించేందుకు రూ.ఆరుకోట్లతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో హాస్పటల్ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు. సెంట్రల్ జైల్లో ఆదివారం ఖైదీల సంక్షేమ దినోత్సవం, గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ నేరాలను నియంత్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఖైదీలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నామని, శిక్ష పూర్తయి విడుదలైన తర్వాత బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, మంజూరైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఎంపీ మాగంటి మురళీ మోహన్, జైల్ సూపరింటెండెంట్ ఎం.వరప్రసాద్ మాట్లాడారు. అనంతరం ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కోస్తా రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ ఎం.చంద్రశేఖర్, డిఫ్యూటీ సూపరింటెండెంట్ ర ఘు, ఎస్.రాజారావు, సెంట్రల్ డీఎస్పీ కుల శేఖర్ పాల్గొన్నారు. -
గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుతో జిల్లా అభివృద్ధి
భోగాపురం : రాష్ట్రంలో విజయనగరం జిల్లా వెనుకబడిన ప్రాంతమని ముఖ్యమంత్రి గుర్తించి భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును ప్రతిపాదించారని గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. మండలంలో మంగళవారం పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ముందుగా తోటపల్లిలో రూ.1.28కోట్లతో నిర్మించిన బహుళ ప్రయోజన తుఫాను షెల్టరును, ముంజేరులో రూ.19.50లక్షలతో నిర్మించిన ప్రాధమిక పాఠశాల అదనపు తరగతి గదులను, భోగాపురంలో రూ.1.44కోట్లతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ గిడ్డంగిని, రావాడ పంచాయతీ కార్యాలయం ఆవరణలో రూ.3.75లక్షలతో నిర్మించిన ఆర్ఓ ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ముంజేరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంతో ఇక్కడివారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడనుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3800కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించుకుంటే మన జిల్లాలోనే 380కిలోమీటర్లు వేశామని చెప్పారు. గ్రామాల్లో భూగర్భజలాలు పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు తమ ఇంటివద్ద ఇంకుడు గుంతలు తవ్వాలని, గ్రామ పరిశుభ్రత కోసం గ్రామాల్లో ఇంటికో మరుగుదొడ్డి ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంచేందుకు జిల్లాలో 1.25కోట్లు మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందని, మొక్కలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంఎల్ఏ పతివాడ నారాయణస్వామి నాయుడు, మాజీ ఎంఎల్ఏ కిమిడి గణపతిరావు, భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాల ఎంపీపీలు కర్రోతు బంగార్రాజు, మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర్, జెడ్పీటీసీలు పడాల రాజేశ్వరి, ఆకిరి ప్రసాద్, పతివాడ అప్పలనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఢిల్లీకి బీజేపీ బృందం
జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులే లక్ష్యం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి నయీంనగర్: జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు సాధించేందుకు ఓరుగల్లు నుంచి 23 మంది ప్రతినిధులతో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సారథ్యంలో బీజేపీ బృందం ఢిల్లీకి వెళ్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 10,11,12 తేదీల్లో ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి పలు కొత్త పథకాల అమలు కోసం నిధులు మంజూరు చేయూలని కోరుతామన్నారు. వరంగల్‌లో నీటి పారుదల ప్రాజెక్ట్, టెక్స్టైల్ పార్క్‌ల నిర్మాణం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం విన్నవిస్తామని తెలిపారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ పరిశ్రమ, మల్లంపెల్లి, మానుకోట వద్ద సిమెంట్, ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. హృదయ్ పథకంలో మహబూబాబాద్‌ను చేర్చాలని, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఐ.ఐ.ఎం.ఏర్పాటు చేయూలని కోరుతామన్నారు. వరంగల్‌లో విమానాశ్రయం అంశంపై కేంద్ర పౌర విమానయూన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో చర్చిస్తామని వివరించారు. ఒడిశా నుంచి తెలంగాణ వరకు నిర్మించే ఆయిల్ టర్మినల్లో భాగంగా వరంగల్‌లో 94కోట్ల తో ఆయిల్ టర్మినల్ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. అనంతరం ఆయన పలు అంశాలపైనా మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం చీప్ లిక్కర్ ప్రవేశపెట్టడంతో గీతకార్మికుల ఉపాధికి ప్రమాదం ఏర్పడిందన్నారు. కరువుపై క్షేత్రస్థారుులో అధ్యయనం చేయూలన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెను సీఎం హేళన చేయడం సరికాదని పేర్కొన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలని కోరారు. 15న ఆందోళనలు చేస్తాం ఈ నెల 15న విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ చెల్లింపు కోసం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్లర్లను నియమించాలని సీఎంను కోరారు. పార్టీ నాయకులు కాసర్ల రాంరెడ్డి, పెదగాని సోమయ్య, కిసాన్‌మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భద్రాద్రి రాంచంద్రారావు,మహిళామోర్చా రాష్ట్ర కార్యదర్శి కూచన రవళి, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి తాళ్లపల్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం
- డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి హన్మకొండ : జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సో మవారం హన్మకొండలోని ప్రెస్‌క్లబ్ సొంత భ వనాన్ని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్‌తో కలిసి ప్రా రంభించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో వివిధ రంగాల్లో జిల్లా వెనుబడి ఉందని తేలిందని, దీని పునర్మాణానికి కృషి చేద్దామన్నారు. పేద వర్గానికి చెందిన తాను రాజకీయాల్లో నిలదొక్కుకోవడంలో జర్నలిస్టుల సహకారం ఎంతో ఉందన్నారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జిల్లా జర్నలిస్టులు పోషించిన పాత్ర అద్వితీయమైనదన్నారు. ప్రెస్‌క్లబ్‌లోఇతర నిర్మాణాలకు నియోజక అభివృద్ధి నిధుల నుంచి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ మాట్లాడు తూ జిల్లా జర్నలిస్టులు ఉత్తేజపూరిత ఉద్యమాన్ని నిర్వహించారన్నారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు మజీథియూ వేజ్‌బోర్డును అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గుంటిపల్లి వెంకట్, కార్యదర్శి దుంపల పవన్, టీఎస్‌యూడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు పిన్న శివకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొంతు రమేశ్, టీయూడబ్ల్యుజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, జర్నలిస్టు సంఘాల నాయకులు దాసరి కృష్ణారెడ్డి, కె.మహేందర్, పిట్టల రవీందర్, పీవీ కొండల్రావు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా
జిల్లా ఇన్చార్జి మంత్రి పరిటాల సునీత శ్రీకాకుళం సిటీ/ శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి తనవంతుగా కృషిచేస్తానని టీడీపీ జిల్లా ఇన్చార్జి మంత్రి పరిటాల సునీత అన్నారు. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతపురం జిల్లాకు ఇక్కడ పరిస్థితికి చాలా వ్యత్యా సం ఉందన్నారు. జిల్లాలోని టీడీపీ కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని చెప్పారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతిపేద కుటుంబంలో ఇస్తున్న రేషన్‌పై ఏటా *700కు పైగా అదనపు భారాన్ని ప్రభుత్వం మోస్తోందన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా 11 లక్షల రేషన్‌కార్డుల దరఖాస్తులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల మేర రేషన్ కార్డులు ఉండగా 8 లక్షల బోగస్ రేషన్ కార్డులను గుర్తించామన్నారు. రాష్ట్ర కార్మిక శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 24 వరకూ హైదరాబాదులో మహానాడు జరగనుందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మరచిపోతే మనుగడ ఉండదన్నారు. తోటపల్లి రిజర్వాయర్ ద్వారా 1.87 లక్షల ఎకరాలకు జూన్ నాటికి సాగునీరందిస్తామన్నారు. 2016 జూన్ నాటికి వంశధార రెండవదశ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికల పర్యవేక్షకుడు, ఎంపీ తోట నర్సింహం, ఎన్నికల పర్యవేక్షకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికతో పాటు ముఖ్యమైన కమిటీలు, అనుబంధ కమిటీల ప్రక్రియను ఆదివారం సాయంత్రానికి పూర్తి చేసి వాటి జాబితాలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ప్రభుత్వవిప్ కూన రవికుమార్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా అని, ఈ జిల్లాపై ప్రత్యేకదృష్టి సారించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పరిటాల సునీతను కోరారు. ఆర్థిక వనరులు, హైవే, ఇరిగేషన్, తాగునీరు, మౌలికవసతులు మెరుగుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ మంత్రి, ఎచ్చెర్ల శాసనసభ్యుడు కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల సభ్యత్వం దేశం పార్టీలో ఉందన్న విషయాన్ని తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి మాట్లాడుతూ పార్టీ పూర్వవైభవానికి, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, ఎమ్మెల్యేలు గౌతు శ్యామసుందర్ శివాజీ, గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి, ఇన్చార్జిలు నిమ్మక జయకృష్ణ, శత్రుచర్ల విజయరామరాజు, గొర్లె హరిబాబునాయుడు, బోయిన గోవిందరాజులు, ఎల్ ఎల్ నాయుడు, తలే భద్రయ్య, పి.వి.రమణ, కలిశెట్టి అప్పలనాయుడు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. సునీతకు ఘనస్వాగతం రాష్ట్ర పౌరసంబంధాల శాఖామంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పరిటాల సునీతకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం, ఏజేసీ పి.రజనీకాంతరావు, ఆర్డీవో బి.దయానిధి, డీఎస్వో సీహెచ్.ఆనంద్‌కుమార్ తదితరులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. -
జవాబుదారీతనంతో పని చేయండి
జిల్లా అభివృద్ధిపై పెదవి విరిచిన సీఎం లక్ష్యసాధనలో లోటు స్పష్టంగా కనిపిస్తోంది బడ్జెట్ ఇస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా పురోగతి లేదేం కార్పొరేట్ స్థాయిలో జీతాలు ఇస్తున్నా... ఫాస్ట్‌ట్రాక్‌లోకి వచ్చే వరకు జిల్లాలో సమీక్షలు కర్నూలు(అగ్రికల్చర్) : అన్ని శాఖలకు అవసరమైన బడ్జెట్ ఇస్తూ అధికారులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ లక్ష్యసాధనలో లోటు స్పష్టంగా కనిపిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జిల్లా అభివృద్ధిపై పెదవి విరిచారు. శనివారం రాత్రి 11 నుంచి 12.30 గంటల వరకు ముఖ్యమంత్రి స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో జిల్లా అభివృద్ధిపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో అట్టడుగున ఉందన్నారు. ఆ తర్వాతి స్థానం కర్నూలుదేనన్నారు. జిల్లా అభివృద్ధికి చేయాల్సినదంతా చేస్తున్నా ప్రగతి కనిపించడం లేదని జిల్లా యంత్రాంగంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేట్ స్థాయి జీతాలు ఇస్తున్నామని, ప్రతిఒక్కరూ జవాబుదారీత నంతో పనిచేసి జిల్లాను ప్రగతిపథంలోకి తీసుకురావాలన్నారు. కొన్ని అంశాల్లో కాకి లెక్కలు చూపుతున్నట్లు కనబడుతోందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇబ్బందికరంగా ఉందని.. అంకితభావంతో పని చేయాలన్నారు. అధికారులంతా విధి నిర్వహణలో కీలకపాత్ర పోషించి ఉన్నత లక్ష్యాలు సాధించి ఫాస్ట్‌ట్రాక్‌లోకి వచ్చే వరకు జిల్లాకు వచ్చి సమీక్షలు నిర్వహిస్తుంటానన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీరు-చెట్టు కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం అధిక ప్రాధాన్యతనిచ్చి భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ మాట్లాడుతూ జిల్లాలో 32.72 లక్షల హెక్టార్లకు సరిపడా నీటి నిల్వలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైందన్నారు. గ్రామాల వారీగా నీటి లభ్యతను బట్టి అనువైన ప్రదేశాల్లో డగౌట్పాండ్స్, ఫాంపాండ్స్, చెక్‌డ్యాంలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రానున్న నాలుగేళ్లలో కోటి మొక్కలు నాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సీఎం స్పందిస్తూ ప్రతి పనికి ప్రణాళిక మేరకు లెక్క ఉండాలని, లేకపోతే ఏమి చేసినా ప్రయోజనం ఉండదన్నారు. సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు.. ఎమ్మిగనూరు, బనగానపల్లె ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, బి.సి.జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సొమ్ము కేంద్రానిది.. సోకు బాబుది
సాక్షి, చిత్తూరు: జిల్లా అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పే సీఎం చంద్రబాబునాయుడు ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సొంత జిల్లాకు పైసా నిధులు విదల్చడం లేదు. పైగా ఆయన పాలనలో పంచాయతీలు విద్యుత్ బకాయిలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితికి దిగజారాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన దాంతోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడుతోంది. అభివృద్ధి పనులను పక్కనపెట్టి కేంద్రం ఇస్తున్న 13వ ఆర్థిక సంఘం నిధులను తాగునీటి అవసరాలకు వెచ్చించాల్సి వస్తోంది. జిల్లాలో 1,363 పంచాయతీలున్నాయి. వీటి అభివృద్ధికి ఫర్ క్యాపిటా గ్రాంట్‌తో పాటు ప్రొఫెషనల్ ట్యాక్స్, సీనరైజేస్ గ్రాంట్‌తో కూడిన నిధులు ఉన్నాయి. పన్నుల వసూళ్లు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. పన్నుల రూపంలో వచ్చే నిధులతో పంచాయతీల అభివృద్ధి సాధ్యమయ్యే పనికాదు. ఇందులో చాలామటుకు విద్యుత్ బిల్లులకే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తే తప్ప పంచాయతీలఅభివృద్ధి సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను తాగునీటి అవసరాలకు, గ్రామీణ రోడ్ల మరమ్మతులు, పరిశ్రమల మెయింటినెన్స్ తదితర వాటికి వినియోగించాల్సి ఉన్నా అలా జరగడం లేదు. పైసా ఇవ్వని బాబు ప్రభుత్వం.. 2014-15 ఏడాదికి సంబంధించి స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా కూడా నిధులు ఇవ్వడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో జిల్లా పంచాయతీలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కేవలం రూ.1,86,44,700 నిధులు మాత్రమే వచ్చాయి. పంచాయతీలకు ఫర్ క్యాపిటా గ్రాంట్ (తలకు నాలుగు రూపాయల వంతున) ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.66,13,800, ప్రొఫెషనల్ ట్యాక్స్ రూపంలో రూ.2,91,61,000, సీనరైజేస్ గ్రాంట్ రూ.1,08,02,300 వచ్చింది. ఈ లెక్కన మొత్తం కలిపితే రూ.4,65,77,100 మాత్రమే వచ్చింది. ఈ మొత్తం విద్యుత్ బకాయిల్లో పదో వంతుకు కూడా సరిపోలేదు. ఇక జిల్లా పరిషత్‌కు సంబంధించి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కేవలం రూ.55 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. ఈ నిధులు అధికారుల వాహనాల డీజిల్ ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి. కేంద్రం నిధులే దిక్కు.. జిల్లాకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 13వ ఆర్థిక సంఘం నిధులతో పాటు బీఆర్జీఎఫ్ కింద మొత్తం రూ.233,61,64,900 నిధులను విడుదల చేసింది. ఇందులో పంచాయతీలకు రూ.198 కోట్లు, జిల్లా పరిషత్‌కు రూ.40 కోట్లు, మండల పరిషత్‌కు రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఇక బీఆర్జీఎఫ్ కింద జిల్లా పరిషత్‌కు రూ.36 కోట్లు విడుదల చేసింది. ఈ లెక్కన ఇప్పటికే కేంద్రం జిల్లాకు రూ.233,61,64,900 నిధులను కేటాయించింది. ఈ నిధులతోనే బాబు ప్రభుత్వం నాటకమాడుతోంది. సొంత జిల్లాలో దాదాపు 3వేల గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నా పైసా విదల్చని ప్రభుత్వం కేంద్రం నిధులనే వాడుకుంటుండడం తెలిసిందే. చిన్నచిన్న అభివృద్ధి కార్యక్రమాలకు సైతం కేంద్రం నిధులనే వెచ్చిస్తున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులతోనే గ్రామపంచాయతీల పరిధిలో పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.130 కోట్లు విద్యుత్ బకాయిలను చెల్లించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. గ్రామాల్లో రోడ్లు, మరుగుదొడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు తదితర అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగే పరిస్థితి లేదు. జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి మాటలతో సరిపెడుతున్నారు. -
జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఐక్య పోరాటాలు
అనంతపురం సెంట్రల్ : జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరముందని వామపక్ష నాయకులు అభిప్రాయపడ్డారు. నగరంలోని డీఆర్డీఏ అభ్యుదయహాలులో సీపీఎం ఆధ్వర్యంలో ‘జిల్లా అభివృద్ధికై సమాలోచనలు’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన వర్క్‌షాపు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఓబులు మాట్లాడుతూ.. జిల్లాలో నీటి సౌకర్యాలను, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాల్సిన అవసరముందన్నారు. వీటితో పాటు ఇక్కడున్న ఖనిజ సంపద ఆధారంగా ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు నెలకొల్పేలా ఒత్తిడి పెంచాల్సి ఉందన్నారు. సీపీఐ సీనియర్ నేత ఎంవీ రమణ మాట్లాడుతూ.. జిల్లాలో అనేక ఏళ్లుగా కరువు నెలకొందన్నారు. దీన్ని శాశ్వతంగా రూపుమాపే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సీపీఐ ఎంఎల్ నాయకుడు పెద్దన్న మాట్లాడుతూ.. జిల్లాలో సమస్యలు శాశ్వతంగా పరిష్కారమై.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రజల్లో తిరుగుబాటు రావాల్సిన అవసరముందన్నారు. ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిపై ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరముందన్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేద్దామన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపడం వల్ల జిల్లా అన్ని రకాలుగా వెనుకబడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వామపక్ష పార్టీలు ఒకతాటిపైకి వచ్చి ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, అనంత సాగునీటి సాధన కమిటీ సభ్యులు బాషా, రామాంజనేయులు, నీటిపారుదలశాఖ ఇంజనీరు పాణ్యం సుబ్రమణ్యం, ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు నాగేశ్వరరావు, రామాంజనేయులు, న్యాయవాది నిర్మలమ్మ, డాక్టర్ ప్రగతి తదితరులు పాల్గొన్నారు. -
ఇన్‌చార్జిలే దిక్కు
జిల్లాలో పరిపాలన పడకేసింది. కీలకమైన శాఖలకు సైతం అధికారులు కరువయ్యారు. ప్రతి విభాగానికి ఇన్‌చార్జిలే దిక్కయ్యారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరిపాలన గాడి తప్పుతున్నా సరిదిద్దాలనే ఆలోచన పాలకుల్లో కలగడంలేదు. వెరసి జిల్లాలో అభివృద్ధి కుంటుపడుతోంది. సాక్షి, కడప : మండల స్థాయి కాదు.. నియోజకవర్గ స్థాయి అంతకన్నా కాదు.. జిల్లాస్థాయి అధికారులు. అందులోనూ ఆయా శాఖల్లో పనిచేసే కిందిస్థాయి అధికారులను పర్యవేక్షించే బాధ్యతతోపాటు, జిల్లా అభివృద్ధిలో కీలక భూమిక పోషించాల్సిన ఉన్నతాధికారుల నియామకంలో ప్రభుత్వ అలక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి, అరా అయితే ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ చాలా శాఖల్లో ప్రధాన అధికారులు లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఏడాదిగా వ్యవసాయశాఖకు ఇన్‌ఛార్జి జేడీ పల్లెలు అభివృద్ధి చెందాలంటే అందుకు రైతులే పట్టుగొమ్మలు. అలాంటిది వ్యవసాయ పరంగా రాణించాలంటే కీలక అధికారుల నియామకం తప్పనిసరి. ప్రభుత్వ పథకాలు రైతులకు సక్రమంగా చేరాలంటే వ్యవసాయ పరంగా ప్రతి సంద ర్భంలోనూ జిల్లాలో జాయింట్ డెరైక్టర్ (జేడీ) పాత్ర కీలకం. సుమారు ఏడాదికిపై ఇన్‌ఛార్జి జేడీనే కొనసాగిస్తున్నారు. ఎఫ్‌టీసీ డీడీగా పనిచేస్తున్న జ్ఞానశేఖరం వ్యవసాయశాఖ ఇన్‌ఛార్జి జేడీగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏడాదికి పైగా అవుతున్నా ప్రభుత్వం ఎందుకు రెగ్యులర్ జేడీ నియామకంలో జాప్యం చేస్తోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏజేసీ, పీఓ, డీసీహెచ్ఓ, సీఈఓ, ఆర్డీ పోస్టులకు ఇన్‌ఛార్జిలే దిక్కు జిల్లా అభివృద్ధిలో అదనపు జేసీ పాత్ర కూడా ప్రధానంగా ఉంటుంది. కడపలో పనిచేస్తున్న అదనపు జేసీ సుదర్శన్‌రెడ్డిని ప్రభుత్వం ఐదు నెలల క్రితం బదిలీ చేసింది. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్‌ఛార్జి ఏజేసీలే కొనసాగుతున్నారు. విద్యారంగంలో కీలకపాత్ర పోషించే రాజీవ్ విద్యా మిషన్‌కు సంబంధించి ప్రాజెక్టు ఆఫీసర్ నియామకంలో అధికారులను నియమించినా రాకుండా అటునుంచి అటే ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోతున్నారు. ప్రాజెక్టు ఆఫీసర్ వీరబ్రహ్మం తిరుపతికి బదిలీ అయిన నాటినుంచి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రతిభాభారతి ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా ఇంతవరకు రెగ్యులర్ అధికారి నియామకం జరగలేదు. వైద్య ఆరోగ్యశాఖ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రెగ్యులర్ ఆర్డీ లేక దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే డీసీహెచ్ఎస్గా కూడా ఇన్‌ఛార్జి అధికారే పనిచేస్తున్నారు. ఇలా వైద్య ఆరోగ్యశాఖలో కీలకమైన రెండు పోస్టుల్లోనూ ఇన్‌ఛార్జి అధికారులే పనిచేస్తుండటం గమనార్హం. జెడ్పీ సీఈఓను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో మరొక రెగ్యులర్ అధికారిని నియమించ పోవడంతో ఇన్‌ఛార్జితోనే కాలాన్ని నెట్టుకొస్తున్నారు. అలాగే ఉద్యాన శాఖలో డిప్యూటీ డెరైక్టర్‌ను, ఐజీ కార్ల్‌కు సంబంధించి రెగ్యులర్ డీడీని ఇంతవరకు ప్రభుత్వం నియమించలేదు. -
జిల్లా అభివృద్ధికి కోర్ గ్రూప్ ఏర్పాటు
స్పీకర్ కోడెల వెల్లడి పాతగుంటూరు: అభివృద్ధి విషయంలో రాజధాని ప్రాంతమైన గుంటూరును ఆదర్శ జిల్లా గా నిలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కోర్ గ్రూపును ఏర్పాటు చేసినట్లు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. బుధవారం ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కోర్ గ్రూపు మొదటి సమావేశం నిర్వహించామని చెప్పారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా సమ గ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తునట్లు వివరించారు. విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, గ్రామీణాభివృద్ధి ప్రధానాంశాలుగా ‘వాష్’ ప్రోగ్రామ్ రూపొందించామన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఆట స్థలం, ప్రహరీ, అదనపు గదుల నిర్మాణానికి, చెట్ల పెంపకానికి చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు దాతల సహాయ సహాకారాలు తీసుకోవాలని సూచించారు. దీనికోసం గ్రామ, మండల, నియోజకవర్గ స్థారుు ల్లో దాతలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. పాఠశాల స్థాయిలోనే పిల్లలకు సామాజిక స్పృహ, నైతిక విలువలు నేర్పితే సమాజం బాగుపడుతుందన్నారు. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలుకు సహకారం అందించటానికి ఇస్కాన్ సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. దీంతో విద్యార్థులకు పోషకవిలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అందుతుందని చెప్పారు. పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోర్ గ్రూప్ సమావేశం అనంతరం ఇస్కాన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ శ్రీధర్, డీఈవో శ్రీనివాసరెడ్డి, హౌసింగ్‌పీడీ సురేష్‌బాబు పాల్గొన్నారు. -
‘ప్రగతి’ దారులు చూపండి
* కలెక్టర్ల సమావేశంలో సీఎం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించాలని సీఎం కేసీఆర్ సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సూచించారు. సమావేశం అనంతరం కలెక్టర్ రొనాల్డ్ రోస్ జిల్లాకు సంబంధిం చిన వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి తగు ప్రతిపాదనలు పంపించాలని సీఎం ఆదేశించారు. ఈ పథకం కింద ఇంటింటికీ నల్లా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. దీంతోపాటు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువులు, కుంటల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. రూ. 3.35 కోట్లతో చేపట్టనున్న హరితహారం కార్యక్రమంలో జిల్లా అంతటా మొక్కలు నాటాలి. రహదారులు, భవనాల శాఖ పరిధిలో ని రోడ్ల అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధిం చిన పనులకు వెంటనే టెండర్లు పిలవాలి. సొంత భవనాలు లేని ప్రభుత్వ కార్యాలయాలకు వెంటనే సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి. శిథిలావస్థలో ఉన్నవాటిని మరమ్మతులు చేయాలి లేదా కొత్త భవనాలు నిర్మించాలి. ఆహార భద్రతా పింఛన్ల జాబితా రూపకల్పనలో, పింఛన్ల పంపిణీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తానికి జిల్లా సమగ్రాభివృద్ధికి కావల సిన పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం కలెక్టర్లకు సూచించారు. -
జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందించాలి
నెల్లూరు (దర్గామిట్ట): రాజకీయాలకతీతంగా జిల్లా అభివృద్ధికి ప్రతిఒక్కరూ తోడ్పాటునందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కోరారు. నగరంలోని నిప్పోసెంటర్లో శనివారం భారతరత్న సర్దార్‌వల్లభాయ్‌పటేల్ విగ్రహాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. తొలుత వల్లభాయ్పటేల్నగర్లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రిత్విక్ఎన్క్లేవ్గా ఉన్న ప్రాంతాన్ని సర్దార్‌వల్లభాయ్‌పటేల్ నగర్‌గా నామకరణం చేసినట్లు తెలిపారు. పటేల్ కాంస్య విగ్రహ ఏర్పాటుతో జీవితంలో ఎంతో సంతోషానిచ్చిందన్నారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడిన మహానీయుడుగా సర్దార్‌వల్లభాయ్‌పటేల్ చరిత్రలో నిలచారన్నారు. విగ్రహ ఏర్పాటుకు అవసరమైన నిధులను స్వర్ణభారత్‌ట్రస్ట్ నిర్వాహకురాలు దీపావెంకట్ సమకూర్చారని తెలిపారు. విగ్రహ నిర్వహణ బాధ్యతలను టయోటో షోరూం నిర్వహకులు చూసుకుంటారని చెప్పారు. జిల్లా అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగాస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నగరంలో ఆక్రమణలు తొలగింపునకు అందరూ పూర్తి సహకారమందించాలని తెలిపారు. భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, నగర పరిధిలో రింగ్‌రోడ్డు ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణాన్ని ఏ మేర విస్తరించాలో ప్రణాళికను తయారు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న డిపోను బైపాస్‌లోకి మార్చి ఆ ప్రాంతంలో టౌన్బస్డాండ్గా నిర్మాణాలు చేపడతామని చెప్పారు. నగరాన్ని విక్రమ సింహపురిగా మార్చేందుకు కార్పొరేషన్లో తీర్మానం చేయాలని సూచించారు. మినీబైపాస్ను సర్దార్వల్లభాయ్పటేల్రోడ్డుగా నామకరణం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగర అభివృద్ధి జరగాలంటే కొన్ని సంస్కరణలు జరగాలన్నారు. పేదలకు కొన్నిరకాల ఇబ్బందులు ఉండవచ్చన్నారు. జిల్లాలో విమానశ్రయం ఏర్పాటు అంత సులభతరం కాద ని తెలిపారు. వైఎస్సార్ జిల్లా ఓబులాపురం నుంచి రాపూరు మీదుగా కృష్ణపట్నంకు రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి మాట్లాడుతూ పటే ల్ విగ్రహాన్ని స్థాపించకపోవడం విచారకరమన్నారు. పటేల్ లేకుంటే సువిశాల సామ్రాజ్యం ఉండేదికాదన్నారు. పటేల్ విగ్రహస్థాపన నెల్లూరుకు గర్వకారణంగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర పురపాలకశాఖమంత్రి నారాయణ మాట్లాడుతూ పటేల్ విగ్రహావిష్కరణలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ నెల్లూరు అభివృద్ధేగాకుండా రాష్ట్ర అభివృద్ధికి వెంకయ్యనాయుడు తోడ్పాడునందించలన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రజలు వెంకయ్యనాయుడుపై కోటి ఆశలు పెట్టుకున్నారన్నారు. గతంలో ఆయన హాయాంలోనే జిల్లాలో అభివృద్ధి పనులు జరిగాయని గుర్తుచేశారు. నగర మేయర్ అజీజ్ మాట్లాడుతూ అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ వరప్రసాద్, చెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి, నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, కలెక్టర్ శ్రీకాంత్, జేసీ రేఖారాణి, నగర కమిషనర్ చక్రధరబాబు, ఎస్పీ సెంథిల్‌కుమార్, ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, వాకాటి నారాయణరెడ్డి, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు మేరిగ మురళీధర్, కార్పొరేటర్లు రూప్‌కుమార్ యాదవ్, జెడ్.శివప్రసాద్, దొడ్డపనేని రాజా, మేకల రజనీ, దీపావెంకట్, బీజేపీ నాయుకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, సురేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
సీఎం హోదాలో తొలిసారిగా
- ఇందూరుకు నేడు కేసీఆర్ రాక - రోజంతా సుడిగాలి పర్యటన - అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేతగా, ఆ త ర్వాత ఎన్నికల ప్రచార రథసారథిగా ఆయన జిల్లా కు పలుమార్లు వ చ్చారు. ముఖ్యమంత్రిగా మొ దటిసారిగా ప ర్యటించనుండ టం ప్రాధాన్యత సం తరించుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ రోజంతా వివి ధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో నిజామాబాద్‌ను ప్రత్యేకంగా కొనియాడే కేసీఆర్, బాల్కొండ నియోజకవర్గం మోతె ‘మట్టిముడుపు’ చరిత్రాత్మకమైనదంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే చేసే ప్రకటనలు, ప్రసంగంపై జిల్లా ప్రజలలో ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు జిల్లా లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా కలెక్టర్ రొనాల్డ్ రాస్, డీఐజీ సూర్యనారాయణ, ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషీ భారీ భద్రత, బందోబస్తు ఏర్పా టు చేశారు. రెండు రోజులుగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి తదితరులు పెద్దఎత్తున జన సమీకరణపై దృష్టి సారించారు. సీఎం పర్యటన ఇలా ఉదయం: ►11.00 గంటలకు రోడ్డుమార్గంలో ఆర్మూర్‌కు చేరుకుంటారు ►11.05 అధికారులు, అనధికారులతో పరిచయం ►11.30 రూ.114.11 కోట్ల మంచినీటి పథకానికి శంకుస్థాపన మధ్యాహ్నం: ►12.05 ఆర్మూరులో బహిరంగ సభ ►1.00 ఆర్మూరు నుంచి అంకాపూర్‌కు బయలుదేరుతారు ►1.15 అంకాపూర్‌లో రైతులతో ముఖాముఖి ►2.00 అంకాపూర్ నుంచి నిజామాబాద్‌కు బయలుదేరుతారు ►2.20 ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు ఇంటికి చేరుకుంటారు. అక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు ►3.00 బోర్గాం(పి) వద్ద విజయలక్ష్మి కళ్యాణవేదికలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు సాయంత్రం: ► 6.20 నర్సింగ్‌పల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు. ► 7.00 మెదక్ జిల్లా ఎర్రబెల్లికి బయలుదేరుతారు. -
జిల్లా అభివృద్ధికి సహకరించాలి
విశాఖ రూరల్ : జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరూ సహకరించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవాని కోరారు. జిల్లా పరిషత్ ద్వారా చేపట్టే అన్ని కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలయ్యేలా చూడాలని పంచాయతీరాజ్ అధికారులు, ఇంజినీర్లకు సూచించారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా తొలిసారిగా బాధ్యతలు చేపట్టానని, జెడ్పీ ద్వారా అమలు పరుస్తున్న కార్యక్రామలపై ఇప్పుడిప్పుడే అవగాహన ఏర్పరుచుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అనే బేధభావం లేకుండా అందరూ సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికారులు, ఉద్యోగులకు సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే సామరస్య పూర్వకంగా పరిశీలిస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న రోడ్లు, తాగునీటి పథకాలు, పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎం.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ జెడ్పీ, పంచాయతీరాజ్ వ్యవస్థలు అనే తేడా లేకుండా అందరూ పంచాయతీరాజ్ ఉద్యోగులనే భావనతో కలిసిమెలసి ముందుకు వెళ్లాలని సూచించారు. జిల్లా పరిషత్ ద్వారా అమలు పరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో సమర్ధవంతంగా అమలుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ కె.రవీంధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అన్నీ చేస్తా.. ఇప్పుడే కాదు
* హామీలు నెరువేరుస్తానంటూనే ఇబ్బందులున్నాని చెప్పిన సీఎం * రుణమాఫీపై నిలదీసిన ప్రజలు * ఆదాయం పెంచేందుకు అధికారుల నుంచి సూచనల స్వీకరణ * జిల్లాలో ముగిసిన చంద్రబాబు రెండు రోజుల పర్యటన సాక్షి, ఏలూరు : ‘ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నా. రాష్ట్ర విభజన జరగటంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. మనకు అప్పులు మిగి లాయి. వనరులు కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని అన్నీ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తా. దానికి మీరందరూ సహకరించాలి’ అని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఆయన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాల్లో పర్యటించారు. ఉదయం జిల్లా అధికారులతో జంగారెడ్డిగూడెంలోని ఆలపాటి గంగాభవాని కల్యాణ మండపంలో సమీక్ష జరిపారు. ఆర్థిక వనరుల పెంపుదలకు అధికారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. పర్యాటక పరంగా అభివృద్ధి చేయడంతోపాటు గోదావరిలో ఇసుక మేటలు తొలగించడం, వరి విత్తనాలు జిల్లాలోనే తయారు చేసుకోవడం, బీచ్‌ల అభివృద్ధి, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులు అవలంభించడం వంటి అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం సమీక్ష ముగించారు. తరువాత అనారోగ్యానికి గురైన చింతలపూడి నియోజకర్గ టీడీపీ కన్వీనర్ మండవ లక్ష్మణరావు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల మరణించిన ఏఎంసీ మాజీ చైర్మన్ నందిన హరిశ్చంద్ర నివాసానికి వెళ్లి అతని కుమారుడు సతీష్‌ను ఓదార్చారు. నరసన్నపాలెం నుంచి రోడ్ షో ప్రారంభించిన చంద్రబాబు అక్కడి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గిరిజన హక్కుల్ని కాపాడటంతోపాటు గ్రామాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సమస్యపై రైతులు వివరించడంతో ఆ శాఖ ఎస్ఈని పిలిచి పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ప్రతి ఫీడర్ వద్ద మీటర్లు పెట్టి ఏ ఫీడర్లో ఎంత విద్యుత్ వినియోగం జరిగిందో తానెక్కడుంటే అక్కడ తెలిసే ఏర్పాటు చేస్తున్నానని వివరించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కావాలనే కొందరు రాజకీయం చేశారని అయినప్పటికీ దానిని పూర్తి చేసేందుకు.. ముంపు మండలాలపై ఆర్డినెన్స్ తీసుకువచ్చేలా కృషి చేశామని చంద్రబాబు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా రాష్ట్ర విభజన చేయడం వల్ల అప్పులే మిగిలాయని, కనీసం ఇంటికో రుణమైనా మాఫీ చేయడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. దీనిపై ఆర్బీఐతో మాట్లాడుతున్నానన్నారు. దేశంలోనే అత్యున్నత రాజధానిని నిర్మిస్తానని చెప్పారు. ఈ సమయంలో ఓ రైతు కల్పించుకుని ‘రాజధాని సంగతి తర్వాత, ముందు రైతులను పట్టించుకోండి, పంటకు గిట్టుబాటు ధర రావడం లేద’నడంతో ప్రత్యేక నిధి సమకూర్చి ధరలను క్రమబద్దీకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సీతంపేట, బయ్యనగూడెంలో మహిళలు డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు చేస్తారంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. చేస్తానని, కొంత సమయం ఇవ్వాలని చెప్పిన చంద్రబాబు ముందుకు సాగారు. బయ్యనగూడెం సెంటర్లో మాట్లాడుతూ సెల్‌ఫోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి ఉపయోగించుకోవాలని సూచించారు. రౌడీలుంటే తోకలు కట్ చేస్తానని, వారికి రాష్ర్టంలో ఉండే హక్కులేదని చంద్రబాబు హెచ్చరించారు. అక్కడి నుంచి పొగాకు బోర్డు కార్యాలయూనికి చేరుకుని పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రాష్ర్టంలోనే నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేసే జిల్లా ఇదేనని అన్నారు. సాయంత్రం 4 గంటలకు కనకాద్రిపురం (ఆరిపాటి దిబ్బల) గ్రామంలో డ్వాక్రా మహిళలతో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. డ్వాక్రా రుణమాఫీ కచ్చితంగా చేసితీరుతానన్నారు. సాయంత్రం 5.45 గంటలకు హెలికాప్టర్లో కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. వెల్డన్ సుజాత మంత్రి పీతలకు సీఎం ప్రశంస సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘వెల్డన్ సుజాత. జిల్లా టూర్ బాగానే జరిగింది. అందరూ..పాజిటివ్ మైండ్స్‌తో ఉన్నారు. జిల్లాకు మంచి చేద్దాం. ఇక్కడ వనరులను మీరు సద్వినియోగం చేసుకోండి. ఆ దిశగా దృష్టి కేంద్రీకరించండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర గనులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతను అభినందిస్తూ సూచనలు చేశారు. సీఎం రెండురోజుల పర్యటన మొత్తం దాదాపుగా మంత్రి సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి నియోజకవర్గం, సమీప గ్రామాల్లోనే సాగింది. తొలిరోజు బుధవారం గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనం అనంతరం చంద్రబాబు చింతలపూడి పరిధిలోని తాడిచర్ల, కామవరపుకోట, ఉప్పలపాడు, రావికంపాడు, దేవులపల్లి, గుర్వాయిగూడెం, జంగారెడ్డిగూడెంలో పర్యటించి రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఇక్కడెక్కడా రైతులు, మహిళలతో ఇబ్బంది లేకుండా సుజాత జాగ్రత్తలు తీసుకున్నారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోకి వెళ్లిన చంద్రబాబుకు ప్రజల నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి. మంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించినప్పటికీ జిల్లాలో తన రెండురోజుల భారీ షెడ్యూల్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగడంతో ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
వచ్చారు.. ఏమిచ్చారు
ఎన్నికల వేళ ‘వస్తున్నా.. మీ కోసం’ అంటూ చంద్రబాబు నాయుడు ఊరూవాడా తిరిగారు. ఎన్నెన్నో హామీలు కురిపించారు. తాజాగా ముఖ్యమంత్రి హోదాలో జిల్లా పర్యటనకు వచ్చారు. ఊరూరా పర్యటించారు. అన్ని స్థానాలను టీడీపీకి కట్టబెట్టిన మన జిల్లాకు ఆయన రాకతో ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు సామాన్య ప్రజలు సైతం ఆశగా ఎదురుచూశారు. అయితే, జిల్లా అభివృద్ధి విషయంలో చంద్రబాబు కనీసం నోరు మెదపకపోవడంతో వారంతా నిశ్చేష్టులయ్యూరు. ‘ఆ జిల్లాకు ఎయిమ్స్.. పక్క జిల్లాకు ఎయిర్‌పోర్టు.. మరో జిల్లాకు పెట్రో కారిడార్.. ఆ శివారు జిల్లాకు ఐటీ హబ్.. ఇంకో జిల్లాకు యూనివర్సిటీ’ అంటూ ఇతర జిల్లాల అభివృద్ధి విషయంలో ప్రకటనలు గుప్పిస్తున్న ముఖ్యమంత్రి మన జిల్లాకు అలాంటివేమీ ప్రకటించకుండానే వెళ్లిపోయూరు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారని రైతులు, డ్వాక్రా మహిళలు అడిగితే డబ్బుల్లేవన్నారు. ‘మేం అడక్కుండానే రుణమాఫీ హామీ ఇచ్చారుగా..’ అని నిలదీస్తే ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయూ..’ అంటూ అసహనంతో ఊగిపోయూరు. ‘ఇదేంటి బాబూ..’ అని అడిగిన రైతును ‘నీ సంగతి తేలుస్తా’నంటూ హుంకరించారు. మీ చావు మీరు చావండన్నట్టు జిల్లాను అభివృద్ధి చేయూల్సిన బాధ్యత అధికారులదేనంటూ హితబోధ చేశారు. మొత్తానికి ఊరడింపులు.. ఈసడింపుల నడుమ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండురోజుల పర్యటన సాఫీగా సాగిపోరుుంది. జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన చంద్రబాబు * పొరుగు జిల్లాలకు వరాలు * ‘పశ్చిమ’కు మాత్రం నిండు సున్నాలు * కొత్త ప్రాజెక్టులపై నోరు మెదపని సీఎం * ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నేతల్లో నిరాశ * రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో * రైతులు, డ్వాక్రా మహిళల్లో నిస్పృహ సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనపై గంపెడాశలు పెట్టుకున్న జిల్లా ప్రజలకు నిరాశే మిగిలింది. సీఎం రెండురోజుల పర్యటన సందర్భంగా జిల్లాకు కీలక ప్రాజెక్టులు ఏమైనా వస్తాయని ఆశించిన వారికి భంగపాటే ఎదురైంది. బుధ, గురువారాల్లో గోపాలపురం, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల పరి దిలోని గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేసి బహిరంగ సభలు నిర్వహించిన చంద్రబాబు జిల్లాకు కొత్తగా ఏదైనా ప్రాజెక్టు ఇస్తున్నామని గాని, అభివృద్ధికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని గాని ప్రకటన చేయకుండానే గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు పయనమయ్యూరు. ‘ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనిది. టీడీపీ అధికారంలోకి రావటానికి ఇక్కడి ఫలితాలే కీలకం. అందుకే రాష్ట్రంలో తొలి పర్యటనను ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాను. జిల్లాను నంబర్-1 చేస్తా’నని తొలిరోజు చెప్పిన చంద్రబాబు జిల్లా ప్రజల్లో ఆశలు రేపారు. ఇందుకు సంబంధించి గురువారం ఏదైనా ప్రకటన చేస్తారని జిల్లా ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నేతలు ఆశించారు. అయితే గురువారం అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జంగారెడ్డిగూడెంలో సమీక్ష నిర్వహించిన ఆయన జిల్లా అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు చేశారే కానీ.. కొత్త ప్రాజెక్టుల ఊసెత్తలేదు. ఇక్కడ అపారంగా ఉన్న సహజ, శక్తి వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా జిల్లాను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారేగాని ఇదిగో ఈ ప్రాజెక్టు ఇస్తున్నాం లేదా త్వరలో ఇస్తాం అనే దిశగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీనిపై టీడీపీ నేతల్లోనూ అసంతృప్తి నెలకొంది. దీనిపై ఏలూరు ఎంపీ మాగంటి బాబు లోలోన మదనపడుతూనే పైకి మాత్రం ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారని విలేకరుల ఎదుట చెప్పుకొచ్చారు. రైతుల ధర్మాగ్రహం రుణమాఫీపై ఈ జిల్లాలోనే స్పష్టత వస్తుందని.. కనీసం ఆశావహ ప్రకట నైనా చేస్తారని ఎదురుచూసిన రైతులు తొలిరోజు అలాంటి పరిస్థితి కనిపించకపోవడంతో గురువారం ఒక్కసారిగా చంద్రబాబుపై తిరగబడ్డారు. గురువారం నాటి పర్యటనలో అడుగడుగునా ఆయనకు నిరసన ధ్వనులే వినిపించాయి. నరసన్నపాలెం, బయ్యనగూడెం, కొయ్యలగూడెంలలో రైతులు రుణమాఫీ జాప్యంపై నిరసన వ్యక్తం చేశారు. ముఖాముఖి చర్చల్లో నేరుగా చంద్రబాబును నిలదీశారు. వీలైనంత త్వరగా రుణమాఫీ విషయం తేల్చాలని గట్టిగా అడిగారు. మలి రోజు కానరాని జోష్ తొలిరోజు పర్యటనలో చంద్రబాబు ఆగిన ప్రతిచోటా వందలాదిగా కనిపించిన జనం గురువారం మాత్రం పదుల సంఖ్యలోనే కనిపించారు. కొయ్యలగూడెం మెయిన్ సెంటర్లో సైతం వందమందికి మించి జనం కనిపించలేదు. దీంతో బాబు కూడా ఒకింత అసహనానికి గురయ్యారు. తొలిరోజు బాబు వెంట కనిపించిన మంత్రులు, సీనియర్ నాయకులు కూడా గురువారం నాటి పర్యటనలో కానరాలేదు. -
గోడు చెప్పుకుందాం
- జిల్లాకు విచ్చేసిన శివరామక్రిష్ణన్ కమిటీ - నేడు రెవెన్యూ భవన్లో భేటీ సాక్షి, అనంతపురం : అన్ని విధాలుగా వెనకబడిన జిల్లా అభివృద్ది చెందాలంటే అనంతపురంలో రెండవ రాజధాని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ను లేవనెత్తిన నాయకులు కదలి రావాల్సిన సమయం వచ్చింది. నవ్యాంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడుండాలో అధ్యయనం చేయడానికి నియమించిన శివరామక్రిష్ణన్‌కమిటీ సోమవారం రాత్రి జిల్లాకు చేరుకుంది. పనిలో పనిగా కేంద్ర, రాష్ట్ర సంస్థల ఏర్పాటుకు సంబంధించి కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి సూచించనున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన కమిటీ జిల్లాలోకి ప్రవేశించగానే గుత్తిలో ప్రభుత్వ అధికారులతో జిల్లా సమాచారాన్ని సేకరించారు. జిల్లా ప్రాముఖ్యత, చారిత్రాత్మక విషయాలు, గుత్తి కోట ప్రాముఖ్యత గురించి అధికారులు కమిటీ సభ్యులకుక్షుణ్ణంగా వివరించారు. రాత్రి 9గంటలకు అనంతపురం చేరుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో కమిటీ జిల్లావాసులతో భేటీ కానుంది. తొలుత అధికారులతో జిల్లా స్థితిగతులపై సమీక్షిస్తారు. అనంతరం 11 గంటలకుప్రజాప్రతినిధులు, మేధావులు, ప్రజాసంఘాలు, జిల్లా ప్రజల వినతులు స్వీరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రాతికేయుల సమావేశంలో మాట్లాడనున్నారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై గత వారం ఎస్కేయూలో మేధావుల సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో పాల్గొన్న వారితో పాటు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతి నిధులు, ప్రతిపక్ష నేతలు కమిటీ ఎదుట హాజరై డిమాండ్లను విన్నవించుకోనున్నారు. -
విద్య, వైద్యానికి పెద్దపీట
కరీంనగర్ సిటీ : జిల్లా పరిషత్ తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తుల ఉమ అభివృద్ధి ఎజెండాను వెల్లడించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమం, మహిళారంగ అభ్యున్నతిపై తనకున్న విజన్‌ను ప్రజల ముందుంచారు. శనివారం జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనంతరం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఎన్నికవడం ఎలా అనిపిస్తోంది? ఉమ : మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నపుడు మహిళలకు అవకాశం రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తొలిసారి జిల్లా పరిషత్ పీఠాన్ని అధిష్టించే అవకాశం మహిళలకు దక్కింది. పదవి మీకే దక్కుతుందనుకున్నారా? ఉమ : నాకైతే ముందునుంచి ఎలాంటి అనుమానం లేదు. మా అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ చేయాలని అనుకున్నారు. కొన్ని పరిస్థితుల వల్ల అది వీలు పడలేదు. జెడ్పీచైర్‌పర్సన్ బీసీ మహిళకు కేటాయించడంతోనే కేసీఆర్ నన్ను చైర్పర్సన్ చేయాలని నిర్ణయించారు. అందుకే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు. మహిళలకు అవకాశం కల్పించడాన్ని ఎలా భావిస్తున్నారు? ఉమ : రాజకీయంగా ఉన్నత పదవులు మహిళలకు రావడం తక్కువే. మహిళలకు అవకాశం వస్తే నీతి, నిజాయతీగా పరిపాలిస్తారని ఎన్నోసార్లు రుజువైంది. ప్రస్తుతం జిల్లాలో 50 శాతం కన్నా ఎక్కువ మహిళా ప్రజాప్రతినిధులం ఉన్నాం. చైర్‌పర్సన్‌గా మీ ప్రాధాన్యతాంశాలేమిటి? ఉమ : విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తా. గ్రామాల్లో పర్యటించినపుడు డ్రెయినేజీ సమస్య అధికంగా ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. ఆ సమస్యను పరిష్కరిస్తా. ప్రధానంగా జిల్లా పరిషత్ పాఠశాలల్లో టాయ్‌లెట్స్ లేక విద్యార్థినులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక ఏడాదిలోగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో టాయ్‌లెట్స్ నిర్మించి, విద్యార్థినుల ఇబ్బందులు తొలగిస్తా. మీ పరిపాలన ఎలా ఉండబోతోంది? ఉమ : చైర్‌పర్సన్‌గా నేను చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా. అవినీతికి తావులేని నీతి, నిజాయితీతో కూడిన పాలన అందిస్తా.