నేడు ఢిల్లీకి బీజేపీ బృందం
జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులే లక్ష్యం
పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి
నయీంనగర్: జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు సాధించేందుకు ఓరుగల్లు నుంచి 23 మంది ప్రతినిధులతో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సారథ్యంలో బీజేపీ బృందం ఢిల్లీకి వెళ్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 10,11,12 తేదీల్లో ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి పలు కొత్త పథకాల అమలు కోసం నిధులు మంజూరు చేయూలని కోరుతామన్నారు. వరంగల్‌లో నీటి పారుదల ప్రాజెక్ట్, టెక్స్‌టైల్ పార్క్‌ల నిర్మాణం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం విన్నవిస్తామని తెలిపారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ పరిశ్రమ, మల్లంపెల్లి, మానుకోట వద్ద సిమెంట్, ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.
హృదయ్ పథకంలో మహబూబాబాద్‌ను చేర్చాలని, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఐ.ఐ.ఎం.ఏర్పాటు చేయూలని కోరుతామన్నారు. వరంగల్‌లో విమానాశ్రయం అంశంపై కేంద్ర పౌర విమానయూన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో చర్చిస్తామని వివరించారు. ఒడిశా నుంచి తెలంగాణ వరకు నిర్మించే ఆయిల్ టర్మినల్‌లో భాగంగా వరంగల్‌లో 94కోట్ల తో ఆయిల్ టర్మినల్ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. అనంతరం ఆయన పలు అంశాలపైనా మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం చీప్ లిక్కర్ ప్రవేశపెట్టడంతో గీతకార్మికుల ఉపాధికి ప్రమాదం ఏర్పడిందన్నారు. కరువుపై క్షేత్రస్థారుులో అధ్యయనం చేయూలన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెను సీఎం హేళన చేయడం సరికాదని పేర్కొన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలని కోరారు.
15న ఆందోళనలు చేస్తాం
ఈ నెల 15న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ చెల్లింపు కోసం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్‌లర్లను నియమించాలని సీఎంను కోరారు. పార్టీ నాయకులు కాసర్ల రాంరెడ్డి, పెదగాని సోమయ్య, కిసాన్‌మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భద్రాద్రి రాంచంద్రారావు,మహిళామోర్చా రాష్ట్ర కార్యదర్శి కూచన రవళి, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి తాళ్లపల్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.