సీఎం హోదాలో తొలిసారిగా
- ఇందూరుకు నేడు కేసీఆర్ రాక
- రోజంతా సుడిగాలి పర్యటన
- అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం
ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా అభివృద్ధిపై సమీక్ష
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేతగా, ఆ త ర్వాత ఎన్నికల ప్రచార రథసారథిగా ఆయన జిల్లా కు పలుమార్లు వ చ్చారు. ముఖ్యమంత్రిగా మొ దటిసారిగా ప ర్యటించనుండ టం ప్రాధాన్యత సం తరించుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ రోజంతా వివి ధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో నిజామాబాద్‌ను ప్రత్యేకంగా కొనియాడే కేసీఆర్, బాల్కొండ నియోజకవర్గం మోతె ‘మట్టిముడుపు’ చరిత్రాత్మకమైనదంటారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే చేసే ప్రకటనలు, ప్రసంగంపై జిల్లా ప్రజలలో ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు జిల్లా లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా కలెక్టర్ రొనాల్డ్ రాస్, డీఐజీ సూర్యనారాయణ, ఎస్‌పీ డాక్టర్ తరుణ్‌జోషీ భారీ భద్రత, బందోబస్తు ఏర్పా టు చేశారు. రెండు రోజులుగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి తదితరులు పెద్దఎత్తున జన సమీకరణపై దృష్టి సారించారు.
సీఎం పర్యటన ఇలా
ఉదయం:
►11.00 గంటలకు రోడ్డుమార్గంలో ఆర్మూర్‌కు చేరుకుంటారు
►11.05 అధికారులు, అనధికారులతో పరిచయం
►11.30 రూ.114.11 కోట్ల మంచినీటి పథకానికి శంకుస్థాపన
మధ్యాహ్నం:
►12.05 ఆర్మూరులో బహిరంగ సభ
►1.00 ఆర్మూరు నుంచి అంకాపూర్‌కు బయలుదేరుతారు
►1.15 అంకాపూర్‌లో రైతులతో ముఖాముఖి
►2.00 అంకాపూర్ నుంచి నిజామాబాద్‌కు బయలుదేరుతారు
►2.20 ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు ఇంటికి చేరుకుంటారు. అక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు
►3.00 బోర్గాం(పి) వద్ద విజయలక్ష్మి కళ్యాణవేదికలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు
సాయంత్రం:
► 6.20 నర్సింగ్‌పల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు.
► 7.00 మెదక్ జిల్లా ఎర్రబెల్లికి బయలుదేరుతారు.